ADVERTISEMENT
home / Celebrity gossip
మనసు లోతుల్లో మర్చిపోలేని ప్రేమకు నిదర్శనం ‘జాను’.. ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే..

మనసు లోతుల్లో మర్చిపోలేని ప్రేమకు నిదర్శనం ‘జాను’.. ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే..

Another Love Story in Tollywood : ‘Jaanu’ First Look Released

మనందరి జీవితాల్లో బయటకు చెప్పుకోలేని స్కూల్ క్రష్ ఎవరో ఒకరు ఉండే ఉంటారు. స్కూల్ రోజుల్లో మొదలయ్యే ఆ మొదటి ప్రేమను ఎవరూ మర్చిపోలేరు. అలాంటి ఓ ప్రేమ కథ గురించి చెప్పే సినిమా ’96’. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా, త్రిష కథానాయికగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో సమంత కథానాయికగా, శర్వానంద్ హీరోగా రూపొందుతోంది. ‘జాను’  టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని.. చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది.

“చైతూకి నాపై ఉన్న కంప్లైంట్.. అదొక్కటే” : సమంత

ఈ ఫస్ట్ లుక్‌లో  ఎడారిలో నాలుగు ఒంటెలు నడుస్తుండగా.. వాటి ముందు ఓ వ్యక్తి వెనుక బ్యాక్ ప్యాక్‌తో.. చేతిలో కెమెరాతో ఉండడం చూడచ్చు. తమిళంలో విడుదలైన ’96’ సినిమాలో కథానాయకుడు ఓ ట్రావెల్ ఫొటోగ్రాఫర్. అదే విషయాన్ని తెలిపేలా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసినట్లు అర్థమవుతోంది. అలాగే ‘జాను’ సినిమా పేరుని కూడా రెండు పేపర్ ముక్కలపై రాసినట్లుగా చూపించడం విశేషం. మరి ఈ పేపర్ ముక్కలకు.. సినిమాలో ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమా రెండు మనసులు పంచుకున్న ఓ అద్భుతమైన ప్రేమకు నిదర్శనం అని చెబుతూ.. నిర్మాత దిల్ రాజు  పోస్టర్‌ని విడుదల చేయడం విశేషం.

ADVERTISEMENT

తమిళంలో ’96’  సినిమా 2018 లో విడుదలై మంచి హిట్ చిత్రంగా నిలిచింది . సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తమ చిన్న నాటి ప్రేమను గుర్తు చేసిందీ చిత్రం. 1996 సంవత్సరంలో.. పదో తరగతి చదువుకుంటుండగా ప్రేమించుకున్న ఓ జంట తిరిగి ఇరవై రెండేళ్ల తర్వాత కలిశాక ఏం మాట్లాడుకుంటారు.. వారి జీవితంలో ఆ రోజు ఎలా సాగింది..? అసలు జీవితాంతం కలిసి ఉండాలనుకున్న వారిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటి? వంటి అంశాలన్నింటిపై ఆధారపడి ఈ సినిమా రూపొందింది. తెలుగులో కేవలం నేటివిటీకి తగినట్లుగా కొన్ని మార్పులు చేసినా.. కథ మాత్రం అదే ఉంటుందని.. కథలో ఎక్కువ మార్పులు లేకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. తమిళంలో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్.. తెలుగులోనూ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించడం విశేషం.

గత అక్టోబర్‌లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా యూనిట్ మాత్రం ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు.

ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తన పాత్రకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ.. ఈ సినిమా తనకెంతో ఛాలెంజింగ్ అని సమంత చెప్పడం చూస్తుంటే.. ఈ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.  ‘జాను’ పాత్రను గురించి తన మదిలోని భావాలను పంచుకుంటూ.. “మరో సినిమా పూర్తయిపోతుంది. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. ఈ పాత్ర నన్ను ప్రతి రోజు నిన్నటి కంటే విభిన్నంగా ఇంకా బెటర్‌గా చేసేలా ఛాలెంజ్ చేసింది. నా దర్శకుడు ప్రేమ్‌కి, సహ నటుడు శర్వానంద్‌కి నా ధన్యవాదాలు. నా జీవితాన్ని ఇలాంటి సినిమాలతో అద్భుతంగా జీవిస్తున్నా. అందుకే నా జీవితానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను”. అంటూ ట్వీట్ చేసింది సమంత.

సమంత ఫిట్‌నెస్, సౌందర్యం వెనకున్న చిట్కాలేంటో.. మీకు తెలుసా?

ADVERTISEMENT

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

07 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT