ADVERTISEMENT
home / Friends and BFFs
స్నేహమేరా జీవితం: ఫ్రెండ్‌షిప్ విలువను తెలియజెప్పే 40 కొటేషన్లు

స్నేహమేరా జీవితం: ఫ్రెండ్‌షిప్ విలువను తెలియజెప్పే 40 కొటేషన్లు

సృష్టిలో బ‌ల‌మైన‌ది, అద్భుత‌మైన‌ది స్నేహం (friendship). ఏదైనా క‌ష్టం వ‌స్తే బంధువు దగ్గ‌ర‌కు వెళ్ల‌డం కన్నా.. స్నేహితుని (friend) ద‌గ్గ‌ర‌కు వెళితే సాయం దొరుకుతుంద‌ని చెబుతారు. అందుకే స్నేహానిక‌న్నా మిన్న లోకాన లేదురా అన్నాడో సినీ క‌వి. క‌ష్ట‌మైనా, న‌ష్ట‌మైనా, ఆనంద‌మైనా, సంతోష‌మైనా.. ఎప్పుడూ మ‌న వెంటే నీడలా వెన్నంటి ఉంటాడు స్నేహితుడు. అలాంటి అపురూప‌మైన ఆత్మీయ బంధం గురించి ఎంద‌రో మ‌హానుభావులు మ‌న‌సుకి హ‌త్తుకొనేలా వివ‌రించారు. అలా చెప్పిన‌వాటిలో కొన్ని సూక్తులు(quotes) మీకోసం

ఫన్నీ ఫ్రెండ్ షిప్ కొటేషన్స్ (Funny Friendship Quotes)

 1. నిజమైన స్నేహితులు ఒకరినొకరు జడ్జ్ చేసుకోరు. వాళ్లిద్దరూ కలిసి ఇతరులను జడ్జ్ చేస్తుంటారు: ఎమిలి సెయింట్- జెనిస్
 2. సముద్రంలో అలల్లా ఎంతో మంది స్నేహితులు వస్తుంటారు, పోతుంటారు. కానీ నిజమైన స్నేహితుడు మాత్రం మీ ముఖంపై ఆక్టోపస్ లాంటోడు. ఎంత వదిలించుకోవాలంటే అంత బలంగా పట్టుకుంటాడు
 3. మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు కింద పడితే నిన్ను పైకి లేపేది నేనే. (నేను నవ్వడం పూర్తయిన తర్వాత).
 4. ఈ లోకంలో స్నేహాన్ని మించింది మరొకటి లేదు. ఎప్పటి వరకు? ఫ్రెండ్ చేతిలో చాక్లెట్ చూడనంత వరకు – లిండా గ్రేసన్
 5. మనం ఎప్పుడూ ఫ్రెండ్సే.. ప్రాణాలు వదిలేంత వరకు. ఒకవేళ మరణిస్తే మనిద్దరి ఆత్మలు కలిసే ఫ్రెండ్‌షిప్ చేస్తాయి.
 6. నిజమైన స్నేహితులు ఏదైనా చెప్పాలనుకుంటే.. ముఖం మీద కొట్టినట్టే చెబుతారు. – ఆస్కార్ వైల్డ్
 7. అప్పు తీసుకోనంత వరకు స్నేహం చాలా అద్భుతంగా ఉంటుంది. గొప్పగా అనిపిస్తుంది. నమ్మకంగా, స్థిరంగా ఉంటుంది. – మార్క్ ట్వైన్
 8. స్నేహితుల సమక్షంలో ఉత్సాహంగా ఉన్నంతగా ఇంకెక్కడా ఉండలేం.
 9. ఒకే మెసేజ్‌ను సిగ్గు లేకుండా వందసార్లు ఎవరికైనా పంపిస్తామంటే అది స్నేహితులకే.
 10. ఫ్రెండ్‌షిప్ ఎలాంటిదంటే.. ప్యాంట్‌లో యూరిన్ పోయడం లాంటిది. అందరూ దాన్ని చూస్తారు. కానీ ఆ వెచ్చదనం మాత్రం మీకే తెలుస్తుంది.

క్యూట్ ఫ్రెండ్‌షిప్ కొటేషన్స్ (Cute Friendship Quotes)

 1. ఫ్రెండ్స్ మనకు బంధువుల్లాంటి వారు. ఆ బంధుత్వం మనకు మనమే వెతుక్కుంటాం – యూస్టాస్ డెస్చామ్ప్స్
 2. వారెప్పుడూ మనతోనే ఉన్నారు. మనతోనే ఉన్నారు. కాలం మారుతూనే ఉంటుంది. కానీ వారు మనతోనే ఉంటారు. దీనిలో మాత్రం మార్పు ఉండదు – విన్నీ ద పూ
 3. మన జీవితంలోకి వచ్చినవారిలో.. చాలా కొంతమంది మాత్రమే మనపై అందమైన ప్రభావం చూపిస్తారు. వారు రాకముందు మన జీవితం ఎలా ఉందో మనకు గుర్తుండదు – అన్నా టేలర్
 4. ఎంతో మంది మన జీవితంలోకి వచ్చిపోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే మన హృద‌యంలో స్థానం సంపాదించుకుంటారు – ఎలెనార్ రూజ్వెల్ట్
 5. మన జీవితం ఓ కుకీ అనుకుంటే.. ఫ్రెండ్స్ చాక్లెట్ చిప్స్ లాంటి వారు
 6. ఫ్రెండ్షిప్ ఎప్పుడు పుడుతుందంటే.. ఇద్దరు వ్యక్తులు ‘నేనే అనుకున్నా.. నువ్వు కూడా ఇంతేనా?’ అనుకున్నప్పుడు – సీఎస్ లెవీస్
 7. నువ్వు వందేళ్లు బతుకుతావంటే.. నేను వందేళ్లకు ఒక రోజు తక్కువ బతకాలని కోరుకుంటా. ఎందుకంటే నీ స్నేహం లేకుండా నేను ఒక్క రోజు కూడా బతకలేను – విన్నీ ద పూ
 8. మనలో ఉన్న లోపాలు కాకుండా.. మనలో ఉన్న మంచి లక్షణాలను చూసేవారే స్నేహితులు
 9. మంచి స్నేహితులు అరుదుగా దొరికే వజ్రం లాంటి వారు. అలాంటి వారు మీ జీవితంలో ఉండటం మీ అదృష్టం – ఐరిస్ సామెత
 10. ఫ్రెండ్‌షిప్ అనేది సమస్యలు, ఇబ్బందుల నుంచి.. మనల్ని కాపాడే రక్షణ కవచం లాంటిది

ADVERTISEMENT

రియల్ ఫ్రెండ్‌షిప్ కొటేషన్స్ (Real Friendship Quotes)

 1. నిజమైన స్నేహితుడి దగ్గర మనం ఎన్ని జోకులైనా వేసుకోవచ్చు. అదే పని మీద ఉన్నా.. తనేమీ పట్టించకోడు. – లారెన్స్ జె.పీటర్
 2. స్నేహంలొ ఉన్న గొప్పతనమేంటో తెలుసా? పనికిరాని విషయాలు మాట్లాడినా మన గౌరవం మనకుంటుంది. – ఛార్లెల్ లాంబ్
 3. మాటల్లో వివరించలేనిది స్నేహం. దాని గురించి మనం తెలుసుకోలేకపోతే.. దేని గురించీ తెలుసుకోలేం – మహ్మద్ అలీ
 4. ప్రపంచాన్ని ఏకం చేసి ఉంచే సిమెంట్ లాంటిది స్నేహం – వుడ్రో విల్సన్
 5. స్నేహం నిరంతరం మనల్ని ఉత్సాహంగా ఉంచే పవర్ హౌస్ లాంటిది.
 6. మన స్నేహితులే మనకు ఓ ప్రపంచం. ఈ ప్రపంచం మనం పుట్టినప్పుడు ఉండదు. ఒకరినొకరు కలుసుకున్పప్పుడు పుడుతుంది – అనైస్ నిన్
 7. మిమ్మల్ని వ్యక్తిగా మరింత ఉన్నత స్థానానికి చేర్చేవారే నిజమైన స్నేహితులు – ఓప్రా విన్ ఫ్రే
 8. స్నేహితులు మనకు దూరంగా ఉన్నప్పుడు.. ఈ ప్రపంచం ఎంతో పెద్దదిగా ఉందనిపిస్తుంది – హెన్రీ డేవిడ్ థోర్యో
 9. స్నేహితుడు మీ గురించి తెలుసుకుంటాడు. జీవిత ప్రయాణంలో మీరెక్కడున్నారో గుర్తిస్తాడు. మీ ఇష్టాలను అంగీకరిస్తాడు. మిమ్మల్ని మరింత ఉన్నతంగా ఎదిగేందుకు సాయం చేస్తాడు – విలియం షేక్స్పియర్
 10. అందరూ ముఖంలో నవ్వుని చూస్తే.. స్నేహితుడు మాత్రం కళ్లలో నిండిన బాధను చూస్తాడు.

బెస్ట్ ఫ్రెండ్ కొటేషన్స్ (Best Friend Quotes)

 1. స్నేహితుల కోసం వెతకడం మొదలు పెడితే ఎవరూ మనకు కనిపించరు. మనమే స్నేహితుడిగా మారితే అందరూ మనతో స్నేహం చేస్తారు – జిగ్ జిగ్లార్
 2. బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఇల్లు శుభ్రంగా ఉన్నా లేకపోయినా పట్టించుకోరు. మీ దగ్గర వైన్ బాటిల్ కోసం చూస్తారు.
 3. ఇద్దరి మధ్య ఉన్న మౌనం సౌకర్యవంతంగా మారినప్పుడు స్నేహం ఏర్పడుతుంది – డేవిడ్ టైసన్
 4. బెస్ట్ ఫ్రెండ్ మన జీవితంలోకి వచ్చాకే అల్లరి వేషాలు వేయడం మొదలు పెడతాం.
 5. నా పెరట్లో ఓ చిన్న గులాబీ.. నా జీవితంలో ఓ మంచి ఫ్రెండ్.. ఇదే నా ప్రపంచం – లియో బస్కాగ్లియా
 6. మీ స్నేహితులందరికీ మీకు సంబంధించిన అందమైన కథలు తెలిసి ఉండచ్చు. కానీ ఆ ప్రతి కథలోనూ మీ బెస్ట్ ఫ్రెండ్ కచ్చితంగా ఉంటాడు.
 7. నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను ఎవరిని భావిస్తానంటే.. నాలో ఉన్న బెస్ట్ క్వాలిటీని బయటకు తీసేవాడు – హెన్రీ ఫోర్డ్
 8. అమ్మాయిలకు వజ్రాలంటే ఇష్టమనుకుంటారు. కానీ వజ్రం లాంటి స్నేహితులను వారు ఇష్టపడతారు – జినా బారెకా
 9. కొన్ని సందర్బాల్లో స్నేహితులతో కలసి ఉండటం ఓ థెరపీలా పనిచేస్తుంది.
 10. వెటకారంగా, దురుసుగా, అసలు బుర్ర లేదనుకున్నట్టుగా మాట్లాడుకుంటున్నా.. సంతోషంగా ఉండేవారే నిజమైన స్నేహితులు

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

25 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT