(South Indian Actress Meena to act in Rajinikanth’s Film)
తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకున్న నటి మీనా. తెలుగులో సీతారామయ్య గారి మనవరాలు, స్నేహం కోసం, అబ్బాయి గారు, ముఠా మేస్త్రీ, సూర్యవంశం లాంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే తమిళంలో కూడా రజనీకాంత్ సరసన ఆమె నటించిన “ముత్తు” చిత్రం.. తనకు కోలీవుడ్‌లో మంచి స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. చిత్రమేంటంటే ఒకప్పుడు “అన్బుల్ల కేట్ట కురల్” చిత్రంలో రజనీ కుమార్తెగా నటించిన మీనా ఆ తర్వాత.. ఆయన పక్కన హీరోయిన్‌గా నటించడం విశేషం.
రజనీకాంత్ కుమార్తె సౌందర్యపై.. నెటిజన్లు ఎందుకు ఫైర్ అయ్యారంటే..?
2014లో వెంకటేష్ సరసన మీనా నటించిన “దృశ్యం” చిత్రం.. సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకి ఒరిజనల్ వెర్షన్ అయిన మలయాళ చిత్రంలో కూడా మీనాయే కథానాయికగా నటించడం గమనార్హం. “సాక్ష్యం” ఆమె తెలుగులో నటించిన ఆఖరి చిత్రం. అంతకు ముందు “మామ మంచు అల్లుడు కంచు” చిత్రంలో మోహన్ బాబు సరసన కూడా నటించింది మీనా. ఈ మధ్యకాలంలో సినిమాలు పెద్దగా చేయకపోయినా.. టీవీషోలకు న్యాయనిర్ణేతగా, వ్యాఖ్యతగా మీనా బహుముఖ పాత్రలు పోషించడం విశేషం.
సీతారామయ్య గారి ‘మనవరాలి’కి.. పుట్టినరోజు శుభాకాంక్షలు ..!
జెమిని టివిలో ప్రసారమైన “అనుబంధాలు” సీరియల్.. మీనాకు బుల్లితెర నాయికగా కూడా మంచి ఫాలోయింగ్‌నే తీసుకొచ్చింది. సూపర్ కుటుంబం, ఎక్స్‌ట్రా జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ ఈమెకు మరింత పేరు తీసుకొచ్చాయి. అయితే ప్రస్తుతం మీనా.. రజనీకాంత్ నటిస్తున్న ఓ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటిస్తోందని టాక్. ఈ చిత్రంలో ఆమె నెగటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో నటిస్తుందని సమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు. “నరసింహ” చిత్రంలో రమ్యక్రిష్ణ పోషించిన నీలాంబరి స్థాయిలో ఈ పాత్ర ఉంటుందని.. ఒక రకంగా చెప్పాలంటే అసలు సిసలైన లేడీ పాత్రని మీనా పోషించే అవకాశముందని కొందరు అంటున్నారు.
1982లో “నిజంగల్” అనే తమిళ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన మీనా.. ఆ తర్వాత దాదాపు పాతిక చిత్రాలలో బాలనటిగా కెరీర్ కొనసాగించింది. 1990లో తెలుగులో “నవయుగం” చిత్రంతో కథానాయికగా తన ప్రస్థానాన్ని కొనసాగించింది. అలాగే “పర్దా హై పర్దా” అనే హిందీ చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటించింది. సీతారామయ్య గారి మనవరాలు, రాజేశ్వరి కళ్యాణం చిత్రాలకు తెలుగులో ఉత్తమ నటిగా నంది పురస్కారాలు కైవసం చేసుకున్న మీనా.. తమిళనాడు ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక కళైమామణి అవార్డును కూడా పొందింది.
తను వచ్చేవరకూ తాళి కట్టనన్నాడు : సౌందర్యా రజనీకాంత్
ఇటీవలే “కరోలిన్ కామాక్షి” అనే వెబ్ సిరీస్‌లో ఫుల్ మాస్ ఓరియంటెడ్ క్యారెక్టర్‌లో దర్శనమిచ్చిందట మీనా. ప్రస్తుతం మీనా సైన్ చేసిన చిత్రం రజనీకాంత్ నటిస్తున్న 168వ చిత్రం కావడం విశేషం. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే.. ఆయన మురుగదాస్ దర్శకత్వంలో “దర్బార్” చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రజనీ పాత్ర పేరు “ఆదిత్య అరుణాచలమ్”. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలను తీసుకుంది. 2020లో సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.