ADVERTISEMENT
home / సౌందర్యం
మీ అంద‌మైన మెరిసే జుట్టు కోసం.. చ‌క్క‌టి షాంపూ బ్రాండ్లివే..! – Best Shampoos For Different Hair Types In India

మీ అంద‌మైన మెరిసే జుట్టు కోసం.. చ‌క్క‌టి షాంపూ బ్రాండ్లివే..! – Best Shampoos For Different Hair Types In India

అందమైన మెరిసే జుట్టు(Hair) కావాల‌ని కోరుకోని వారు ఎవ‌రుంటారు చెప్పండి? అయితే ఇది కేవ‌లం జ‌న్యుప‌రంగా వ‌చ్చేది మాత్ర‌మే కాదు.. వివిధ ర‌కాల ఉత్ప‌త్తుల‌ను ఉప‌యోగించి మ‌నం దాన్ని సంర‌క్షించుకోవ‌డం కూడా ముఖ్య‌మే. జుట్టును ఆరోగ్యంగా, అందంగా ఉంచేందుకు మ‌నం ఫాలో అయ్యే బేసిక్స్‌లో మొద‌టిది జుట్టును షాంపూ(Shampoo) చేసుకోవ‌డం.. అలాగే.. రోజూ కాదు కానీ రెగ్యుల‌ర్‌గా త‌ల‌స్నానం చేస్తూ ఉండాలి.

అలాగే కండిష‌న‌ర్‌తో కండిష‌న్ చేయ‌డం, నూనె వంటివి ఉప‌యోగించి డీప్ కండిష‌నింగ్ చేయ‌డం, స్టైలింగ్ చేసుకోవ‌డం, హాట్ ఆయిల్ మ‌సాజ్ వంటివ‌న్నీ చేస్తూ కూడా జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

మ‌నంద‌రి వ్య‌క్తిత్వాలు, ఇష్టాయిష్టాలు అన్నీ వేరుగా ఉంటాయి. మ‌రి, అంద‌రం ఒకే ర‌కం షాంపూ ఎందుకు ఉప‌యోగించాలి? మ‌న చ‌ర్మంలాగానే జుట్టు కూడా ఒక్కొక్క‌రికి విభిన్నంగా ఉంటుంది. అందుకే దానికి వ్య‌క్తిగ‌తంగా ప్ర‌త్యేక కేర్ (Hair care) తీసుకోవాల్సి ఉంటుంది.

పొడి జుట్టుకు పోష‌ణ అందించాలి.. ర‌ఫ్‌గా ఉన్న జుట్టును మృదువుగా మార్చేందుకు త‌గిన ఉత్ప‌త్తులు ఉప‌యోగించాలి. జుట్టు ఎలా ఉన్నా స‌రే.. రాలిపోకుండా ఒత్తుగా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఇదంతా చ‌దువుతుంటే కాస్త క‌న్ఫ్యూజింగ్‌గా అనిపిస్తోంది కదూ. అయితే మీ జుట్టు ర‌కానికి త‌గిన‌ట్లు బెస్ట్ షాంపూల గురించి తెలుసుకుందాం రండి..

ADVERTISEMENT

ఉంగ‌రాల జుట్టుకి షాంపూలు
స్ట్రెయిట్ జుట్టుకి షాంపూలు
స‌న్న‌ని జుట్టుకి షాంపూలు
జుట్టు రాల‌డాన్ని అరిక‌ట్టే షాంపూ బ్రాండ్స్‌
కెమిక‌ల్స్ అప్లై చేసిన జుట్టుకి షాంపూ
ఆర్గానిక్ షాంపూ బ్రాండ్స్‌
త‌ర‌చూ వ‌చ్చే సందేహాలు

shampoo1

ఉంగ‌రాల జుట్టుకి మ‌న‌దేశంలో అందుబాటులో ఉన్న షాంపూలు (Shampoos For Wavy Hair)

సాధార‌ణ జుట్టు కంటే ఉంగ‌రాల జుట్టును మెయిన్‌టైన్ చేయ‌డం ఎంతో క‌ష్టం. ఇది ఆ త‌ర‌హా జుట్టు ఉన్న‌వారికే అర్థ‌మ‌వుతుంది. అందులోనూ చ‌లికాలంలో ఈ త‌ర‌హా జుట్టు ర‌ఫ్‌గా, నిర్జీవంగా తయార‌వుతుంది. జుట్టులో జీవం పెంచి, ఇంత‌కుముందున్న‌ట్లుగా మార్చ‌డం ఎంతో క‌ష్ట‌మైన ప‌ని.. చిక్కులుప‌డిపోయిన జుట్టులో జీవాన్ని పెంచేందుకు ఏ షాంపూ ఉప‌యోగించాలో చూద్దాం..

ఓజీఎస్ మొరాక‌న్ ఆర్గాన్ ఆయిల్ షాంపూ (OGS Moroccan Organ Oil Shampoo)

ఇది మన దేశంలోనే బెస్ట్ షాంపూ బ్రాండ్‌గా చెప్పుకోవ‌చ్చు. ఈ షాంపూలు పారాబెన్‌, స‌ల్ఫేట్ ఫ్రీగా ఉంటాయి. అంతేకాదు.. ఇది మీ జుట్టుకి చ‌క్క‌టి మెరుపును అందిస్తుంది. స్టైలింగ్ చేసినా, డై వేసినా ఈ షాంపూను ఉప‌యోగించ‌వచ్చు. ఇది మీ జుట్టులో తేమను పెంచి సిల్కీగా మార్చుతుంది. దీంతో మంచి ఫ‌లితాలు రావాలంటే ఓజీఎస్ మొరాక‌న్ ఆర్గాన్ ఆయిల్ కండిష‌న‌ర్‌, హెయిర్ మాస్క్‌ని కూడా ఉప‌యోగించండి. ధ‌ర రూ.723.

మార్క్ ఆంథోనీ స్ట్రిక్ట్‌లీ క‌ర్ల్స్ సల్ఫేట్ ఫ్రీ క‌ర్ల్ డిఫైనింగ్ షాంపూ (Mark Anthony Strictly Curls Sulfate Free Curl Defining Shampoo)

హెయిర్ స్టైలింగ్ ఉత్ప‌త్తులు ఎక్కువ‌గా వాడే వారికి.. జుట్టు గురించి వివిధ ర‌కాల ట్రీట్‌మెంట్స్ కోసం చూసే వారికి పాపుల‌ర్ హెయిర్ స్టైలిస్ట్ మార్క్ ఆంథోనీ గురించి తెలిసే ఉంటుంది. త‌ను ఏర్పాటు చేసిన సంస్థే ఇది. ఇవి స‌ల్ఫేట్ ఫ్రీ కావ‌డంతో జుట్టుకు ఎక్కువ మెరుపును అందిస్తాయి. అంతేకాదు.. ఇందులోని విట‌మిన్ ఇ, ప్రొటీన్ జుట్టులో తేమ‌ను పెంచి దాన్ని మృదువుగా మారుస్తాయి. ధ‌ర‌. రూ. 1400

ADVERTISEMENT

మక‌డామియా న్యాచుర‌ల్ ఆయిల్ రిజువినేటింగ్ షాంపూ (Macadamia Natural Oil Regulating Shampoo)

ఈ షాంపూలో రెండు రకాల నూనెలుంటాయి. వాటిని మ‌న జుట్టులోకి పంపి జుట్టును మృదువుగా మారుస్తుందీ షాంపూ. ఇందులో మ‌క‌డామియా ఆయిల్‌తో పాటు ఆర్గాన్ ఆయిల్ కూడా ఉంది. ఇవి జుట్టును బౌన్సీగా మారుస్తాయి. జుట్టులో తేమ‌ను నింపి సాగే గుణాన్ని, బౌన్స్‌ని పెంచుతాయి. ధ‌ర రూ.1400

shampoo2

స్ట్రెయిట్‌ జుట్టుకి మ‌న‌దేశంలో అందుబాటులో ఉన్న షాంపూలు (Shampoos For Straight Hair)

స్ట్రెయిట్ హెయిర్‌ను మెయిన్‌టైన్ చేయ‌డం సుల‌భమేనని మనకు అనిపించవచ్చు. కానీ అందులో మెరుపును కొన‌సాగించ‌డం చాలా క‌ష్టం. పైగా పెరుగుతున్న కాలుష్యంతో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడ‌డం కూడా క‌ష్ట‌మే. అందుకే దానికి త‌గిన తేమ‌ను అందిస్తూ డ‌ల్‌నెస్‌ని, పొడిద‌నాన్ని పోగొట్ట‌డం మంచి షాంపూ వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంది.

లోరియ‌ల్ ప్రొఫెష‌న‌ల్ అబ్సొల్యూట్ రిపేర్ లిపిడియం షాంపూ (Loreal Professional Absolute Repair Lipidium Shampoo)

డ్యామేజ్‌డ్ హెయిర్ కోసం ఈ షాంపూ ప్ర‌త్యేకంగా త‌యారైంది. ఇది మీ జుట్టును మృదువుగా, మెరిసేలా, మెత్త‌గా మారుస్తుంది. ఈ షాంపూలో లిపిడ్స్ నిండి ఉంటాయి. అంతేకాదు.. జుట్టుకు అవ‌స‌ర‌మైన అత్యవ‌స‌ర పోష‌కాలు జుట్టును మెరిసేలా చేస్తాయి. జుట్టులో స‌హ‌జ‌మైన తేమ‌ను ఎక్కువ స‌మ‌యం పాటు ఉండేలా చూస్తూ స‌హ‌జ పోష‌కాల‌ను జుట్టులోనే నిలిపి ఉంచుతాయి. ధ‌ర రూ. 635

స‌న్‌సిల్క్ ప‌ర్ఫెక్ట్ స్ట్రెయిట్ లాక్ షాంపూ (Sunsilk Perfect Straight Lock Shampoo)

బ‌డ్జెట్‌లో అందుబాటులో ఉండే షాంపూల్లో ఇది ఒక‌టి. ఇది జుట్టును స్ట్రెయిటెన్ చేయ‌డంతో పాటు స్మూత్‌గా మార్చి జుట్టులో తేమ‌ ఎక్కువ‌కాలం నిలిచి ఉండేలా చేస్తుంది. ఈ షాంపూను ఉప‌యోగిస్తే చాలు.. మీ జుట్టు మెరిసిపోతూ… మిమ్మల్ని పార్టీకి సిద్ధమయ్యేలా చేస్తుందనడంలో సందేహం లేదు. ధ‌ర రూ. 206

ADVERTISEMENT

స‌న్న‌ని జుట్టుకి మ‌న‌దేశంలో అందుబాటులో ఉన్న షాంపూలు (Shampoos For Thin Hair)

జుట్టు ముడి వేసుకున్నప్పుడు.. అది సన్న‌గా క‌నిపిస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది క‌దూ. అలాగే పోనీటెయిల్ వేసుకుంటే కేవ‌లం రెండుమూడు వెంట్రుక‌లు క‌లిపి ర‌బ్బ‌ర్‌బ్యాండ్ వేసుకున్న‌ట్లు అనిపిస్తోందా? ఏదైనా ప్ర‌త్యేక సంద‌ర్భం వ‌స్తే చాలు.. హెయిర్ ఎక్స్‌టెన్ష‌న్స్ ఉప‌యోగించాల్సి వ‌స్తోందా? అయితే మీరు మీ జుట్టు ఒత్తుగా మారేందుకు షాంపూలు వాడాల్సిందే..

బిబ్లంట్ ఫుల్ ఆన్ వాల్యూమ్ షాంపూ ఫ‌న్ ఫైన్ హెయిర్‌ (Bblunt Full On Volume Shampoo Fun Fine Hair)

మీ జుట్టును ఒత్తుగా మార్చేందుకు మీరు ర‌క‌ర‌కాల ఉత్ప‌త్తులు ఉప‌యోగిస్తుంటే అది కాస్త లావైనా తిరిగి మ‌ళ్లీ స‌న్న‌గా మారిపోతోందా? అయితే మీరు ఈ షాంపూను ఉప‌యోగించాల్సిందే. ఇది మీ స‌న్న‌ని జుట్టుని ఒత్తుగా మార్చేందుకు తోడ్ప‌డుతుంది. దీంతో పాటు కండిష‌న‌ర్‌, లీవ్ ఇన్ స్ప్రే రావ‌డంతో దీని ప్ర‌భావం ఎక్కువ రోజులు ఉంటుంది. ధ‌ర‌. రూ. 675

ట్రెసెమె బ్యూటీ ఫుల్ వాల్యూమ్ షాంపూ (Tresemme Beauty Full Volume Shampoo)

భార‌త్‌లో ఉన్న వివిధ షాంపూ బ్రాండ్ల‌లో ట్రెసెమె చాలా పాపుల‌ర్‌. ఈ షాంపూ, దీనితో పాటు ట్రెసెమె కండిష‌న‌ర్ ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టు అందంగా మ్యానేజ్ చేయ‌డానికి సులువుగా త‌యార‌వుతుంది. ఫుల్ ఆన్ వాల్యూమ్ షాంపూ మీ జుట్టుని బౌన్సీగా మార్చ‌డంతో పాటు మాయిశ్చ‌రైజ్ కూడా చేస్తుంది. ధ‌ర రూ. 460

shampoo3

జుట్టు రాలే స‌మ‌స్య‌కు ఉత్త‌మ‌మైన షాంపూలు (Best Shampoos To Control Hair Fall Problems)

జుట్టు రాలే స‌మ‌స్య ప్ర‌తి అమ్మాయిని ఏదో ఒక ద‌శ‌లో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ప్ర‌స్తుతం ఉన్న కాలుష్యం వ‌ల్ల‌, త‌ల‌స్నానానికి ఉప‌యోగించే నీటి వ‌ల్ల జుట్టు రాలే స‌మ‌స్య ఎదుర‌వుతూ ఉండ‌డం స‌హ‌జం. జుట్టును దువ్వుకున్నాక చూస్తే స‌గం వెంట్రుక‌లు దువ్వెన‌లోనే ఉంటే మన‌సుకు ఎంతో బాధ‌నిపిస్తుంది క‌దూ.. ఈ స‌మ‌స్య‌ను నివారించేందుకు చాలా ర‌కాల మార్గాలున్నాయి. అయితే మంచి షాంపూ కూడా జుట్టు రాల‌డాన్ని కొద్దిగా త‌గ్గిస్తుంద‌నే చెప్పుకోవాలి.

ADVERTISEMENT

హిమాల‌యా హెర్బ‌ల్స్ ప్రొటీన్ షాంపూ జెంటిల్ డైలీ కేర్‌ (Himalayan Herbals Protein Shampoo)

హిమాల‌యా మ‌న దేశంలో ఎక్కువమంది విశ్వ‌సించే స్కిన్‌కేర్ అండ్ హెయిర్‌కేర్ ఉత్ప‌త్తుల సంస్థ‌. ఇది మ‌న చ‌ర్మం, జుట్టును ఎంతో మృదువుగా మారుస్తుంది. ప్రొటీన్ నిండిన ఈ షాంపూ పొడిబారిన జుట్టులో తేమ‌ను పెంచుతుంది. ప్ర‌తి వెంట్రుక‌ను ఆరోగ్యంగా, దృఢంగా మారుస్తుంది. దీనివ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. ఇందులో కెమిక‌ల్స్ ఉండ‌వు కాబ‌ట్టి జుట్టును శుభ్ర‌ప‌ర్చ‌డంతో పాటు కెమిక‌ల్ ఫ్రీగా కూడా మార్చుతుంది. రోజూ త‌ల‌స్నానం చేయాల‌నుకునేవారి కోసం ఇది చాలా చ‌క్క‌టి షాంపూ. ధ‌ర రూ. 360

ప్యాంటీన్ ప్రొ వి హెయిర్‌ఫాల్ కంట్రోల్ షాంపూ (Pantene Pro V Shampoo)

ఈ షాంపూ దేశంలోని మ‌హిళ‌లంద‌రూ మెచ్చే షాంపూ. కెరాటిన్ టెక్నాల‌జీతో త‌యారైన ఈ షాంపూ జుట్టు తెగిపోయి, రాలిపోవ‌డాన్ని ఆపుతుంది. అంతేకాదు.. జుట్టుకు మెరుపును అందిస్తుంది. ఇది జుట్టు రాల‌డాన్ని కొన్నిసార్ల‌లోనే బాగా త‌గ్గిస్తుంది. ధ‌ర రూ.395

డ‌వ్ హెయిర్‌ఫాల్ రెస్క్యూ షాంపూ (Dove Hairfall Rescue Shampoo)

ఇది కూడా అందుబాటు ధ‌ర‌లో అంద‌రికీ న‌చ్చే షాంపూ. ఇది జుట్టు రాల‌డాన్ని చాలా బాగా ఆపుతుంది. దీని ద్వారా చాలా తొంద‌ర‌గా జుట్టు రాల‌డం ఆగుతుంది. జుట్టు తెగిపోవ‌డాన్ని ఆపి.. జుట్టును మృదువుగా, బలంగా మారుస్తుంది. అంతేకాదు.. జుట్టుకు మంచి బౌన్స్‌ని కూడా అందిస్తుంది. ధ‌ర రూ. 450

shampoo4

వివిధ ర‌కాల జుట్టుకు స‌రిపోయే షాంపూలు (Dove Hairfall Rescue Shampoo)

కేవ‌లం జుట్టు మాత్ర‌మే కాదు.. త‌ల‌ చ‌ర్మం కూడా వివిధ ర‌కాలుగా ఉంటుంది. కొంత‌మంది చ‌ర్మం పొడిగా.. మ‌రికొంద‌రిది జిడ్డుగా ఉంటే.. ఇంకొంద‌రిది కాంబినేష‌న్ ర‌కం. మ‌న చ‌ర్మం ఏ ర‌క‌మైన‌దో తెలుసుకుంటే చాలు.. దానికి త‌గిన‌ట్లుగా షాంపూలు ఉప‌యోగించే వీలుంటుంది.

ADVERTISEMENT

లోరియాల్ ప్యారిస్ టోటల్ రిపేర్ 5 షాంపూ (Loreal Paris Total Repair 5 Shampoo)

చాలామంది పొడిగా, ర‌ఫ్‌గా, చిక్కులు ప‌డిపోయిన జుట్టును స‌రిచేయ‌డానికి వివిధ ర‌కాల ఉత్ప‌త్తుల‌ను ఉప‌యోగిస్తుంటారు. అయితే స‌మ‌స్య జుట్టులో కాదు.. కుదుళ్ల‌లో ఉంద‌ని గుర్తించాలి. డ్రై స్కాల్ప్ ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ కార‌ణం. అంతేకాదు.. ఇది చుండ్రు, డ్రైఫ్లేక్స్‌కి కూడా కార‌ణ‌మ‌వుతుంది. లోరియాల్ షాంపూ 5 ర‌కాల స‌మ‌స్య‌ల నుంచి జుట్టును కాపాడుతుంది. పొడి జుట్టు, రఫ్‌గా మారిన జుట్టు, డ‌ల్ జుట్టు, వెంట్రుక‌లు చిట్లిపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌న్నీ ఈ షాంపూతో తీరిపోతాయి. ధ‌ర రూ. 55

రెనె ఫ‌ర్ట‌ర‌ర్ మెలెల్యూకా యాంటీ డాండ్ర‌ఫ్ షాంపూ (René Furterer Melaleuca Anti-Dandruff Shampoo Dry Scalp)

మీ జుట్టు కూడా ఆయిలీగా ఉంటూ, స‌న్న‌గా రెండుమూడు వెంట్రుక‌లు మాత్ర‌మే ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోందా? జుట్టు మ‌రీ జిడ్డుగా అనిపిస్తుండ‌డంతో రోజూ త‌ల‌స్నానం చేయాల్సి వ‌స్తోందా? అయినా రాత్రి అయ్యేస‌రికి జుట్టు నూనెలో ముంచిన‌ట్లుగా త‌యార‌వుతోందా?

అయితే మీ సెబేషియ‌స్ గ్రంథులు ఎక్కువ‌గా ప‌నిచేస్తున్నాయ‌న్నట్లు లెక్క‌. జిడ్డు వ‌ల్ల చుండ్రు కూడా ఎక్కువ‌వుతుంది. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ చ‌క్క‌టి ప‌రిష్కారం రెనె ఫ‌ర్ట‌ర‌ర్ మెలెల్యూకా యాంటీడాండ్ర‌ఫ్ షాంపూ. ఇందులోని క‌ర్బీషియా ఎక్స్‌ట్రాక్ట్స్ త‌ల‌లో నూనె ఉత్ప‌త్తిని త‌గ్గించేస్తాయి. ఇది పారాబెన్ ర‌హిత షాంపూ కాబ‌ట్టి దీనివ‌ల్ల ఎలాంటి దుష్ప్ర‌భావాలు ఎదుర‌వ్వ‌వు. ధ‌ర‌. రూ. 1600

shampoo5

కెమిక‌ల్స్ అప్లై చేసిన జుట్టుకి చ‌క్క‌టి షాంపూలు (Best shampoos For Chemical applied hair)

జుట్టు స్ట్రెయిట్‌గా, స్మూత్‌గా, షైనీగా మార్చాలంటే దానికి కెమిక‌ల్ ట్రీట్‌మెంట్లు త‌ప్ప‌నిస‌రి. అయితే ఈ కెమిక‌ల్ ట్రీట్‌మెంట్ల త‌ర్వాత జుట్టుకి త‌గిన షాంపూలు ఉప‌యోగించ‌క‌పోతే జుట్టు క్వాలిటీ బాగా త‌గ్గిపోతుంది. అందుకే ఇలాంటి ట్రీట్‌మెంట్ల తర్వాత జుట్టును జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సి ఉంటుంది. రెగ్యుల‌ర్‌గా షాంపూ చేయ‌డంతో పాటు చ‌క్క‌టి శ్ర‌ద్ధ వ‌హించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వెల్లా ప్రొఫెష‌న‌ల్స్ బ్రిలియ‌న్స్ షాంపూ ఫ‌ర్ క‌ల‌ర్డ్ హెయిర్‌ (Wella Professionals Brilliance shampoo)

ఈ షాంపూతో మీ రంగు వేసిన జుట్టును అందంగా ఉండేలా కాపాడుకోవ‌చ్చు. మైక్రోలైట్ క్రిస్ట‌ల్ టెక్నాల‌జీతో రూపొందించిన ఈ షాంపూ మీ హెయిర్ క‌ల‌ర్ను మ‌రింత మెరిసేలా చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ర‌ఫ్‌గా, పొడిగా కాకుండా కాపాడతాయి. మృదుత్వం, మెరుపును జుట్టులో నిలిచేలా చేస్తాయి. ధ‌ర రూ. 575

లోరియాల్ ప్రొఫెష‌న‌ల్ ఎక్స్ టెన్సో కేర్ ప్రొ కెరాటిన్ షాంపూ (Loreal professional Exponso Care Pro Keratin Shampoo)

ఇది కెమిక‌ల్ ట్రీటెడ్ హెయిర్ కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన షాంపూ. ఇందులోని కెరాటిన్ గుణాలు హెయిర్ ఫైబ‌ర్‌ని బ‌లంగా మారుస్తుంది. అలాగే అమైనో యాసిడ్స్ స్ట్రెయిటెన్ చేసిన‌, కెమిక‌ల్ ట్రీట్‌మెంట్ చేసిన జుట్టును శుభ్రం చేస్తాయి. అంతేకాదు.. జుట్టు మ‌రీ స‌న్న‌గా కాకుండా దానికి బౌన్స్‌ని కూడా పెంచేలా చేస్తుంది. ధ‌ర రూ. 530

shampoo6

భార‌త్‌లోని ఆర్గానిక్ షాంపూ బ్రాండ్స్‌ (Organic Shampoo Brands In India)

మీకు కెమిక‌ల్స్ అంటే ఇష్టం లేక‌పోయినా.. మీరు ఎక్కువ‌గా ఇంట్లో ల‌భించే ఉత్ప‌త్తులు, స‌హ‌జ ప‌దార్థాల‌ను మీ జుట్టు అందం కోసం ఉప‌యోగించే వారైనా ప్ర‌స్తుతం మార్కెట్లో మీకోసం స‌హ‌జ ఉత్ప‌త్తుల‌తో రూపొందించిన పదార్థాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ జుట్టుకు సహ‌జంగానే మంచి మెరుపును అందిస్తాయి.

వావ్ ఆర్గానిక్స్ హెయిర్ స్ట్రెయిటెనింగ్ షాంపూ ఫ్రీ పారాబెన్ స‌ల్ఫేట్‌ (Wow Organics Hair Straightening Shampoo Free Paraben Sulfate)

వావ్ ఆర్గానిక్స్ ఉత్ప‌త్తులను ఒక‌సారి ప్ర‌య‌త్నించిన‌వారు మ‌ళ్లీ వేరే కంపెనీ ఉత్ప‌త్తులు ఉప‌యోగించ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అంత‌గా దాని ప్ర‌భావం క‌నిపిస్తుంది. రోజ్ మేరీ ఆయిల్‌, టీ ట్రీ ఆయిర్‌, ఆర్గాన్ ఆయిల్‌, సోయా ప్రొటీన్లు క‌లిపిన ఈ షాంపూ మీ జుట్టును అందంగా మార్చ‌డంతో పాటు ప్ర‌తి వెంట్రుక‌ను బ‌లంగా మార్చి.. లోప‌లి నుంచి ఆరోగ్యంగా కండిష‌న్ చేస్తుంది. ఇది అన్ని ర‌కాల జుట్టు త‌త్వాల‌కు న‌ప్పుతుంది. ధ‌ర రూ. 499

ADVERTISEMENT

హెయిర్ మాక్ స‌ల్ఫేట్ ఫ్రీ షాంపూ (Hair Mask Sulphate Free Shampoo)

మీ జుట్టు కెమిక‌ల్స్‌తో ట్రీట్ చేసినదైతే ఆపై మీరు మంచి ఆర్గానిక్ ఉత్ప‌త్తిని ఉప‌యోగించాల‌నుకుంటే ఈ షాంపూను వాడ‌వ‌చ్చు. ఇది మీ జుట్టును మృదువుగా, మెత్త‌గా ప‌ట్టులా మారుస్తుంది. స‌ల్ఫేట్‌, పారాబెన్ ఫ్రీ కాబ‌ట్టి కెమిక‌ల్స్ గురించి మీరు ఏమాత్రం కంగారు ప‌డాల్సిన అవ‌సరం లేదు. ఇది అన్ని ర‌కాల జుట్టు ఉన్న‌వారికి న‌ప్పుతుంది. ధ‌ర రూ. 630.

మీ జుట్టుకి త‌గిన‌ట్లుగా ఏ షాంపూ ఉప‌యోగించాలో తెలుసుకున్నారుగా.. మీ జుట్టుకు స‌రిప‌డిన షాంపూని ఉప‌యోగిస్తూ దాని అందాన్ని కాపాడుకోండి. మ‌రి, షాంపూ ఉప‌యోగించేట‌ప్పుడు సాధార‌ణంగా వ‌చ్చే సందేహాల‌కు స‌మాధానాలు తెలుసుకుందాం రండి..

సాధారణంగా వ‌చ్చే సందేహాలు.. వాటికి జ‌వాబులు (FAQ’s)

1. ఈ షాంపూల‌న్నీ రంగు వేసిన, కెమిక‌ల్స్ ట్రీట్‌మెంట్ చేసిన జుట్టుకు న‌ప్పుతాయా?

కెమిక‌ల్స్ తో ట్రీట్ చేసిన జుట్టుకు వేసుకోవ‌డానికి త‌గిన షాంపూలు వాడితే జుట్టులో తేమ‌ను పెంచ‌డ‌మే కాదు.. ఇందులో బ్లీచ్ ఉండ‌దు కాబ‌ట్టి జుట్టు రంగును కూడా ఏమాత్రం తొల‌గించ‌వు.

2. ఎన్నిరోజుల‌కోసారి ఈ షాంపూల‌తో త‌ల‌స్నానం చేయాలి?

మీ జుట్టును క‌నీసం వారానికోసారి షాంపూ చేయాల్సి ఉంటుంది. దీనివ‌ల్ల త‌ల‌లో ఉన్న స్టైలింగ్ ఉత్ప‌త్తులు, మృత క‌ణాలు లాంటివ‌న్నీ తొల‌గించేందుకు వీల‌వుతుంది. అయితే అంద‌రికీ వారానికోసారి త‌లస్నానం చేయ‌డం స‌రికాదు. మీరు ఈత‌, ఏరోబిక్స్‌, జిమ్ లేదా అవుట్‌డోర్ స్పోర్ట్స్ ఏవైనా ఆడేవారైతే మీ త‌ల‌లో చెమ‌ట ఎక్కువ‌గా ప‌డుతుంది. కాబ‌ట్టి ఇంకాస్త తొంద‌ర‌గానే త‌ల‌స్నానం చేయాల్సి ఉంటుంది. అయితే మ‌రీ త‌ర‌చుగా త‌ల‌స్నానం చేయడం వ‌ల్ల త‌ల‌లో ఉన్న స‌హ‌జ నూనెలు తొల‌గిపోతాయి. అందుకే మ‌రీ త‌ర‌చూ చేయ‌కుండా.. మ‌రీ ఎక్కువ రోజులు స‌మ‌యం ఇవ్వ‌కుండా వారానికి ఒక‌సారి లేదా రెండుసార్లు త‌ల‌స్నానం చేస్తే స‌రి.

ADVERTISEMENT

3. నా జుట్టు ఎలాంటిది అని నేను ఎలా నిర్ధారించ‌గ‌ల‌ను?

మీ జుట్టు ఎలాంటిద‌ని ముందుగానే గుర్తించ‌డం కాస్త క‌ష్ట‌మే. అందుకే మొద‌టిసారి ప్రొఫెష‌న‌ల్ స్టైలిస్ట్ స‌హాయం తీసుకోండి. ఆ స్టైలిస్ట్ మీ వెంట్రుక‌ల‌ను గ‌మ‌నించి అవి ఎంత దృఢంగా ఉన్నాయో.. దాని ర‌కం ఏంటో.. మీ జుట్టు స‌మ‌స్య‌లేంటో అన్నింటి గురించి మీకు చెప్పి.. దానికి త‌గిన హెయిర్‌కేర్ ఉత్ప‌త్తుల‌ను కూడా రిక‌మెండ్ చేస్తారు.

4. వేడి నీటితో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల నా జుట్టు పాడ‌వుతుందా?

అవును. మ‌రీ వేడి నీటితో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల జుట్టు పాడ‌య్యే అవ‌కాశాలుంటాయి. ఇలా చేయ‌డం వ‌ల్ల వెంట్రుక‌ల పైన ఉన్న స‌హ‌జ‌మైన నూనె పొర తొల‌గిపోతుంది. అందుకే గోరువెచ్చ‌ని నీటిని త‌ల‌స్నానం చేయ‌డానికి వాడి ఆ త‌ర్వాత చ‌ల్ల‌ని నీటితో క‌డుక్కోవ‌డం వ‌ల్ల ఎలాంటి ఇబ్బందీ ఎదుర‌వ‌కుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

చర్మ, కేశ సంరక్షణ కోసం వాడాల్సిన.. పారాబెన్, సల్ఫేట్ రహిత ఉత్పత్తులివే..!

ADVERTISEMENT

మీ కురులు ప‌ట్టులా మెరిసిపోవాలా?? ఇంట్లోనే హెయిర్ స్పా ట్రీట్మెంట్ చేసుకుంటే స‌రి..!

స్ట్రెయిటెనింగ్‌, స్మూతెనింగ్‌తో.. జుట్టును స్టైలిష్‌గా మార్చుకుందాం..

Images: Shutterstock

03 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT