ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఈ మోడ్ర‌న్ సీతతో అంత వీజీ కాదండోయ్‌..ఎందుకంటే త‌ను శూర్ఫ‌ణ‌క లాంటిది!

ఈ మోడ్ర‌న్ సీతతో అంత వీజీ కాదండోయ్‌..ఎందుకంటే త‌ను శూర్ఫ‌ణ‌క లాంటిది!

కాజ‌ల్ అగ‌ర్వాల్‌ (Kajal Aggarwal).. ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దం దాటినా త‌న న‌ట‌ప్ర‌తిభ‌తో లెక్క‌లేనంత మంది అభిమానుల‌ను సంపాదించుకుంటూ ముందుకెళ్తోన్న క‌థానాయిక‌. ప్ర‌స్తుతం త‌మిళంలో క్వీన్ రీమేక్ అయిన ప్యారిస్ ప్యారిస్ చిత్రంలో న‌టిస్తోందీ బ్యూటీ.

తెలుగులోనూ బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడుగా రూపొందుతోన్న సీత(Sita) అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమాలో కాజ‌ల్ క్యారెక్ట‌ర్ చాలా భిన్నంగా ఉండ‌డం విశేషం. అందుకే తాజాగా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కి యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ క‌నిపిస్తోంది.

sita3 8896592

తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోన్న చిత్రం సీత‌. ఈ సినిమాతో దాదాపు ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత తేజ దర్శ‌క‌త్వంలో న‌టిస్తోంది కాజ‌ల్‌. ఆమె తెలుగులో న‌టించిన మొద‌టి చిత్రం ల‌క్ష్మీ క‌ల్యాణానికి దర్శ‌కుడు తేజ‌. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ ఒక సినిమాకి క‌లిసి ప‌నిచేయడం ఇదే మొద‌టిసారి. ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. విడుద‌లైన ఒక్క‌ రోజులోనే ఇది మిలియ‌న్ వ్యూస్ సంపాదించ‌డం విశేషం.

ADVERTISEMENT

సీత‌.. ఓ ప‌క్కా బిజినెస్ వుమ‌న్‌.. త‌న‌కు లాభం వ‌స్తుందంటే ఏ ప‌నైనా చేయ‌డానికి సిద్ధ‌ప‌డుతుంది. ఆఖ‌రికి విల‌న్ల‌తోనూ డేటింగ్ వంటి రిలేష‌న్‌షిప్‌లో ఉండేందుకు ఒప్పుకుంటుంది. పేరే సీత.. కానీ చేసే ప‌నులు శూర్ప‌ణ‌క లాంటివి. చాలామంది ఈ మాట త‌న‌తో అంటుంటారు కూడా. కానీ ఆ మాట‌ను కూడా సీత ఓ ప్ర‌శంస‌లాగే తీసుకుంటూ ఉంటుంది. మ‌రి, ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ వుమ‌న్‌కి ఆ పేరేంటా? అనుకుంటున్నారా? వాళ్ల నాన్న ఆమెకు సీత అని పేరు పెట్ట‌డం మాత్ర‌మేకాదు… ప‌క్క‌నే ఆమె బావ‌ను కూడా ఉంచారు. త‌న పేరు ర‌ఘురాం. ఎంతో అమాయ‌కుడు. సున్నిత మ‌న‌స్త‌త్వం ఉన్న‌వాడు. మొత్తంగా చెప్పాలంటే చిన్న‌పిల్లాడి మ‌న‌స్త‌త్వం. కానీ నేను సీత‌ని.. సీత న‌న్ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని మావ‌య్య చెప్పాడు అంటూ త‌న‌ని ఎల్ల‌ప్పుడూ కాపాడే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. మ‌రి, ఇలాంటి అమాయ‌కుడు అంత‌టి ధైర్య‌వంతురాలైన సీత‌ను ఎలా కాపాడ‌తాడు? అస‌లు వీరిద్ద‌రూ క‌లిసి ఉండాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? వ‌ంటివ‌న్నీ సినిమాలోనే చూడాలి.

ఈ సినిమాలో సీతగా డేరింగ్‌ అండ్ డ్యాషింగ్ బిజినెస్ వుమ‌న్ పాత్ర‌లో కాజ‌ల్ ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తే.. ఇప్ప‌టివ‌ర‌కూ స్ట్రాంగ్ హీరో పాత్ర‌ల్లో మాత్ర‌మే క‌నిపించిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇందులో ఎంతో అమాయ‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్న ఈ చిత్రానికి ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

కాజ‌ల్ ఇంత‌కుముందు ఎప్పుడూ క‌నిపించ‌ని ప్ర‌త్యేక పాత్ర‌ను పోషిస్తుండ‌డంతో అభిమానుల్లో ఈ సినిమా ప‌ట్ల ఎంతో ఆస‌క్తి ఏర్ప‌డింది. ఈ చిత్రంలో కాజ‌ల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు జ‌యబాబు పాత్ర‌లో త‌నికెళ్ల భ‌ర‌ణి, విల‌న్ బ‌స‌వ పాత్ర‌లో సోనూ సూద్‌ల‌తో పాటు మ‌రో క‌థానాయిక‌గా మ‌న్నారా చోప్రా కూడా న‌టించ‌నుంది.

ఈ టీజ‌ర్‌లోని నువ్వు సీత‌వు కావే.. శూర్ఫ‌ణ‌క‌వి.. నువ్వు బాగుప‌డ‌వు.. మ‌ట్టికొట్టుకుపోతావు.. అనే డైలాగ్ వింటుంటే సీత క్యార‌క్ట‌రైజేష‌న్‌పై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి పెరుగుతోంది. మ‌రి, ఈ మోడ్ర‌న్ సీత ఎలా ఉంటుంది.. ఎలా బిహేవ్ చేస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 25 వ‌ర‌కూ ఆగాల్సిందే.

ADVERTISEMENT

ఇవి కూడా చ‌ద‌వండి.

షారూఖ్ పార్టీకి అమీర్ టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నాడట.. ఎందుకో తెలుసా?

చ‌క్క‌టి చెలిమి సంత‌కం..ఈ మ‌హ‌ర్షి మొద‌టి పాట‌..ఛోటీ ఛోటీ బాతే..!

తమ‌న్నా ఈ న‌టుడితో.. డేటింగ్‌కి వెళ్లాల‌ని అనుకుందట. ఎందుకో తెలుసా?

ADVERTISEMENT
01 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT