ADVERTISEMENT
home / వినోదం
మీ ఇన్స్టాగ్రామ్  అకౌంట్ కి మంచి మైలేజ్ ఇచ్చే 95 క్యాప్షన్లు ( 95 Instagram Captions)

మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మంచి మైలేజ్ ఇచ్చే 95 క్యాప్షన్లు ( 95 Instagram Captions)

ఇన్స్టాగ్రామ్(Instagram).. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకొంటూ ఇంటర్నెట్లోనే ప్రపంచాన్ని పలకరించే నేటితరం యాప్. అందుకే నేను కూడా ఈ మధ్యే ఇన్స్టాగ్రామ్ లో చేరాను. ఈ సోషల్ మీడియా యాప్ లో కొందరికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మరికొందరికి మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది మాత్రమే ఫాలోవర్లు ఉన్నారు. దీనికి కారణం ఏమై ఉంటుదబ్బా అని ఆలోచించి.. వాళ్ల ప్రొఫైళ్లను జల్లెడ పట్టా. అప్పుడే నాకు ఓ విషయం తెలిసింది. కొందరు తమ ఫొటోలు, వీడియోలకు చక్కటి క్యాప్షన్లు, హ్యాష్ ట్యాగ్ లు వాడుతున్నారు. అందుకే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించగలుగుతున్నారనే విషయం నేను తెలుసుకొన్నాను. అసలు ఎలాంటి క్యాప్షన్లు వాడితే మన ఇన్స్టాగ్రామ్ ఖాతా ఎక్కువ మందిని చేరుకొంటుంది? అని బాగా పరిశోధించి మరీ ఓ లిస్ట్ తయారుచేశాను.

ప్రతి చిత్రం కోసం శీర్షికలు (Instagram Captions For Every Picture)

Instagram Captions For Every Picture 

Caption For Vacation Pictures  

Types Of Captions  

ADVERTISEMENT

అవేంటో మీక్కూడా చెబుతా. ఏ సందర్భంలో వాడాలో కూడా చెబుతా.. మీరు కూడా వాటిని చక్కగా మీ ప్రొఫైల్ లో క్యాప్షన్లుగా పెట్టి ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ స్టేటస్ అందుకోండి.

 

ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ ఎందుకు ముఖ్యం? (Why Instagram Captions Are Important) 

ఇన్స్టాగ్రామ్ అంటే మనకి ఓ అభిప్రాయం ఉంది. అదే ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకొనే సామాజిక మాధ్యమం అని. నిజమే.. ఇన్స్టాగ్రామ్ లో అవే ప్రధాన ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వాటికి మనం ఇచ్చే క్యాప్షన్లు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. అవే మన ఖాతాను ఇతరులు ఫాలో అవ్వాలా? వద్దా? అనే అంశాన్ని నిర్ణయిస్తాయి. గ్రూప్ ఫొటో, సెల్ఫీ అయినా.. మనమిచ్చే క్యాప్షన్ వల్ల ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పెరగకపోవచ్చు. కానీ ఈ రోజు ఏ ఫొటోకి ఏ క్యాప్షన్ పెట్టారనే ఉత్సుకతను వారిలో పెంచుతాయి. అది వారిని కామెంట్, లైక్ చేసే విధంగా చేస్తాయి. అలా నెమ్మది నెమ్మదిగా మీ అకౌంట్ కు ఫాలోవర్లను పెంచుతాయి. మీరిచ్చే క్యాప్షన్ లో మీదైన ముద్ర కనిపించాలి. ఎందుకంటే వాటి ద్వారానే మీ గురించి మీ ఫాలోవర్లకు తెలుస్తుంది. 

ADVERTISEMENT

ఆకట్టుకొనే క్యాప్షన్ కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలి? (Tips For Creating Caption)

  • క్యాప్షన్ పెట్టే ముందు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం.. మీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఎవరి ఫాలోయింగ్ పెంచుకోవాలనుకొంటున్నారని. ముందు దీనిపై ఓ నిర్ణయానికి రావాలి. మీ అకౌంట్లో ఫాలోవర్లు ఎక్కువ మంది మీ కుటుంబ సభ్యులు, స్నేహితులే ఉంటే.. మీ కామెంట్ వ్యక్తిగతమైనదిగా ఉండొచ్చు. కానీ కాస్త నవ్వు తెప్పించే విధంగా ఉండాలి. మీరు బ్లాగ్ నడుపుతున్నట్లయితే.. మీరిచ్చే క్యాప్షన్ లో మీ ఫాలోవర్ కి వీలైనంత సమాచారం అందించాలి. ఉదాహరణకు మీరు ఫ్యాషన్ బ్లాగ్ నిర్వహిస్తున్నట్లయితే.. మీరు పోస్ట్ చేసిన ప్రొడక్ట్ కి సంబంధించిన వివరాలన్నింటినీ అందులో ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్లను పెంచుకొంటే మనకు ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తరచూ పోస్ట్ లు పెడుతూ ఉండండి. అప్పుడే మీ ఖాతాకు లైక్స్, కామెంట్స్ పెరుగుతాయి. తద్వారా మీరు ఇన్ఫ్లుయెన్సర్ గా మారొచ్చు.
  • ఇన్స్టాగ్రామ్ లో మీరు పెట్టే క్యాప్షన్లు వీలైనంత క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలి. పెద్ద పెద్ద క్యాప్షన్లు పెడితే ఇన్స్టాగ్రామ్ వాటిని కుదిస్తుంది. దీంతో మీ ఫాలోవర్ ‘రీడ్ మోర్’ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా అయితే.. మీ పోస్ట్ ఎక్కువ మందికి చేరకపోవచ్చు. అందుకే వీలైనంత వరకు క్యాప్షన్ ను రెండు పంక్తులకే పరిమితం చేయాలి. తప్పని పరిస్థితుల్లో ఎక్కువ రాయాల్సి వస్తే మనల్ని అనుసరించే వారిని ఆకట్టుకొనే వాక్యాన్ని ముందు రాయాల్సి ఉంటుంది.
  • మీ ఫాలోవర్లను మరింత ఆకట్టుకోవడానికి కొన్ని ప్రశ్నలు వారి ముందు ఉంచండి. అది ఒక్కమాటలో సమాధానం ఇచ్చేదై ఉండాలి. ఉదాహరణకి ‘మీకు నచ్చిన పర్యటక ప్రదేశం ఏది?’ అని మీరు పోస్ట్ చేస్తే… దానికి వారు తమకు నచ్చిన ప్రాంతాన్ని సమాధానంగా ఇస్తారు.
  • ఉదాహరణకి మీరు ఒక పర్యటక ప్రదేశానికి లేదా కాఫీషాప్ కి సంబంధించి లేదా ఎవరితోనైనా కలసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారనుకొందాం. ఇప్పుడు మీకు ఆ ప్రదేశంతో లేదా ఆ వ్యక్తులతో ఉన్న అనుబంధం గురించి హాస్యంతో కూడిన మాటల్లో వర్ణించవచ్చు. లేదా అక్కడ జరిగిన హాస్య సంఘటన గురించి చెప్పచ్చు. ఇది మీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు మంచి మైలేజ్ ను అందిస్తుంది. 

సందర్భానుసారంగా ఇవ్వాల్సిన ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్లు (Captions For Occasions)

స్నేహితులతో కలసి దిగిన సాధారణమైన సెల్ఫీ అయినప్పటికీ దానికి చక్కటి క్యాప్షన్ జోడిస్తే మీ ఫాలోవర్ల దృష్టిని అది బాగా ఆకర్షిస్తుంది. పర్యటక ప్రదేశాల్లో దిగిన ఫొటోల నుంచి కుటుంబంతో దిగిన ఫొటోల వరకు ఏ క్యాప్షన్ ఇస్తే ఎక్కువ మందికి చేరువ అవుతుందో నేను ఓ జాబితాను సిద్ధం చేసి పెట్టాను. అది మీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఫొటోలతో సంబంధం లేకుండా మరింత ఎక్కువ మందికి చేరువ అయ్యేలా చేస్తుంది.

వెకేషన్ పిక్చర్స్ కోసం చక్కటి క్యాప్షన్లు (Caption For Vacation Pictures)

మీరు త్వరలో ఎక్కడికైనా టూర్ కి వెళ్లాలనుకొంటున్నారా? అయితే నేను చెప్పే ఈ క్యాప్షన్లను మీరు కాపీ చేసి పెట్టుకోండి. మీరు చక్కగా ఫొటోలు దిగి వాటికి సరిపోయే క్యాప్షన్ ఎంచుకొని మరీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి.

  1. నేను అన్ని ప్రదేశాల్లోనూ ఉండలేకపోవచ్చు. కానీ నా ట్రావెల్ లిస్ట్ లో వాటికి చోటుంటుంది.
  2. వాండర్ లస్ట్ : ప్రయాణించాలనే కోరిక..  ప్ర‌కృతిని అర్థం చేసుకొనే ప్రయత్నం.
  3. ప్రతి రోజూ ఓ సాహస యాత్ర.. డాక్టర్ అవసరం లేకుండా చేస్తుంది.
  4. ఎన్నోొ ఎన్నో.. ప్ర‌కృతిలో వింతలెన్నో..
  5. ఎంత అద్భుతం.. ఈ సూర్యాస్తమయం..
  6. అద్భుతం.. సముద్రాన్ని ముద్దాడుతున్న సూర్యున్ని చూశాను.
  7. వెకేషన్ మోడ్: ఆన్, వర్క్ మోడ్: ఆఫ్
  8. గడియారంలో నిమిషాల్ని లెక్కించే బదులు ఆకాశంలో నక్షత్రాల్ని లెక్కిస్తున్నా..
  9. ఇల్లు – ఓ ప్రదేశం కాదు.. మనల్ని అక్కున చేర్చుకొనే ప్రేమమూర్తి.
  10. జీవితం ఎంత హాయిగా అనిపిస్తుందో..!
  11. ఈ అందమైన రాత్రులు.. ఆ చక్కని చుక్కలు.. వహ్వా.. ఈ ట్రిప్ అద్భుతంగా అనిపిస్తోంది.
  12. ఈ ప్రపంచాన్ని నా సొంతం చేసుకొన్నా. అందుకే అది నాకు చిన్నగా అనిపిస్తోంది.

స్నేహితుల కోసం ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్లు (Captions For Friends)

స్నేహితులతో కలసి దిగిన ఫొటోలు దాదాపుగా సెల్ఫీలే అయి ఉంటాయి. వాటిని తరచూ మనం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇవి మన ఫాలోవర్లకు కాస్త బోర్ గా అనిపించవచ్చు. అందుకే మనం చక్కటి క్యాప్షన్లను వాటికి జోడిస్తే అందరినీ ఆకట్టుకోగలుగుతాం. అవి ఫన్నీగా, భావోద్వేగాన్ని కలిగించేవిగా ఉండాలి.

ADVERTISEMENT
  1. వెలుతురులో ఒంటరిగా ఉండటం కంటే..చీకట్లో స్నేహితురాలితో కలసి నడవడానికి ఇష్టపడతాను.
  2. స్నేహితులు – మనం ఎంచుకొన్న కుటుంబ సభ్యులు.
  3. నాకు దారి చూపించే వెలుగు కిరణం నువ్వే మిత్రమా..!
  4. భగవంతుడిచ్చిన సోదరి నా స్నేహితురాలు.
  5. పిజ్జా.. బెస్ట్ ఫ్రెండ్.. పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా..!
  6. మా కళ్ల కింద క్యారీ బ్యాగులు చాలా విలువైనవి తెలుసా?
  7. మా గ్యాంగ్ ప్రపంచంలోనే ది బెస్ట్ గ్యాంగ్
  8. నువ్వు టిమోన్ నేను పుంబా.. మనం టిమోన్ అండ్ పుంబా
  9. చిరునవ్వుతో మన జీవితాన్ని ఆనందమయం చేసేవారెవరైనా ఉన్నారంటే అది స్నేహితులే.
  10. నీతో చేసే ప్రతి సాహసం నన్ను మరింత దృఢంగా చేస్తోంది.
  11. మీ గర్ల్ గ్యాంగ్ ఏం చేస్తోంది? నన్నైతే గ్యాంగ్ నుంచి బయటకు వెళ్లకుండా చేస్తోంది.
  12. మా గ్యాంగ్ లో ఒక్కరే పొరపాటు చేయడం నిషిద్ధం. అందుకే అందరూ కలసి చేస్తాం. 

అనుకోకుండా తీసిన ఫొటోల కోసం క్యాప్షన్లు (Captions For Un-Intended Photos)

Read More: Funny Captions For Selfies

మీరు అలా నడిచి వెళుతున్నప్పుడు చక్కటి పూలమొక్కల వరస కనిపించింది. లేదా ఆకాశంలో వరుసగా వెళుతున్న పక్షుల బారు కనిపించింది. లేదా మీకు బాగా నచ్చిన చెప్పుల జతను ఫొటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలనుకొంటున్నారు. అప్పుడెలాంటి క్యాప్షన్లు పెట్టాలంటే..

  1. ఎక్కడికి వెళుతున్నారు? ఇంకా అద్భుతమైన ప్రదేశానికి..
  2. జీవితం కొండ శిఖరం లాంటిది.. అక్కడి నుంచి చూస్తే అన్నీ అద్భుతాలే.
  3. హుందాగా ఉండాలి. అందులో సరదా ఉండాలి. ఏమంటారు?
  4. వంద అనుకొంటాం.. అన్నీ జరగాలని లేదు.
  5. ఎప్పటికి పూర్తి చేస్తావని అడుగు.. నువ్వు చేయగలవా? అని కాదు.
  6. మీ వ్యక్తిత్వాన్ని తక్కువగా చూసే అవకాశం ఎవరికీ ఇవ్వద్దు.
  7. ప్లీజ్ వీకెండ్ ప్లీజ్.. అప్పుడే వెళ్లిపోవద్దు.
  8. అందం ఆత్మవిశ్వాసంలో ఉంటుంది.
  9. నాకు ఆరు నెలలు సెలవు కావాలి. అది కూడా ఏడాదికి రెండు సార్లు.
  10. నలుగురితో పాటు కాదు.. నలుగురిలో ఒక్కరిగా నిలవాలి.
  11. నేనంటే నాకు చాలా ఇష్టం.

ADVERTISEMENT

భాగస్వామితో దిగిన చిత్రాలకు క్యాప్షన్లు (Captions For Images With Partner)

వావ్.. త్వరలో మీరు ఒకింటి వారు కాబోతున్నారా? అయితే ఈ విషయం అందరికీ తెలియజేయాలి కదా.. దానికోసం నేను ఓ జాబితా ఇస్తున్నాను. మీకు నచ్చినవి వాడుకోండి.

  1. మన ప్రేమ వైన్ లాంటిది. కాలం గడిచే కొద్దీ రుచి పెరుగుతుంది.
  2. ఈ ప్రపంచమంతా కలసి మనల్ని ఒక్కటిగా చేసింది. 
  3. నా చేయి అందుకో.. నీతో ఎక్కడికైనా వచ్చేస్తా.
  4. మనల్ని మనం మరచిపోయేలా అందమైన ప్రదేశాల్ని చుట్టొద్దాం.
  5. నువ్వెక్కడుంటే నేనక్కడుంటా.
  6. నీతో ప్రతి రోజూ ప్రేమలో పడిపోతున్నా.
  7. నువ్వు పడవ.. నేను చుక్కాని.
  8. నాకు పిజ్జా అంటే ఇష్టం. నువ్వంటే మరీ ఇష్టం.
  9. ప్రేమ దేవతా నీకు వందనం..! మమ్మల్ని ఏకం చేశావ్.
  10. నేను జామ్.. నువ్వు పీనట్ బటర్.. మంచి కాంబినేషన్ కదా..!
  11. సముద్రంలో అన్ని చేపలుంటే.. నా గాలానికి నువ్వు చిక్కావ్..!
  12. ప్రేమ జీవితం ఎంత బాగుందో కదా..!

కుటుంబ సభ్యుల చిత్రాలకు క్యాప్షన్లు (Captions For Family Members)

అక్కచెల్లెల్లతో దిగిన సెల్ఫీల దగ్గర నుంచి.. కుటుంబమంతా కలసి దిగిన ఫొటో వరకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకోవచ్చు. కానీ వాటికి మీరిచ్చే క్యాప్షన్ లో కుటుంబం పట్ల మీకున్న ప్రేమ కనిపించాలి. అప్పుడే అది అందరినీ ఆకట్టుకొంటుంది.

  1. నా ఆటలు సాగే ఏకైక ప్రదేశం – నా ఇల్లు.
  2. ఇంట్లో అందరికీ మన లోపాలు తెలుసు. అయినా మనల్ని ప్రేమిస్తారు.
  3. ఇంటిని ఇటుకలు, సిమెంట్ తో కడతారు. కుటుంబాన్ని ప్రేమతో నిర్మిస్తారు.
  4. ప్రతి చిన్న సంఘటనను ఆస్వాదించండి. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూస్తే ఆనందాన్నిచ్చేవి అవే.
  5. మనుషులుగా దూరంగా ఉండొచ్చు. కానీ మానసికంగా కాదు. ఎప్పటికీ ఇలాగే కలిసుందాం.
  6. కుటుంబంలో ఎవ్వరూ ఎవ్వరినీ వదలిపెట్టరు. మరచిపోరు.
  7. ఏంటిది? ఇది మా అల్లరి.
  8. నేను మినిమలిస్ట్ ను. ఆనందంగా గడపడానికి నేను ఎక్కడికో వెళ్లను. నా ఇంటికి వెళతాను.
  9. నా ప్రపంచమంతా ఇక్కడే ఉంది.
  10. నా బలం, బలహీనత నా కుటుంబమే.
  11. నా కుటుంబం అందమైన హరివిల్లు లాంటిది.

ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్లలో రకాలు (Types Of Captions)

మీరు మీ ఇన్స్టాగ్రామ్ పేజీలో క్యాప్షన్లు పెట్టేటప్పడు అసలు మీరు ఏం కోరుకొంటున్నారో అవగాహనకు రావాలి? క్యాప్షన్లు క్లుప్తంగా, ఆకట్టుకొనే విధంగా ఉండాలా? లేదా నవ్వు తెప్పించే విధంగా ఉండాలా? అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి.

ADVERTISEMENT

నవ్వు తెప్పించే ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్లు (Funny Captions)

ఇదుగో ఇక్కడ నేను మీకు ఇస్తున్న క్యాప్షన్లతో మీ ఫాలోవర్ల ముఖంపై నవ్వులు పూయించవచ్చు.

  1. ప్రతీ చర్యకు ప్రతిగా వ్యతిరేకమైన క్యాప్షన్ నా దగ్గర ఉంటుంది.
  2. ఇన్స్టాగ్రామ్ నేను తిన్నవాటి గురించి రికార్డు మెయింటైన్ చేస్తుంది. అందుకే అదంటే నాకు చాలా ఇష్టం.
  3. కాఫీయే కాదు.. నా ఐలైనర్ కూడా హాట్ గానే ఉంటుంది.
  4. ఆ ఇబ్బంది నుంచి మూన్ వాక్ చేసుకొంటూ బయటకు వచ్చేశా.
  5. అంతా బాగానే ఉన్నట్టు నడుస్తున్నా. కానీ నా షూలోపల సాక్స్ నన్ను ఇబ్బంది పెడుతోంది.
  6. మన ఫ్రెండ్స్ మంచోళ్లయితే.. వారి గొడుగు మనకిస్తారు. అదే వారు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే దాన్ని మన దగ్గర లాక్కుని తిరిగి మనమీదే అరుస్తారు.
  7. వాస్తవం నన్ను వెంటాడుతోంది. అందుకే  ఆగిపోయా.
  8. నా రాకుమారుడు రెక్కల గుర్రం మీద రాకుండా.. తాబేలు మీద వస్తున్నట్టున్నాడు.
  9. జీవితం చాలా చిన్నది. కాబట్టి పళ్లు ఊడకముందే.. నవ్వేయండి.
  10. ఫ్రెండ్సంటే మీరే.. నా రూం శుభ్రంగా లేదే అని చూడరు.. బాటిల్ డ్రింక్ ఉందా అని మాత్రమే చూస్తారు.
  11. ఎన్ని రోజులు చెట్టుకింద ప్లీడరులా? ఒక్కసారైనా లేడీస్ టైలర్ అయితే బాగుండు.

ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ల కోసం ప్రత్యేకమైన పాటలు (Songs For Captions)

క్యాప్షన్లను పెట్టడంలో చాలా సులభమైన పద్ధతి ఇది. ఎందుకంటే సందర్భానికి తగినవిధంగా ఉండే పాటలు ఎక్కువగా మన నోట్లో నానతాయి. కాబట్టి వాటిని ఎంచుకొని పోస్ట్ చేయండి. ఉదాహరణకు కొన్ని పాటలు మీకోసం.

  1. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో(అభినందన)
  2. సింగమల్లే నీవు శిఖరం చేరు.. శిఖరం చేరి నింగిని కోరు..(నరసింహ)
  3. చూడాలి చూడాలి అంటూ నీ తోడే కావాలి అంటూ నా ప్రాణం అల్లాడుతోంది లోలోపలా…(నువ్విలా)
  4. వాట్ ది వాట్ ది లైఫ్..(గీత గోవిందం)
  5. ఆగిపో బాల్యమా.. నవ్వులో నాట్యమా.. సరదా సిరిమువ్వలా..(మహానటి)
  6. పండగల్లే తానొచ్చి పండు వెన్నెలే తెచ్చి దాచేసుకొంటాడా..(గౌతమ్ ఎస్ ఎస్ సి)
  7. ఉషస్సెలా ఉదయిస్తుందో…నిశీధెలా ఎటుపోతుందో.. నిదుర ఎప్పుడు నిదరోతుందో.. మొదలు ఎప్పుడు మొదలౌతుందో..(కంచె)
  8. చిన్ని తండ్రి నిను చూడగా వేయి కళ్లయినా సరిపోవురా.. అన్ని కళ్లు నిను చూస్తుండగా నీకు దిష్టంతా తగిలేను రా..(సిసింద్రీ)
  9. నువ్వు అచ్చుల్లోన హల్లువో.. జడకుచ్చుల్లోన మల్లెవో.. మధుమాసంలోన మంచుపూల జల్లువో..(ఘర్షణ)
  10. బతుకంటే బడి చదువా.. అనుకొంటే అది సులువా..  పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా(కొత్త బంగారు లోకం)
  11. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే.. అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే.(భారతీయుడు)
  12. పాదం విడిచి ఎటు పోయెను భువనం.. ఆద మరిచి ఎటు వెళ్లెను గగనం (సెగ)
  13. లోకాన్నేజయించినా నీ ప్రేమవల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోనా(అందాల రాక్షసి)
  14. నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలీబాబా వుంటే అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లావుద్దీన్ చెలిమే వుంటే(ఐతే)

ఇన్స్టాగ్రామ్ కోసం క్లుప్తంగా ఉండే క్యాప్షన్లు (Short Captions)

ముందుగానే మనం చెప్పుకొన్నట్టు పెద్ద పెద్ద క్యాప్షన్లను పెడితే అవి రీడ్ మోర్ లోకి వెళ్లిపోతాయి. అందుకే మీ కోసం క్లుప్తంగా, ఆకర్షణీయంగా ఉంటే బాగుంటుంది. అలాంటివి మీకోసం..

ADVERTISEMENT
  1. (మీ పేరు) ఒక్కటే పీస్..
  2. నేను నేనులాగే ఉంటా.
  3. సూర్యున్ని చేతులతో అడ్డుకోలేం కదా..!
  4. మంచి పనులు చేయడం కోసం మనం జన్మించాం.
  5. మంచి పనులు ఇతరుల దృష్టిని త్వరగా ఆకర్షించలేవు.
  6. నా కథ ఇప్పుడే మొదలైంది.
  7. కల కనడం సులభం. దాన్ని సాధించడం కష్టం.
  8. ఇవీ మనం బతుకుతున్న రోజులు.
  9. వాటి కన్నా ఇంకా ముఖ్యమైనవి ఉన్నాయి.
  10. కాఫీ కంటే అద్భుతమైనది ఏమైనా ఉందా?
  11. నిద్ర లేవండి. విజయం రుచిని ఆస్వాదించండి.
  12. నక్షత్రాల మధ్య సమయం గడుపుతున్నా.

ఇవీ అమ్మాయిలూ.. మన ఇన్స్టాగ్రాం అకౌంట్ కి మైలేజ్ నిచ్చే క్యాప్షన్లు. ఇలాంటివి మీరు మరిన్ని ఆలోచించి మీ ఖాతాలో పోస్ట్ చేయండి. మీ ఫాలోయింగ్ ఎలా పెరిగిపోతుందో చూడండి.

13 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT