ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
బ్రేకప్ తర్వాత మళ్లీ తిరిగి కలిస్తే?  ఈ కథలు.. ప్రేమ పై మీ నమ్మకాన్ని మరింత పెంచుతాయి

బ్రేకప్ తర్వాత మళ్లీ తిరిగి కలిస్తే? ఈ కథలు.. ప్రేమ పై మీ నమ్మకాన్ని మరింత పెంచుతాయి

ఇద్దరు వ్యక్తులు ఏదో విషయమై గొడవపడి విడిపోయినంత మాత్రాన.. వారు జీవితంలో మరెప్పుడూ కలవరని లేదు. వారు తిరిగి ప్రేమలో పడరని కూడా అనుకోలేం. ఎంత గాఢమైన బంధమైనా.. అప్పుడప్పుడు పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది. అవే గనుక తొలిగి వారిని ప్రేమ మరోసారి తలుపు తెరిచి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది?  బ్రేకప్ (Breakup) అయ్యాక కూడా.. మరోసారి తిరిగి అదే వ్యక్తితో ప్రేమలో పడిన వారి కథలను మనం ఇప్పుడు చూద్దాం. ప్రేమ‌లోని మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం. తామిద్దరి మధ్యనున్న ప్రేమ ఇంకా అంతం కాలేదని గుర్తించి.. నిజమైన ప్రేమంటే ఇదేనని నిరూపించిన ఈ కథలు (Love Tales) మీకోసం..

సెకండ్ ఛాన్స్ ప్రేమ..

మిగిలిన జంటల్లా కాకుండా మేం మంచి స్నేహితుల్లా విడిపోయాం. అదే స్నేహంతో అప్పుడప్పుడు టచ్‌లో కూడా ఉండేవాళ్లం. మేం విడిపోయిన మూడేళ్లకు.. తను మా నగరానికి ఏదో పని మీద వచ్చాడు. ఫోన్ చేసి వీలుంటే కలుద్దామని అడిగాడు. అప్పటికే నాకు మరొకరితో పరిచయం ఏర్పడింది. తనతో జీవితాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నాను. అతని జీవితంలోకి కూడా మరో అమ్మాయి వచ్చింది. అయినా కలవాలని అనుకున్నాం. అయితే స్నేహపూర్వకమైన మా మీటింగ్ క్యాజువల్‌గానే ఉంటుందని అనిపించింది. అందుకే వెళ్లాను. కానీ అతనితో కలిసి మాట్లాడగానే నా మనసు మారిపోయింది. తను ఇదివరకటి వ్యక్తి కాదనిపించింది. అనేక విషయాలు చాలా సంతోషంగా మాట్లాడుకున్నాం. తను ఇక్కడికి ఓ పని మీద వచ్చాడని.. హోటల్‌లో దిగాలని చెప్పాడు. కానీ నేను ఏమాత్రం ఆలోచించకుండా మా ఇంట్లో ఉండమని చెప్పా.

రెడ్ లైట్ ఏరియా అమ్మాయిని.. అమెరికన్ యూనివర్సిటీకి చేర్చిన ప్రేమ..!

ADVERTISEMENT

తను మా ఇంట్లోకి అడుగుపెట్టిన నిమిషం మొదలు.. గతంలో మా మధ్య జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చేవి. మేం మొదటిసారి గోవా వెళ్లిన రోజు, తను నన్ను వాళ్ల అమ్మకు పరిచయం చేసిన రోజు, ఇద్దరం కలిసి ఒకే ప్లేట్‌లో తిన్న క్షణాలు వంటివన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు తను మా ఇంట్లో ఉన్న ఈ మూడు రోజులు నాకు చాలా విషయాల్లో తోడుగా నిలిచాడు. సాయం చేశాడు. తను వెళ్లడానికి ముందు రోజు రాత్రి భోజనం చేస్తూ.. ఎన్నో విషయాలను పంచుకున్నాం. మరోసారి మా బంధం గురించి ఆలోచిస్తే బాగుంటుందని అనిపించింది. అదే విషయం తనని అడిగాను. తను కూడా ఆ విషయమే ఆలోచిస్తున్నానని తెలిపాడు.  మా బంధాన్ని కొనసాగించాలంటే.. అప్పటికన్నా ఇఫ్పుడు మేం ఇంకా ఎక్కువ కష్టపడాలని మాకు తెలుసు. మేమిద్దరం దానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే మళ్లీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికి ఈ సంఘటన జరిగి మూడేళ్లు. అయినా మా బంధం ఆనందంగా సాగిపోతోంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం.

ప్రేమలో ప్రతి విషయం సాధ్యమే..

జీవితంలో కొన్నింటి కోసం ఎంత పోరాడినా తప్పు లేదు. అందులో  ప్రేమ కూడా ఒకటి. మేం ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నాం. అయితే మా కుటుంబం వల్ల మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. తను వేరే మతానికి చెందిన వాడు. అందుకే మా ఇంట్లో వాళ్లు మా ప్రేమకు అంగీకారం తెలపలేదు. నా తల్లిదండ్రులు నన్ను విదేశాలకు చదువుకోవడానికి పంపించారు. నేను అతన్ని మర్చిపోయి.. నా జీవితాన్ని తిరిగి కొత్తగా ప్రారంభించాలన్నది వారి కోరిక. కానీ నేను అతన్ని మర్చిపోలేకపోయాను. మా అమ్మ నా ఫోన్ నంబర్ మార్చేసింది. నా ఫేస్‌బుక్ అకౌంట్ డీ యాక్టివేట్ చేయించింది. కానీ నేను మాత్రం నా బాయ్ ఫ్రెండ్‌ని మర్చిపోలేకపోయాను.

టెలిఫోన్ బూత్ నుంచి తనకు ఫోన్లు చేసేదాన్ని. తను కూడా ఏమాత్రం ఆశ వదులుకోలేదు. మా ప్రేమను కొనసాగించేందుకు తను కూడా ఆసక్తి చూపించాడు. వేరే దేశంలో ఉన్నా.. ఎన్ని ఇబ్బందులెదురైనా మా ప్రేమకు ఏవీ అడ్డు కాలేదు. మా ఇద్దరి ఇళ్లలో ఈ విషయం తెలిశాక గొడవలు జరిగాయి. మేమిద్దరం అవన్నీ భరించాం. మావాళ్లు అతన్ని కొట్టారు. కేసు పెట్టారు. అన్నీ చేశారు. దాంతో మా ఇంట్లో వాళ్లకు ఫోన్ చేశాను. “తనకి ఇంకేదైనా జరిగితే నేను మరోసారి ఇంటికి రాను. వాళ్ల ముఖం కూడా చూడనని” చెప్పాల్సి వచ్చింది.

అంతేకాదు.. తనని తప్ప నేను ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని కూడా తెగేసి చెప్పేశాను. వాళ్లు దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. అయితేనేం ఆఖరికి అర్థం చేసుకున్నారు. రెండు కుటుంబాలు కలిసి మా పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. ఈరోజు మేం పెళ్లి చేసుకొని చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాం. నా తల్లిదండ్రులు దీనికి మనస్పూర్తిగా ఒప్పుకోలేదు. కానీ తను నన్ను చూసుకునే విధానాన్ని బట్టి.. వారి ఆలోచనల్లో మార్పు వస్తుందేమోనని భావిస్తున్నా.

ADVERTISEMENT

అది మా సంతోషాల పొదరిల్లు..

మా ప్రేమ అచ్చం పాతకాలం నాటి సినిమా కథలాగే సాగింది. ఒక అమ్మాయి అబ్బాయిని కలవడం.. తనతో వెంటనే ప్రేమలో పడిపోవడం.. తర్వాత ఇద్దరూ ఒక్కటిగా జీవించాలని భావించడం.. మా కథ కూడా దాదాపు ఇలాంటిదే. నేను రెండు సంవత్సరాల పాటు ప్రతిక్షణం తనతోనే గడిపాను. తనే నా జీవితమని అనుకున్నా. కానీ కాలేజీలో నుండి బయటకు వచ్చాక.. పరిస్థితి అంతా మారిపోయింది. యూనివర్సిటీ గోడల బయట ఇంత పెద్ద ప్రపంచం ఉందా? అనిపించింది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లిపోయాను. దాంతో మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయినా ఈ గ్యాప్ మాకు పెద్ద ఇబ్బంది అవుతుందని అనిపించలేదు.

కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్‌లో ఉన్న ఇబ్బందులు ఆ తర్వాతే అర్థమయ్యాయి. నాకంటూ ఎవరూ తెలియని ఆ కొత్త నగరంలో..  ఓ చిన్న ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను.  ఓ అద్భుతమైన కెరీర్ ఏర్పాటు చేసుకోవడానికి చాలా కష్టపడి పనిచేశాను. “ఎన్ని కష్టాలు ఎదురైనా నా కెరీర్‌ను నిలబెట్టుకోవాలి.. అన్నింటా నేనే ముందుండాలి” అని నేను భావించేదాన్ని. ఈ క్రమంలో నాకు చాలామంది స్నేహితులు దూరమయ్యారు. ఆ తర్వాత కుటుంబానికి కూడా సరైన సమయం కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది.  తను కూడా కొద్దికొద్దిగా నా నుంచి దూరమయ్యాడు.

నా కథ : నా పెళ్లి అలా జరుగుతుందని.. నేను కలలో కూడా ఊహించలేదు

నా కెరీర్ కోసం కొన్నింటిని వదులుకోవాలేమో? అని అనిపించింది. కానీ రానురాను నన్ను ఒంటరితనం ఆవరించింది. దాంతో పని మీద ఆసక్తి కూడా తగ్గిపోయింది. కొన్నాళ్లకు మానసికంగా కుంగిపోయాను. డిప్రెషన్‌తో బాధపడ్డాను. బెంగళూరులో ఉద్యోగానికి రాజీనామా చేసి.. హైదరాబాద్ వచ్చి ఇక్కడే పనిచేయడం ప్రారంభించాను. నా కుటుంబంతో గడపసాగాను. అలా మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఆ తర్వాత చాలామంది అబ్బాయిలు నా జీవితంలోకి రావాలని చూశారు.

ADVERTISEMENT

కానీ ఎందుకో వాళ్లలో నిజాయతీని నేను చూడలేకపోయాను. ఇదే సమయంలోనే తను మళ్లీ నా జీవితంలోకి అడుగుపెట్టాడు. ఎప్పుడో కాలేజీలో ఆగిపోయిన ప్రేమకథ మళ్లీ ప్రారంభమైంది. అదే ప్రేమ ఇప్పుడు మరింత పరిపక్వతతో ముందుకు సాగింది. కొన్ని నెలలకే మేం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికి మా పెళ్లయి కొన్ని నెలలు గడిచింది. ఆ ఆనంద క్షణాలను ఇప్పటికీ నేను మర్చిపోలేను.

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే  100% సిద్ధంగా ఉన్నాయి… అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి 

06 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT