ADVERTISEMENT
home / Celebrity Life
టీనేజ్ క్రష్.. కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్.. అచ్చం సినిమా లాంటి ప్రేమకథ (Ranbir Kapoor & Alia Bhatt Love Story)

టీనేజ్ క్రష్.. కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్.. అచ్చం సినిమా లాంటి ప్రేమకథ (Ranbir Kapoor & Alia Bhatt Love Story)

అమ్మాయిల హార్ట్ ఫేవరెట్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor).. కలువ కన్నుల చిన్నది అలియా భట్ (Alia Bhatt). వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ.. వెరసి ఓ అందమైన ప్రేమకథ. చాలా ఆసక్తిగా ఉంది కదా.. టీనేజ్‌లో ఉన్నప్పుడు సావరియా సినిమా చూసి రణబీర్ పై మనసు పారేసుకుంది అలియా. ఆ క్రష్ ఇప్పుడు ప్రేమగా మారింది. 

అలియా భత్ రాంబిర్ కపుర్ ప్రేమ కథ (Alia Bhatt Love Story With Ranbir Kapoor)

పార్టీలకు ఒకే కారులో వెళ్లడం.. సోషల్ మీడియాలో అలియా పోస్ట్ చేసిన ఫొటోలకు క్రెడిట్ రణబీర్‌కి ఇవ్వడం.. ఇవి వారిద్దరి మధ్య ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తించాయి. సోనమ్ కపూర్ పెళ్లి రిసెప్షన్‌కి ఇద్దరూ కలసి హాజరైనప్పుడు.. వారి మధ్య ఉన్న అనుబంధంపై అందరికీ స్పష్టత ఏర్పడింది. అవును ప్రస్తుతం వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. బాలీవుడ్ హాట్ కపుల్‌గా అందరి దృష్టిని తమ వైపు తిప్పుకొన్నారు.

‘అనుబంధాన్ని నిలబెట్టుకోవడం ఘనకార్యమేమీ కాదు.. అది జీవితంలో ఒక భాగం.. అతి ముఖ్యమైన భాగం. అది చాలా అందంగా ఉండాలి. ప్రతి క్షణం ఆనందమయంగా ఉండాలి. ప్రస్తుతం నా ప్రేమను భద్రంగా చూసుకుంటున్నాను. అప్పుడే కదా.. అది పెరిగి పెద్దదవుతుంది’ అంటూ ఇటీవలే ఓ ఇంటర్య్వూలో రణబీర్‌తో తన ప్రేమ బంధం గురించి చెప్పుకొచ్చింది అలియా.

1-Ranbir-alia-love-story

ADVERTISEMENT

అలియా-రణబీర్‌ల ప్రేమ గురించి మనందరికీ తెలిసినా.. ఈ విషయంపై వారు మాత్రం పెదవి విప్పడం లేదు. అయినా వారిద్దరూ అప్పుడప్పుడూ ఒకరిపై ఒకరికున్న ప్రేమను వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. 

ఆమె హృద‌యం అప్పుడే దోచేశాడు.. (Her Heart Was Just Stolen)

ఈ ప్రేమకథని ఎక్కడ మొదలుపెడదాం. 2014.. కాఫీ విత్ కరణ్ సెట్స్‌లో. ఆ సమయంలోనే కరణ్ జోహార్‌తో రణబీర్ గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది అలియా. ‘మొదటిసారి నేను రణబీర్‌తో మాట్లాడిన క్షణాలు నాకిప్పటికీ గుర్తున్నాయి. రాక్ స్టార్ సినిమా విడుదలైనప్పుడు మీరు(కరణ్ జోహార్) నన్ను రణబీర్ దగ్గరకు తీసుకెళ్లి.. తనని నేనెంతగా ఇష్టపడుతున్నానో చెప్పమన్నారు.  అప్పుడు నేను నా నోటికి వచ్చినదంతా మాట్లాడేశాను. నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉన్నాను. నేనేం మాట్లాడినా.. ‘యా.. దట్స్ వెరీ నైస్ అలియా’  అని అన్నాడు’ అని కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో చెప్పింది అలియా.  

అప్పటి నుంచి వారిద్దరి మధ్య సహనటులుగా స్నేహం ఏర్పడింది. ‘రణబీర్ నాకు చాలా అపురూపంగా కనిపిస్తాడు. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను. ఈ విషయం రణబీర్‌కి తప్ప అందరికీ తెలుసు’ అని చెప్పంది అలియా. ఎందుకంటే సావరియా సినిమాలో రణబీర్‌ను చూసి టీనేజ్‌లో అతనిపై ఇష్టాన్ని పెంచుకొంది. అప్పటికి ఆమె రణబీర్‌కి అభిమాని మాత్రమే. ఈ విధంగా అలియా మాట్లాడి నాలుగేళ్లు గడిచిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా.. 

అలా మొదలైంది.. (Starting)

ప్రస్తుతం రణబీర్, అలియా ఇద్దరూ బ్రహ్మాస్త్ర సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయినప్పటికీ రణబీర్ తో డేటింగ్ చేస్తున్న విషయాన్ని అలియా అంగీకరించలేదు. కానీ తన ఇన్స్టాగ్రామ్‌లో తన చిత్రాలను పోస్ట్ చేస్తూ వాటి క్రెడిట్‌ను రణబీర్ కు ఇవ్వసాగింది అలియా. అప్పటి నుంచి నెమ్మదిగా కథ మారుతూ వచ్చింది.

ADVERTISEMENT

ఇద్దరూ కలసి వచ్చారు.. (Both Came Together)

గతేడాది మేలో జరిగిన సోనమ్ కపూర్ పెళ్లి రిసెప్షన్‌కు ఇద్దరూ కలసి వచ్చారు. అంతేకాదు.. ఇద్దరూ ఫొటోలకు సైతం ఫోజులిచ్చారు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. అదుగో.. అప్పటి నుంచే ఇద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారనే రూమర్ మొదలైంది.

అదే నెలలో రణబీర్ ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ ద్వారా ఆ రూమర్ నిజమని తేలింది. ఆ ఇంటర్వ్యూలో మనం అనుకొంంటున్నదంతా నిజమేనని చెప్పాడు రణబీర్. ‘మా బంధం ఇప్పడే మొదలైంది. దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు. అది బలపడటానికి ఇంకా సమయం కావాలి. నటిగా, వ్యక్తిగా అలియా అంటే నాకిష్టం. ఆమె పనిచేసే తీరు, నటించే విధానం అంతెందుకు నిజజీవితంలో నేను కోరుకొనేవే.. ఆమె నాకు అందిస్తూ ఉంటుంది. ఇప్పుడే మొదలైన మా బంధం మరింత పెరగనివ్వండి’ అంటూ చెప్పుకొచ్చాడీ  రాక్ స్టార్.

కట్ చేస్తే.. (Continue In Relation)

గతేడాది అక్టోబర్‌లో కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి అలియా భట్.. రణబీర్ మాజీ ప్రియురాలు దీపికా పదుకొణెతో కలసి హాజరయింది. ఈ ఎపిసోడ్‌లో రణబీర్‌తో ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. రణబీర్ విషయంలో దీపిక, అలియా ఇద్దరినీ ఇబ్బంది పెట్టే ప్రశ్నలడిగినప్పటికీ ఇద్దరూ పరిణితితో సమాధానం చెప్పడం విశేషం.

2-Ranbir-alia-love-story

ADVERTISEMENT

2019లో మాత్రం వీరిద్దరూ తమ బంధం గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఒకరి కుటుంబంతో మరొకరు సమయం గడుపుతున్నారు. క్యాజువల్ డిన్నర్, బర్త్ డే పార్టీ.. ఏదైనా సరే ఇద్దరూ కలిసే వెళుతున్నారు.  అలియా, రణబీర్ కపూర్ కుటుంబంతో కలసి న్యూయార్క్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంది. అక్కడ రణబీర్ తండ్రి రిషి కపూర్ వైద్యం చేయించుకొంటున్నారు.

3-Ranbir-alia-love-story

చూశారా.. రణబీర్ పై టీనేజ్‌లో క్రష్ పెంచుకొంది అలియా. ఇప్పడు తనతో డేటింగ్ చేస్తోంది. చిత్రంగా ఉంది కదా.. అచ్చం సినిమాలో మాదిరిగా..!

Images: Instagram, Instagram

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి

సోనమ్ వివాహానికి హాజరైన రణ్ బీర్, అలియా… ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి

అలియా భట్ అవుట్ ఫిట్స్ గురించి వ్యాసాన్ని.. ఆంగ్లంలో చదవండి

అలియా భట్ బ్యూటీ ఎవల్యూషన్ పై వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి

ADVERTISEMENT
04 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT