ADVERTISEMENT
home / Celebrity Weddings
పెళ్లి చేసుకొని సర్ ప్రైజ్ చేసిన టీవీ నటి సమీర.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?

పెళ్లి చేసుకొని సర్ ప్రైజ్ చేసిన టీవీ నటి సమీర.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?

సమీర షరీఫ్ (sameera sherief).. ఈటీవీలో ప్రసారమైన ‘ఆడపిల్ల’ సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమై.. అభిషేకం, భార్యామణి, ప్రతిబింబం, మంగమ్మ గారి మనవరాలు, ముద్దు బిడ్డ వంటి సీరియళ్లతో అందరికీ దగ్గరైపోయింది. ఆ తర్వాత తెలుగు సీరియళ్లకు దూరమైనా.. తమిళంలో మాత్రం ఇంకా సీరియళ్లలో నటిస్తూ బిజీగా ఉంది సమీర. విజయ్ టీవీలో ఓ షోతో పాటు జీ తమిళం ఛానెల్‌లోనూ ఓ సీరియల్‌లో నటిస్తోంది. ఈ అమ్మడు తాజాగా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, చాలా కొద్ది మంది సన్నిహితుల మధ్య సింపుల్‌గా జరిగిన తన వివాహం గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది

గత నాలుగున్నరేళ్లుగా తాను ప్రేమిస్తున్న తమిళ సీరియల్ నటుడు సయ్యద్ అన్వర్ అహ్మద్ ( Syed Anwar ahmad) ని వివాహమాడిందామె. తమిళంలో వీరిద్దరూ కలిసి ‘పాగల్ నిలావు’ అనే సీరియల్‌లో నటించారు. ప్రస్తుతం ‘రెక్క కట్టి పరక్కుదు మనసు’ అనే సీరియల్‌లో ప్రధాన పాత్రల్లో నటించడంతో పాటు.. అదే సీరియల్‌కు నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ‘పాగల్ నిలావు’ సీరియల్‌లో నటించే సమయంలోనే వీరి ప్రేమ చిగురించింది. నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట తాజాగా 11.11.2019 తేదిన పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది సమీర.

సమీర వివాహం చేసుకున్న సయ్యద్ అన్వర్ అహ్మద్ కేవలం తమిళ సీరియల్ నటుడు, నిర్మాత మాత్రమే కాదు.. తెలుగులో 600 కి పైగా సినిమాలతో పాటు సీరియళ్లలో కూడా నటించి మంచి పేరు సంపాదించిన సన (షానూర్ సనా బేగం) కుమారుడు. సమీర తమ కుటుంబంలో భాగం అవ్వడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందంటూ నూతన వధూవరుల ఫొటోలను షేర్ చేస్తూ సన క్యాప్షన్ రాయడం విశేషం.

ADVERTISEMENT

ఈ సందర్భంగా ఆమె “అల్లా దీవెనలతో సయ్యద్ అన్వర్, సమీర షరీఫ్‌లు ఇద్దరూ అన్విరాగా ఒక్కటయ్యారు. మీ, మా దీవెనలు వారిపై ఎప్పటికీ ఉంటాయని నమ్ముతున్నాను. ఈ కొత్త జంటకు మీ దీవెనలు అందించండి. సయ్యద్‌లైన మేం షరీఫ్‌లను మా కుటుంబంలోకి ఎంతో ఆనందోత్సాహాలతో ఆహ్వానిస్తున్నాం. సయ్యద్ గారి కొడుకు షరీఫ్ గారి కూతురిని వివాహమాడాడు. వీరిద్దరూ జీవితాంతం ఇలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు సన.

మరో వైపు తన పెళ్లి విషయాన్ని తనే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది వధువు సమీర. “అల్లా దయ వల్ల మేం (అన్విరా) మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. గత నాలుగున్నరేళ్లుగా ప్రేమలో ఉన్న మేం ప్రస్తుతం భార్యాభర్తలుగా మారాం. మాపై మీ ప్రేమాభిమానాలు గతంలోలాగే చూపుతారని మీ ఆశీర్వాదాలు, మీ ప్రేమ, సహకారం అందిస్తారని కోరుకుంటున్నా. మా శక్తి కంటే మీ నమ్మకమే మా ప్రేమ కథను ముందుకు నడిపించి మమ్మల్ని మరింత దగ్గర చేసిందని నేను నమ్ముతున్నా. మా సంతోషం, మా బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. ఆశీర్వాదాలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని వెల్లడించింది ఆమె.

మరో పోస్ట్‌లో భాగంగా తన పెళ్లి ఇంత సింపుల్‌గా జరుపుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది సమీర. మా పెళ్లి ఇంత సింపుల్‌గా, ఇంత రహస్యంగా జరగడానికి కారణం.. మేం ఇస్లాం చెప్పిన మార్గంలో నడవాలనుకోవడమే. ఖురాన్ ప్రకారం తక్కువ ఖర్చు పెట్టి చేసుకునే వివాహం చాలా ఎక్కువగా దీవింపబడుతుంది. అందులోనే ఆనందం ఎక్కువగా ఉంటుంది. మా ఈ నిర్ణయానికి మా రెండు కుటుంబాల సహకారం లేకపోతే.. మేం ముందుకు వెళ్లేవాళ్లం కాదు. వాళ్లు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. అల్లా దయ వల్ల మేం ఇద్దరం.. మా ప్రేమను పెళ్లి వరకూ తీసుకొచ్చాం. ఇక ముందు కూడా అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. అందరూ పాజిటివ్‌గా ఆలోచించడం వల్ల ఈ ప్రపంచమే మారుతుంది” అంటూ పోస్ట్ చేసింది సమీర.

ADVERTISEMENT

ఈ వివాహం చాలా సింపుల్‌గా చేసుకొని, మిగిలిన డబ్బుతో కొంతమంది పేద విద్యార్థులను దత్తత తీసుకొని.. వారిని చదివించాలన్నది ఈ జంట ఉద్దేశంగా తెలుస్తోంది. తమ పెళ్లి నిరాడంబరంగా చేసుకొని.. ఇతరులకు ఆదర్శంగా నిలవడంతో పాటు.. ఇతరులకు సాయం కూడా చేయాలనుకుంటున్న ఈ జంట.. ఎప్పటికీ ఇలాగే ఆనందంగా తమ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుందాం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT

 

13 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT