ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
మీ బాయ్ ఫ్రెండ్‌కి గడ్డం ఉందా? అయితే ముద్దుపెట్టే ముందు మరోసారి ఆలోచించండి..!

మీ బాయ్ ఫ్రెండ్‌కి గడ్డం ఉందా? అయితే ముద్దుపెట్టే ముందు మరోసారి ఆలోచించండి..!

చాలామంది అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్ (Boyfriend) లేదా భర్తలో నచ్చని అంశం ఏదైనా ఉందా అంటే అది గడ్డం (Beard) అనే చెబుతుంటారు. ఎప్పుడూ గడ్డంతో కనిపించేవాళ్లకు దాన్ని తీసేయమని తగాదాలు పెట్టుకోవడం కూడా మనం చూస్తుంటాం.

అయినా సరే.. గడ్డాన్ని ఎంతో ఇష్టపడే కొందరు అబ్బాయిలు.. దాన్ని తీయడానికి ససేమిరా అనడం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్‌ని గడ్డం తీయమనడానికి మరో కారణం కూడా దొరికేసింది. ఈసారి పరిశోధనల ఫలితం కాబట్టి.. అంత సులువుగా వారు మీకు నో అనే సమాధానం చెప్పలేరు కూడా. అందుకే ఇది చూపించి గడ్డం తీయమని మరోసారి చెప్పి చూడండి మరి..

f

అసలు విషయానికొస్తే అబ్బాయిల గడ్డం వారి శరీరంలోని మిగిలిన భాగాలన్నింటికంటే తక్కువ శుభ్రంగా ఉంటుందట. ఈ విషయాన్ని పరిశోధకులే చెబుతున్నారు. రోజూ స్నానం చేసే సమయంలో శుభ్రం చేసుకున్నా వారి గడ్డంలో మాత్రం బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎంతగా అంటే మన కుక్కల వెంట్రుకల కంటే అబ్బాయిల గడ్డంలోనే ఎక్కువ సూక్ష్మ క్రిములు ఉంటాయట.

ADVERTISEMENT

స్విట్జర్లాండ్‌లోని హిర్స్ లాండెన్ క్లినిక్ నిర్వహించిన పరిశోధనల్లో తేలిన ఈ ఫలితాన్ని అక్కడి ఛీఫ్ ప్రొఫెసర్ ఆండ్రియాస్ గట్జీట్ వివరించారు. దీని ప్రకారం మగవాళ్ల గడ్డం నుంచి తీసుకున్న శాంపిల్స్‌లో.. కుక్క వెంట్రుకల మధ్య నుంచి తీసుకున్న శాంపిళ్ల కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉందట. అంటే ఈ పరిశోధన ప్రకారం గడ్డం ఉన్నవారి కంటే కుక్కలే ఎక్కువ శుభ్రంగా ఉంటున్నాయన్నమాట.

అయితే ఈ సర్వే నిర్వహించింది అబ్బాయిల్లో శుభ్రత గురించి తెలుసుకోవడం గురించి మాత్రం కాదు. కుక్కల్లో వచ్చే వ్యాధులు మనుషులకు కూడా వ్యాపిస్తాయా? అన్న కోణంలో పరిశోధన నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలకు కుక్కల కంటే ఎక్కువ అపరిశుభ్రంగా ఉన్నది మనుషులే అని తేలిందట.

ఎంఆర్ఐ స్కానింగ్ చేసి నిర్వహించిన ఈ పరిశోధనల కోసం వివిధ జాతులకు చెందిన ముప్ఫై కుక్కల నుంచి, 18 మంది అబ్బాయిల నుంచి శాంపిల్స్ సేకరించారట. దీనికోసం వారి మెడ భాగం దగ్గర రుద్ది తీసిన కాటన్ స్వాబ్‌ని మొదట ఎంఆర్ఐ చేసి.. తర్వాత వివిధ పరీక్షలు నిర్వహించారట.

giphy

ADVERTISEMENT

ఈ పరిశోధనల్లో భాగంగా పద్దెనిమిది నుంచి డెబ్భై ఆరు సంవత్సరాల మధ్య ఉన్న  గడ్డమున్న పురుషుల్లో సూక్ష్మ క్రిముల సంఖ్య చాలా ఎక్కువగా ఉందట. అంతేకాదు.. ముప్ఫై రకాల్లో కేవలం 23 రకాల కుక్కల్లో అచ్చం అలాంటి రకాలైన సూక్ష్మ జీవులే కనిపించాయట.

మొత్తంగా చెప్పాలంటే అబ్బాయిల గడ్డాలు సూక్ష్మ జీవులకు ఆవాసాలు. ఎప్పటికప్పుడు అందులో బ్యాక్టీరియా సంఖ్య పెరగకుండా రకరకాలుగా శ్రద్ధ వహించడం లేదా గడ్డం తీసేసి నున్నగా షేవింగ్ చేసుకోవడం మాత్రమే వారి ముందున్న రెండు మార్గాలు. మరి, ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటాడో మీ బాయ్ ఫ్రెండ్‌ని అడిగి తెలుసుకోండి. కానీ ఇదంతా వింటుంటే వింటుంటే నో షేవ్ నవంబర్ చాలా అనారోగ్యకరమైన పద్ధతి అనిపిస్తోంది కదూ..

ఇంత‌టి అద్భుత‌మైన సమాచారాన్ని అందించే POPxo యాప్‌ని మీరు ఇంకా డౌన్‌లోడ్ చేసుకోలేదా? అయితే వెంట‌నే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ల‌లో డౌన్‌లోడ్ చేసుకోండి.

POPxo ప్ర‌స్తుతం ఆరు భాష‌ల్లో అందుబాటులో ఉంది. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, త‌మిళం, మ‌రాఠీ మ‌రియు బెంగాలీ.

ADVERTISEMENT

అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.

ఇవి కూడా చదవండి.

మగవాళ్ల గురించి.. ఈ విషయాలు పెళ్లి తర్వాతే తెలుస్తాయి..!

“కోపమా నాపైనా.. ఆపవా ఇకనైనా..” అనే ఫీలింగ్ తనకు కలిగేదెప్పుడు..?

ADVERTISEMENT

బంధం బలపడేందుకు.. ఈ అడ్వెంచర్లు ఒక్కసారైనా చేయాల్సిందే..!

17 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT