ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
నా కథ : నా పెళ్లి అలా జరుగుతుందని.. నేను కలలో కూడా ఊహించలేదు

నా కథ : నా పెళ్లి అలా జరుగుతుందని.. నేను కలలో కూడా ఊహించలేదు

“జీవితం ఒక్కోసారి మనల్ని అనుకోని ప్రదేశాలకు తీసుకెళ్తుంది. తొలుత కోరుకున్నది అందేలా చేస్తుంది. తర్వాత ఎంతో ఇష్టపడి ప్రేమించిన వ్యక్తులకు.. వారినే దక్కకుండా చేస్తుంది. కష్టపడిన కొందరికి ఫలితం దక్కదు. కానీ ఆఖరికి దారి దొరకక వెతుకుతూ ఉండేవారిని మాత్రం గమ్యం చేరుస్తుంది” అంటూ తన జీవితంలో జరిగిన అరుదైన సంఘటన గురించి చెప్పుకొచ్చింది ఓ అమ్మాయి. ప్రేమంటే ఏంటో తెలియకుండా పెళ్లి చేసుకున్నా.. పెళ్లి తర్వాత ప్రేమలో మాత్రం మునిగిపోయానని చెబుతోంది.

ప్రతి అమ్మాయి యుక్తవయసు వచ్చినప్పటి నుంచి తన పెళ్లి (marriage) గురించి ఎన్నో కలలు కంటుంది. తన కలల రాజకుమారుడు తనను వివాహమాడి జీవితాంతం ఆనందంగా చూసుకుంటాడని భావిస్తుంది. కానీ నా జీవితంలో అలాంటివేవీ లేవు. మా ఇంట్లో నేను అక్క, ఇద్దరమే పిల్లలం. అక్క చూసేందుకు బాపూ బొమ్మలా ఎంతో అందంగా ఉంటుంది. నేను మాత్రం నల్లగా ఉంటాను. దీనివల్ల నేను చిన్నతనం నుంచీ చుట్టుపక్కల వారితో మాటలు పడేదాన్ని. “ప్రతి ఒక్కరూ.. ఇలా చేస్తే తెల్లబడతావు” అంటూ నా రంగును ఎత్తిచూపేవారే. వారి మాటలతో నా మనసు బాగా నొచ్చుకునేది. దానికి తోడు మా అమ్మకు కూడా అక్క అంటేనే చాలా ఇష్టం. అలా అందరి మాటలు పడుతూనే.. చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరాను.

ఓరోజు మా బంధువు ఒకాయన అక్క కోసం ఓ మంచి సంబంధం తీసుకొచ్చాడు. పెళ్లి కొడుకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. కట్నం, లాంఛనాలు ఏమీ లేకపోయినా ఫర్వాలేదు. అబ్బాయికి వేరే రాష్ట్రానికి ట్రాన్స్ ఫర్ అయింది కాబట్టి.. అక్కడికి వెళ్లేలోగా పెళ్లి చేయాలని మాత్రం వారు కోరారు. మూడు రోజుల తర్వాత వాళ్లు.. అక్కను చూసుకోవడానికి వచ్చారు. నేను కూడా వెళ్లి అక్కడేం జరుగుతుందో చూడాలనుకున్నా. కానీ నాన్న వద్దన్నారు. దాంతో నాకు బాధనిపించి ఆఫీస్‌కి వెళ్లిపోయాను. పెళ్లి కొడుకు, అక్క ఇష్టపడ్డారు. దీంతో అక్క పెళ్లి నెల రోజుల్లోనే కుదిరింది. పెళ్లి కుదరడంతో అమ్మానాన్న.. ఇద్దరూ హడావిడిగా వివాహానికి అన్నీ సిద్ధం చేయడంలో మునిగిపోయారు. బంధువుల రాకడ కూడా ప్రారంభమైంది.

ADVERTISEMENT

నాన్న తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు.. ఐదు లక్షలు అప్పు చేసి మరీ పెళ్లి పనులు చేస్తున్నారు. ఒకరోజు అందరం కలిసి షాపింగ్ చేసి వచ్చి కూర్చొని ఆనందంగా మాట్లాడుకుంటున్నాం. అంతలోనే అక్కకి రక్తపు వాంతులు అయ్యాయి. చూస్తుండగానే కళ్లు తేలేసి ఊపిరి ఆడనట్లుగా తయారైంది. మా అందరికీ చాలా భయమేసింది. అప్పటికి పెళ్లికి ఇంకా కేవలం పది రోజులు మాత్రమే గడువుంది. వెంటనే ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. రాత్రంతా ఆమెను ఐసీయూలో ఉంచారు. తర్వాత రకరకాల పరీక్షలు చేసి.. అక్క‌కి బ్లడ్ క్యాన్సర్ అని. అది. ఆఖరి దశలో ఉంది కాబట్టి.. ఆమె మరికొన్ని నెలల కంటే ఎక్కువకాలం జీవించదని డాక్టర్లు చెప్పడంతో అందరం గుండెలు పగిలేలా ఏడ్చాం. మరో నాలుగైదు రోజుల్లో అక్కని డిశ్చార్జ్ చేశారు.

అక్క ఇంటికి రాగానే.. పెళ్లి కొడుకు వాళ్లకు ఫోన్ చేసి.. వాళ్లను పిలిపించి జరిగిందంతా చెప్పేశారు. అప్పుడు నేను ఆఫీస్‌కి వెళ్లాను. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేసరికి అంతా సంతోషంగా ఉన్నారు. నేను అది అస్సలు ఊహించలేదు. ఆ ఆనందానికి కారణం అక్క నాకు చెప్పింది. పెళ్లి క్యాన్సిల్ కాలేదని.. అయితే తనకు బదులు నా పెళ్లి జరుగుతుందని చెప్పుకొచ్చింది. మా అక్క తన ఆఖరి కోరిక “నా పెళ్లి చూడడం అని.. నన్ను వధువుగా చూసి తను సంతోషంగా చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని” వారికి చెప్పిందట. పెళ్లి కొడుకు, వాళ్ల తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడంతో.. మా ఇంట్లో వాళ్లందరూ ఆనందించారు. అన్నీ ఎంత తొందరగా జరిగిపోయాయంటే.. నాకు పెళ్లి కుదిరిందని నాకే నమ్మకం కుదరలేదు.

చూస్తుండగానే నా పెళ్లి జరిగిపోయింది. నేను అత్తగారింటికి వెళ్లేటప్పుడు అక్క చాలా ఏడ్చింది. అప్పుడు నాక్కూడా బాధనిపించింది. దేవుడు ఒక్కోసారి మన జీవితాలతో ఆటలాడుకుంటాడు. తను ప్రేమించిన వ్యక్తిని చెల్లెలికిచ్చి పెళ్లి చేయడం ఏ అమ్మాయికైనా కష్టమైన విషయమే. కదా. అలా నేను అత్తారింటికి చేరుకున్నా. నేను నా భర్తను అంతకుముందు కేవలం ఒకటి, రెండు సార్లు మాత్రమే చూశాను. అది కూడా సరిగ్గా చూడలేదు. తను కూడా నన్ను చూడలేదనే భావించా.

ADVERTISEMENT

అత్తారింట్లో నా ప్రవేశం చాలా ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకలన్నీ పూర్తయ్యాక.. నేను మా అత్తగారు, మా వారు ముగ్గురమే మిగిలాం. శోభనం రోజు నేను గదిలోకి వెళ్లేసరికి.. ఆయన బెడ్ మీద పడుకొని నిద్రపోతుండడం చూశాను. నాకు చాలా భయమేసింది. అయితే నేను లోపలికి వెళ్లిన తర్వాత.. తను నా దగ్గరికి వచ్చి మాట్లాడిన మాటలు.. తన పట్ల నాకు ఎంతో గౌరవాన్ని పెంచాయి. అప్పుడే నేను తనని మొదటిసారి దగ్గరగా చూశాను. తను చాలా అందంగా ఉన్నాడు. “నేను అందంగా ఉండననే ఫీలింగ్‌”తో తన ముందు తల దించుకొని నిలబడిపోయాను.

అప్పుడు తను చెప్పాడు. “భయపడకు.. మనిద్దరికీ అసలు ఒకరి గురించి మరొకరికి ఏమీ తెలీదు. మన పెళ్లి అంత హడావిడిగా జరిగిపోయింది. అందుకే మనం ముందు స్నేహితులుగా మారదాం. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ (love) పుట్టాక.. భార్యాభర్తల్లా కలిసి జీవిద్దాం. దీనివల్ల ఇద్దరికీ ఇబ్బందిగా అనిపించదుష అని తను చెబుతుంటే అది నిజమా? కలా? అస్సలు అర్థం కాలేదు. నన్ను ప్రేమించే వ్యక్తి కూడా దొరుకుతాడని.. నేను అస్సలు ఎప్పుడూ అనుకోలేదు.

కానీ జీవితం.. ఇలా నాకు అనుకోకుండా ప్రేమించే భర్తను అందించింది. ఆ తర్వాత కొన్నాళ్లు.. మేం స్నేహితుల్లా కలిసిపోయాం. కొన్ని నెలల పాటు ప్రేమించుకున్నాక.. ఇద్దరం ఒక్కటయ్యాం. అప్పుడే నాకు అర్థమైంది. ప్రేమ అనేది కేవలం… పెళ్లికి ముందే ఉండాలని రూలేం లేదు. పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రేమించుకోవచ్చు అని. దానికి నా జీవితమే ఉదాహరణ కావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

18 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT