Entertainment

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసిందా?

Sandeep ThatlaSandeep Thatla  |  Jan 27, 2020
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసిందా?

సినిమా కెరీర్ ముందుకి సాఫీగా సాగాలంటే… అందుకు ముఖ్యంగా కావాల్సింది సక్సెస్. ఒక పెద్ద విజయం సినీ కెరీర్‌ని ఎన్నో మెట్లు ఎక్కిస్తుంది. అదే సమయంలో ఒక పరాజయం కూడా.. అంతే త్వరగా మనల్ని కిందకి తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే వరుస విజయాలతో మంచి ఆఫర్స్ దక్కించుకున్న నటి రష్మిక మందాన్న (Rashmika Mandanna) ఇప్పుడు ఫేవరెట్ హీరోయిన్‌గా మారింది. 

ఎకో ఫ్రెండ్లి పెళ్లి చేసుకుంటూ… ఆదర్శంగా నిలుస్తున్న హీరో చేతన్

ఆమె తాజాగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru). ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే రష్మిక పాత్రకి కూడా మంచి పేరు రావడంతో .. పెద్ద హీరోల పక్కన చేసే అవకాశాలు బాగానే వస్తాయన్నది ట్రేడ్ వర్గాల అంచనా. సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించడం.. అదే సమయంలో మంచి అభినయాన్ని కూడా ప్రదర్శించడంతో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) & త్రివిక్రమ్ (Trivikram) కలయికలో పట్టాలెక్కనున్న చిత్రంలో రష్మికకి అవకాశం దక్కిందట. ఇదే వార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. 

ఈ పరిణామాన్ని ట్రేడ్ వర్గాలు కూడా ఇంతకుముందే ఊహించగలిగారు.  ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద స్టార్ హీరో సరసన నటించే అవకాశం వచ్చాక.. ఆమె దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమే అందుకు కారణం. అయితే అలా వైకుంఠాపురములో వంటి ఒక భారీ విజయాన్ని ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో.. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్. ఆర్. ఆర్ చిత్రంలో కొమరం భీం పాత్రలో కనువిందు చేయనున్న ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం రష్మికకు కెరీర్ తొలినాళ్లలోనే దొరకడం పెద్ద అదృష్టమనే చెప్పాలి.

ఇక హారిక హాసిని క్రియేషన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ చిత్రం.. 2020 చివరలో మొదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఒక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్ చిత్రం ముందుగా అనుకున్న సమయం అనగా జులై 20న కాకుండా.. ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల అవుతుందని టాక్. షూటింగ్ అనుకున్న సమయంలో జరగపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు.

ఫ్రీ హగ్స్ పేరిట ముంబై నగరంలో.. రిచా ఛడ్డా చేసిన వినూత్న ప్రయత్నం మీకు తెలుసా..!

పైన చెప్పిన కారణంగా ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ల చిత్రం (Movie) ఈ ఏడాది చివరలో మొదలయ్యే అవకాశం ఉంది. అందుకు సంబంధించి కథా చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా  విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

అరవింద సమేత లాంటి ఒక మంచి చిత్రాన్ని ఈ ఇద్దరి కలయికలో చూసిన ఆడియన్స్‌కి .. వీరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందంటే అంచనాలు భారీగానే ఉంటాయని..  మరి ఆ అంచనాలని ఈ ఇద్దరు కూడా అందుకుంటారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.

రష్మిక విషయానికి వస్తే, ఆమె చేతిలో ప్రస్తుతం 4 సినిమాలు ఉన్నాయి. అందులో రెండు షూటింగ్ పూర్తి చేసుకోగా.. అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో నటించేందుకు ఆమె సిద్దమవుతోంది. ఏదైతేనేమి .. సరిలేరు నీకెవ్వరు చిత్రం విజయంతో స్టార్ లీగ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక.. అల్లు అర్జున్ (Allu arjun) – సుకుమార్ (Sukumar) చిత్రంతో అదే లీగ్‌లో స్థానం  సుస్థిరం చేసుకోవాలని మనసారా కోరుకుందాం.

‘జొమాటో’లో ఉబర్ ఈట్స్ విలీనం .. ఈ ఆసక్తికర పరిణామం వెనుక కారణాలివే..!