నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగానే తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు రేణు దేశాయ్(Renu Desai). పవన్ తో విడాకులు తీసుకొన్న అనంతరం ఆ ఇమేజ్ చెరిపేసుకొనే ప్రయత్నం చేస్తూ దర్శకురాలిగా తనకంటూ ఓ ఐడెంటిటీని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతేడాది తనకు ఎంగేజ్ మెంట్ జరిగిందని త్వరలో మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించారు. అంతేకాదు.. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకొన్నారు. అయితే ఇప్పుడు రేణు దేశాయ్ వివాహం (marriage) ఆగిపోయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ఆమె చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ఇటీవలే రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రాం ఖాతాలో ‘బాధలో మునిగిపోయినప్పుడు ఓ చోట ప్రశాంతంగా కూర్చొని మీకందిన ఆశీర్వాదాలను లెక్కించుకోవాలి. అప్పుడు మీ జీవితం ఎంత అందంగా ఉందో మీకు తెలుస్తుంది. ఇదే మీ ముఖంపై మళ్లీ చిరునవ్వుని తెస్తుంది. చిమ్మ చీకటిలో ఉన్నా మీకు దారి చూపిస్తుంది. అందమైన మీ నవ్వులో హరివిల్లు విరబూస్తుంది. అప్పుడు మీ మనసులో బాధ కంటే జీవితం పట్ల ప్రేమ పెరుగుతుంది’ అని చెప్పుకొచ్చింది.
మరో పోస్ట్ లో.. ‘సంతోషంగా ఉండటం నేర్చుకొంటున్నా’ అని అంటోంది. ‘మళ్లీ ప్రేమించడం సాధ్యమేనా? యవ్వనంలో కలిగిన తొలిప్రేమ లాంటి అనుభూతి పొందగలమా? కాలాన్ని రోజుల్లో కాకుండా నిమిషాలు, సెకన్లలో కొలవగలమా? అద్దంలో ముఖం చూసుకొంటున్నప్పుడు కోల్పోయిన ఆ సౌందర్యాన్ని చూడగలమా? రాత్రి నిద్రపోకుండా.. నక్షత్రాల్లో ముఖాన్ని చూడగలుగుతామా? ఒయాసిస్ కోసం బాటసారి వెతుక్కున్నంత ఆత్రంగా ప్రేమ నిండిన కళ్ల కోసం వెతుక్కోగలమా? చెట్ల ఆకుల మధ్య నుంచి ప్రసరించే సూర్యకాంతిలోని నులివెచ్చదనాన్ని అనుభవించగలమా? గుండె కొట్టుకొంటున్న వేగాన్ని గుర్తించడం సాధ్యమేనా? అవును సాధ్యమే. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ ఎప్పుడు మొదలైందో.. ఎక్కడికి వెళుతుందో తెలీదు. కానీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.’
ఇదుగో ఈ రెండు ఇన్స్టాగ్రాం పోస్టులే రేణు దేశాయ్ వివాహం ఆగిపోయిందనే వార్తలు రావడానికి కారణమైంది. దీనికి తోడు నిశ్చితార్థమై చాలా కాలం గడిచినా ఇప్పటికీ వివాహం కాకపోవడం కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. గతేడాది జూన్ లో రేణుకి నిశ్చితార్థం అయింది.
అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో ఇప్పటి వరకు నిర్ధరణ కాలేదు. రేణు దేశాయ్ కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎవరూ ఈ విషయాన్ని ధ్రువపర్చలేదు. కేవలం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆధారంగా మాత్రమే ఈ వార్తలు పుట్టుకొచ్చాయి.
అంతేకాదు.. ఇటీవలే రేణు దేశాయ్ నటిగా తన సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతోందనే వార్తలు సైతం ఈ రూమర్స్ రావడానికి కారణమయ్యాయి. ఈ వార్తలపై రేణు దేశాయ్ మౌనం వీడితే తప్ప ఇందులో నిజమెంత ఉందో మనకు తెలిసే అవకాశం లేదు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.