ADVERTISEMENT
home / సౌందర్యం
అందమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి..

అందమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి..

మచ్చలేని మృదువైన చర్మం(skin) కావాలని కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండి? చర్మం మచ్చల్లేకుండా అందంగా, ప్రకాశవంతంగా మెరిసిపోవాలని (glowing) మనం భావిస్తాం. కానీ మన చర్మం అలా ఉండడం అసాధ్యం అనే చెప్పాలి. కొన్నిసార్లు సూర్యకిరణాలు.. మరికొన్నిసార్లు అనారోగ్యం కారణంగా మచ్చలు, మొటిమలు, ముడతలు.. ఇలా ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఒకేసారి తగ్గించుకోవాలంటే కేవలం మెడికల్ ట్రీట్ మెంట్లు మాత్రమే కాదు.. ఇంటి చిట్కాలు కూడా పని చేస్తాయి. కాబట్టి ఇవి ఓసారి ప్రయత్నించి చూడండి.

ayurveda %288%29

1.పసుపు, శెనగ పిండి

పసుపులో యాంటీబయోటిక్ గుణాలుంటాయి. ఇక శెనగ పిండి మంచి స్క్రబ్‌లా పనిచేయడం మాత్రమే కాదు.. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని కోసం టేబుల్ స్పూన్ శెనగపిండిలో టీ స్పూన్ పసుపు వేసి అందులో తగినన్ని పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం పై అప్లై చేసుకొని ఆరేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లు జల్లి స్క్రబ్ చేస్తూ కడిగేసుకుంటే సరిపోతుంది.

honey

2. తేనె చేసే మాయ

తేనెలో మన చర్మం, శరీర ఆరోగ్యానికి తోడ్పడే గుణాలెన్నో ఉంటాయి. దీని కోసం రోజూ ఉదయాన్నే లేచిన వెంటనే ముఖానికి కాటన్ బాల్ సాయంతో తేనెను అప్లై చేసుకోవాలి. అది పూర్తిగా ఆరే వరకూ ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం శుభ్రంగా మారి కాంతిమంతంగా, మెరుస్తూ కనిపిస్తుంది.

3. కీరా ముక్కలతో

కీరా ముక్కలు మన అలసటను తొలగించి కొత్త చర్మకణాల ఉత్పత్తిలో సాయం చేస్తాయి. ఇందుకోసం కీరాను సన్నని ముక్కలు చేసి దానితో ముఖం, మెడను రుద్దుకుంటూ లేదా ఈ సన్నని ముక్కలను కాస్త నలిపి ముఖంపై పేర్చుకుంటూ పోవాలి. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మచ్చలు కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి.

ADVERTISEMENT

ayurveda %285%29

4. కలబంద ప్రయత్నించండి.

ముఖం మాత్రమే కాదు.. జుట్టుకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని తగ్గించడంలో కలబంద చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం చేయాల్సిందల్లా కలబంద ఆకును తీసుకొని మధ్యలో ఉన్న జెల్‌ని మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని అలా వదిలేయాలి. ముఖం పూర్తిగా ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

5. బేకింగ్ సోడా పేస్ట్

బేకింగ్ సోడా కూడా మన చర్మం పై మచ్చలు తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీని కోసం బేకింగ్ సోడా తీసుకొని అందులో కొన్ని చుక్కల నీళ్లు కలుపుకొని మచ్చలు ఎక్కువగా ఉన్నచోట అప్లై చేసుకోవాలి. దీన్ని పావు గంట నుంచి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకొని గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.

 

potato

6. బంగాళాదుంప, నిమ్మరసం

బంగాళాదుంప మచ్చలు పోగొట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే బంగాళాదుంపను మిక్సీ పట్టుకొని రసం తీసుకోవాలి. అందులో కాస్త నిమ్మరసం పిండాలి. ఈ రసాన్ని కాటన్ బాల్ సాయంతో ముఖం మొత్తం అప్లై చేసుకోవాలి. ఆరేవరకూ ఉంచుకొని మిగిలిన రసాన్ని కూడా కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చాలు. ముఖం మెరుస్తూ మచ్చల్లేకుండా తయారవుతుంది.

7. ఓట్ మీల్, కార్న్ ఫ్లోర్

చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అప్పుడప్పుడూ స్క్రబ్ చేసుకోవడం కూడా అవసరమే. అందుకే ఓట్ మీల్, కార్న్ ఫ్లోర్ ఈ రెండింటినీ కలిపి నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరే వరకూ అలాగే ఉంచుకొని స్క్రబ్ చేస్తూ గోరు వెచ్చని నీటితో  కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. ఈ రెండూ చర్మానికి మంచి స్క్రబ్‌లాగా పనిచేస్తాయి.

ADVERTISEMENT

egg

8. తెల్లసొనతో తళతళ మెరిసేలా..

గుడ్డులో ప్రొటీన్ ఉంటుంది. ఇది మన చర్మంపై ముడతలు తగ్గించడం మాత్రమే కాదు.. మచ్చలు తగ్గేందుకు కూడా తోడ్పడుతుంది. దీని కోసం గుడ్డులోని తెల్ల సొనను తీసుకొని తెలుపు రంగు వచ్చే వరకూ బీట్ చేసుకొని ఆపై ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉన్న చర్మం శుభ్రంగా మారుతుంది. మచ్చలు తగ్గడం మాత్రమే కాదు.. ట్యాన్ కూడా తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

9. ఉల్లిపాయ రసం

చర్మం మెరుస్తూ మచ్చల్లేకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. ఇందుకోసం ఉల్లిరసాన్ని తీసి దాన్ని కాటన్ బాల్ సాయంతో ముఖం, మెడకు అప్లై చేసి అది ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీని వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది.

ayurveda %284%29

10. బొప్పాయి గుజ్జు

మచ్చలు తగ్గించడంలో బొప్పాయిది చాలా ముఖ్యమైన పాత్ర. అందుకే ఒక పెద్ద ముక్క తీసుకొని మెత్తని మిశ్రమంగా చేసుకొని దాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అది ఆరిపోయే వరకూ ఉంచుకొని తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.

POPxo ఇప్పుడు పాఠకులకు ఆరు భాషల్లో లభ్యమవుతోంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, బెంగాలీ

ADVERTISEMENT

అతి గొప్ప వార్త. POPxo SHOP ఇప్పుడు సరికొత్త  ఆఫర్లతో వస్తోంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25 % డిస్కౌంట్ అందిస్తోంది. POPXO FIRST అనే కూపన్ కోడ్‌ను ఉపయోగించండి. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మహిళలకు ఎన్నో సేవలను మేము అందిస్తున్నాం. 

ఇవి కూడా చదవండి.

ఇలా చేస్తే మీ పొట్టి జుట్టు కూడా.. పొడుగ్గా కనిపిస్తుంది..!

ట్యాన్‌తో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో దాన్ని ఇట్టే దూరం చేసుకోవచ్చు..!

ADVERTISEMENT

చర్మం పై మొండి మచ్చలా? వాటికి ఇలా చెక్ పెట్టండి..

పగుళ్లను (Cracked Heels) తగ్గించే ప్యాక్స్ ఇవే..

13 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT