Advertisement

Bollywood

పెళ్లి పీటలెక్కనున్న ‘సాహో’ నటి ఎవ్లిన్ శర్మ.. బాయ్ ఫ్రెండ్‌తో ఫోటో షేర్ చేసిన భామ..!

Soujanya GangamSoujanya Gangam  |  Oct 9, 2019
పెళ్లి పీటలెక్కనున్న ‘సాహో’ నటి ఎవ్లిన్ శర్మ.. బాయ్ ఫ్రెండ్‌తో ఫోటో షేర్ చేసిన భామ..!

Advertisement

ఎవ్లిన్ శర్మ (evelyn sharma).. యే జవానీ హే దివానీ, యారియా వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్న ఈ భామ.. తాజాగా విడుదలైన ‘సాహో’ చిత్రంలో కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ‘సాహో’ విజయంతో ఆనందంలో మునిగితేలుతున్న ఈ అందాల తార.. త్వరలో పెళ్లి పీటలెక్కేందుకు కూడా సిద్ధమవుతోందట. తాజాగా తన ఎంగేజ్ మెంట్‌కి సంబంధించిన వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఎవ్లిన్.

ఓ ప్రముఖ దిన పత్రికతో మాట్లాడిన ఎవ్లిన్ తన బాయ్‌ఫ్రెండ్ డాక్టర్ తుషాన్ భిండీ (Tushan Bhindi) గురించి వెల్లడించింది. ఆస్ట్రేలియాలో డెంటల్ సర్జన్‌‌గా పనిచేసే తుషాన్.. సిడ్నీలోని హార్బర్ బ్రిడ్జ్ పై తనకు ప్రపోజ్ చేశాడని.. దానికి తాను వెంటనే ఒప్పుకున్నానని వెల్లడించింది ఎవ్లిన్. అంతేకాదు.. కలలో కూడా తాను ఇలాంటి ప్రపోజల్‌ని ఊహించలేదని చెబుతూ ఆ క్షణం గురించి చెప్పుకొచ్చింది.

తుషాన్ తొలుత ఓ గిటారిస్ట్‌ని అపాయింట్ చేసుకున్నాడట. అతడు వీరిద్దరి ఫేవరెట్ పాటలు పాడుతూ గిటార్ వాయిస్తుండగా.. తుషాన్ తన మోకాళ్లపై కూర్చొని.. ఉంగరంతో ఎవ్లిన్‌కు ప్రపోజ్ చేశాడట. “తుషాన్‌కి నా గురించి బాగా తెలుసు. నాకు ఎలా ప్రపోజ్ చేస్తే నచ్చుతుందో కూడా తను అర్థం చేసుకున్నాడు. ఆ ప్రపోజల్ గురించి నేను కలలో కూడా ఊహించలేదు” అంటూ చెప్పుకొచ్చింది ఎవ్లిన్.

View this post on Instagram

Yessss!!! 🥰💍🥳😍🤩

A post shared by Evelyn Sharma (@evelyn_sharma) on Oct 7, 2019 at 7:24pm PDT

అంతేకాదు.. తన బాయ్ ఫ్రెండ్ తుషాన్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఎవ్లిన్. సిడ్నీ స్కైలైన్ బ్యాక్ గ్రౌండ్‌గా ఉన్న ఈ ఫొటోలో.. వారిద్దరూ ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు. దానికి క్యాప్షన్‌గా ‘యెస్’ అని పెట్టి.. తాను ‘యెస్’ చెప్పానన్న విషయాన్ని ప్రస్తావించింది ఎవ్లిన్.

ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూల్లో భాగంగా వారిద్దరూ.. మొదటిసారి కలిసిన రోజు గురించి చెప్పింది ఎవ్లిన్. ‘మేమిద్దరం గతేడాది బ్లైండ్ డేట్‌లో భాగంగా కలిశాం. మా ఇద్దరికీ తెలిసిన ఓ మంచి స్నేహితురాలు.. మాకు ఆ బ్లైండ్ డేట్‌ని ఏర్పాటు చేసింది. అంతకుముందు మా ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలీదు. కానీ ఆ మొదటి పరిచయంలోనే తను చాలా రొమాంటిక్ అని తెలుసుకున్నా”

‘మీకు తెలుసా? ఆయన నాకంటే పెద్ద సినిమా బఫ్. కావడానికి సర్జన్ అయినా.. తను చాలా సినిమాటిక్. నా గురించి తనకు చాలా బాగా తెలుసు. నన్ను అంతలా అర్థం చేసుకునే వ్యక్తితో కలిసి జీవించాల్సి రావడంతో.. నేను ఎంతో లక్కీ అని ఫీలవుతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది ఎవ్లిన్.

ఎవ్లిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఎంగేజ్‌మెంట్ గురించి ప్రకటించగానే.. ఆమె స్నేహితులతో పాటు అభిమానులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు సోఫీ చౌదరి, ఎల్లీ అవ్రం, డియాన్నే పాండే, కరిష్మా తన్నా, ప్రతీక్ చక్రవర్తి వంటి వారందరూ శుభాకాంక్షలు తెలిపారు.

తన పెళ్లి తేదీ గురించి, వేదిక గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని చెప్పే ఎవ్లిన్.. దాని గురించి ప్రత్యేకంగా మరో ప్రకటన చేస్తామని చెబుతోంది. “ప్రస్తుతానికి మేమిద్దరం కలిసి ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం” అంటోంది. ఆస్ట్రేలియాలో సర్జన్‌గా పనిచేస్తున్న తుషాన్ కోసం.. సిడ్నీకి వెళ్లిపోవడానికి కూడా ఎవ్లిన్ సిద్ధంగా ఉందట.

“సిడ్నీ నాకెంతో ఇష్టమైన నగరం. అక్కడ ఉండేందుకు నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అయితే ఇండియాలో కూడా మేం ఒక ఇల్లు కొనుక్కొని.. ఇక్కడికి అప్పుడప్పుడూ వస్తుంటాం. ఎంతైనా ఇది మా సొంత దేశం. మా సొంతిల్లు లాంటిది” అంటూ చెప్పుకొచ్చింది.

ఎవ్లిన్ సగం ఇండియన్. సగం జర్మన్. ఆమె తండ్రి పంజాబీ వ్యక్తి. తల్లి ఓ జర్మన్. ఎవ్లిన్ జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్‌లో పుట్టి పెరిగింది. ‘యే జవానీ హే దివానీ’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో పేరు మంచి సంపాదించుకున్న ఆమె.. తాజాగా ‘సాహో’లో జెన్నిఫర్ అనే పాత్రలో కనిపించింది. ఈ  పాత్ర కోసం ఎవ్లిన్ యాక్షన్ సీన్లలో కూడా పాల్గొంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.