Advertisement

Beauty

మీ అందానికి మెరుగులు దిద్దేందుకే… ఈ ‘ తేనె ‘ చిట్కాలు ..!

Soujanya GangamSoujanya Gangam  |  Nov 21, 2019
మీ అందానికి మెరుగులు దిద్దేందుకే… ఈ ‘ తేనె ‘ చిట్కాలు ..!

Advertisement

(Honey Hacks that will do wonders to your Skin and Hair)

తేనె .. ప్రకృతి మనకందించిన ఓ వరప్రసాదం. దీనితో ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మన చర్మ పరిరక్షణ కోసం.. వివిధ రకాల ఉత్పత్తులను వాడడం అత్యవసరం. అయితే అందుకు పార్లర్‌లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పని లేదు. మనకు సహజంగా లభించే వస్తువులతోనే .. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. 

సహజ ఉత్పత్తులలో తేనె చాలా ముఖ్యమైంది. ఇది కేవలం మన చర్మాన్ని మాత్రమే కాదు.. కేశ రక్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో వివిధ యాంటీ ఆక్సిడెంట్లు,  పోషకాలుంటాయి. అందమైన చర్మం, తళతళ మెరిసే కేశాల కోసం పాశ్చురైజ్ చేయని తేనెను ఉపయోగించడం అవసరం. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఈ గుణాలే ప్రతి మహిళా ఎదుర్కొనే సాధారణ సమస్యలను సైతం దూరం చేస్తాయి. మనం కూడా తేనెను మన సౌందర్య పరిరక్షణ కోసం ఇంట్లోనే వాడుతూ.. వివిధ ప్రయోజనాలు పొందవచ్చు.

1. మాయిశ్చరైజర్‌గా..

తేనె సహజసిద్ధంగా చర్మంలో తేమను పెంచుతుంది. కాబట్టి పొడి చర్మం ఉన్న వారికి.. ఇది చాలా బాగా తోడ్పడుతుంది. చర్మాన్ని సహజసిద్ధంగా మాయిశ్చరైజ్ చేయాలంటే.. తేనెను చర్మంపై పల్చగా ఓ లేయర్‌గా రుద్దాలి. ముఖంతో పాటు మెడకు కూడా దానిని అప్లై చేసుకొని.. 15 నిమిషాల పాటు ఆగి.. గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. మీకు తేనె వాసన ఇష్టం లేకపోతే POPxo Shop నుంచి.. గ్లో ఆన్ గర్ల్ ఈజిప్షియన్ రోజ్ అండ్ హనీ ఫేస్ వాష్ ఉపయోగించండి. దీని వల్ల కూడా అవే ఫలితాలు పొందవచ్చు. తేనెతో పాటు ఇందులో గులాబీ, విటమిన్ ఇ గుణాలు కూడా ఉంటాయి.

2. సన్ ట్యాన్ తొలగించేందుకు

ఎండ వల్ల నల్లగా మారి, కమిలిపోయిన చర్మానికి ఔషధంగా కూడా.. తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ఒక వంతు తేనెలో రెండు వంతుల కలబందను వేసి బాగా కలుపుకొని.. ఆ మిశ్రమాన్ని గాలి చొరబడని ఓ డబ్బాలో నింపుకొని పెట్టుకోవాలి. అదే మిశ్రమాన్ని ఎండ తగిలి నల్లబడిన చర్మానికి అప్లై చేసుకొని.. 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.

3. మంచి ఎక్స్ ఫోలియేటర్‌గా..

చాలామంది  మృత చర్మాన్ని తొలిగించేందుకు.. మార్కెట్లో దొరికే ఎక్స్ ఫోలియేటర్స్ వాడుతుంటారు. ఇవి మన చర్మానికి హాని కలిగించవచ్చు. అందుకే సహజమైన స్క్రబ్‌లను వాడాలి. అవి చర్మంపై మంచి ప్రభావం చూపిస్తాయి. అలాగే టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ కలిపి దాన్ని చర్మానికి అప్లై చేసుకోవాలి. తేనె, ఓట్ మీల్ కలిపి తయారుచేసిన మిశ్రమం చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళితో పాటు.. మృత చర్మాన్ని కూడా తొలగిస్తుంది. అలాగే మంచి ఫేస్ ప్యాక్‌లా కూడా పనిచేస్తుంది.

అచ్చం ఇలాంటి ఫలితాలను పొందేందుకు POPxo Shop నుంచి ‘ద బ్రైటర్ దెన్ సన్ షైన్ హనీ అండ్ ఓట్ మీల్ ఫేస్ ప్యాక్‌’ను ఉపయోగించండి. ఇందులో కలబంద, విటమిన్ ఇ, చందనం, ఆర్గాన్ ఆయిల్, తేనె, ఓట్ మీల్ వంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ చర్మం మృదువుగా తయారయ్యేలా చేస్తాయి.

4. హెయిర్ కండిషనర్‌గా..

తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఇది కేవలం చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం మాత్రమే కాదు.. జుట్టును కూడా కండిషనింగ్ చేసేందుకు తోడ్పడతాయి. ఇందుకోసం టేబుల్ స్పూన్ తేనెలో.. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ హెయిర్ మాస్క్‌ని తలకి అప్లై చేసుకొని ఓ గంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి. అంతే జుట్టు.. పట్టులా మెరుస్తూ తయారవుతుంది.

5. మొటిమలు తగ్గించేందుకు..

తేనెలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మం పై మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తాయి. దీనికోసం చాలా కొద్ది మోతాదులో తేనెను తీసుకొని.. కాటన్ బాల్ పై వేయాలి. దాంతో మొటిమలు ఉన్న చోట రుద్దాలి. ఆ తర్వాత పదిహేను నిమిషాల పాటు ఉంచుకొని కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి.

6. బాత్ సోకింగ్‌లో..

కేవలం ముఖం, మెడ, జుట్టుకు మాత్రమే కాదు.. శరీరం మొత్తానికీ తేనె మాయిశ్చరైజేషన్‌ను అందిస్తుంది. అంతేకాదు.. రోజంతా కష్టపడి అలసిన శరీరానికి తిరిగి పునరుత్తేజాన్ని అందిస్తుంది. దీనికోసం స్నానం చేసే నీళ్లలో తేనెను కలుపుకోవాలి. కప్పు పాలలో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలిపి.. ఈ పాలను మగ్గు నీటిలో కలపాలి. ఇవి బాగా కలిసిపోయిన తర్వాత.. ఇదే మిశ్రమాన్ని స్నానం చేసే నీటితో కలుపుకోవాలి.

ఇలా చేసిన నీటితో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే ఒకవేళ మీకు బాత్ టబ్ లేకపోయినా.. స్నానం చేసే నీటిలో ఇవన్నీ కలపడం మీకు ఇబ్బందిగా అనిపించినా.. మీకు ఇంకో దారి కూడా ఉంది. దీనికోసం POPxo Shop లో అందుబాటులో ఉన్న ‘ఫ్రెష్ అండ్ ఫ్యాబ్ హనీ అండ్ వెనీలా జెల్ బాడీ వాష్’ని ఉపయోగించవచ్చు. దీనితో మీకు పాలు, తేనె రెండింటి గుణాలు అంది.. మీ చర్మం మెరుస్తూ, పట్టులా తయారవుతుంది.

7. అందమైన పెదాల కోసం..

తేనెలో ఎన్నో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. అందుకే ఇది మంచి లిప్ బామ్‌లా కూడా పనిచేస్తుంది. దీనికోసం కొద్దిగా తేనెను తీసుకొని  పెదాలకు రుద్దుకోవాలి. రాత్రి మళ్లీ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత.. ఉదయాన్నే కడిగేసుకుంటే మెత్తటి, మృదువైన పెదాలు మీ సొంతం అవుతాయి.

మీ కిచెన్‌లో ఇన్ని ప్రయోజనాలు అందించే మరో ఉత్పత్తి ఏదైనా ఉందా? అస్సలు ఉండదు. అదీ తేనె ప్రత్యేకత మరి..

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.