home / Celebrity Weddings
పాట పాడి స‌ర్‌ప్రైజ్ చేశాడు.. నెచ్చెలి మ‌న‌సు దోచేశాడు..!

పాట పాడి స‌ర్‌ప్రైజ్ చేశాడు.. నెచ్చెలి మ‌న‌సు దోచేశాడు..!

మ‌న‌లో చాలామంది చిన్న‌త‌నం నుంచే త‌మ పెళ్లి గురించి ఎన్నో క‌ల‌లు కంటూ ఉంటారు. త‌మ వ‌రుడు త‌మ కోసం ప్రపంచాన్నే ఎదిరించాల‌ని.. పాట పాడుతూ మోకాళ్ల‌పై నిల‌బడి ప్ర‌పోజ్ (Propose) చేయాల‌ని.. ఇలా ఎన్నో క‌లలు కన‌డం స‌హ‌జ‌మే.. అన్నింటికంటే త‌మ‌కు కాబోయేవాడు పాట పాడుతూ త‌న‌ని ప్ర‌పోజ్ చేయాల‌ని కోరుకునేవారు చాలామంది..

మ‌రి, అదే క‌ల నిజ‌మైతే ఎలా ఉంటుందో తెలుసా? అంత‌టి ఆనందాన్ని త‌న సొంతం చేసుకుందీ వ‌ధువు. త‌న‌కు కాబోయే భ‌ర్త తామిద్ద‌రికీ ఎంతో ఇష్ట‌మైన ఎడ్ షీర‌న్(Ed sheeran) ఫ‌ర్ఫెక్ట్ పాట‌ను పాడి ఆక‌ట్టుకున్నాడు. ఐ ఫౌండ్ ఏ ల‌వ్ ఫ‌ర్ మీ.. అంటూ ఆ యువ‌కుడు పాడుతుంటే ఆ పాట‌తో లిప్‌సింక్ చేస్తున్న ఈ వ‌ధువు వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారుతోంది.

సిద్ధార్థ్ చండేక‌ర్‌(siddarth chandekar), మిథాలీ మాయేక‌ర్ (mithali mayekar) మ‌రాఠీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఫేమ‌స్ జంట‌. గ‌త రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట త్వ‌ర‌లో వివాహ బంధంతో ఒక్క‌టికానున్నారు. గ‌త నెల 24న వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. రెండేళ్ల క్రితం తామిద్ద‌రూ మొద‌టిసారి క‌లిసిన ఈ తేదీనే ఎంగేజ్‌మెంట్ చేసుకొని.. ఆరోజుకి త‌మ జీవితాల్లో ఎంత ప్ర‌త్యేక‌త ఉందో చాటిచెప్పారీ వ‌ధూవరులు.

ఈ వేడుక‌కు కేవ‌లం ఇద్ద‌రి ద‌గ్గ‌రి బంధువులు, స్నేహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఎంగేజ్‌మెంట్ సంద‌ర్భంగా త‌న ప్రేయ‌సి కోసం ఎడ్ షీర‌న్ రాసిన ఫ‌ర్ఫెక్ట్ పాట‌ను పాడుతూ ఆమె మ‌న‌సు దోచేశాడు సిద్ధార్థ్. త‌న‌కెంతో ఇష్ట‌మైన ఈ పాట‌ను ఎంగేజ్‌మెంట్ సంద‌ర్భంగా సిద్ధార్థ్ పాడుతూ ఉంటే ఆనందంతో పొంగిపోయింది మిథాలీ.. దీనికి సంబంధించిన వీడియోని సిద్ధార్థ్ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియో కొద్ది రోజుల్లోనే వైర‌ల్‌గా మారిపోయింది.

40451860 478267595985266 5212478506619197163 n

అయితే మిథాలీని సిద్ధార్థ్ స‌ర్‌ప్రైజ్ చేయ‌డం ఇది మొద‌టిసారేమీ కాదు.. రెండేళ్ల వారి ప్రేమ‌లో చాలాసార్లు ఆమెను స‌ర్‌ప్రైజ్ చేసి ఆనందంలో ముంచెత్తాడ‌ట సిద్ధార్థ్. అన్నింటికంటే ముఖ్యంగా గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో మిథాలీ పుట్టినరోజు సంద‌ర్భంగా త‌న‌కు ప్ర‌పోజ్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

ఈ సంద‌ర్భంగా తాను ప్రపోజ్ చేసిన విష‌యాన్ని.. ఆమె ఒప్పుకున్న ఆనందాన్ని సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ “నేను బ్యాట్‌మాన్ కంటే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే అమ్మాయికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. నిన్ను నాకోసం పుట్టించినందుకు దేవుడికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా. మ‌న‌ల్ని క‌లిపినందుకు కూడా ఆయ‌న‌కు థ్యాంక్స్‌. నువ్వు ఎప్పుడూ ఉన్న‌ట్టే న‌వ్వుతూనే ఉండు. అది చూస్తే చాలు.. నాకు సంతోషం అందుతుంది…” అంటూ పోస్ట్ చేశాడు.

50070551 602383226899000 8038254920461493832 n 5669688

అంత‌కుముందు మిథాలీలో త‌న‌కు న‌చ్చిన ల‌క్ష‌ణాల గురించి చెబుతూ “మిథాలీ ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. త‌న‌తో ఉన్న‌వారినీ ఆనందంగా ఉండేలా చేస్తుంది. అందుకే త‌నంటే నాకెప్పుడూ ఇష్ట‌మే. నాకే కాదు.. త‌నంటే మా అమ్మ‌కు కూడా చాలా ఇష్టం..” అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా త‌న‌లోని ప్ర‌తి అంశాన్ని ప్రేమించే వ్య‌క్తి భ‌ర్త‌గా రావాల‌ని ప్ర‌తి అమ్మాయి కోరుకుంటుంది క‌దూ..! అందుకే మిథాలీ ల‌క్కీ అంటున్నారు వారి గురించి తెలిసిన ప్ర‌తిఒక్క‌రూ. ఈ ఏడాదిలో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న వీరిద్ద‌రూ జీవితాంతం క‌లిసి సంతోషంగా ఉండాల‌ని కోరుకుందాం.

49645728 1660449750721605 7461701089147970809 n 2198029

అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.

ఈ వ‌ధువు స్టెప్పులేస్తే.. ప్ర‌పంచ‌మే ఫిదా అయిపోయింది..!

అమ్మానాన్న‌లను వ‌దులుకోవ‌డం న‌చ్చ‌క.. సంప్ర‌దాయాన్నే కాదన్న వధువు ..!

ప్రేమ వివాహం.. ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే.

Images : Instagram.

05 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this