ADVERTISEMENT
home / Acne
చర్మం పై మొండి మచ్చలా? వాటికి ఇలా చెక్ పెట్టండి.. – (How To Remove Acne Scars In Telugu)

చర్మం పై మొండి మచ్చలా? వాటికి ఇలా చెక్ పెట్టండి.. – (How To Remove Acne Scars In Telugu)

అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే.. అంటూ తన ప్రేయసి మొటిమను (pimples) కూడా ప్రేమిస్తూ రాశాడో సినీకవి.. కానీ నిజానికి మొటిమలు, మచ్చలు (acne scars) అనేవి అమ్మాయిలకు ఓ భయంకరమైన కల లాంటివి. తమ అందాన్ని పోగొట్టే ఈ తరహా సమస్యలను ఏ అమ్మాయి కోరుకోదు. అవి వచ్చినా వాటిని ఎలా తొలగించాలా? అని ప్రయత్నిస్తూ ఉంటుంది.

సాధారణంగా మొటిమలు (pimple) మన చర్మ గ్రంథుల్లో ఎక్కువగా ఉన్న నూనెలు, దుమ్ము, ధూళి, మృత క‌ణాలు.. వీటన్నింటి కలయికతో ఏర్పడతాయి. ఇలా వచ్చిన మొటిమలు కొన్ని రోజుల్లో వాటంతట అవే తగ్గుతాయి. ఈలోపు మరో మొటిమ రావడం వల్ల మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.

మొటిమలు గురించి పూర్తి సమాచారం మీ కోసం

అయితే మొటిమల కంటే వాటి ద్వారా ఏర్పడే మచ్చలు చాలా మొండివి అని చెప్పుకోవచ్చు. మొటిమలు వచ్చినప్పుడు చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. బ్యాక్టీరియా వల్ల చీము కూడా పట్టి ఉబ్బెత్తుగా తయారవుతాయి.

ADVERTISEMENT

ఇలా కావడం వల్ల మన చర్మ కణాలు నాశనమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ నాశనమైన కణాలు కేవలం ఉపరితలం మీదవే అయితే.. ఏర్పడే మచ్చలు త్వరగా వాటంతట అవే తగ్గిపోతాయి. అదే కాస్త లోతుగా ఉన్న కణాలు నాశనం అవ్వడం వల్ల చర్మం రెండో లేయర్ అయిన డెర్మిస్ కూడా పాడ.. ఆ విధంగా వచ్చే మచ్చలు చాలా లోతుగా ఉంటాయి. కాబట్టి వీటిని తొలగించడానికి కాస్త సమయం పడుతుంది.

ఏవో చిట్కాలు లేదా మందులు ఉపయోగించి మొటిమలను తగ్గించుకోగలం. కానీ మొటిమల వల్ల ఏర్పడే మచ్చలను తగ్గించడం మాత్రం కాస్త కష్టమే అని చెప్పుకోవాలి. అయితే మన సమస్య ఎలాంటిదో తెలుసుకొని దానికి తగిన ఉత్పత్తులు ఉపయోగిస్తూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. మొటిమలు, మచ్చలు  తగ్గించుకోవడం ఏమాత్రం కష్టం కాదు.

మొటిమల మచ్చలు – వాటిలోని రకాలు

మచ్చలు తొలగించేందుకు ఇంటి చిట్కాలు

ADVERTISEMENT

మచ్చలు తొలగించేందుకు క్రీములు, ట్రీట్మెంట్స్

మొటిమలు, మచ్చలు రాకుండా ఎలా కాపాడుకోవాలి

తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు

how to treat scars from acne

మొటిమల మచ్చలు – వాటిలోని రకాలు (Types Of Acne Scars)

మొటిమల మచ్చలన్నీ ఒకే రకంగా కనిపించినా వాటిలో ఎన్నో తేడాలుంటాయి. అందుకే వాటి స్థితిని బట్టి మొటిమల మచ్చలను ఐదు రకాలుగా చెప్పుకోవచ్చు.
1. ఐస్ పిక్ స్కార్స్ : ఇవి చిన్నగా లోతుగా ఉండే మచ్చలు
2. రోలింగ్ స్కార్స్ : వెడల్పుగా, కాస్త లోపలికి ఉంటూ అంచుల వద్ద తిరిగి సాధారణంగా చర్మం ఎత్తులోనే ఉంటాయి.. ఈ తరహా మచ్చలు.
3. బాక్స్ కార్ స్కార్స్ : వెడల్పుగా ఉండే మచ్చలు ఇవి..
4. అట్రోఫిక్ స్కార్స్ : ఫ్లాట్‌గా కాస్త ఉబ్బెత్తుగా కనిపించే స్కార్స్ ఇవి..
5. హైపర్ ట్రోఫిక్ స్కార్స్ : లావుగా ఉబ్బెత్తుగా ఉండే మచ్చలు ఇవి..

ADVERTISEMENT

ఈ మచ్చల రకాలను బట్టి మనం తీసుకునే ట్రీట్ మెంట్.. దానిని పొందాల్సిన రోజుల్లో మార్పులు వస్తుంటాయి. తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో ఉపయోగించే చిట్కాల ద్వారానే వాటిని దూరం చేసుకోవచ్చు. అదే కాస్త తీవ్రత పెరిగితే డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది.

మచ్చలు తొలగించేందుకు ఇంటి చిట్కాలు (Home Remedies To Remove Acne Scars)

మొటిమల మచ్చలను తగ్గించేందుకు.. ఇంట్లోనే మనకు అందుబాటులో ఉన్న వివిధ పదార్థాలతోనే ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. అయితే మచ్చల స్థాయిని బట్టి అవి తగ్గడానికి పట్టే సమయం కూడా ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో మనం కూడా మచ్చలను తొలిగించే  కొన్ని ఫేస్ ప్యాక్స్ గురించి తెలుసుకుందాం రండి..

how to treat scars from acnehoney

1. తేనె, ఓట్ మీల్‌తో.. (Honey And Oatmeal)

తేనె మన శరీరానికి మాత్రమే కాదు.. చర్మానికి కూడా ఎంతో అవసరం. ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా, మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. సూర్య కిరణాల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. మచ్చల్నీ తగ్గిస్తుంది. దీనికోసం మనం చేయాల్సిందల్లా పావు కప్పు ఓట్ మీల్, రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకొని మెత్తని పేస్ట్‌లా చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట రాయాలి. ఆ తర్వాత.. ఈ ప్యాక్‌ను పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ముఖంపై అద్దుకొని.. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి.

2. నిమ్మరసంతో..(Lemon Juice)

నిమ్మ మనకు సహజసిద్ధమైన బ్లీచింగ్‌గా పనిచేస్తుంది. ఇది మచ్చలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ బంధాలను తిరిగి పరిపుష్టం చేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలంటే.. ముందుగా నిమ్మకాయను కోసి రసం తీసుకోవాలి. ఆ రసంలో ముంచి తీసిన దూదిని.. ఈ మచ్చలపై రుద్దాలి. అలా రుద్దుతూ పావు గంట పాటు ఉంచుకొని.. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీంతో పాటు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

ADVERTISEMENT

how to treat scars from acnepotato

3. బంగాళాదుంపతో.. (Potatoes)

మచ్చలను తగ్గించడంలో బంగాళాదుంపలు ఎంతో బాగా పనిచేస్తాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం చేయాల్సిందల్లా బంగాళాదుంపలను స్లైసులుగా కట్ చేయాలి. ఆ స్లైసులను మీ మచ్చలున్న స్థానంలో గుండ్రగా రుద్దుకోవాలి. ఇలా ఆ ముక్కలు పొడిబారిపోయే వరకూ రుద్దుకోవాలి. ఇలా 20 నిమిషాల నుంచి అరగంట పాటు చేసుకొని తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరి. ఆ తర్వాత మీ చర్మతత్వానికి సరిపడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా వారానికి నాలుగైదు సార్లు చేయడం వల్ల మచ్చలు త్వరగా తగ్గిపోతాయి.

 4. బాదం పప్పుతో.. (Almonds)

బాదం పప్పు మాత్రమే కాదు.. నూనె కూడా మన చర్మానికి, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మన తెలివిని పెంపొందించడంతో పాటు అందాన్ని కూడా పెంచుతుంది. దీనికోసం రాత్రి పూట నాలుగైదు బాదం పప్పులను నానబెట్టుకోవాలి. ఉదయాన్నే పొట్టు తీసి.. బాదంపప్పును గుజ్జు చేసి పెట్టుకోవాలి. ఈ గుజ్జులో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసుకొని పావు గంట పాటు అలా ఉంచుకోవాలి. పావు గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

how to treat scars from acneayurveda %2811%29

5. చందనం పొడితో.. (Sandalwood)

చందనం యాంటీ బయోటిక్. మన చర్మంపై ఉన్న బ్యాక్టీరియా, వైరస్.. ఇతర జీవులను అది చంపుతుంది. అంతేకాదు.. మొటిమలు (pimple) , మచ్చలను తగ్గిస్తుంది. దీనికోసం టీస్పూన్ చందనం పౌడర్‌ని తీసుకొని అందులో రోజ్ వాటర్ లేదా పాలు కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. గంట పాటు.. దీన్ని అలాగే ఉంచుకొని అది ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి.

6. ఆలివ్ నూనెతో.. (Oilve Oil)

ఆలివ్ నూనెలో విటమిన్ ఎ, డి, ఇ, సి, బి1, బి2లు ఉన్నాయి. ఇవి మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు మచ్చలను తగ్గిస్తాయి. దీన్ని ఉపయోగిస్తే చర్మ సమస్యలు చాలా వరకూ తగ్గుముఖం పడతాయి. తొలుత ఓ దూది ఉండను ఆలివ్ నూనెలో ముంచి.. ఆ తర్వాత మన చర్మంపై మచ్చలున్న చోట రుద్దుకోవాలి. ఇది చర్మంలోకి బాగా ఇంకిన తర్వాత.. వేడి నీటిలో ముంచి తీసిన టవల్‌ని ముఖంపై వేసుకోవాలి. ఐదు నుంచి పది నిమిషాల పాటు అలా ఉంచి గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే సరిపోతుంది.

ADVERTISEMENT

7. బేకింగ్ సోడాతో.. (Baking Soda)

మొటిమల మచ్చలను తగ్గించడానికి మరో ముఖ్యమైన మార్గం బేకింగ్ సోడా. చర్మానికి ఏమాత్రం హాని కలగకుండా ఉపయోగించే పద్దతి ఇది. దీన్ని ఉపయోగించడం వల్ల మృత చ‌ర్మం తొలగిపోయి చర్మం కాంతిమంతంగా మారడంతో పాటు మచ్చలు కూడా తగ్గుతాయి.

దీనికోసం రెండు టీస్పూన్ల బేకింగ్ సోడాను నీళ్లలో కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని మచ్చలున్న చోట రెండు నిమిషాల పాటు ఉంచుకొని గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఆ తర్వాత మీ చర్మ తత్వానికి సరిపడే మాయిశ్చరైజర్‌ని అప్లై చేసుకోవాలి.

how to treat scars from acneskin %282%29

మచ్చలు తొలగించేందుకు క్రీములు, ట్రీట్మెంట్స్ (Cream And Treatments To Remove Acne Spots)

 1. విటమిన్ సి మన చర్మంలోని కొల్లాజెన్‌ని పెంచి.. చర్మం దానికదే రిపేర్ చేసుకునే ప్రక్రియను వేగవంతం చేసేలా చేస్తుంది. అందుకే విటమిన్ సి సీరమ్‌ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
2. రెటినాల్, విటమిన్ ఎ ఉన్న క్రీమ్స్ ఉపయోగించడం వల్ల మొటిమలు(pimple) , పిగ్మంటేషన్ వంటివి తగ్గుతాయి. అయితే ఈ క్రీమ్ అప్లై చేసుకొనేటప్పుడు.. మన చర్మం చాలా సున్నితంగా మారిపోతుంది కాబట్టి.. బ్యూటీ ట్రీట్ మెంట్స్ చేయించుకోవడం లేదా ఎండలో బయటకు వెళ్లడం వంటివి చేయకూడదు.
3. కోజిక్ యాసిడ్ ఉన్న క్రీమ్స్ ఉపయోగించడం వల్ల కూడా మొటిమలు, మచ్చలు మ్యాజిక్ చేసినట్లుగా మాయమైపోతాయి. కోజిక్ యాసిడ్ మంచి స్కిన్ లైటెనర్.. ఇది మన చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంతో పాటు మచ్చలు, పిగ్మంటేషన్ వంటివి తగ్గిస్తుంది.
4. ఇవే కాదు.. అజిలిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ వంటివి ఉన్న క్రీములు కూడా మొటిమలతో పాటు మచ్చలను కూడా తగ్గిస్తాయి.
5. ఇవేవీ పనిచేయకపోతే సాఫ్ట్ టిష్యూ ఫిల్లర్స్, లేజర్, డర్మాబ్రేషన్, కెమికల్ పీలింగ్, రోలింగ్, బోటాక్స్ వంటి పద్ధతులు చాలానే ఉన్నాయి. మంచి డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించి ఇందులో బెస్ట్ చికిత్సను ఎంచుకోవచ్చు. 

మొటిమలు, మచ్చలు రాకుండా ఎలా కాపాడుకోవాలి (How To Prevent Acne)

 how to treat scars from acne pimples 1

ADVERTISEMENT

చికిత్స కంటే నివారణ మంచిది అని పెద్దలంటారు. అందుకే మచ్చలు రాకముందే వాటిని రాకుండా చేసే పద్దతులు పాటించడం మంచిది.

దీనికోసం చేయకూడని పనులేంటంటే.. (Don’ts)

1. వేడి నీటితో స్నానం చేయకపోవడం.. ఒకవేళ చేసినా ఆ వెంటనే క్రీములు లేదా మేకప్ ఉత్పత్తులు ఉపయోగించడం సరికాదు. ఇలా చేయడం వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఎక్కువ.
2. ఏవైనా నూనె వస్తువులు తిన్నప్పుడు చేతులు కడుక్కోకుండా ముఖాన్ని ముట్టుకోకూడదు.
3. మొటిమలు వస్తే వాటిని ముట్టుకోవడం, లేదా గిల్లడం వంటివి చేయకూడదు. మొటిమలు లేకపోయినా ముఖాన్ని తరచూ ముట్టుకోవడం సరికాదు.
4. మొటిమలు వాటంతట అవే పగిలినా వాటిపై క్రీం లేదా పసుపు లాంటివేవీ పెట్టకపోవడం మంచిది.
5. మీ చర్మతత్వానికి సరిపడని ఉత్పత్తులను ఉపయోగించకూడదు.
6. చాలామంది మచ్చలు రంగు మారతాయని బ్లీచ్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇది సరికాదు. ఎందుకంటే బ్లీచ్ చర్మం పై చాలా కఠినంగా పనిచేస్తుంది. మొటిమలు వచ్చే చర్మం చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఈ చర్మంపై బ్లీచ్ ఉపయోగించడం వల్ల చర్మం మరింతగా పాడయ్యే అవకాశం ఉంటుంది.

ఇవి చేయండి.. (Do’s)

how to treat scars from acneskin %281%29

1. మీ చర్మంపై మొటిమలు ఎక్కువగా వస్తున్నాయని మీకు అనిపిస్తే వెంటనే వాటికి చికిత్సను ప్రారంభించడం మంచిది. దీనికోసం బెంజోయిల్ పెరాక్సైడ్, సాలిసిలిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ వంటి పదార్థాలున్న క్రీమ్‌లను ఎంచుకోవడం మంచిది.
2. చాలామంది ముఖం కడుక్కోవడానికి బద్ధకిస్తూ ఉంటారు. కానీ రోజులో రెండు మూడు సార్లయినా ముఖం కడుక్కోవడం వల్ల ముఖం తాజాగా మెరిసిపోతూ ఉంటుంది.
3. మిసెల్లార్ వాటర్, రోజ్ వాటర్ వంటి ఉత్పత్తులతో మేకప్‌ని తొలగించుకోవడం ఆ తర్వాత ముఖాన్ని క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వంటి ప్రక్రియలతో శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
4. రెటినాల్‌తో కూడిన సీరమ్ లేదా నూనెలు అన్ని రకాల చర్మ తత్వాలకు నప్పుతాయి. అందుకే వీటిని ఉపయోగించి మొటిమలు, మచ్చలను తగ్గించుకోండి. అయితే వీటిని ఉపయోగించే ముందు డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించడం మంచిది.
5. కోజిక్ యాసిడ్, లిక్రోయిస్ రూట్ వంటివి ఉన్న ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల చర్మం పై మచ్చలు రాకుండా ఉంటాయి.
6. సాధారణంగా మచ్చలు ఎక్కువగా ఉన్నప్పుడు.. సన్ ట్యాన్ బారిన కూడా పడితే.. అవి మరింతగా నల్లగా మారిపోతాయి. అందుకే ఎస్ పీ ఎఫ్ వ్యాల్యూ మంచి రేంజిలో ఉండేలా మంచి సన్ స్క్రీన్ లోషన్‌ని ఎంచుకోవాలి.
7. ఇంట్లోనే కలబంద గుజ్జు, అవకాడో గుజ్జు, శనగ పిండి వంటి వాటితో పాటు కొబ్బరి నూనె, నీళ్లు కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి.
8. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ముఖంలో కాంతి పెరుగుతుంది. అంతే కాదు.. మొటిమలు, మచ్చలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రోజూ కనీసం నాలుగైదు లీటర్ల నీళ్లు తాగాలి.
9. ఒత్తిడి వల్ల మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి.. కాబట్టి ఒత్తిడి కూడా తగ్గించుకోవాలి.
10. రోజూ సున్నిపిండితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖం శుభ్రంగా ఉంటుంది.

ADVERTISEMENT

తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు (FAQ’s)

1. మచ్చలు తగ్గేందుకు సాధారణంగా ఎంత సమయం పడుతుంది?

సాధారణంగా మొటిమల మచ్చలు తగ్గడం అనేది వాటి రకాలను బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణ మొటిమల మచ్చలైతే వారం నుంచి పది రోజుల్లో తగ్గిపోతాయి. అవే కాస్త మొండి మచ్చలు లేదా గుంటల్లాంటివి తగ్గేందుకు రెండు నెలల నుంచి సంవత్సరం వరకూ సమయం పడుతుంది.

how to treat scars from acneskin

2. మొటిమల మచ్చలు శాశ్వతమైనవా?

మొటిమల మచ్చలు శాశ్వతమైనవి కావు.. కొన్ని మచ్చలు పది రోజుల్లో తగ్గిపోతే కొన్ని నెలలు, సంవత్సరాల సమయం తీసుకుంటాయి.. కొన్ని సహజంగా వాటికవే తగ్గిపోతే.. మరికొన్ని చికిత్స వల్ల మాత్రమే తగ్గుతాయి. 

3. మొటిమల మచ్చలు తగ్గించే ట్రీట్ మెంట్ ఖరీదైనదా? దానికి దుష్ప్రభావాలుంటాయా?

మొటిమల మచ్చలను తగ్గించడానికి సాధారణంగా ఇంటి చిట్కాలను పాటించవచ్చు. అయితే కాస్త కఠినమైన మచ్చలకు క్రీములు లేదా ట్రీట్ మెంట్స్ తీసుకోవచ్చు. క్రీముల వల్ల పెద్దగా ప్రమాదం లేకపోయినా డెర్మాబ్రెషన్, కెమికల్ పీల్స్ వంటి చికిత్సలు తీసుకోవడం వల్ల కాస్త ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే నిపుణుల సలహా తీసుకొని మీకు నప్పుతుందా లేదా నిర్ణయించుకొని ట్రీట్ మెంట్ తీసుకోవడం మంచిది. మచ్చల తీవ్రత ఆధారంగా చికిత్స ఖరీదు కూడా ఉంటుంది.

ADVERTISEMENT

4. మచ్చలను మేకప్‌తో ఎలా కవర్ చేయాలి?

సాధారణంగా మొటిమల మచ్చలు తగ్గడానికి కాస్త సమయం పడుతుంది. అయితే ఈలోపు మచ్చలను కవర్ చేయడానికి మేకప్‌ని ఉపయోగించవచ్చు. దీనికోసం ముందుగా మాయిశ్చరైజర్ రాసి తర్వాత ప్రైమర్‌తో మేకప్ ప్రారంభించాలి.

ప్రైమర్‌ని ముఖమంతా అప్లై చేసుకున్న తర్వాత మచ్చలున్న చోట కన్సీలర్‌ని చుక్కలుగా అప్లై చేసి టిష్యూ పేపర్‌తో అద్దుకోవాలి. దీన్ని రుద్దకూడదు. ఆపై కళ్ల కింద కూడా కన్సీలర్ అద్దుకొని స్ప్రే ఫౌండేషన్ వేసుకోవాలి. దీనిపై మేకప్ పౌడర్ లేదా సాధారణ పౌడర్ వేసి లుక్ పూర్తి చేయాలి. లిప్, ఐ మేకప్ వేస్తే లుక్ అద్భుతంగా కనిపిస్తుంది. 

ఇవి కూడా చదవండి. 

అవిసె గింజ‌ల‌తో ఆరోగ్య‌మే కాదు.. అంద‌మైన మోము కూడా సొంత‌మ‌వుతుంది..!

ADVERTISEMENT

క‌మ్మ‌ని చాక్లెట్.. మీకు క‌ళ్లు చెదిరే అందాన్ని కూడా అందిస్తుంది..!

బొప్పాయి మీకందించే.. బహుచక్కని ప్రయోజనాలేమిటో తెలుసా..?

29 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT