బిగ్ బాస్.. తెలుగు టీవీ చరిత్రలోనే ఓ చరిత్ర క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. పార్టిసిపెంట్ల మధ్య గొడవలు, వివాదాలతో బుల్లితెర వీక్షకుల్లో ఉత్సుకత కలిగించింది. ఎవరు గెలుస్తారా? అని ఆసక్తిని రేకెత్తించింది. అందుకేనేమో బిగ్ బాస్ 3(Big boss 3) సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారంతా. ఈలోగా ఎవరు బిగ్ బాస్ కి హోస్ట్(వ్యాఖ్యాత) గా వ్యవహరిస్తారు? బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళతారనే దానిపై ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. రేణు దేశాయ్(Renu Desai) బిగ్ బాస్ పార్టిసిపెంట్ గా సెలక్టయ్యారనేది కూడా అందులో ఒకటే.
బిగ్ బాస్ 3 సీజన్ మొదలవుతుందని తెలిసినప్పటి నుంచి ఎవరికి వారు బిగ్ బాస్ హౌస్ మేట్స్ గురించి వివిధ రకాలుగా రూమర్లను వ్యాపిస్తున్నారు. వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారని, దీనికి సంబంధించి షో నిర్వాహకులు ఆమెను కలిశారనే వార్తలు వెల్లువెత్తాయి. రేణు దేశాయ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ షోకు ఫ్లస్ అవుతుందని వారి ఉద్దేశమట. హౌస్ మేట్ గా ఉండే విషయంలో ఆమె సానుకూలంగా స్పందించారని వదంతులు సైతం వచ్చాయి. చాలా మంది ఇది నిజమనే భావించారు కూడా. తాజాగా ఈ విషయంపై రేణు దేశాయ్ స్పష్టతనిచ్చారు. పనిలో పనిగా తన మనసులోని మాటను సైతం బయటపెట్టారు.
బిగ్ బాస్ హౌస్ లో తాను పార్టిసిపెంట్ గా వస్తున్నానన్న వార్తలను రేణు దేశాయ్ ఖండించారు. తాను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం లేదని ఆ హౌస్ తనకు సరిపడదని చెప్పారు. కానీ అవకాశం వస్తే బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తానని చెప్పారు రేణు. ప్రస్తుతం తాను నటన, దర్శకత్వం మీదే దృష్టి సారిస్తున్నట్టు స్పష్టం చేశారు.
బిగ్ బాస్ 3 సీజన్ ఎప్పుడు మొదలవుతుందో ఇంకా నిర్వాహకులు ప్రకటించలేదు. అయినా దీనిలో ఎవరు పాల్గొంటున్నారనే దానిపై రూమర్లు మాత్రం చాలా వినిపిస్తున్నాయి. ఎక్సట్రా జబర్దస్త్ యాంకర్ రష్మి, తీన్మార్ సావిత్రి, బిత్తరి సత్తి, కేేఏ పాల్ కూడా దీనిలో పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అవి నిజం కాదు.. పుకార్లు మాత్రమే.
హోస్ట్ విషయంలోనూ ఇదే స్థాయిలో రూమర్లు వస్తున్నాయి. తొలి సీజన్లో ఎన్టీయార్ వ్యాఖ్యాతగా మెప్పించారు. రెండో సీజన్లో నాని అంత ప్రభావం చూపించలేకపోయారు. దీంతో సీజన్ 3 కి హోస్ట్ గా ఎవరు వస్తారనేదానిపై కూడా చాలా ఆసక్తి నెలకొంది. నాగార్జున లేదా వెంకటేష్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని సమాచారం.
అయితే బిగ్ బాస్ 3 సీజన్లో హౌస్ లోకి వెళ్లే పార్టిసిపెంట్స్ ఎంపిక జరుగుతోందని సమాచారం. ఈ సారి షో కి సంబంధించి చిన్న వార్త కూడా బయటకు పొక్కుకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారట ఆ టీం. బిగ్ బాస్ 3 సీజన్ గురించి పూర్తి క్లారిటీ రావాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.