ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
కొత్త సంవత్సరంలో.. ఈ సెక్స్ రిజల్యూషన్స్ మీ జీవితాన్ని మార్చేస్తాయి

కొత్త సంవత్సరంలో.. ఈ సెక్స్ రిజల్యూషన్స్ మీ జీవితాన్ని మార్చేస్తాయి

కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొత్త మార్పు కోసం కొత్త కొత్త అలవాట్లు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమని తాము మరింత బెటర్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు . అయితే ఈసారి కాస్త ప్రత్యేకమైన రిజల్యూషన్స్ కూడా ట్రై చేయండి. ఇవి మిమ్మల్ని మీ భాగస్వామికి మరింత దగ్గర చేస్తాయి. మానసికంగా మాత్రమే కాదు.. శారీరకంగా కూడా. అవును..  ఈ సెక్స్ రిజల్యూషన్స్ (sex resolutions).. మీ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు  ఎంతగానో తోడ్పడతాయి. అవేంటంటే..

1. ఫేక్‌గా వద్దు..

చాలామంది మహిళలు సెక్స్ సమయంలో ఫీలింగ్స్ రాకపోయినా వచ్చినట్లుగా నటిస్తూ ఉంటారు. ఇది మీ కోసం కావచ్చు.. లేదా మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి కావచ్చు.. కానీ ఇలా చేయడం సరికాదు. మీ భాగస్వామితో దీని గురించి మాట్లాడి ఏం చేయగలరో నిర్ణయించుకోండి.

2. అసౌకర్యంగా ఉంటే వద్దు..

సెక్సీ బ్రా లేదా ప్యాంటీలో మీరు అందంగా కనిపిస్తారని చెప్పి.. మీకు సౌకర్యంగా లేని వాటిని ఉపయోగించడం అంత మంచిది కాదు. మీకు సౌకర్యంగా ఉన్నవాటిలోనే అద్భుతంగా కనిపిస్తారని గుర్తుంచుకోవాలి. అందంగా ఉన్నారని మీరు మీకు నప్పని.. లేదా మీకు అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉన్న దుస్తులు ధరించడం వల్ల మీకు ఆనందం ఉండదు. మీ భాగస్వామి కూడా ఇలా కోరుకోరని గుర్తుంచుకోవడం మంచిది. 

ADVERTISEMENT

3. ఎక్కువగా చదవండి..

రొమాంటిక్‌గా, సెక్సీగా ఉండే నవలలు ఎక్కువగా చదవడానికి ఆసక్తి చూపించండి. మీకు బెడ్రూంలో ఏం కావాలో మీరు తెలుసుకునేలా చేస్తాయి. వీటితో పాటు అప్పుడప్పుడూ పోర్న్ సినిమాలు చూడడం కూడా మంచిదే. సాధారణంగా దీన్ని తప్పుగా భావిస్తారు. అయితే మీరు మీ భాగస్వామితో ఎలా సెక్స్‌లో పాల్గొనాలనే విషయంతో పాటు.. కొత్త కొత్త పొజిషన్లకు సంబంధించిన విషయాలు మీకు తెలుస్తాయి. 

4. కొత్త పొజిషన్లు ప్రయత్నించండి.

మీకు ఒక పొజిషన్ బాగా నచ్చిందని అదే పొజిషన్‌లో సెక్స్‌లో పాల్గొంటున్నారా? ఇది మంచిదే. కానీ కొత్త పొజిషన్లు ప్రయత్నించడం వల్ల మరింత ఆనందంగా ఫీలయ్యే వీలుంటుంది. అందుకే మీరు మరింత ఆనందాన్ని పొందేందుకు ప్రతిసారి కొత్త పొజిషన్లు ప్రయత్నించండి.

5. ఎక్కువగా మాట్లాడండి.

మీరు సెక్స్ సమయంలో ఎలా ఫీలవుతున్నారో మీ భాగస్వామికి చెప్పడం ఎంతో అవసరం. ఇది అన్ని విషయాల్లోనూ ముఖ్యమే. ప్రధానంగా చాలామంది జంటలు బెడ్రూంలో తాము ఎలా ఫీలవుతున్నామన్న విషయాన్ని భాగస్వామితో పంచుకోలేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ప్రతి ఒక్క విషయాన్ని నిజాయతీగా పంచుకోవడం మంచిది.

ADVERTISEMENT

6. ముద్దు పెట్టుకోండి.

తరచూ ముద్దు పెట్టుకోవడం వల్ల మెదడు రిలాక్స్ అవుతుంది. మీ భాగస్వామికి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. మీ మూడ్‌ని మార్చి మిమ్మల్ని ఆనందంగా మార్చుతుంది.

ముద్దులోనూ ఎన్నో ర‌కాలున్నాయి.. వాటి అర్థాలేంటో మీకు తెలుసా? (Types Of Kisses And Importance Of Kissing)

7. ఎలా ఉన్నారో ఆలోచించకండి.

సెక్స్‌లో పాల్గొనే సమయంలో ఎలా ఉన్నారో అని ఆలోచించడం చాలా మంది అమ్మాయిలు చేసే పనే. అయితే మీ భాగస్వామి మీతో సెక్స్‌లో పాల్గోనేటప్పుడు వారు మీరు ఎలా ఉన్నారు.. ఎంత లావుగా ఉన్నారు అని ఆలోచించరు. కాబట్టి లైట్లు ఆఫ్ చేస్తేనే సెక్స్ అని గిరిగీసుకోకపోవడం మంచిది.

ADVERTISEMENT

8. టెస్టులు అవసరమే..

మీరు చాలా సంవత్సరాల నుంచి బంధంలో ఉండి ఉండొచ్చు. కానీ ప్రతి ఆరు నెలలకోసారి టెస్టులు చేయించుకోవడం మంచిది. కనీసం ఏడాదికోసారైనా చేయించుకోవడం వల్ల మీరు ఆనందంగా ఉండే వీలుంటుంది.

9. మీకు నచ్చినప్పుడు మాత్రమే..

మీకు ఇష్టం లేకపోయినా మీ భాగస్వామికి ఇష్టం ఉందని.. వారికి మూడ్ వచ్చిందని మీరు కూడా ఓకే చెప్పడం సరికాదు. ఈ సంవత్సరం ఇతరుల గురించి ఆలోచించడం కంటే ముందు.. మీ గురించి ఆలోచించడం నేర్చుకోండి. అది మీ భాగస్వామి అయినా సరే.

10. ప్రయోగాలు అవసరమే..

మీరు ప్రయోగాలు చేయాలనుకుంటే దానికి ఎన్నో మార్గాలు.. మూడ్ ఉంటే చాలు..

ADVERTISEMENT

ఈ తొలి వార్షికోత్స‌వ రొమాన్స్ ముచ్చ‌ట్లు.. ఆలుమ‌గ‌ల‌కు ప్ర‌త్యేకం..!

11. షేవింగ్ గురించి ఆలోచించండి..

చాలామంది అమ్మాయిలు సెక్స్ సమయంలో షేవింగ్ లేదా వ్యాక్సింగ్ చేసుకోలేదని బాధపడుతుంటారు.. ఓ ముఖ్యమైన రాత్రి సందర్భంగా మీరు అక్కడ వ్యాక్సింగ్ చేసుకోలేదని ఇబ్బందిపడుతున్నారా? అయితే మీరెలా ఉన్నారో మీ భాగస్వామికి చూపేందుకు ఇబ్బంది పడకపోవడం మంచిది.

12. మీ ఇష్టాయిష్టాలు చెప్పండి..

మీకు సెక్స్ సమయంలో మీ భాగస్వామి ఎలా ఉంటే.. ఏం చేస్తే నచ్చుతుందో వారికి చెప్పండి. దీనివల్ల అద్భుతమైన అనుభవాన్ని సొంతం చేసుకునే వీలుంటుంది.

ADVERTISEMENT

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

 

03 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT