ADVERTISEMENT
home / వినోదం
క్రీడాకారులుగా దూసుకుపోవడానికి.. మన యువ హీరోలు రెడీ..!

క్రీడాకారులుగా దూసుకుపోవడానికి.. మన యువ హీరోలు రెడీ..!

మ‌న దేశంలో సినిమాలు, రాజ‌కీయాల త‌ర్వాత ఎక్కువ‌గా చ‌ర్చించుకునే అంశం క్రీడ‌లు. యావ‌త్ భార‌త‌దేశాన్ని ఒక్క తాటిపై తీసుకురాగ‌ల స‌త్తా ఉన్న ముఖ్య‌మైన అంశాల్లో ఇదీ ఒక‌టి. అలాంటి అత్యంత ప్ర‌భావవంత‌మైన క్రీడా రంగంలో చెప్పుకోద‌గ్గ విజ‌యాలు సాధించి మ‌న దేశ కీర్తిప‌తాక‌ను రెప‌రెప‌లాడించిన క్రీడాకారుల జీవితాల‌ను సినిమాలుగా మ‌లిస్తే అవి త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క‌లిగిస్తాయ‌ని చెప్ప‌చ్చు. పైగా ప్ర‌స్తుతం తెలుగు, హిందీ అనే తేడా లేకుండా బ‌యోపిక్స్ హ‌వానే ఎక్కువ‌గా న‌డుస్తోంది.

14352032 1095409150507770 36950497619174500 o

ఈ బ‌యోపిక్స్‌లో  భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు ప‌లువురు క్రీడాకారులు లేదా వారికి శిక్ష‌ణ ఇచ్చిన కోచ్‌లపై కొన్ని చిత్రాలు వ‌చ్చిన విష‌యం మ‌న‌కి తెలిసిందే! తెలుగులో విడుద‌లైన గురు (Guru), అశ్వ‌ని (Ashwini) చిత్రాలే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లు.

అయితే తెలుగులో ఈ త‌ర‌హా చిత్రాల కంటే క్రీడానేప‌థ్యంలో రూపొందించిన సినిమాలే కాస్త ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) న‌టించిన త‌మ్ముడు, రాజమౌళి (Rajamouli) తీసిన సై (Sye).. మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన గోల్కొండ హైస్కూల్ (Golconda High School).. మొద‌లైన‌వ‌న్నీ ఈ కోవ‌కు చెందిన చిత్రాలే!

ADVERTISEMENT

అయితే 2017లో విక్ట‌రీ వెంక‌టేష్ (Victory Venkatesh) న‌టించిన “గురు” సినిమా త‌ర్వాత తెలుగులో ఇలాంటి చిత్రాలేవీ విడుద‌ల కాలేదు. కానీ ఈ ఏడాది అంటే 2019లో మాత్రం క్రీడా నేప‌థ్యంలో రూపొందుతున్న సినిమాలు మూడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. అయితే ఈ మూడు చిత్రాల్లోనూ మూడు క్రీడ‌ల‌ను క‌థ‌గా ఎంపిక చేసుకున్నారు. అవి క్రికెట్, బాక్సింగ్, బ్యాడ్మింట‌న్. ఇంత‌కీ ఈ సినిమాల్లో న‌టిస్తున్న యువ హీరోలు ఎవ‌రో తెలుసా?? నాని (Nani), వరుణ్ తేజ్ (Varun Tej) & సుధీర్ బాబు (Sudheer Babu). మ‌రి, ఎవ‌రు ఎందులో న‌టిస్తున్నారంటే.. 

న్యాచుర‌ల్ స్టార్ నానీ క్రికెట్ నేప‌థ్యంలో రూపొందుతోన్న జెర్సీ (Jersey) చిత్రంలో న‌టిస్తున్నాడు. మళ్ళీ రావా (Malli Raava) చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన గౌతమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా 30 ఏళ్ళు పైబడిన ఒక క్రికెటర్ పాత్రలో నానీ మనకి కనిపించనున్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్‌కి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న కూడా ల‌భించింది. ఈ సినిమాను వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తోందీ చిత్ర‌బృందం. అయితే క్రీడానేప‌థ్యం ఉన్న చిత్రాల్లో న‌టించ‌డం నానీకి ఇదేమీ తొలిసారి కాదు. కెరీర్ ప్రారంభంలోనే క‌బ‌డ్డీ క్రీడా నేప‌థ్యంలో రూపొందించిన భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు (Bheemili kabaddi jattu) చిత్రంలో అద్భుత‌మైన న‌ట‌న‌తో అంద‌రినీ మెప్పించాడీ యువ‌ క‌థానాయ‌కుడు.

టాలీవుడ్ హ్యాండ్ స‌మ్ హీరో సుధీర్ బాబు స్వ‌త‌హాగానే మంచి బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ మాజీ బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు, కోచ్ అయిన పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand)పై తెర‌కెక్కిస్తోన్న బ‌యోపిక్‌లో గోపీచంద్ పాత్ర‌లో న‌టిస్తున్నాడీ హీరో! ఈ సినిమాకు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ ఏడాది చివ‌రిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావిస్తోందీ చిత్ర‌బృందం. 

వ‌రుస హిట్ల‌తో జోరు మీద ఉన్న మెగా హీరో వ‌రుణ్‌తేజ్ కూడా త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ కోసం క్రీడా నేప‌థ్యం ఉన్న క‌థ‌నే ఎంపిక చేసుకున్నాడు. F2 తో సంక్రాంతి రేసులో దూసుకుపోయిన ఈ యువ క‌థానాయ‌కుడు బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే ఓ క‌థ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌! అంతేకాదు.. బాక్స‌ర్‌గా క‌నిపించేందుకు, ఆ పాత్ర‌కు పూర్తి న్యాయం చేసేందుకు ప్ర‌త్యేక‌ శిక్ష‌ణ కూడా తీసుకుంటున్నాడ‌ట ఈ హీరో! ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ADVERTISEMENT

ఇవే కాదు.. భార‌తదేశ క్రీడారంగంలో ఒక ప్ర‌ధాన మైలురాయిగా భావించే 1983 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్‌ని మ‌న దేశానికి అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించిన భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ అయిన క‌పిల్ దేవ్ (Kapil Dev) జీవిత క‌థ ఆధారంగా కూడా హిందీలో ఒక సినిమా తెర‌కెక్కుతోంది. దీనిని తెలుగు, త‌మిళ భాష‌ల్లో కూడా రూపొందిస్తున్నార‌ట‌! 83 టైటిల్‌తో ఈ సినిమా నేరుగా టాలీవుడ్‌లో కూడా విడుద‌ల కానుంది. క‌పిల్ దేవ్ పాత్ర‌లో ర‌ణ్ వీర్ సింగ్ (Ranveer Singh) న‌టిస్తుండ‌గా; కబీర్ ఖాన్ (Kabir Khan) ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుద‌ల కానుంది. 

మ‌రో ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు విజ‌య్ త‌మిళంలో చేయ‌నున్న త‌న త‌దుప‌రి చిత్రంలో మ‌హిళా ఫుట్ బాల్ జ‌ట్టుకి కోచ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారులైన సైనా నెహ్వాల్ (Saina Nehwal) & పీవీ సింధు (PV Sindhu)ల జీవిత క‌థ‌లు ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌లో బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్.. ఆ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ సినిమా కూడా ఈ ఏడాది విడుద‌ల కానుంది.

ఈ ఏడాది వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్న ఈ చిత్రాల్లో ఏవి ప్రేక్ష‌కుల మ‌న‌సుని గెలుచుకోవ‌డంలో స‌ఫ‌లం అవుతాయో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే!

ఇవి కూడా చ‌ద‌వండి

ADVERTISEMENT

మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తోన్న మ‌రో హీరో.. వైష్ణ‌వ్ తేజ్..!

కమల్ “భారతీయుడు” చిత్రానికి.. వెంకటేష్, రాజశేఖర్‌కి సంబంధమేమిటి..?

ద‌టీజ్ మ‌హాల‌క్ష్మితో.. టాలీవుడ్ క్వీన్‌గా మార‌నున్న‌ త‌మ‌న్నా!

22 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT