ADVERTISEMENT
home / Celebrity Life
ఆ నిమిషం నేను సినిమాలు వదిలేసి మెడిసిన్ చేద్దామనుకున్నా : సాయి పల్లవి

ఆ నిమిషం నేను సినిమాలు వదిలేసి మెడిసిన్ చేద్దామనుకున్నా : సాయి పల్లవి

సాయి పల్లవి.. (Sai Pallavi) దక్షిణాది సినిమా రంగంలో పరిచయం అవసరం లేని పేరు ఆమెది. ఇటు తెలుగుతో పాటు అటు మలయాళంలోనూ టాప్ కథానాయికగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి తమిళంలోనూ మంచి గుర్తింపు సాధించింది. ఇప్పుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఎన్ జీకే (NGK) చిత్రంతో హీరోయిన్ గా మన ముందుకు రానుంది సాయిపల్లవి. ఈ సినిమా ఈ నెల 31 న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది ఈ రౌడీ బేబీ.

sp3 4143249

మలయాళ సినిమా ప్రేమమ్ విడుదల తర్వాత సాయి పల్లవి ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే తాను ఈ సినిమాను ఎంచుకోవడం వెనుక ఉన్న ఓ వింత కారణాన్ని అభిమానులతో పంచుకుంది సాయి పల్లవి. కోయంబత్తూర్ లో పుట్టి, పెరిగిన ఈ అమ్మడు స్నేహితులంతా తమిళియన్లే.. వారు మలయాళ సినిమాలు చూసేది చాలా తక్కువేనట. అందుకే తాను మలయాళాన్ని తెరంగేట్రానికి ఎంచుకున్నానని చెబుతుందీ బ్యూటీ. నా స్నేహితులందరూ తమిళ్ వాళ్లే. నేను వాళ్లను నా సినిమా చూడమని బతిమాలినా వారు దాన్ని చూసేందుకు ఇష్టపడరు. అందుకే ఒకవేళ నా సినిమా బాగా ఆడకపోయినా.. నేను అందులో నటించానన్న విషయం నా స్నేహితులెవరికీ తెలియదు. వాళ్లు నన్ను వెక్కిరించే అవకాశం కూడా ఉండదు.. అనే నేను మలయాళ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. కానీ ప్రేమమ్ మంచి విజయాన్ని సాధించడంతో పాటు దక్షిణాది సినీ రంగాల్లో అందరికీ తెలిసిపోయింది. దీంతో నేను హీరోయిన్ అన్న విషయం నా స్నేహితులకు కూడా తెలిసిందని అంటుందీ బ్యూటీ.

sp2

ADVERTISEMENT

అంతేకాదు.. మేకప్ అంటే పెద్దగా ఇష్టపడని సాయిపల్లవి సినిమాలోనూ అలాగే నటించడానికి కారణం కూడా వెల్లడించింది. నేను నాలాగే ఉండాలనుకుంటా. అందుకే మేకప్ వేసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. నా ముఖంపై రోసేషియా అనే సమస్య ఉంది. దాని వల్ల మొటిమలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సినిమాలో నటించక ముందు నాకు ఆత్మవిశ్వాసం కూడా తక్కువగా ఉండేది. కానీ ప్రేక్షకులు నేను ఎలా ఉన్నానో అలాగే నన్ను ఒప్పుకున్నారు. ప్రేమమ్ సినిమా విజయం సాధించిన తర్వాత నా రియల్ బ్యూటీకి అందరూ ఫిదా అవుతారని అర్థమైంది. నా మీద నాకే నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరిగాయి. ఈ సినిమా తర్వాత ఆ మొటిమలు, డీగ్లామ్ లుక్  నా గుర్తింపుగా మారాయి.. అంటుందామె.

ngk1

ప్రస్తుతం సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఎన్ జీకే సినిమాలో కథానాయికగా కనిపించనుంది సాయి పల్లవి. ఈ సినిమాలో ఆమె సూర్య భార్యగా కనిపించనుంది. సినిమాని మలుపు తిప్పే పాత్ర తనదంటూ ఈ సినిమా గురించి కూడా చెప్పిందామె. సెల్వరాఘవన్ సర్ తో సినిమా చేయడం కాస్త కష్టమే. ఆయన షూటింగ్ లో చాలా క్రమశిక్షణ ఉంటుంది. సెల్ ఫోన్ షూటింగ్ లోకి అనుమతించరు. కేవలం ఒక మేకప్ అసిస్టెంట్ తప్ప మరెవరూ మనతో పాటు సెట్స్ కి రావడానికి వీల్లేదు. సెట్స్ లోనూ ఎవరూ ఎవరితో పెద్దగా మాట్లాడుకోరు. సినిమా షూటింగ్ ప్రారంభమైన రోజు నుంచి పూర్తయ్యేవరకూ ఇలాగే కొనసాగింది అంటోందామె. అంతేకాదు.. తాను చేసే పాత్రలోకి దూరాలంటే తనకు కెమెరా ముందుకు వెళ్లిన తర్వాత ఓ నిమిషం సమయం పడుతుందని కానీ సెల్వరాఘవన్ మాత్రం అంత సమయం ఇవ్వకుండా వెంటనే రియాక్షన్ ఇవ్వాలని భావిస్తుంటారని కూడా చెప్పింది. అలాగే.. కెమెరా ముందు నటిస్తున్నప్పుడు కనురెప్పలు కూడా ఎక్కువసార్లు కొట్టకూడదని ఆయన నియమం. కానీ మనం ఎక్కువసార్లు రెప్పలు వాల్చకూడదు అని ఆలోచించేటప్పుడే ఈ కనురెప్పలు ఎక్కువసార్లు కొట్టుకుంటాయి. దీని వల్ల షూటింగ్ సమయంలో ఇబ్బంది పడ్డా అని చెప్పుకొచ్చింది సాయిపల్లవి.

ngk2

ADVERTISEMENT

ఇదొక్కటే కాదు.. ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా నేర్చుకున్నానని చెప్పిన సాయి పల్లవి షూటింగ్ క్రమంలో ఇబ్బంది పడిన సంఘటన కూడా ఉందని దాని గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆ సంఘటన వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయి తిరిగి మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలని భావించిందట. దీనికి కారణం కూడా సెల్వరాఘవన్ వ్యవహార శైలే.. సినిమా షూటింగ్ సమయంలో ఓసారి ఓ సీన్ ని ఎన్ని టేకులు చేసినా సెల్వరాఘవన్ కి అది నచ్చక తిరిగి రీటేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. అలా ఒకటీ రెండు కాదు.. పదుల సార్లు సీన్ ని చేసిన పల్లవికి ఆ మొత్తం సీన్ ఎంతో బాధ కలిగించిందట. ఇంటికి వెళ్లి అమ్మను హత్తుకొని ఏడుస్తూ ఇక ఎన్ జీకే సినిమా పూర్తయ్యాక తాను సినిమా రంగాన్ని వదిలి మెడిసిన్ ప్రాక్టీ స్ చేస్తానని చెప్పిందట. అయితే ఆ తర్వాత షూటింగ్ కి వెళ్లిన ఆమెకు హీరో సూర్య తనకు కూడా సెల్వరాఘవన్ అలాగే టేకుల మీద టేకులు తీసుకుంటారని.. ఆయన పర్ఫెక్ట్ షాట్ వచ్చే వరకూ అలాగే చేస్తారని చెప్పడంతో తన మనసులో ఉన్న ఆ బాధను తగ్గించుకుందట.. ఈ విషయాన్ని కూడా తనే స్వయంగా చెప్పుకొచ్చిందీ అందాల భామ.

ఎన్ జీకే తర్వాత ఈ అమ్మడు తెలుగులో రానా సరసన విరాటపర్వం 1992 అనే చిత్రంలో నటించనుందట. ఈ సినిమాలో ఆమెది డీగ్లామ్ రోల్ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకి నీది నాది ఒకటే కథ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వం వహించనున్నారు. ప్రియమణి ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది. 

ఇవి కూడా చదవండి.

మన వెండితెర ముద్దుల ‘రౌడీ’ల గురించి.. ఈ విశేషాలు మీకు తెలుసా?

ADVERTISEMENT

స్నేహితురాలి పెళ్లిలో.. సమంత సందడి చూశారా?

అమ్మా.. నా జీవితం నాశనం చేసినందుకు థ్యాంక్స్: సినీనటి సంగీత

Images : Instagram

27 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT