ADVERTISEMENT
home / Bollywood
తమ‌న్నా ఈ న‌టుడితో.. డేటింగ్‌కి వెళ్లాల‌ని అనుకుందట. ఎందుకో తెలుసా?

తమ‌న్నా ఈ న‌టుడితో.. డేటింగ్‌కి వెళ్లాల‌ని అనుకుందట. ఎందుకో తెలుసా?

తమ‌న్నా భాటియా (Tamannaah bhatia).. శ్రీ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ప్ర‌స్తుతం బాలీవుడ్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న క‌థానాయిక‌. బాహుబ‌లి (Bahubali) సినిమాతో త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ.. ఇటు సౌతిండియ‌న్ సినిమాల‌తో పాటు అటు బాలీవుడ్‌లోనూ న‌టిస్తూ త‌న‌కంటూ మంచి గుర్తింపు సాధిస్తోంది. తాజాగా ఈ అమ్మ‌డు విక్ట‌రీ వెంక‌టేష్ స‌ర‌స‌న‌ న‌టించిన ఎఫ్‌2 (ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్) చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన‌ సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం ఆమె న‌టించిన క్వీన్ తెలుగు రీమేక్ ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి, అభినేత్రి సినిమా పార్ట్ – 2 అయిన దేవి – 2 సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. వీటితో పాటు చిరంజీవి స‌ర‌స‌న సైరా న‌ర‌సింహా రెడ్డి చిత్రంలోనూ.. త‌మిళంలో సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న సినిమాలోనూ న‌టిస్తోందీ బ్యూటీ.

ఇలా వ‌రుస సినిమాల‌తో త‌న‌కంటూ గుర్తింపు సంపాదించుకుంటోన్న ఈ బ్యూటీ.. పెళ్లి గురించి మాత్రం ఏమాత్రం ఆలోచించ‌ట్లేదట‌. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది త‌మ‌న్నా.

44535183 294344464753532 8078077672460523792 n 2762087

ADVERTISEMENT

సినిమాల్లోకి రావాల‌ని త‌న‌కి చిన్న‌త‌నం నుంచి కోరిక ఉండేద‌ని చెప్పిన త‌మ‌న్నా.. అదే త‌న‌ని ఈ స్థాయికి తీసుకొచ్చింద‌ని.. అయితే దీనికి త‌న శ్ర‌మ‌తో పాటు వ‌చ్చిన అవ‌కాశాలు కూడా కార‌ణం అని చెబుతోంది. సినిమా ఏ భాష‌లో చేసినా మంచి క‌థ ఉన్న చిత్రాల‌ను ఎంచుకొని వాటిలో న‌టించాల‌న్న‌దే త‌న కోరిక‌ట‌. అందుకే బాహుబ‌లి త‌ర్వాత సైరా లాంటి సినిమాను ఎంచుకున్నాన‌ని చెబుతుందీ అందాల రాశి. ఇందులో త‌మ‌న్నా లుక్ చాలా డిఫ‌రెంట్‌గా ఉండ‌బోతోంద‌ట‌.

అది ఎలా ఉంటుంద‌న్న‌ది సినిమా చూసి తెలుసుకోవాల్సిందేన‌ని చెబుతుంది త‌మ‌న్నా. ఇవే కాదు.. బాహుబ‌లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాన‌ని చెప్పే.. త‌మ‌న్నా ఆ త‌ర్వాత మ‌హిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే ఎక్కువ‌గా న‌టిస్తున్నానని అంటోంది.

42080544 289053291697821 2056035677020113177 n 5760809

సినిమాల‌తో పాటు జ్యుయ‌ల‌రీ బిజినెస్‌నీ కొన‌సాగిస్తోన్న త‌మ‌న్నాకు ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌ లేద‌ట‌. దీని గురించి వెల్ల‌డిస్తూ.. పెళ్లి అనే బంధాన్ని నేను చాలా న‌మ్ముతాను. నా మ‌న‌సుకు న‌చ్చిన వ్య‌క్తి దొరికిన‌ప్పుడు పెళ్లి చేసుకోవాల‌ని నేను కూడా ఆశిస్తున్నా. కానీ ఇప్ప‌ట్లో అలాంటి ఆలోచ‌నైతే ఏమీ లేదు. ప్ర‌స్తుతం మూడు భాష‌ల్లో ఎన్నో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా కాబ‌ట్టి ప్రేమ‌కి, పెళ్లికి ఇప్పుడు అంత స‌మ‌యం లేదు.

ADVERTISEMENT

ఆ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌క పెళ్లి చేసుకుంటా. అది కూడా అంద‌రికీ చెప్పే చేసుకుంటా అని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఎవ‌రైనా న‌టుడితో డేటింగ్‌కి వెళ్లాలంటే మాత్రం.. విక్కీ కౌశ‌ల్‌ని ఎంపిక చేసుకుంటాన‌ని చెప్పిన త‌మ‌న్నా.. ఉరి, రాజీ చిత్రాల్లో అత‌డి న‌ట‌న త‌న‌కు బాగా న‌చ్చింద‌ని చెప్పింది.

అంతేకాదు.. మీటూ ఉద్య‌మం గురించి కూడా మాట్లాడిన త‌మ‌న్నా.. ఈ ఉద్య‌మం ముఖ్యోద్దేశ‌మే వివిధ రంగాల‌కు చెందిన మ‌హిళ‌లు తాము ఎదుర్కొన్న అనుభవాల గురించి బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడ‌డం. అలా చేయ‌డానికి ఎంతో ధైర్యం కావాలి. అయితే గ‌త కొన్నాళ్లుగా ఇది కేవ‌లం పాపులారిటీ సంపాదించుకోవడానికి మాత్ర‌మే అన్న‌ట్లుగా మారిపోయింది. ఇది చాలా సీరియ‌స్ విష‌యం దీన్ని మ‌రింత సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది అని వెల్ల‌డించింది త‌మ‌న్నా.

tam 8223318

సైరా చిత్రంలోనూ పోరాట స‌న్నివేశాల్లో పాల్గొన‌నున్న త‌మ‌న్నా.. ఆ త‌ర్వాత సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో విశాల్ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌ట‌. ఆపై మ‌రో సినిమాలో నెగ‌టివ్ రోల్ కూడా చేసేందుకు త‌మ‌న్నా సిద్ధ‌మ‌వుతోంద‌ట‌. ఇలా ప్ర‌తి సినిమాకి ఏదో ఒక వైవిధ్యం ఉండేలా ఎంపిక చేసుకుంటూ త‌న కెరీర్‌ని కొన‌సాగిస్తోందీ మిల్కీ బ్యూటీ.

ADVERTISEMENT

ఇవి కూడా చ‌ద‌వండి. 

లక్ష్మి నాకు ఒక ప్రేరణ.. ఆమె కథ నా మనసుకు దగ్గరైంది : దీపిక ప‌దుకొణె

గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్‌కి ప‌రిచ‌య‌మైన‌ప్పుడు.. ఈ అందాల రాశులు ఎలా ఉన్నారంటే..!

మహేష్ బాబు వర్సెస్ మహేష్ బాబు: క్రేజీ ఫ్యాన్స్ సమక్షంలో.. ప్రిన్స్ విగ్రహం ఆవిష్కరణ..!

ADVERTISEMENT

Images – Instagram.com/VickyKaushal, Instagram.com/TamannaahBhatia

28 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT