Entertainment

30 ఏళ్ళ గ్యాప్ తరువాత కలిసి నటించబోతున్న.. మెగాస్టార్ చిరంజీవి & కలెక్షన్ కింగ్ మోహన్ బాబు

Sandeep ThatlaSandeep Thatla  |  Feb 4, 2020
30 ఏళ్ళ గ్యాప్ తరువాత కలిసి నటించబోతున్న.. మెగాస్టార్ చిరంజీవి & కలెక్షన్ కింగ్ మోహన్ బాబు

మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi), కలెక్షన్ కింగ్ మోహన్ బాబుల (mohan babu)  గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వీరు వెండితెర మీద సాధించిన విజయాలు కూడా మనకి సుపరిచితమే. అయితే వీరిద్దరూ దాదాపు 30 ఏళ్ళ తరువాత ఒకే చిత్రంలో కలిసి నటించబోతున్నారనే వార్త.. ఇప్పుడు తెలుగు సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. 

Thappad Trailer Talk : భర్త చెంపదెబ్బ కొట్టినందుకు.. విడాకులు కోరిన భార్య కథ

పూర్తి వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల శివ (koratala siva) కలయికలో రూపొందుతున్న చిత్రంలో ప్రతినాయకుని పాత్ర కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మోహన్ బాబునే ప్రత్యేకించి ఈ పాత్రకి ఎంపిక చేసుకోవడానికి కారణం – సదరు విలన్ పాత్రకి ఉన్న విలక్షణత. అలాగే ఆ పాత్ర కూడా సినిమా మొత్తానికి  ఎంతో కీలకమైనది కావడం విశేషం. 

పైగా చిరంజీవి – మోహన్ బాబులు ఒకే వేదికను పంచుకున్న ప్రతిసారి కూడా.. ఒకరిపై మరొకరు ఛలోక్తులు విసురుకోవడం… అలాగే అప్పుడప్పుడు సెటైర్లు వేసుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. తమ బంధాన్ని ఒకసారి చిరంజీవి ప్రస్తావిస్తూ – ‘మాది టామ్ & జెర్రీ లాంటి రిలేషన్’ అంటూ చెప్పి అందరిని నవ్వించారు.

అలాగే వీరు ఇటీవలే జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోవడమే కాకుండా.. ముద్దు కూడా పెట్టుకుని తమ మధ్య ఉన్న బంధం ఎంత గట్టిదో చెప్పకనే చెప్పారు. అలాగని వీరు ఎప్పుడూ కూడా ఇలాగే లేరు. 2006లో జరిగిన తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో.. ఈ ఇద్దరు ఒకరిపై మరొకరు సభాముఖంగా చేసుకున్న ఘాటు విమర్శలు ఇప్పటికీ అందరికిీ గుర్తే. అయితే ఆ తరువాత క్రమక్రమంగా వీరి మధ్య ఏర్పడిన విభేదాలు, అపోహలు తొలిగిపోయి ఇప్పుడు మంచి స్నేహితుల్లాగా మారిపోవడంతో.. మరోసారి వీరిరువురిని ఒకే సినిమాలో చూసే అదృష్టం తెలుగు ప్రేక్షకులకి లభించింది.

ఇక చిరంజీవి – కొరటాల శివ చిత్రానికి #Chiru152 (chiru 152)  సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ చిత్రానికి నిర్మాతలుగా రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే స్టాలిన్ చిత్రం తరువాత మరోసారి మెగాస్టార్ సరసన త్రిష నటించబోతుంది. ఈ జంటని కూడా చాలా సంవత్సరాల తరువాత తెర పైన చూడడం ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంది.

ఎకో ఫ్రెండ్లి పెళ్లి చేసుకుంటూ… ఆదర్శంగా నిలుస్తున్న హీరో చేతన్

కొరటాల శివ విషయానికి వస్తే.. ఆయన దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలలో – మిర్చి (mirchi) , శ్రీమంతుడు (srimanthudu) , జనతా గ్యారేజ్ (janatha garage) & భరత్ అనే నేను (bharath ane nenu).. ఇలా ప్రతి ఒక్క చిత్రం బ్లాక్ బస్టర్ కావడం విశేషం. అలా అపజయం ఎరుగని స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరిగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు కొరటాల శివ.

100 % సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడిగా.. ఆయన మెగాస్టార్‌తో కలిసి చేయబోతున్న ఈ చిత్రం కూడా ఆయన గత చిత్రాల మాదిరిగానే బ్లాక్ బస్టర్ అవ్వాలని  మెగా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరి ఇంతటి అంచనాలని దర్శకుడు కొరటాల శివ అందుకుంటాడనే మనమూ కోరుకుందాం. అలాగే తన ప్రతి చిత్రాన్ని కూడా ఏదో ఒక సామాజిక అంశాన్ని స్పృశిస్తూ తీయడం అలవాటైన కొరటాల.. ఈ చిరు 152 చిత్రంలో కూడా కచ్చితంగా ఏదో ఒక అంశాన్ని  ప్రస్తావిస్తాడని చెప్పవచ్చు. దానిపై ఇప్పటికే అభిమానుల మధ్య తర్జనభర్జనలు మొదలయ్యాయి.

ఏదేమైనా.. దాదాపు 30 ఏళ్ళ విరామం తరువాత ఇద్దరు స్టార్ నటులు – చిరంజీవి & మోహన్ బాబు.. ఒకరితో మరొకరు సై అనుకుంటూ నటించే అవకాశం రావడం.. అలాగే వారిని ఒకే చిత్రంలో చూసే అవకాశం అభిమానులకి రావడం డబల్ బొనాంజా అని చెప్పవచ్చు. ఈ వార్తకు సంబంధించి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. 

భర్త వైద్యం కోసం.. మారథాన్ లో 72 ఏళ్ళ వృద్ధురాలి పరుగులు