ADVERTISEMENT
home / Celebrity Style
కాలేజ్ ఫంక్ష‌న్స్‌లో.. ఈ శారీ లుక్స్‌తో అద‌రగొట్టేయండి..!

కాలేజ్ ఫంక్ష‌న్స్‌లో.. ఈ శారీ లుక్స్‌తో అద‌రగొట్టేయండి..!

ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ఎన్ని కొత్త ట్రెండ్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ చీరది మాత్రం ఎప్పుడూ మొద‌టి స్థాన‌మే. ఎందుకంటే మారుతున్న కాలం, ట్రెండ్స్‌కు అనుగుణంగా చీర కూడా త‌న రూపాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకొంటూ కొత్త సొబ‌గులు అద్దుకుంటోంది. అందుకే సెల‌బ్రిటీలు మొద‌లుకొని సామాన్య మ‌హిళ‌ల వ‌ర‌కు త‌మ వార్డ్ రోబ్‌లో చీర‌కు క‌చ్చితంగా స్థానం ఇస్తున్నారు. అదీకాకుండా పండ‌గ‌లు, శుభ‌కార్యాలు, ప్రత్యేక వేడుక‌లు.. వంటి సంద‌ర్భాల్లో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపిస్తూనే స్టైల్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌వాలంటే అది చీర‌తోనే సాధ్యం.

అందుకే ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు పండ‌గ‌లు, పెళ్లిళ్లు.. వంటి వేడుక‌ల‌కే కాదు.. కాలేజీలో జ‌రిగే వార్షికోత్సవం, వీడ్కోలు ప‌లికే పార్టీ.. వంటి సంద‌ర్భాల్లో కూడా శారీ క‌ట్టుకునేందుకు అమితంగా ఆస‌క్తి చూపిస్తున్నారు. త‌ద్వారా వారు న‌లుగురిలోనూ ప్ర‌త్యేకంగా క‌నిపించ‌డ‌మే కాదు.. స్టైలిష్‌గా కూడా మెరిసిపోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. రోజూ క‌ట్టుకునే చీరలో లేక ప‌ట్టు చీర‌లో ఈ సంద‌ర్భాల‌కు అంత‌గా సెట్ కాక‌పోవ‌చ్చు. మ‌రి, ఏం చేయాలి అంటారా?? బాలీవుడ్ ఫిట్ నెస్ ఫ్రీక్, ఫ‌రెవ‌ర్ బ్యూటీ శిల్పాశెట్టి (Shilpa shetty)ని ఫాలో అయితే స‌రి..!

సింపుల్‌గా ఉండే వ‌స్త్రధార‌ణ‌తోనే న‌లుగురిలోనూ భిన్నంగా క‌నిపించాల‌ని మీరు అనుకుంటున్నారా?? అయితే శిల్ప ధ‌రించిన ప్లెయిన్ బ్లూ క‌ల‌ర్ శారీ చూశారా?? చూడ‌డానికి అచ్చం చీర‌లానే క‌నిపిస్తున్న ఈ డిజైన్‌ను ఐష్ రావు అనే డిజైన‌ర్ రూపొందించారు. దీనిని ప్లీటెడ్ ప్రీ డ్రేప్డ్ శారీ అంటారు. దీనికి ప్లెయిన్ లైట్ పింక్ క‌ల‌ర్ స్లీవ్ లెస్ బ్లౌజ్, ఫ్లోర‌ల్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన బెల్ట్ జ‌త చేసి.. శిల్ప మెడ‌లో ఒక నెక్లెస్‌తో త‌న లుక్‌ని సింపుల్‌గా పూర్తి చేసింది. కావాల‌నుకుంటే దీనికి ఫ్లోర‌ల్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన బ్లౌజ్‌ని కూడా జ‌త చేయ‌వ‌చ్చు.

ప్ర‌స్తుత ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ర‌ఫెల్డ్ అవుట్‌ఫిట్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా?? ఫ‌్యాష‌న్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే ఇలాంటి అంద‌మైన ఫ్యాష‌న్‌ను చీర‌కు ఆపాదిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అచ్చు మ‌న శిల్ప క‌ట్టుకున్న పింక్ క‌ల‌ర్ శారీలానే ఉంటుంది. ప్ర‌ముఖ డిజైన‌ర్ రిధిమెహ్రా రూపొందించిన ప్లెయిన్ ర‌ఫెల్డ్ కాక్ టెయిల్ శారీకి ప్లెయిన్ బ్లౌజ్ జ‌త చేసిన ఈ బ్యూటీ హెవీ యాక్సెస‌రీస్‌తో త‌న లుక్‌ని పూర్తి చేసింది. స్టోన్స్, కుంద‌న్స్‌తో త‌యారుచేసిన ఆక‌ర్షణీయ‌మైన చోక‌ర్, బ్రేస్ లెట్, వ‌డ్డాణం, ఉంగ‌రాల‌ను పెట్టుకున్న శిల్ప మేక‌ప్ కూడా చాలా లైట్‌గా వేసుకుంది.

ADVERTISEMENT

ప్ర‌కాశ‌వంత‌మైన రంగు అన‌గానే మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఓటు వేసేది ప‌సుపుకే! అలాంటి స‌న్ షైన్ ఎల్లో క‌ల‌ర్ శారీకి సిల్వ‌ర్ ప‌నిత‌నం జ‌తైతే?? ఇదుగో.. అందాల శిల్ప క‌ట్టుకున్న చీర‌లానే అందంగా మెరిసిపోతుంది. హాఫ్ శారీ మోడ‌ల్ త‌ర‌హాలో రూపొందిన చీర‌కు స్లీవ్ లెస్ బ్లౌజ్ జ‌త చేసి.. దానిపై ఓవ‌ర్ కోట్ త‌ర‌హాలో లేయ‌ర్ ట‌చ‌ప్ ఇచ్చిందీ య‌మ్మీ మ‌మ్మీ. టాప్ లేయ‌ర్‌కు ఉన్న టాజెల్స్ చీర‌కే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. ఈ చీర‌కు సిల్వ‌ర్ కోటెడ్ యాక్సెస‌రీస్ జ‌త చేసిన శిల్ప ప్ర‌కాశవంతంగానే కాదు.. స్టైలిష్‌గా కూడా క‌నిపిస్తోంది క‌దూ!

సాయంత్రం లేదా రాత్రి వేళల్లో జ‌రిగే పార్టీల్లో మ‌నం ధ‌రించే దుస్తులు ప్లెయిన్‌గా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే క‌దా సీక్వెన్ లేదా క్రిస్ట‌ల్ వ‌ర్క్స్ ఉన్న అవుట్‌ఫిట్స్ ఎంపిక చేసుకునేది అంటారా?? నిజ‌మే కానీ.. చీర విష‌యానికి వ‌చ్చే సరికి ఇలాంటి వ‌ర్క్స్ ఉన్న‌వి బ‌రువుగా ఉన్న కార‌ణంగా అంత సౌక‌ర్య‌వంతంగా అనిపించ‌క‌పోవ‌చ్చు. అదీకాకుండా వాటిని అంత‌సేపు క్యారీ చేయ‌డం కూడా క‌ష్ట‌మే. మ‌రి, అలాంటి సంద‌ర్భాల‌లో ఏం ధ‌రించాలి అంటారా?? శిల్ప ధ‌రించిన కాన్సెప్ట్ శారీ ఇందుకు మంచి ఎంపిక‌. చూడండి.. ప్ర‌ముఖ డిజైన‌ర్ త‌రుణ్ త‌హిల్యానీ పేస్ట‌ల్ షేడ్‌లో రూపొందించిన ఈ చీర‌లో సింపుల్ యాక్సెస‌రీస్‌తో శిల్ప ఎంత అందంగా మెరిసిపోతోందో!

ఇవ‌న్నీ కాదు.. మేం చీర క‌ట్టుకున్నా స‌రే.. వెస్ట్ర‌న్ లుక్‌లో క‌నిపించాల్సిందే అంటారా?? అయితే శిల్ప ప్ర‌య‌త్నించిన ఇండో వెస్ట్ర‌న్ శారీ మీ కోస‌మే! రెడ్ క‌ల‌ర్ శారీపై చేసిన గోల్డ్ ఎంబిలిష్డ్ వ‌ర్క్ మ‌న‌కు మంచి లుక్‌ని ఇవ్వ‌డ‌మే కాదు.. చీర‌కు జ‌త చేసిన వ‌న్ షోల్డ‌ర్ బ్లౌజ్‌తో వెస్ట్ర‌న్ లుక్ వ‌స్తుంది. దీనికి జ‌త‌గా ఒకే ఒక్క బ్రేస్ లెట్ పెట్టుకున్న శిల్ప హెయిర్‌ను మాత్రం వేవీ స్టైల్లో తీర్చిదిద్దుకుంది.

చూశారుగా.. కాలేజీలో జ‌రిగే పార్టీలు, వేడుక‌ల‌కు అమ్మాయిలు ఫాలో కాద‌గిన శారీ స్టైల్స్..! వీటిలో మీకు న‌ప్పిన వాటిని ఎంపిక చేసుకొని ప్ర‌య‌త్నించి చూడండి. పార్టీలో మీరే సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌గా మారండి..!

ADVERTISEMENT

ఇవి కూడా చ‌ద‌వండి

కాలేజీ అమ్మాయిల‌కు ప్రత్యేకం.. రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషన్స్..!

స్టైలిష్‌గా క‌నిపించాలంటే.. ఈ బేసిక్ ఫ్యాష‌న్ రూల్స్ ఫాలో కావాల్సిందే!

ఆఫీసులో స్టైల్‌ గా మెరిసిపోవాలంటే .. ఈ ఫ్యాషన్ ఫాలో అవ్వాల్సిందే..!

ADVERTISEMENT
28 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT