ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో.. మరో కొత్త చిత్రం..!

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో.. మరో కొత్త చిత్రం..!

ఒక సినిమా(Film) క‌థ న‌చ్చిన‌ప్ప‌టికీ డేట్స్ కుద‌ర‌ని కార‌ణంగా హీరో లేదా హీరోయిన్ దానిని చేజార్చుకోవ‌డం.. షూటింగ్ ప‌ట్టాలెక్కిన త‌ర్వాత సినిమాకు ప‌ని చేస్తున్న నిర్మాత‌/ ద‌ర్శ‌కుడు.. ఇలా ఎవ‌రో ఒక‌రు మారిపోవ‌డం.. క‌థ మాట్లాడుకున్నప్పుడు ఉన్న హీరోయిన్ సెట్స్ పైకి వ‌చ్చే స‌రికి మారిపోవ‌డం.. ఇలాంటివ‌న్నీ సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా స‌ర్వ‌సాధార‌ణం. అందుకే ఒక్కో క‌థానాయ‌కుడు/ క‌థానాయిక వ‌దులుకున్న క‌థ‌ల‌ను మ‌రొక‌రు అందిపుచ్చుకొని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ని త‌మ ఖాతాలో వేసుకున్న‌వారు ఎంద‌రో!

ప్ర‌స్తుతం తెలుగు చిత్ర సీమ‌లో ఈ త‌ర‌హా వార్త ఒక‌టి బాగా చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంతకీ అది ఎవ‌రికి సంబంధించిందో తెలుసా?? సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కు సంబంధించిన వార్త‌. అదేంటంటే.. రంగ‌స్థ‌లం చిత్రంతో సిల్వ‌ర్ స్క్రీన్ పై మంచి హిట్ సొంతం చేసుకున్న త‌ర్వాత సుకుమార్ లెక్క‌లు ఏవిధంగా మారనున్నాయి? ఆయ‌న త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో చేయ‌నున్నారు.. అని ఎంతో మంది చాలా ఆస‌క్తిగా ఆయ‌న త‌దుప‌రి చిత్ర ప్ర‌క‌ట‌న గురించి వేచి చూశారు.11873366 886717161411526 1277916435278161221 n

దీనికి త‌గ్గ‌ట్లే సుకుమార్ సైతం త‌న త‌దుప‌రి చిత్రం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఉంటుంద‌ని ప్ర‌క‌టించే స‌రికి ప్రేక్ష‌కుల్లో అప్ప‌టికే ఓ స్థాయిలో అంచ‌నాలు ఏర్ప‌డిపోయాయి. ముఖ్యంగా వీరిరువురి క‌ల‌యిక‌లో మునుపు విడుద‌లైన వ‌న్: నేనొక్క‌డినే సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డంలో విఫ‌ల‌మైనా; విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు మాత్రం అందుకుంది. అలాగే సూప‌ర్ స్టార్, సుకుమార్ అభిమానుల‌కు అదొక క్లాసీ చిత్రంగా ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేప‌థ్యంలో వీరి క‌ల‌యిక‌లో మ‌రో చిత్రాన్ని ప్ర‌క‌టించ‌డం, శ్రీ‌మంతుడు, రంగ‌స్థ‌లం వంటి బ్లాక్ బస్ట‌ర్ హిట్స్ ను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డంతో దీనిపై ఉన్న అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. అయితే తాజాగా అంచ‌నాల‌న్నింటికీ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒకే ఒక్క పోస్ట్ తో బ్రేక్ వేశారు.

సుకుమార్ తో నేను చేయాల్సిన చిత్రం క్యాన్సిల్ అయింది. క‌థ‌ప‌రంగా మా ఇద్ద‌రి మ‌ధ్య విభిన్న అభిప్రాయాలు ఏర్ప‌డ‌డంతో సినిమా వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. అయితే మా ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన వ‌న్ – నేనొక్క‌డినే చిత్రం మాత్రం ఎప్ప‌టికీ ఒక క్లాసిక్ గా నిలిచిపోతుంది. ఆ సినిమాకు ప‌ని చేయ‌డం నేనెప్ప‌టికీ మ‌రిచిపోను. సుకుమార్ చేయ‌నున్న త‌న త‌దుప‌రి చిత్రానికి నా బెస్ట్ విషెస్.. అంటూ మ‌హేష్ బాబు సోషల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేయ‌డంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌స్తుంద‌నుకున్న ఈ చిత్రానికి బ్రేక్ ప‌డిన‌ట్లైంది. అయితే మ‌హేష్ బాబు మాత్రం త‌న త‌దుప‌రి చిత్రం ఏంట‌న్న‌ది ఇంత‌వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. కానీ సుకుమార్ మాత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో క‌లిసి ప‌ని చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. దీంతో మునుపు వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఆర్య, ఆర్య 2 ప్రేక్ష‌కుల క‌ళ్ల ముందు మెదిలాయి. ఆర్య‌తో ఎంత పెద్ద హిట్ అందుకున్నారో ఆర్య 2తో అంతే ప‌రాజ‌యాన్ని కూడా చ‌విచూసిందీ కాంబినేష‌న్. అయినా స‌రే.. వీరిద్ద‌రి కాంబోలో మ‌రో సినిమా రానుంది అన‌గానే ప్రేక్ష‌కుల్లో బాగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.17499357 1342255219191049 201459478856226067 n

ADVERTISEMENT

అయితే మ‌హేష్ కి చెప్పిన క‌థే అల్లు అర్జున్ కి కూడా చెప్పార‌ని, ఆయ‌న‌కు న‌చ్చ‌ని క‌థ అల్లు అర్జున్ కి న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వినిపిస్తున్నాయి చిత్ర‌సీమ‌లో! మరి, ఒక‌రికి న‌చ్చ‌ని క‌థ‌, మ‌రొక‌రు మెచ్చిన ఈ క‌థతో సుకుమార్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు ఆక‌ట్టుకుంటారో, ఆయ‌న లెక్క‌లు ఈసారి ఎంత వ‌ర‌కు తేలతాయో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాలి మ‌రి..

ఇవి కూడా చ‌ద‌వండి

“సైరా” చిత్రంలో.. కథను మలుపు తిప్పే మెగా డాటర్..?

జయలలిత బ‌యోపిక్ “తలైవి” గురించి.. ఆసక్తికర విశేషాలు

ADVERTISEMENT

దీపికా పదుకొణే రాజకీయాల్లోకి వస్తే.. ఏ శాఖ మంత్రి అవుతారో తెలుసా..?

05 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT