ADVERTISEMENT
home / సౌందర్యం
సొగసుల సోనమ్.. సౌందర్య రహస్యాలేంటో మీకు తెలుసా?

సొగసుల సోనమ్.. సౌందర్య రహస్యాలేంటో మీకు తెలుసా?

సోనమ్ (Sonam kapoor).. కేవలం నటి మాత్రమే కాదు.. బాలీవుడ్ ఫ్యాషనిస్టా కూడా. విభిన్నమైన డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకోవడం తనకు అలవాటు. అద్భుతమైన ఫ్యాషన్లే కాదు.. నాజూకైన చర్మం కూడా తన సొంతం.

ఒకప్పుడు 85 కేజీలున్న సోనమ్.. ఆరోగ్యకరమైన డైట్‌ను అనుసరించి.. కొన్ని నెలల్లోనే 35 కేజీల బరువు తగ్గింది. ఆ ఆరోగ్యకరమైన డైట్ తాను బరువు తగ్గడానికి తోడ్పడడంతో పాటు.. తన అందమైన చర్మానికి (radient skin) కూడా ఎంతో సహాయపడిందని చెబుతోంది.

అలాగే ఆరోగ్యకరమైన డైట్‌తో పాటు.. తను సౌందర్యానికి ఇంకా అనేక కారణాలున్నాయని చెబుతుంది సోనమ్. ఈ అందాల ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇటీవలే తన సౌందర్య రహస్యాల గురించి పంచుకుంది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. తన బ్యూటీ కేర్ గురించి అందరికీ వివరించింది. అంతేకాదు.. ప్రతి అమ్మాయి నాజూకైన చర్మం కోసం.. ఈ చిట్కాలు పాటించవచ్చని కూడా వెల్లడించింది. మరి, సొగసుల సోనమ్ అందమైన చర్మానికి, మెరిసిపోయే ముఖానికి వెనకున్న రహస్యాలేంటో మీకు తెలుసా?

ADVERTISEMENT

Instagram

సోనమ్ చెప్పినదాని ప్రకారం తన అందానికి స్వచ్ఛమైన గాలి, ప్రేమ.. ఈ రెండూ కారణం. అవును. భర్త ఆనంద్ అహూజా ప్రేమ ఆమె అందానికి కారణమట. ఇటీవలే భర్త ఆనంద్ అహూజాతో జపాన్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న సోనమ్ మేకోవర్ చూసి మనమంతా అబ్బురపోయా. కానీ ఆమె అందానికి ప్రేమే కారణం అని సోనమ్ చెప్పడం విశేషం.

మన మనసు మొత్తం ప్రేమతో నిండిపోయి.. అదే స్థాయిలో ప్రేమించే వాళ్లు మన జీవితంలో ఉంటే చాలు.. మన లైఫ్ ఎంతో ఆనందంతో నిండిపోతుంది. ఆ ఆనందం మన ముఖంలోనూ కనిపిస్తుంది.  అందుకే తాజా వెకేషన్‌లో కూడా ఆనంద్‌ని చూసి సోనమ్ బుగ్గలు కెంపుల్లా మెరిసిపోవడం మనకు తెలిసిందే. అయితే.. కేవలం ఇదొక్కటేనా? ఇంకా చాలా ఉన్నాయట ఆమె సౌందర్యానికి కారణాలు. ప్రేమ మాత్రమే కాకుండా ఇంకా మీ సౌందర్యానికి కారణాలేంటి? అని ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది.

ADVERTISEMENT

Instagram

ఆహారంలో విటమిన్ సి ఉండేలా చూసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం, పడుకునే ముందు మేకప్ చాలా శుభ్రంగా తొలగించుకోవడం.. వంటివి తన అందానికి చిట్కాలని సోనమ్ వెల్లడించింది.

అంతేకాదు.. తనకి జన్యుపరంగా కళ్లచుట్టూ నల్లని వలయాలు వచ్చాయని.. అందుకే తాను కన్సీలర్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటానని చెప్పింది. “నేను కన్సీలర్ ఉపయోగిస్తాను. ఫౌండేషన్ పెద్దగా ఉపయోగించను. సాధారణంగా మన భారతీయ చర్మతత్వాలకు తగినట్లుగా ఎక్కువ ఫౌండేషన్, కన్సీలర్లు ఉండవు. అందుకే నేను ఒకే దాన్ని ఉపయోగించను. వివిధ రకాల ఫౌండేషన్లు లేదా కన్సీలర్లను కలిపి వాడుతుంటాను. పీచ్ అండర్ టోన్స్ ఉన్న ఫౌండేషన్లు, కన్సీలర్స్ దొరకడం చాలా కష్టం” అంటూ వెల్లడించింది.

ADVERTISEMENT

Instagram

వీటన్నింటితో పాటు తన ప్రధానమైన సౌందర్య రహస్యం కూడా చెప్పుకొచ్చింది సోనమ్. అదేంటనుకుంటున్నారా? నిద్రపోవడం.. అవును. ఎనిమిది గంటల పాటు హాయిగా నిద్రపోవడం వల్లే తన చర్మం అందమైన మెరుపును సంతరించుకుంటుందని సోనమ్ చెబుతుంది.

అందుకే నిద్రను బ్యూటీ స్లీప్ అంటారట. ఈ సమయంలో మన శరీరం చర్మానికి రక్త ప్రసరణను పెంచుతుంది. ఈ రక్త ప్రసరణ పెరగడం వల్ల చర్మంలోని కణాలు ఉత్తేజితమై.. అందంగా మెరిసే చర్మం మన సొంతమవుతుందట.

అందుకే ఎంత ఆలస్యమైనా సరే.. ఆరోగ్యకరమైన నిద్రను మాత్రం దూరం చేసుకోదట సోనమ్. బాగుంది కదండీ.. మరి, మీరూ సోనమ్ చెప్పిన ఈ చిట్కాలను పాటించి మీ చర్మంలో వచ్చే మార్పులను గమనించండి.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి కూడా చదవండి. 

అందమైన చర్మం కోసం.. ఇంట్లో తయారుచేసిన ఈ బాడీ స్క్రబ్స్ వాడేద్దామా..!

ADVERTISEMENT

మీ చర్మ తత్వం ఎలాంటిదో మీకు తెలుసా? ఇలా చేసి సులభంగా తెలుసుకోండి

అందమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి..

01 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT