ADVERTISEMENT
home / వినోదం
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే

ఇప్పుడు ‘బుట్టబొమ్మ’ అంటే మనకి గుర్తొచ్చేది పూజా హెగ్డే (pooja hegde). ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇటీవలే విడుదలైన ‘అల వైకుంఠపురములో’ (ala vaikunthapuramulo) చిత్రంలో నిధి అనే పాత్రలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ పై వచ్చిన రెండు పాటలు – సామజవరగమన & బుట్టబొమ్మ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అలాగే ఆమె అభినయానికి సైతం మంచి మార్కులు పడడంతో పాటుగా.. ‘అల వైకుంఠపురములో’ చిత్రం కలెక్షన్స్ సునామిని సృష్టించడంతో.. పూజ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించేసుకుంది తెలుగులో..

RRR సినిమా విడుదల మళ్లీ వాయిదా : అందరినీ నిరాశపరిచిన రాజమౌళి

ఇక పూజా హెగ్డేకి బాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ ఉంది. మొన్నీమధ్యనే ఆమె నటించిన ‘హౌస్ ఫుల్ 4’ చిత్రం కూడా కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇలా ఆమె తను సినిమాలు చేస్తున్న రెండు చిత్రపరిశ్రమల్లో కూడా మంచి విజయాలు సాధిస్తూ ముందుకి సాగిపోతోంది. 

ఇక ఇప్పుడు పూజ తన విజయాల పరంపరని మరో స్థాయికి తీసుకెళ్ళే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఆ అవకాశం మరేమిటో కాదు – సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నాయికగా ఎంపికవ్వడమే. ఆయన త్వరలో నటించబోతున్న ‘కభీ ఈద్ కభీ దివాళీ’ అనే చిత్రంలో హీరోయిన్‌గా పూజ హెగ్డే ఎంపికైంది. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత సాజిద్ నడియాద్‌వాలా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్ పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ దక్కడం అంటే.. పెద్ద బ్లాక్ బస్టర్‌లో నటించే అవకాశం కొట్టేసినట్టే అని అర్ధం కాబట్టి.. పూజా హెగ్డే ఖాతాలో ఒక సూపర్ హిట్ పడిపోయినట్టే అని సినీ అభిమానులు అంటున్నారు.

ADVERTISEMENT

ఈ సినిమా వివరాల్లోకి వెళితే, ఇందులో సల్మాన్ ఖాన్ (salman khan) ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. అందుకోసమే ఈ చిత్రానికి ‘కభీ ఈద్ కభీ దివాళీ (kabhi eid kabhi diwali)’ అనే టైటిల్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కి ప్రేక్షకుల ముందుకి రాబోతుందనేది సమాచారం. ఈ చిత్రానికి మరొక అదనపు ఆకర్షణ ఏంటంటే – ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి స్వరాలు అందించడమే. అలాగే ఈ చిత్రానికి ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించనున్నారు.

30 ఏళ్ళ గ్యాప్ తరువాత కలిసి నటించబోతున్న.. మెగాస్టార్ చిరంజీవి & కలెక్షన్ కింగ్ మోహన్ బాబు

మొత్తానికి పూజా హెగ్డే ఈ చిత్రం ద్వారా.. బాలీవుడ్‌లో సైతం స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాన్ని కొట్టేసిందనే చెప్పాలి. ఎందుకంటే సల్మాన్ ఖాన్‌తో సినిమా అంటే.. అది ఎలా ఉన్నాసరే.. కచ్చితంగా రూ. 100 కోట్ల వసూలు చేస్తుందనేది సత్యం. ఇక అదే సినిమా గనుక సూపర్ హిట్ అయితే.. కలెక్షన్స్ సునామి సంభవిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే ‘కభీ ఈద్ కభీ దివాళీ’ హిట్ అయితే.. పూజా హెగ్డే బాలీవుడ్‌లో ఇతర స్టార్ హీరోయిన్స్ జాబితాలో స్థానం తప్పక కొట్టేస్తుందనేది నిజం.

ఇక పూజా హెగ్డే చేతిలో ఈ చిత్రం మాత్రమే కాకుండా.. తెలుగులో రెండు పెద్ద చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి అఖిల్ అక్కినేనితో నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తుండగా.. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. మరో చిత్రంలో ప్రభాస్ సరసన పూజ నటించడం విశేషం. ‘సాహో’ చిత్రం తరువాత ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం పైన అంచనాలు భారీగానే ఉన్నాయి. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘జిల్’ మూవీ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు.

ADVERTISEMENT

ఇలా తెలుగులో రెండు పెద్ద చిత్రాలు.. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ తో చేస్తున్న చిత్రం.. ఇలా మొత్తం మూడు చిత్రాలతో పూజా హెగ్డే ఈ సంవత్సరం బిజీ బిజీగా ఉండబోతుంది. ఈ సంవత్సరం మొదట్లోనే ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో మంచి విజయం సాధించి.. రాబోయే చిత్రాల్లో కూడా  ఆమె ఇదే స్థాయిలో హిట్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

భర్త వైద్యం కోసం.. మారథాన్ లో 72 ఏళ్ళ వృద్ధురాలి పరుగులు

 

11 Feb 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT