ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
చ‌క్క‌టి చెలిమి సంత‌కం..ఈ మ‌హ‌ర్షి మొద‌టి పాట‌..ఛోటీ ఛోటీ బాతే..!

చ‌క్క‌టి చెలిమి సంత‌కం..ఈ మ‌హ‌ర్షి మొద‌టి పాట‌..ఛోటీ ఛోటీ బాతే..!

ప్రిన్స్ మ‌హేష్‌బాబు (Mahesh babu) చిత్రాలంటేనే అభిమానుల్లో అదో ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంటుంది. ఫ్లాపైనా, హిట్ట‌యినా అభిమానుల గుండెల్లో అవి అలా నిలిచిపోతాయి. భ‌ర‌త్ అనే నేను వంటి విభిన్న‌మైన సినిమా త‌ర్వాత ఇప్పుడు మ‌హర్షి (Maharshi)తో మ‌న ముందుకు రాబోతున్నాడు మ‌హేష్‌.

పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ మ‌రో ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించ‌నున్నాడు. తెలుగు తెరపై మ‌ల్టీస్టార‌ర్లు ఎక్కువ‌గా క‌నిపిస్తోన్న కాలం ఇది. గ‌తంలో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టులో వెంక‌టేష్‌తో క‌లిసి న‌టించిన మ‌హేష్ ఇప్పుడు అల్ల‌రి న‌రేష్‌తో క‌లిసి న‌టిస్తున్నాడు.

D2orirbWoAA43FL 3490922

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ తొలిసారి న‌టిస్తోన్న చిత్రం ఇది. ఇది మ‌హేష్ 25వ చిత్రం కూడా కావ‌డం విశేషం. ఆఖ‌రి ద‌శ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను కూడా తాజాగా ప్రారంభించింది చిత్ర బృందం. ఈరోజు (29 మార్చి) ఉద‌యం 9.09కి సినిమాకి సంబంధించిన మొద‌టి పాట చోటి చోటీ బాతే.. అనే పాట‌ను విడుద‌ల చేసింది.

ADVERTISEMENT

ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న దేవిశ్రీ ప్రసాద్ ఈ పాట‌ను స్వ‌యంగా త‌నే పాడ‌డం విశేషం. ఈ పాటకి శ్రీమ‌ణి లిరిక్స్ అందించారు. ఫ్రెండ్‌షిప్ నేప‌థ్యంలో సాగే ఈ పాట ఎంతో రీఫ్రెషింగ్‌గా.. కొత్త‌గా అనిపిస్తోంది. ఈ పాట‌ను మీరూ ఓసారి వినేయండి.

ఈ సినిమాలో మ‌హేష్‌తో పాటు పూజ‌, న‌రేష్‌వి కూడా బ‌ల‌మైన పాత్ర‌లే అని.. ఈ క‌థ ఎంతో విభిన్నంగా.. స‌రికొత్తగా ఉంటుంద‌ని సినిమా యూనిట్ వెల్లడిస్తోంది. అశ్వ‌నీ ద‌త్‌, దిల్ రాజు, పీవీపీ సినిమాస్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాత‌లు రూపొందిస్తోన్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని అందించ‌నుంద‌ట‌. మే 9న విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఈ చిత్రం టీజ‌ర్ ని ఉగాది పండ‌గ సంద‌ర్భంగా విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం సిద్ధ‌మ‌వుతోంది.

ఈ పాట‌ను ట్విట్ట‌ర్ ద్వారా అంద‌రితో పంచుకుంటూ చోటీ చోటీ బాతే.. ఈ పాట‌తో మీ స్నేహాన్ని సెల‌బ్రేట్ చేసుకోండి అంటూ మ‌హేష్ ట్వీట్ చేస్తే.. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి స్నేహితులంద‌రికీ, వారి స్వ‌చ్ఛ‌మైన చెలిమి క‌థ‌ల‌కి ఈ పాట అంకితం అని చెప్ప‌డం విశేషం. అందాల తార పూజా హెగ్డే ఈ వీడియోను షేర్ చేస్తూ స్నేహితుల‌తో గ‌డిపే అంద‌మైన అనుభూతులు లేక‌పోతే ఆ జీవితానికి అర్థం ఏముంటుంది? అందుకే అలాంటి స్నేహానికి సంకేత‌మైన ఈ పాట‌ను చూడ‌మ‌ని త‌న అభిమానుల‌ను కోరింది.

Dvvs WFU8AAZQbg 5915366

ADVERTISEMENT

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి అభిమానులు క‌థ గురించి ఎన్నో వూహాగానాలు చేస్తుండ‌డం విశేషం. పోస్ట‌ర్‌లో మ‌హ‌ర్షి టైటిల్ వ‌ద్ద ఒక‌వైపు ప‌ల్లెటూరు.. మ‌రోవైపు అమెరికా ఉండ‌డం, రిషిగా కోట్ వేసుకొని ఉన్న మ‌హేష్ లుక్ చూసి ప‌ల్లె నుంచి అమెరికా వెళ్లిన అబ్బాయి క‌థ అని అప్పుడు క‌థ‌ను వూహించిన అభిమానులు ఇప్పుడు అల్ల‌రి న‌రేష్ పాత్ర ప‌ల్లెటూరిలో ఉంటుందని.. మ‌హేష్ చ‌దువ‌య్యాక అమెరికా వెళ్లిపోయి స్నేహితుల‌ను క‌లిసేందుకు మ‌ళ్లీ ఇండియాకి తిరిగి వ‌స్తార‌ని వూహిస్తున్నారు. మ‌రి, అస‌లు ఈ సినిమా క‌థేంట‌న్న‌ది తెలియాలంటే విడుద‌ల వ‌ర‌కూ ఆగాల్సిందే.

అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి.

తమ‌న్నా ఈ న‌టుడితో.. డేటింగ్‌కి వెళ్లాల‌ని అనుకుందట. ఎందుకో తెలుసా?

ADVERTISEMENT

మహేష్ బాబు వర్సెస్ మహేష్ బాబు: క్రేజీ ఫ్యాన్స్ సమక్షంలో.. ప్రిన్స్ విగ్రహం ఆవిష్కరణ..!

లక్ష్మి నాకు ఒక ప్రేరణ.. ఆమె కథ నా మనసుకు దగ్గరైంది : దీపిక ప‌దుకొణె

29 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT