ADVERTISEMENT
home / వినోదం
మ్యాన్ Vs వైల్డ్ కార్యక్రమంలో.. బేర్ గ్రిల్స్‌తో పాల్గొన్న రజినికాంత్‌కి స్వల్ప గాయాలు

మ్యాన్ Vs వైల్డ్ కార్యక్రమంలో.. బేర్ గ్రిల్స్‌తో పాల్గొన్న రజినికాంత్‌కి స్వల్ప గాయాలు

ప్రపంచవ్యాప్తంగా అభయారణ్యాలలో ఒంటరిగా కలియతిరుగుతూ.. ఎన్నో సాహసాలు చేసే వ్యక్తిగా బేర్ గ్రిల్స్ (bear grylls) అలియాస్ ఎడ్వర్డ్ మైఖేల్ గ్రిల్స్‌కి మంచి పేరుంది.  ప్రముఖ వ్యక్తులతో కలిసి అభయారణ్యాలలోకి వెళ్లడం.. అలాగే అక్కడ ఏమి లభిస్తే అవే తినడంతో పాటు సాహస యాత్రాలు చేయడం అనేవి  ఈ మ్యాన్ Vs వైల్డ్ (man vs wild) కార్యక్రమంలోని ప్రత్యేక అంశాలు. 

ఎకో ఫ్రెండ్లి పెళ్లి చేసుకుంటూ… ఆదర్శంగా నిలుస్తున్న హీరో చేతన్

బేర్ గ్రిల్స్‌తో సాహస యాత్రలు చేసిన జాబితాలో.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదలుకుని అనేకమంది హాలీవుడ్ సెలబ్రిటీలు  ఉన్నారు. గత ఏడాది మన దేశ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో వీరు సాహసయాత్ర చేసి వార్తలలో నిలిచారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ (narendra modi) ప్రకృతి  ఆవశ్యకత గురించి.. అదే సమయంలో  అడవితో చిన్నప్పుడు తనకు ఏర్పడిన అనుబంధం గురించి చెప్పడం విశేషం. ఈ కార్యక్రమం గత ఏడాది ఆగష్టులో నెట్ ఫ్లి‌క్స్‌తో.. డిస్కవరి ఛానల్‌లో కూడా ప్రసారమైంది. 

ఇక తాజాగా సూపర్ స్టార్ రజినికాంత్ (rajinikanth) తో కలిసి.. మ్యాన్ Vs వైల్డ్ కార్యక్రమంలో భాగంగా ఒక ఎపిసోడ్ చేసేందుకు బేర్ గ్రిల్స్ బెంగళూరు చేరుకోవడం జరిగింది. వీరిరువురు కలిసి కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బందీపూర్ నేషనల్ పార్క్‌లో సాహసయాత్ర చేయడానికి రంగం సిద్ధం చేసుకోగా.. నిన్న ఇందుకు సంబంధించిన ఎపిసోడ్‌ని షూట్ చేశారు. 

ADVERTISEMENT

అయితే ఈ షూట్ కోసం అనేక గంటలు బందీపూర్ నేషనల్ పార్క్‌లో వీరిరువురు గడిపారు. అయితే నిన్న జరిగిన షూటింగ్ అనంతరం రజినికాంత్ నేరుగా తన ఇంటికి చేరుకున్నారని సమాచారం. అలా ఆయన ఇంటికి చేరుకోవడానికి ప్రధాన కారణం షూటింగ్ చేస్తున్న సమయంలో.. రజినికాంత్‌కి గాయాలు తగలడమే అని వార్తలు వస్తున్నాయి.

దీనితో ఒక్కసారిగా రజినికాంత్ అభిమానుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. అయితే రాత్రికి అవి స్వల్ప గాయాలేనని రజినికాంత్ సన్నిహిత వర్గాలు చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈరోజు ఇవే వార్తల పై రజినీకాంత్ స్పందిస్తూ.. తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. చెట్ల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు కేవలం చేతులు గీరుకుపోయాయని ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

భర్త వైద్యం కోసం.. మారథాన్ లో 72 ఏళ్ళ వృద్ధురాలి పరుగులు

ఇక ఈ మ్యాన్ Vs వైల్డ్ షో  ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇందులో ఈ ఇద్దరు ఎటువంటి సాహసాలు చేసి ఉంటారనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 

ADVERTISEMENT

అలాగే ఈ మ్యాన్ Vs వైల్డ్ షోలో భాగంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఈ ఎపిసోడ్ చేయడం.. తనకెంతో గొప్ప ఫీలింగ్‌ను కలిగించిందని బేర్ గ్రిల్స్ తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు. ఆ ట్వీట్‌లో #ThalaivaOnDiscovery అంటూ హ్యాష్ ట్యాగ్ చేయడంతో.. ప్రపంచవ్యాప్తంగా రజనీ ఫ్యాన్స్ ఈ మ్యాన్ Vs వైల్డ్ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందనే దానిపై  ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలావుండగా త్వరలోనే.. రజినీకాంత్ దర్శకుడు శివ రూపొందిస్తున్న ఓ చిత్రంలో నటించేందుకు సిద్దమవుతున్నాడు. అలాగే ఇటీవలే సంక్రాంతికి మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్బార్ చిత్రం ద్వారా.. మరోసారి తన స్టార్ స్టామినాని అందరికి రుచి చూపించారు.

చివరిగా ఇప్పటివరకు వెండితెర పై రజనీకాంత్ చేసిన సాహసాలను చూసిన అభిమానులు.. ఆయన నిజజీవితంలో చేసిన సాహసాలను చూసేందుకు ఈ మ్యాన్ Vs వైల్డ్ షో కోసం  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా.. తైలవా సాహసాలు చూడడానికి…

ఫ్రీ హగ్స్ పేరిట ముంబై నగరంలో.. రిచా ఛడ్డా చేసిన వినూత్న ప్రయత్నం మీకు తెలుసా..!

ADVERTISEMENT
29 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT
good points logo

good points text