ADVERTISEMENT
home / Bollywood
వీరిని చూస్తే మ‌న సెల‌బ్రిటీల‌కు.. క‌వ‌ల‌ల్లా అనిపించ‌డం ఖాయం..!

వీరిని చూస్తే మ‌న సెల‌బ్రిటీల‌కు.. క‌వ‌ల‌ల్లా అనిపించ‌డం ఖాయం..!

సాధార‌ణంగా మ‌న‌ల్ని పోలిన మ‌నుషుల‌ను చూస్తే ఆనందంతో పాటు ఆశ్చ‌ర్యం కూడా అనిపిస్తుంది. ప్ర‌పంచంలో ఒక‌రిని పోలిన వారు(doppelganger) మ‌రో ఆరుగురు ఉంటార‌ని చెబుతుంటారు. మ‌న‌లాంటి వాళ్లు ఎక్క‌డో ఉండే ఉన్నా.. వారిని క‌నుక్కోవ‌డం మ‌న‌కు కాస్త క‌ష్ట‌మే.

కానీ సెల‌బ్రిటీలు(Celebrities), బాగా పాపుల‌రైన వ్య‌క్తుల్లా ఉండే మ‌రికొంద‌రు మాత్రం అప్పుడప్పుడూ పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదిస్తూ ఉంటారు. తాజాగా అనుష్కా శ‌ర్మలా ఉండే అమెరిక‌న్ సింగ‌ర్ జూలియా మైఖెల్స్ గురించి విన్నాం. ఇప్పుడు ఆ వ‌రుస‌లో తానూ ఉన్నానంటూ నిలిచింది బాలీవుడ్ అందాల భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌. ఈ సిలోన్ సుంద‌రిలా క‌నిపించే వ్య‌క్తి అమెరికాకు చెందిన టీవీ న‌టి అమాండా సెర్నీ. వీరిద్ద‌రూ ఒక్క‌చోట చేరితే క‌వ‌లలేమో అనిపించ‌క‌మాన‌దు.

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని వీరిద్ద‌రినీ ఫొటోషాప్‌లో ఒక్క‌చోట చేర్చిన ఫొటో జాక్వెలిన్ కంట‌ప‌డింద‌ట‌. ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ అమాండాని ట్యాగ్‌చేసి నువ్వు ముంబై వ‌స్తే మ‌నిద్ద‌రం క‌లిసి ఎంజాయ్ చేసేవాళ్లం అంటూ పోస్ట్ చేసింది జాక్వెలిన్‌. ఈ పోస్ట్ చూసిన వెంట‌నే అమాండా త‌న‌లా ఉండే అమ్మాయిని చూసేందుకు భార‌త్‌కి బ‌య‌ల్దేర‌డం విశేషం.

త‌న పోస్ట్ చూడ‌గానే బ‌య‌ల్దేరిన అమాండాను చూసి జాక్వెలిన్ కూడా ఆశ్చ‌ర్య‌పోయింది. మ‌రి, అమాండా ఇండియాకి వ‌చ్చాక వీరిద్ద‌రు క‌లిసి ఏం చేస్తారో వేచి చూడాలి… ఇలా త‌మ‌లా క‌నిపించే వ్య‌క్తుల ప‌రిచ‌యం కేవ‌లం జాక్వెలిన్‌కి మాత్ర‌మే కాదు.. చాలామంది క‌థానాయిక‌ల‌కు జ‌రిగింది. మ‌రి, అలా క‌థానాయిక‌ల్లా ఉండే వేరే వ్య‌క్తుల గురించి తెలుసుకుందాం రండి..

ADVERTISEMENT

anushka

అనుష్కా శ‌ర్మ‌

బాలీవుడ్ అందాల న‌టి అనుష్కా శ‌ర్మ‌లా క‌నిపించే అమెరిక‌న్ గాయ‌ని జూలియా మైఖేల్స్ ఆమె ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ట్యాగ్ చేసింద‌ట‌. ఇది చూసిన అనుష్క “మ‌నిద్ద‌రం ఒకేలా ఉన్నాం. నాకు చాలా ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంది. నేను ఎప్ప‌టినుంచో నీకోసం మ‌న‌లా ఉండే మ‌రో ఐదుగురి కోసం వెతుకుతున్నా” అని స‌మాధాన‌మిచ్చింది. దీనికి జూలియా కూడా ఓరోజు మ‌నం ప్లేసులు మార్చుకొని జీవిద్దాం అని చెప్ప‌డం విశేషం. మ‌రో ప్ర‌త్యేక‌తేంటంటే విరాట్, అనుష్క‌లు ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లిన స‌మ‌యంలోనే జూలియా కూడా అక్క‌డికి వెళ్లింది.

pc

ప్రియాంకా చోప్రా

జాక్వెలిన్‌, అనుష్క‌ల కంటే ముందు మ‌న దేశీ గ‌ర్ల్‌లా ఉండే క‌వ‌ల అమ్మాయి ఎంతో పాపుల‌ర్‌గా మారింది. త‌న పేరు న‌వ్‌ప్రీత్ బంగా.. కెన‌డాకి చెందిన ఫిట్‌నెస్ బ్లాగ‌ర్‌. ప్రియాంక‌లా ఉండి మంచి గుర్తింపు సాధించిన త‌ర్వాత ఆమె బాలీవుడ్ పాట‌ల‌కు నృత్యం చేయ‌డం, బాలీవుడ్ మేక‌ప్ వంటివి ప్ర‌య‌త్నించి.. వీడియోలు తీసి మ‌న దేశంలోనూ పాపుల‌ర్‌గా మారింది.

ADVERTISEMENT

dia

దియా మీర్జా

హైద‌రాబాద్‌లో పుట్టి పెరిగి, బాలీవుడ్‌లో పాపుల‌ర్ క‌థానాయిక‌గా మారింది దియా మీర్జా. మిస్ ఏషియా ప‌సిఫిక్‌గా ఎంపికైన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో సినిమాల త‌ర్వాత నిర్మాత‌గా మారింది. ప్ర‌ముఖ హాలీవుడ్ క‌థానాయిక అన్నే హాత్వే ఈ బ్యూటీలాగే క‌నిపించ‌డం విశేషం. వీరిద్ద‌రికీ చాలా ద‌గ్గ‌ర పోలిక‌లుంటాయి. ఎంత‌గా అంటే వీరిద్ద‌రి ఫొటోల‌ను ప‌క్క‌న పెడితే అందులో దియా ఎవ‌రో గుర్తించ‌డానికి కాస్త ఆలోచించాల్సి ఉంటుంది.

sam

స‌మంత‌

గ‌తేడాది స‌మంత లాంటి లుక్స్‌తో అంద‌రి చూపును త‌న‌వైపు తిప్పుకుంది అషూ రెడ్డి. అచ్చం సమంత‌లా పోజులివ్వ‌డ‌మే కాదు.. త‌నలా డ‌బ్‌స్మాష్ చేసి ఆక‌ట్టుకుంటూ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్ల‌ను పెంచుకుంది. ఈ అమ్మాయి కూడా తెలుగ‌మ్మాయి కావ‌డం విశేషం. వీరిది అమెరికాలో స్థిర‌ప‌డిన తెలుగు కుటుంబం.

ADVERTISEMENT

parineeti

ప‌రిణీతి చోప్రా

అక్క ప్రియాంక కంటే ముందే చెల్లెలు ప‌రిణీతిలా ఉండే ఓ అమ్మాయి గురించి అంద‌రికీ తెలిసింది. ఈ అమ్మాయి మ‌రెవ‌రో కాదు.. హాలీవుడ్ హీరోయిన్, సింగ‌ర్‌, మోడ‌ల్ హేడెన్ పెనెట్టీర్‌. వీరిద్ద‌రి జుట్టు రంగు భిన్నంగా ఉంటుంది కానీ మిగిలిన పోలిక‌ల‌న్నీ ఒకేలా ఉండ‌డం విశేషం. త‌నొక్క‌తే కాదు.. పంజాబ్‌కి చెందిన ఫ్యాష‌న్ డిజైనింగ్ స్టూడెంట్ హ‌ర్మీత్ సింగ్ కూడా అచ్చం ప‌రిణీతిని పోలి ఉండ‌డం విశేషం.

andrea

ఆండ్రియా

హాలీవుడ్ న‌టి.. మ‌నంద‌రి వండ‌ర్ వుమ‌న్ గాల్ గాడోట్‌కి మ‌న ఫేవ‌రెట్ న‌టి, గాయ‌ని ఆండ్రియా జెర్మియాకి చాలా ద‌గ్గ‌ర పోలిక‌లుంటాయి. వీరిద్ద‌రినీ ప‌క్క‌ప‌క్క‌న చూస్తే క‌వ‌లలు అనిపిస్తారు. అందుకే ఆండ్రియాను చాలామంది కోలీవుడ్ వండ‌ర్ వుమ‌న్ అని కూడా పిలుస్తుంటారు.

ADVERTISEMENT

ఇవి కూడా చ‌ద‌వండి.

గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్‌కి ప‌రిచ‌య‌మైన‌ప్పుడు.. ఈ అందాల రాశులు ఎలా ఉన్నారంటే..!

దీపిక అంద‌మైన‌ మైన‌పుబొమ్మ‌ను చూసి.. ర‌ణ్‌వీర్ ఏమ‌న్నాడో తెలుసా?

ప్ర‌పంచ సుంద‌రి ఫిట్‌నెస్ రహస్యాలేమిటో మీకు తెలుసా?

ADVERTISEMENT
27 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT