ADVERTISEMENT
home / సౌందర్యం
ఈ ప్యాక్స్‌తో నల్ల మచ్చలు.. మటుమాయం అయిపోతాయి తెలుసా..?

ఈ ప్యాక్స్‌తో నల్ల మచ్చలు.. మటుమాయం అయిపోతాయి తెలుసా..?

అందమైన చందమామపై నల్ల మచ్చలు (dark spots) ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఆ  మచ్చలే.. అందమైన అమ్మాయి ముఖంపై ఏర్పడితే మాత్రం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ముఖంపై నల్లమచ్చలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకపోవడం, దుమ్ము, కాలుష్యం, హార్మోన్ల ప్రభావం వంటివి మాత్రమే కాదు.. జన్యు పరమైన కారణాల వల్ల కూడా మచ్చలు వస్తుంటాయి.

వీటితో పాటు మొటిమల మచ్చలు, హైపర్ పిగ్మంటేషన్ (pigmentation) ఇలా కారణాలు ఎన్నెన్నో. ఈ మచ్చలను తగ్గించేందుకు ఇంట్లోనే ఉపయోగించగలిగే సహజమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఇవి సహజమైనవి కాబట్టి కొద్దిగా ఆలస్యమైనా ఫలితాలు మాత్రం తప్పక కనిపిస్తాయి.

రోజూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ప్రక్రియను కొనసాగిస్తూ.. ఈ ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల.. నల్ల మచ్చలు త్వరగా తగ్గే వీలుంటుంది. ఇవన్నీ సాధారణంగా.. మన ఇంట్లో.. మన వంట గదిలో లభించేవే. ఇవి మన చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంతో పాటు మెరుపును కూడా అందిస్తాయి.

ADVERTISEMENT

కొబ్బరి, ఆలివ్ నూనె

కొబ్బరి నూనెతో కలిగే ప్రయోజనాల గురించి మనం ఎప్పటి నుంచో వింటున్నాం. కొబ్బరితో పాటు ఆలివ్ నూనెను కూడా వాడడం వల్ల..  చర్మానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ రెండిట్లో ‘విటమిన్ ఇ’ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి మొటిమల మచ్చలు, వయసు వల్ల వచ్చే మచ్చలు, నల్లని పిగ్మంటేషన్ వంటివన్నీ తగ్గిస్తాయి.

కావాల్సినవి
కొబ్బరి నూనె – రెండు టేబుల్ స్పూన్లు
ఆలివ్ నూనె – రెండు టేబుల్ స్పూన్లు

తయారీ
ఈ రెండు నూనెలను బాగా కలిపాక.. నల్లని మచ్చలు, వలయాలు వంటివి ఏర్పడిన చోట బాగా రుద్దాలి. తర్వాత నాలుగైదు నిమిషాల పాటు గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన నూనెను.. కాటన్ సాయంతో తుడిచేసి గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.

బంగాళాదుంప, నిమ్మరసంతో..

నల్లటి వలయాలు, మచ్చలను తొలిగించడానికి బంగాళాదుంప, నిమ్మరసం వంటివి చాలా బాగా పనిచేస్తాయి. వీటిలో సహజ బ్లీచింగ్ గుణాలుంటాయి. ఇవి మీ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి.

ADVERTISEMENT

కావాల్సినవి
బంగాళాదుంప – ఒకటి
నిమ్మరసం – సగం ముక్క
వేడి నీళ్లు – కప్పు

తయారీ
తొలుత బంగాళాదుంప తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు చేయాలి. తర్వాత కప్పు వేడి నీళ్లలో వాటిని 20 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత ముక్కలు తీసేసి నీళ్లను వడగట్టుకోవాలి. తర్వాత అర కప్పు నిమ్మరసాన్ని అందులో వేసి.. ఆ మొత్తాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నీటిలో ఒక కాటన్ బాల్‌‌‌‌‌ను ముంచాలి. అదే బాల్‌తో రోజుకు రెండు సార్లు ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పావుగంట సేపు ఆగి ముఖం కడుక్కోవాలి.

టొమాటో, తేనెతో..

కిచెన్‌లో లభించే ఈ పదార్థాలు చర్మంలో తేమను పెంచడంతో పాటు.. చర్మ రంధ్రాలను శుభ్రం చేసి నల్ల మచ్చలను, పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తాయి.

ADVERTISEMENT

కావాల్సినవి
టొమాటో – ఒకటి
తేనె – రెండు టీస్పూన్లు

తయారీ
టొమాటోను మిక్సీ పట్టి రసాన్ని తీయాలి. ఆ రసానికి తేనెను కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత.. కాటన్ బాల్‌తో రోజుకి రెండు మూడు సార్లు అప్లై చేయాలి.

పెరుగు, శనగ పిండి..

కాలుష్యం కారణంగా ఏర్పడే మచ్చలను తొలిగించేందుకు.. అలాగే సూర్యకాంతి వల్ల కమిలిపోయే చర్మానికి ఉపశమనం కలిగించేందుకు..  అదేవిధంగా చర్మ ఛాయను మెరుగుపర్చేందుకు ఈ మిశ్రమం ఎంతగానో తోడ్పడుతుంది.

కావాల్సినవి
శనగ పిండి – రెండు టేబుల్ స్పూన్లు
పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు

ADVERTISEMENT

తయారీ
ఈ రెండింటినీ బాగా కలిపి.. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత.. అరగంట పాటు ఉంచుకొని ముఖం కడుక్కోవాలి.

బేకింగ్ సోడా.. నిమ్మరసరం.. చక్కెరతో..

బేకింగ్ సోడాను కేవలం కేక్స్, బిస్కట్స్ వంటివి తయారుచేయడానికి మాత్రమే కాదు.. ముఖాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు కూడా ఉపయోగిస్తారు. ఇది మీ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. బ్యాక్టీరియాను తొలగించడంతో పాటు.. చర్మ రంధ్రాలను తెరుస్తుంది.

కావాల్సినవి
చక్కెర – టేబుల్ స్పూన్
నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు
బేకింగ్ సోడా – అర కప్పు

ADVERTISEMENT

తయారీ
ఈ మూడింటినీ బాగా కలిపి తయారుచేసిన మిశ్రమాన్ని.. మీ చేతులతో నల్లని మచ్చలున్న చోట రుద్దుకొని నెమ్మదిగా స్క్రబ్ చేయాలి.

బొప్పాయి, గ్రీన్ టీ

ముఖానికి అద్భుతమైన మెరుపు సొంతం కావాలంటే ఉపయోగించాల్సిన పండ్లలో.. బొప్పాయి చాలా ముఖ్యమైంది. ఇక గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటితో తయారుచేసే ఫేస్ ప్యాక్ నల్ల మచ్చలను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను పెంచి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

కావాల్సినవి
బొప్పాయి గుజ్జు – అర కప్పు
గ్రీన్ టీ – పావు కప్పు

తయారీ
ముందుగా ఈ రెండింటినీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముఖానికి ఆవిరి పట్టుకొని.. చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేయాలి. తర్వాత ఈ ప్యాక్ అప్లై చేసుకొని అరగంట పాటు ఉంచుకోవాలి. తర్వాత ఫేస్ ప్యాక్‌ని చల్లని నీటితో కడిగేసుకోవాలి.

ADVERTISEMENT

పాలు, కుంకుమ పువ్వు

ఈ ఫేస్ ప్యాక్ నల్ల మచ్చలను తగ్గిస్తుంది. అంతేకాదు.. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

కావాల్సినవి
పాలు – రెండు టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు – కొద్దిగా

తయారీ
తొలుత పాలలో కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పాలు పసుపు రంగులోకి మారేంత వరకూ ఆగాలి. ఆ పైన ఆ మిశ్రమంలో కాటన్‌ని ముంచి తీయాలి. దాంతో ముఖమంతా రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. మచ్చలు కూడా తగ్గుతాయి.

ADVERTISEMENT

జీలకర్ర, బియ్యం కడిగిన నీళ్లు

చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలను తొలగించడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. జీలకర్ర, బియ్యం.. ఈ రెండూ ప్రతి ఇంట్లో ఉండేవే. కాబట్టి వీటి కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.

కావాల్సినవి
నీళ్లు – రెండు కప్పులు
జీలకర్ర – రెండు టేబుల్ స్పూన్లు
బియ్యం నానబెట్టిన నీళ్లు – కప్పు

తయారీ
రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను.. రెండు కప్పుల నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత ఇందులో కప్పు బియ్యం నానబెట్టిన నీళ్లు పోయాలి. తర్వాత ఆ నీళ్లను ఐస్ ట్రేలో నింపుకోవాలి. ఆ పైన డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. రోజుకొకసారి.. ఒక ఐస్ క్యూబ్ తీసుకొని నల్ల మచ్చలున్న చోట రుద్దుకోవాలి.

ADVERTISEMENT

వేపాకు, రోజ్ వాటర్‌తో..

వేపాకులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మం పై బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. మొటిమల మచ్చలను మాత్రమే కాదు.. పిగ్మంటేషన్‌ని కూడా దూరం చేస్తుంది.

కావాల్సినవి
వేపాకులు – గుప్పెడు
రోజ్ వాటర్ – తగినంత

తయారీ
వేపాకుల్లో రోజ్ వాటర్ వేసి బాగా మిక్సీ పట్టాలి. తర్వాత దీన్ని ముఖానికి పట్టించి అరగంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

25 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT