ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
నా బాయ్ ఫ్రెండ్ ని అలా ఎవరికీ తెలియకుండా ఇంట్లోకి తీసుకొచ్చా..

నా బాయ్ ఫ్రెండ్ ని అలా ఎవరికీ తెలియకుండా ఇంట్లోకి తీసుకొచ్చా..

ప్రేమలో ఉన్న చాలామంది జంటలు రొమాన్స్ (Romance) లో పాల్గొనే సమయం కోసం వేచి చూస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ఇది కొందరి విషయంలో తప్పుగా అనిపించినా.. మరికొందరు మాత్రం దీన్ని చాలా సింపుల్ విషయంగా భావిస్తారు. ఒంటరిగా లేదా రూమ్మేట్ తో కలిసి ఉంటున్న అమ్మాయిలకైతే బాయ్ ఫ్రెండ్(boy friend)ని ఇంటికి తీసుకొచ్చి రొమాన్స్ చేయడం పెద్ద విషయం కాదు.. కానీ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నవారు బాయ్ ఫ్రెండ్ ఇంటికి వస్తానంటే కంగారు పడిపోతారు. అలా తన బాయ్ ఫ్రెండ్ ని ఇంట్లో వాళ్లకు తెలియకుండా తీసుకొచ్చిన సందర్భం గురించి చెప్పుకొచ్చారు ముగ్గురు అమ్మాయిలు. ఆ కథలేంటో తెలుసుకుందాం..

1. శబ్దం రాకుండా..

మా అమ్మా నాన్న ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు. వారు ఆఫీస్ కి వెళ్లిన తర్వాత ఇంటికి వస్తానని నా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు. తను ఇంటి నుంచి బయల్దేరి మా ఇంటి దగ్గర్లో ఉన్నానని చెప్పగానే బెల్ మోగింది. తీసి చూస్తే మా నాన్న. నేను చాలా భయపడ్డా.. నిరుత్సాహ పడ్డా కూడా. అయితే నాన్న తనకు ఒంట్లో బాగా లేదని.. గదిలోకి వెళ్లి పడుకుంటానని చెప్పారు. నాకు అది చాలు అనిపించింది. నా బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి షూస్ బయటే విప్పి ఏమాత్రం శబ్దం కాకుండా ఇంట్లోకి రమ్మని చెప్పాను. మా కుక్కను వాకింగ్ కి తీసుకెళ్తున్నట్లుగా డోర్ తీసి బయటకు వెళ్లాను. అదే సమయంలో తను ఇంట్లోకి అడుగుపెట్టి వేగంగా మెట్లెక్కి నా గదిలోకి వెళ్లిపోయాను. రెండు నిమిషాల తర్వాత నేను కూడా ఇంట్లోకి వెళ్లాను. నేను నా గదిలోకి అడుగుపెట్టగానే తను నా నడుము పట్టుకొని దగ్గరికి తీసుకొని పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత నేను కంగారుగా గది తలుపు పెట్టేశాను. ఆ తర్వాత మేమిద్దరం మా జీవితంలోనే అద్భుతమైన రొమాన్స్ చేశాం. ఆరోజు చేసిన సెక్స్ నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఎలాంటి శబ్దం రాకుండా సెక్స్ చేయాలన్న థ్రిల్ మా ఆనందాన్ని మరింత పెంచిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తను ఎలా వచ్చాడో అలాగే శబ్ధం లేకుండా బయటకు వెళ్లిపోయాడు.

ADVERTISEMENT

2. మొదటి అంతస్థు నుంచి దూకేశాడు..

మా అమ్మానాన్న తమ స్నేహితులతో పాటు ఓ రిసార్ట్ కి ట్రిప్ కి వెళ్లారు. నన్ను కూడా రమ్మన్నారు కానీ నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంట్లో ఉండిపోయాను. ఆ తర్వాత నేను నా బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి విషయం చెప్పాను. తను వస్తాడని నేను అస్సలు ఊహించలేదు. కానీ తను కాసేపట్లేనే మా ఇంటికి వచ్చి డోర్ బెల్ కొట్టాడు. తలుపు తీసి తనని చూసి నేను ఆశ్చర్యపడడంతో పాటు భయపడ్డాను.. తను లోపలికి రాగానే నన్ను గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరం మాకు నచ్చినట్లుగా రొమాన్స్ చేయాలని నిర్ణయించుకున్నాం. బెడ్ రూంలోకి వెళ్లి ఇద్దరం ఒకరి దుస్తులు మరొకరు తీస్తూ హాట్ గా రొమాన్స్ చేశాం. సెక్స్ లో పాల్గొని కాస్త అలా విశ్రాంతి తీసుకుందామని భావిస్తున్నంతలోనే డోర్ బెల్ మోగింది. వచ్చింది ఎవరో తెలియక మా ఇద్దరిలో కంగారు పెరిగింది. వెంటనే బట్టలు వేసుకొని నేను డోర్ తీయడానికి పరిగెత్తాను. బయటకు ఎలా వెళ్లాలో అర్థం కాక నా బాయ్ ఫ్రెండ్ మంచం కింద దాక్కుంటానని చెప్పాడు. కానీ తనకున్న కంగారు వల్ల దొరికిపోతానేమో అనిపించి వెనుక ఉన్న కిటికీ నుంచి బయటకు దూకేశాడు. నా గది మొదటి అంతస్థులో ఉండడం వల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. నేను వెళ్లి తలుపు తీశాను. వర్షం పడుతుందని అమ్మానాన్న.. వాళ్ల స్నేహితులు ప్లాన్ ని మరో రోజుకి వాయిదా వేసుకొని ఇంటికి తిరిగి వచ్చేశారట. అంత వర్షంలోనూ కిటికీలు తీసి ఉంచినందుకు మా అమ్మ నన్ను తిట్టింది. తనకు అసలు విషయం తెలీదు కదా మరి..

3. వాళ్లందరినీ అలా బోల్తా కొట్టేంచేశా..

మా ఇళ్లు ఓ సాధారణ కాలనీలో ఉంది. చుట్టు పక్కల ఏం జరుగుతుందని అక్కడున్న ఆంటీలందరూ ఎప్పుడూ గమనిస్తూనే ఉండేవారు. అందుకే మా అమ్మానాన్న ఇంట్లో లేకపోయినా నా బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకురావడం అన్నది అసాధ్యంగానే అనిపించేది. మామూలుగా ఎవరైనా అబ్బాయి తలుపు వరకూ వస్తేనే చుట్టు పక్కల వారు తొంగి చూడడం.. మా గురించి మాట్లాడుకోవడం వంటివి చేస్తుండేవారు. నా బాయ్ ఫ్రెండ్ వారాంతంలో అమ్మా నాన్నలు బయటకు వెళ్తున్నారని తెలిసినప్పుడు తను రావొచ్చా? అని అడిగాడు. వెంటనే నో చెప్పాలనుకున్నా. కానీ నా జీవితం నాకోసం జీవించాలని భావించాను. ఎవరి గురించో భయపడి నాకు నచ్చిన పని చేయకుండా ఆగిపోవడం ఏంటి? అనిపించింది. దాంతో సరేనన్నా. ఆరోజు ఉదయం తను రావడానికి ముందు కొన్ని గంటల పాటు ఇతరులకు అనుమానం రాకుండా చేశాను. నా బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఏసీ రిపేర్ బాయ్ తో మాట్లాడుతున్నట్లుగా గట్టిగా మాట్లాడసాగాను. అది విన్న మా పక్కింటి ఆంటీలు వచ్చింది ఏసీ రిపేర్ చేసే వ్యక్తి అనుకోవాలని నా ఫీలింగ్. నా బాయ్ ఫ్రెండ్ ఉదయం 11 గంటలకు మా ఇంటికి వచ్చాడు. తను ఇంటికి వచ్చిన తర్వాత మరోసారి ఏసీ రిపేర్ బాయ్ లా మాట్లాడుతూ లోపలికి తీసుకెళ్లాను. లోపలికి వెళ్లడం వల్ల దూరం దూరంగా ఉన్న మేమిద్దరం గట్టిగా కౌగిలించుకున్నాం. కొన్నేళ్ల నుంచి మేం కలవలేదేమో అన్నట్లుగా మేం గట్టిగా హత్తుకున్నాం. ఆ రోజంతా తను మా ఇంట్లోనే ఉన్నాడు. మేమిద్దరం కలిసి వంట చేసుకున్నాం, తింటూ టీవీ చూశాం. రొమాన్స్ లో పాల్గొన్నాం. ఆ తర్వాత రాత్రంతా మా ఇంట్లోనే ఉండి తెల్లవారుఝామున ఎవరూ లేవక ముందు తను మా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంట్లోంచి వెళ్లేటప్పుడు తను ఇచ్చిన ముద్దు నాకు ఇప్పటికీ ఎంతో ఇష్టమైన ముద్దు..

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

22 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT