Advertisement

Fashion

కళా నైపుణ్యానికి పెట్టింది పేరు – ఉప్పాడ జమ్దానీ చీరలు

Babu KoiladaBabu Koilada  |  Dec 8, 2019
కళా నైపుణ్యానికి పెట్టింది పేరు – ఉప్పాడ జమ్దానీ చీరలు

Advertisement

(Interesting Facts related to Uppada Jamdani Sarees)

ఉప్పాడ .. తూర్పు గోదావరి కొత్త పల్లె మండలానికి చాలా దగ్గరగా ఉన్న గ్రామం. చిత్రమేంటంటే.. ఈ ప్రాంతం చేనేత కళాకారులకు దాదాపు వందేళ్ళ నుండి ఆలవాలంగా నిలుస్తోంది. ఇక ఇక్కడి చేనేత కార్మికులు డిజైన్ చేసి విక్రయించే జమ్దానీ చీరలకు దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. భారతదేశంలోని టాప్ డిజైనర్లతో పాటు.. ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్లను సైతం ఆకర్షించిన ఈ జమ్దానీ చీర ఒరిజినల్ డిజైనర్లకు.. 1972లోనే భారత ప్రభుత్వం రాష్ట్రపతి అవార్డును అందించడం విశేషం. 

బెనారసీ చీర గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?

ఇక ఇప్పుడు మనం “జమ్దానీ” అనే పదానికి అర్థమేంటో తెలుసుకుందాం. బంగ్లాలో “జామ్” అంటే పుష్పం అని అర్థం. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌తో పాటు.. బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ చీరలను తయారుచేసేవారు. ఈ తర్వాత ఈ కళాకారులు దేశంలోని పలు ప్రాంతాలకు తమ శాఖలను విస్తరించారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ జమ్దానీ చీరలకు మంచి ఆదరణ ఉండేదట. బ్రిటీష్ మహారాణి సైతం ఈ అద్భుతమైన కళను చూసి ఆశ్చర్యపోయిందట. స్వచ్ఛమైన కాటన్‌తో తయారుచేసే  ఈ చీరలపై పూల డిజైన్లు చాలా వైవిధ్యమైన రీతిలో ఉంటాయి. 

తెలుగు రాష్ట్రాలకు చెందిన.. ఈ అద్బుతమైన చేనేత చీరల గురించి మీకు తెలుసా?

మగ్గం పై తయారుచేసే ఈ చీరలు తెలుగువారికి ఉప్పాడ కేంద్రంగా లభించడం విశేషమే. ఈ చీరల పుట్టుక బెంగాల్ దేశంలో జరిగినా.. ఉప్పాడలో తయారుచేసే చీరలకు కాస్త లోకల్ టచ్ ఉంటుందట. నాణ్యత, స్టైల్, డిజైన్ విషయంలో వీళ్లు కొంత వైవిధ్యాన్ని పాటించడమే దీనికి కారణం. ఈ సంప్రదాయ కళకు యూనెస్కో (UNESCO) వారు సైతం.. చాలా సంవత్సరాల క్రితం పురాతన సాంస్కృతిక సంపదగా గుర్తించి.. తమ రికార్డులలో చోటు కల్పించారు. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లలో కూడా ఈ చీరలను కట్టుకోవడం ఫ్యాషన్‌గా మారుతోంది. 

 

జమ్దానీ చీరలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిని మగ్గం పై తయారుచేసే వ్యక్తి అత్యంత నేర్పరి అయ్యుండాలి. ఎందుకంటే డిజైన్‌ను చేతితో వేయాలి కాబట్టి.. చాలా సమయం తీసుకుంటుంది. చిత్రమేంటంటే.. దాదాపు 12 గంటలు పనిచేస్తే గానీ.. అరమీటర్ చీరను డిజైన్ చేయడం సాధ్యం కాదట. అంటే ఈ లెక్కన ఒక్కో చీర తయారుచేయాలంటే.. దాదాపు సగం నెల పూర్తవుతుంది. రెగ్యులర్ శారీ సెల్లర్స్ దగ్గర ఈ చీరలు దొరక్కపోవడానికి ఇదే కారణం. అయితే ఈ కళకు ఉన్న విలువను బట్టి.. కొన్ని సీజన్స్‌లో ఆర్డర్లు బాగానే వస్తాయని అంటున్నారు చేనేత కార్మికులు.

పెళ్లి కూతురుని మరింత.. అందంగా మార్చే పెళ్లి పట్టుచీరలు..!

ప్రస్తుత ధరల ప్రకారం రూ.5,000 నుండి రూ.80,000 వరకు ఈ చీర లభించే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ కళకు ఉన్న విలువ అలాంటిది మరి. ప్రస్తుతం ఉప్పాడ, కొత్తపల్లె ప్రాంతాలలో ఉప్పాడ చీరలను నేసే కుటుంబాలు దాదాపు 3000 కు పైగా ఉండడం విశేషం. మరొక విషయం ఏంటంటే.. కంచీ, ధర్మవరం చీరలతో పోల్చుకుంటే ఈ ఉప్పాడ జమ్దానీ చీరలు చాలా తక్కువ బరువు ఉంటాయట. కానీ ఈ చీరలను ఆప్కో వారు ఇంకా తమ జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. శ్రీకాకుళంలో కూడా కొందరు జమ్దానీ కళాకారులు ఉన్నట్లు వినికిడి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.