Advertisement

Celebrity Style

హైదరాబాద్ ఫ్యాషన్ ట్రెండ్స్: మోడరన్ అమ్మాయిలకు ప్రత్యేకం.. ఈ టాప్ 10 డిజైనర్ బొతిక్స్..!

Lakshmi SudhaLakshmi Sudha  |  Jul 2, 2019
హైదరాబాద్ ఫ్యాషన్ ట్రెండ్స్: మోడరన్ అమ్మాయిలకు ప్రత్యేకం.. ఈ టాప్ 10 డిజైనర్ బొతిక్స్..!

సాధారణంగా ఫ్యాషన్ డిజైనర్లు అంటే.. ఫ్యాషన్ షోలకు లేదా బాగా ధనవంతులకు మాత్రమే దుస్తులు డిజైన్ చేస్తారనే అభిప్రాయం ఉండేది. కానీ అది తప్పని నిరూపిస్తున్నారు మన హైదరాబాదీ డిజైనర్లు. ఓ వైపు ర్యాంప్ షోలకు అవసరమయ్యే దుస్తులు డిజైన్ చేస్తూనే.. మరో వైపు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా డిజైనర్ వస్త్రాలను రూపొందిస్తున్నారు.

అందులోనూ ఈ మధ్యకాలంలో ఇతరులకంటే భిన్నంగా , ప్రత్యేకంగా తమ వస్త్రాలుండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిజైనర్ బొతిక్‌లకు (boutique) మరింత ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో మనం కూడా హైదరాబాద్ (Hyderabad) నగరంలోని టాప్ 10 డిజైనర్ బొతిక్‌ల గురించి తెలుసుకుందాం.

1. గోల్డెన్ త్రెడ్స్

Facebook

ఈ చీరలో నేను అందంగా కనిపిస్తానా? ఈ లెహంగా నాకు బాగుంటుందా? ఈ చీర కట్టుకుంటే పెద్దదానిలా కనిపిస్తానేమో??.. పెళ్లి షాపింగ్ విషయంలో కాబోయే పెళ్లికూతురికి ఇలా ఎన్నో సందేహాలుంటాయి. అయితే గోల్డెన్ త్రెడ్స్‌కి వెళితే మీకు తగిన పెళ్లి వస్త్రాలను వారే తయారుచేసి అందిస్తారు. పెళ్లి  లెహంగాలు, చీరలు, ఓణీలు రూపొందించడంలో డిజైనర్ కవితా గుత్తాది అందె వేసిన చెయ్యి. డిజైనర్ వెడ్డింగ్ దుస్తుల కోసం చూస్తున్నవారికి గోల్డెన్ త్రెడ్స్ మంచి ఆప్షన్.

చిరునామా: 1359, రోడ్ నెం. 45, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ – 500033

2.అనహిత

Facebook

ఫ్యాషన్ ఎక్కువగా  ఫాలో అయ్యే హైదరాబాదీలకు బాగా పరిచయమున్న బొతిక్ అనహిత. ఫేమస్ డిజైనర్లు రూపొందించిన డిజైనర్ వేర్‌లు ఇక్కడ మనకు లభ్యమవుతాయి. మనీష్ అరోరా, రిధి మెహ్రా లాంటి వారు డిజైన్ చేసిన వస్త్రాలు ఇక్కడ దొరుకుతాయి. ట్రెడిషనల్ ఇండియన్ వేర్‌తో పాటు మోడరన్ అమ్మాయిలకు సూటయ్యే అవుట్‌ఫిట్స్ సైతం ఇక్కడ లభిస్తాయి.

చిరునామా: 8-2-418, కృష్ణ‌మ్మ‌ హౌస్, రోడ్ నెం 7, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034

3.భార్గవి కూనం

Facebook

తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా పేరున్న డిజైనర్ భార్గవీ కూనం. ఆమె డిజైన్ చేసిన చీరలు, లెహంగాలు మన అభిరుచికి తగినట్టే ఉంటాయి. నేటి తరానికి తగ్గట్టుగా ఎత్నిక్ తరహా వస్త్రాలను రూపొందించడంలో భార్గవిది అందె వేసిన చేయి. పెళ్లి, సంగీత్, కాలేజ్ ఫంక్షన్స్ ఇలా ఏ సందర్భానికి తగిన దుస్తులు కావాలన్నా.. భార్గవి కూనం బొతిక్‌కు వెళ్లాల్సిందే. ఇక్కడ చిన్న పిల్లలకు సైతం డిజైనర్ దుస్తులు రూపొందిస్తారు.

చిరునామా: 8-2-293/82/L/39A, రోడ్ నెంబర్ 12, ఎమ్మెల్యేకాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్ -500873

4.ముగ్ధ ఆర్ట్ స్టూడియో

Facebook

ఇంజనీరింగ్ చదివిన శశి వంగపల్లి ఆసక్తి కొద్దీ ఫ్యాషన్ డిజైనింగ్‌ రంగంలోకి వచ్చారు. ముగ్థ ఆర్ట్ స్టూడియో పేరుతో బొతిక్ నడుపుతున్నారు. హైదరాబాద్‌లో ది బెస్ట్ డిజైనర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో సైతం తాను రూపొందించిన దుస్తులను ప్రదర్శించారు. అద్భుతమైన డిజైన్లు, సూపర్ అనిపించదగ్గ కలర్ కాంబినేషన్స్‌లో వస్త్రాలు ముగ్థ ఆర్ట్ స్టూడియోలో మనకు దొరుకుతాయి.

చిరునామా: 8-2-616B/2D, రోడ్ నెం 11, బంజారాహిల్స్, హైదరాబాద్  – 500034

5.ప్లాంటేషన్ హౌస్

Facebook

ప్రస్తుతం సెలబ్రిటీలంతా హ్యాండ్లూమ్స్‌లోనే మెరిసిపోతున్నారు. వారిని చూస్తే హ్యాండ్లూమ్స్‌తో ఇంత స్టైలిష్‌గా కనిపించొచ్చా అనిపించక మానదు. అసలు చేనేత వస్త్రాలతో ఎన్ని రకాల డిజైనర్ దుస్తులు ఉంటాయో తెలుసుకోవాలంటే ప్లాంటేషన్ హౌస్‌కి వెళ్లాల్సిందే. మిగిలిన బొతిక్‌లతో పోలిస్తే విభిన్న తరహా వస్త్రాలను ఈ డిజైనర్ హౌస్ అందిస్తుంది.

చిరునామా: 89/90, గ్రౌండ్ ఫ్లోర్, అన్నపూర్ణ స్టూడియోస్ లేన్, హైదరాబాద్ – 500034

6.ఇలాహి

Facebook

హైదరాబాద్‌లో మరో పాపులర్ మల్టీ డిజైనర్ బొతిక్ ఇలాహి. తరుణ్ తహిల్యాని, గౌరవ్ గుప్తా, సబ్యసాచి ముఖర్జీ, మనీష్ అరోరా లాంటి బెస్ట్ డిజైనర్ల దుస్తులతో పాటు ఆమ్రపాలి కలెక్షన్ సైతం ఇక్కడ దొరుకుతుంది.

చిరునామా: మైల్ స్టోన్ #476, రోడ్ నెం 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034

7.వైశాలి కోషర్

Facebook

ఆధునికతను, సంప్రదాయాన్ని మిళితం చేసిన డిజైనర్ దుస్తులు కావాలనుకొనే వారికి వైశాలి కోషర్ మంచి ఎంపిక. పాంట్ సూట్, బ్రైడల్ లెహంగా, పెళ్లి చీర.. ఇలా అటు ట్రెడిషనల్, ఇటు ఫ్యాషనబుల్ తరహా దుస్తులు వైశాలి కోషర్లో లభిస్తాయి.

చిరునామా: ప్లాట్ నెం. 221, రోడ్ నెం 17, జూబ్లీహిల్స్, హైదరాబాద్ – 500033

8.అనీశా ఉప్పల

Facebook

అనీశా ఉప్పల డిజైన్ చేసిన దుస్తులు మినిమల్ డిజైన్‌తో ఉన్నప్పటికీ.. ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. కట్స్, స్టిచ్చెస్, ఫోల్డింగ్స్‌తో మ్యాజిక్ చేస్తారామె.

చిరునామా: స్ట్రీట్ నెం. 4, వెస్ట్ మారేడ్‌పల్లి, హైదరాబాద్  – 500026

9.గణేశ్ నల్లారి.. కోషర్ చిక్ పీ స్టూడియో

Facebook

వృత్తి రీత్యా డెంటిస్ట్ అయినప్పటి..కీ ఆసక్తి కొద్దీ డిజైనింగ్ రంగంలోకి అడుగుపెట్టారు గణేశ్ నల్లారి. క్లాసికల్ డ్యాన్సర్ అయిన గణేశ్ నల్లారిలోని కళాత్మకత ఆయన రూపొందించిన దుస్తుల్లోనూ కనిపిస్తుంది. సంప్రదాయ, మోడరన్ మేళవింపుగా ఆయన వస్త్రాలు రూపొందిస్తుంటారు.

చిరునామా: P-30 సెకండ్ రోడ్, సాగర్ సొసైటీ కమలాపురి కాలని, బంజారా హిల్స్,హైదరాబాద్ – 500073

10.ఇషా

Facebook

కేప్ డ్రసెస్, వన్ పీస్ గౌన్స్, చీరలు, లెహంగాలు.. ఇలా ఏ తరహా డిజైనర్ దుస్తులు కావాలన్నా ఇషా బొతిక్‌కు వెళ్లాల్సిందే. ఈ బొతిక్‌లో తయారైన దుస్తులను మోడల్స్ అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై ప్రదర్శించారు. ఇషా లోదుస్తులు విభిన్నంగా, వినూత్నంగా ఉంటాయి.

చిరునామా: హుడా టెక్నో ఎన్క్లేవ్, హైటెక్ సిటీ, హైదరాబాద్ – 500081

Featured Image: Golden Threads

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.