ADVERTISEMENT
home / Family
తను వచ్చేవరకూ తాళి కట్టనన్నాడు : సౌందర్యా రజనీకాంత్

తను వచ్చేవరకూ తాళి కట్టనన్నాడు : సౌందర్యా రజనీకాంత్

సౌందర్యా రజనీకాంత్ (Soundarya rajanikanth).. రజనీకాంత్ కూతురిగానే కాదు.. గ్రాఫిక్ డిజైనర్, నిర్మాత, దర్శకురాలిగా కూడా మంచి పేరు సాధించిందీ స్టార్ డాటర్. అశ్విన్ రామ్ కుమార్‌తో తన ఏడేళ్ల వివాహ బంధానికి విడాకులతో ముగింపు చెప్పినప్పుడు ఆ విషయం ప్రతిఒక్కరినీ షాక్‌కి గురి చేసింది. అయితే విడాకులు తన జీవితంలో సంతోషానికి స్వస్తిపలికే అవకాశం లేదని.. ఒక వివాహంలో తన ప్రిన్స్ ఛార్మింగ్ దొరకకపోతేనేం.. మరోసారి తప్పక దొరుకుతాడని భావించింది సౌందర్య. అందుకే మరోసారి వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకుంది.

నటుడు, ఫార్మా కంపెనీ అధినేత విశాగన్ వనంగమూడిని (Vishagan) పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు అందరికీ తెలిసేలా గ్రాండ్‌గా వివాహం చేసుకొని విడాకులు తీసుకోవడం, రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదని తనలాంటి సాధారణ అమ్మాయిలకు చాటి చెప్పింది సౌందర్య. తన పెళ్లి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మదిలోని భావాలను పంచుకున్న సౌందర్య విశాగన్ మంచితనం గురించి.. తన కొడుకు వేద్‌తో విశాగన్‌కి ఉన్న బంధం గురించి చెప్పుకొచ్చింది సౌందర్య.

fdfe

“నా పెళ్లికి నా కంటే ముందు వేద్ అనుమతి తీసుకున్నా. మొదటిసారి తన ఫొటోను వేద్‌కి చూపించి ‘డాడీ ఎలా ఉన్నారు’ అని అడిగాను. తనని చూడగానే వేద్ ఇష్టపడ్డాడు. విశాగన్‌తో మాట్లాడిన తర్వాత వాళ్లిద్దరూ నాకంటే క్లోజ్‌గా అయిపోయారు. విశాగన్ వేద్‌తో చాలా సన్నిహితంగా, ప్రశాంతంగా ఉంటారు.

ADVERTISEMENT

విశాగన్ దగ్గర ఉంటే వేద్ చాలా సౌకర్యంగా ఫీలవుతాడు. సురక్షితంగా ఫీలవుతాడు. ఒక అమ్మగా నాకు అంతకంటే కావాల్సిందేముంటుంది? అంతేకాదు.. విశాగన్ నన్ను పెళ్లి చేసుకోవడానికి వేద్ పర్మిషన్ కూడా అడిగాడు. నేను మీ అమ్మను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. నీకు నేను నాన్నగా ఓకేనా? అని అడిగాడు. ఇలా చెబుతున్నప్పుడు నేను వీడియో కూడా తీశాను. ఆ వీడియోని నేను వేద్ పెద్దయ్యాక చూపించాలనుకుంటున్నా..” అంటూ వివరించింది.

ఇదొక్కటే కాదు.. తమ పెళ్లిలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది సౌందర్య. “మా పెళ్లి సమయంలో మేమందరం ముహూర్తానికి మండపానికి వెళ్లిపోయాం. కానీ వేద్ రావడం కాస్త ఆలస్యమైంది. ఇలాంటి సందర్భంలో ముహూర్తం సమయం అయినా సరే.. వేద్ మండపానికి వచ్చేవరకూ తాను తాళి కట్టనని చెప్పేశారు విశాగన్. మా అందరికీ టెన్షన్ పెరిగిపోతోంది.

ఫర్వాలేదు తాళి కట్టు అంటూ చుట్టూ ఉన్నవారందరూ చెబుతున్నా తను వినలేదు. అప్పుడు విశాగన్ నా వైపు తిరిగి ముహూర్తం ఉన్నా లేకపోయినా నేను నీ మెడలో తాళి కడతాను. కానీ వేద్ వచ్చిన తర్వాతే.”. అంటూ చెప్పాడు. మా బిడ్డ ఈ వేడుకను చూసి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలని మేం కోరుకున్నాం. అలాగే జరిగింది.. అంటూ ఆనందం వ్యక్తం చేసింది.

gg 1220955

ADVERTISEMENT

ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాగన్ వేద్ గురించి మాట్లాడుతూ “నేను తనని మొదటిసారి కలిసినప్పుడు తను చాలా కామ్‌గా ఉన్నాడు. అందుకే తనతో మాట్లాడడం నాకు చాలా సులువుగా అనిపించింది. తను నాతో చాలా క్లోజ్‌గా ఉంటాడు. తను నన్ను నాన్నా అని పిలుస్తున్నప్పుడు నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఒక బాధ్యతాయుతమైన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇక సౌందర్య ఎవరినైనా ప్రేమిస్తే మనస్పూర్తిగా హద్దులు లేకుండా ప్రేమిస్తుంది. తను చాలా రొమాంటిక్ కూడా..” అంటూ తన కుటుంబం గురించి చెప్పాడు.

2010లో అశ్విన్ రామ్ కుమార్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది సౌందర్య. వీరిద్దరికీ జన్మించిన బిడ్డే వేద్ క్రిష్ణ. మనస్పర్థల కారణంగా 2017లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత తాజాగా ఆమె విశాగన్ వెనంగమూడిని వివాహమాడింది. వీరిద్దరి వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 11న జరిగిన సంగతి తెలిసింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కి సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ వ‌ధువులు త‌మ భ‌ర్త‌ల‌కు తాళి క‌ట్టారు.. కానీ ఇది “జంబ‌ల‌కిడిపంబ” కాదు..!

ADVERTISEMENT

తన పెళ్లిలో.. తనే డీజేగా మారిన ఓ పెళ్లి కూతురు కథ ఇది..!

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నిఖాతో ఒక్క‌టైన ప్రేమ‌జంట.. ఆర్య‌ – సాయేషా..!

17 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT