ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

లైంగికపరమైన (Sex)  కోరికలు అందరిలోనూ కలుగుతాయి. ప్రతీ మనిషికి భావోద్వేగాలు ఉన్నట్లే.. తన భాగస్వామితో  శారీరకంగా రొమాంటిక్ ఫీలింగ్స్ పంచుకోవాలనే కోరిక కూడా ప్రతీఒక్కరిలో ఉంటుంది. అయితే ఈ కోరికలు కలగడంలోనూ తేడాలుంటాయి. కొందరిలో ఈ పరమైన రొమాంటిక్ కోరికలు చాలా ఎక్కువగా ఉంటే.. మరికొందరిలో తక్కువగా ఉంటాయి. అయితే రాశుల (Zodiac sign) ప్రకారం.. ఈ రకమైన కోరికలు ఎవరికి ఏ స్థాయిలో ఉంటాయి.. లాంటి ప్రశ్నలు వేస్తే ఎవరికైనా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నమ్మడానికి కాస్త వింతగా అనిపించినా.. పుట్టిన తేదీని బట్టి ఈ పరమైన కోరికల్లో మార్పులు ఉంటాయంటున్నారు కొందరు ఆస్ట్రాలజీ ఎక్స్‌పర్ట్స్..

మన పర్సనాలిటీకి రాశులతో ఎంతగా సంబంధం ఉంటుందో..  అదే స్థాయిలో సెక్స్ జీవితాన్ని కూడా అవి ప్రభావితం చేస్తాయట. అందుకే కొందరు లైంగికపరమైన జీవితం గురించి.. ఏమాత్రం సంకోచం లేకుండా మాట్లాడితే మరికొందరు మాత్రం దాని గురించి మాట్లాడేందుకు అస్సలు ఇష్టపడరు.

ఇంకొందరైతే బయట మాట్లాడేందుకు ఇష్టపడకపోయినా ..బెడ్రూంలో మాత్రం వారే ముందుంటారట. మొత్తంగా చెప్పాలంటే కొన్ని రకాల రాశుల వారికి.. మిగిలిన రాశుల వారితో పోల్చితే కామోద్రేకం ఎక్కువగా ఉంటుందట. లైంగిక కోరికలు వారిలో ఎక్కువగా ఉంటాయి. అలాంటి రాశుల వారి గురించి తెలుసుకుందాం రండి.

tenor %281%29

మేష రాశి ( 21 మార్చి నుంచి 19 ఏప్రిల్ )

ఈ రాశి వారు మిగిలిన వారికంటే కాస్త భిన్నంగా ఉంటారు. ఇతరులను తమవైపు ఆకర్షించడం, వారిలో మోహావేశాన్ని పెంచడంలోనూ ఈ రాశి వారికి మంచి ప్రావీణ్యం ఉంటుంది. బెడ్రూంలో తమ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడం ఈ రాశివారికి ఇష్టం. వీరిలాంటి మనస్తత్వం ఇంకే రాశుల వారికి ఉండదు. బెడ్రూంలో వీరికి మూడ్ రావాలే.. కానీ ఎంత ఆనందాన్ని పొందగలరో వీరి భాగస్వాములు అస్సలు వూహించలేరు.

ADVERTISEMENT

పెళ్లయిన కొత్తల్లో ఎక్కువగా ఉండే వీరి ఫీలింగ్స్ రోజుల గడుస్తున్న కొద్దీ పెరుగుతాయే తప్ప తగ్గవు. సెక్స్ విషయంలోనే కాదు.. భాగస్వామితో సాధారణ సందర్భాల్లోనూ చాలా జోవియల్‌గా వ్యవహరిస్తారు ఈ రాశివారు. అయితే ఈ రొమాంటిక్ కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల.. చాలాసార్లు భాగస్వామితో కలయిక తర్వాత వీరు అసంతృప్తికి లోనయ్యే అవకాశాలుంటాయి.

tenor1

వృషభ రాశి ( 20 ఏప్రిల్ నుంచి 20 మే)

ఈ రాశి వారు రొమాన్స్ పట్ల చాలా ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. వీరి ప్రవర్తనను బట్టి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రెండర్థాలు వచ్చేలా మాటలు మాట్లాడడం వీరి ప్రత్యేకత. తమ భాగస్వామి వీరిని ముట్టుకుంటే చాలు.. వీరికి మూడ్ వచ్చేస్తుంది. వీరికి ఒక వ్యక్తిపై ప్రేమ పుట్టడం కాస్త కష్టం. కానీ ఒకసారి ఎవరిపైనైనా ప్రేమ పుట్టిందంటే అవతలివారిని చాలా బాగా చూసుకుంటారు. వీరికి సెక్స్ కంటే ఫోర్ ప్లే అంటే ఎక్కువ ఇష్టం.

అందుకే ఈ రాశి వారు మంచి సెక్స్ పార్టనర్ అని అందరూ భావించేలా చేస్తారు. తమ భాగస్వామికి మూడ్ తెప్పించడంలో వీరిని మించిన వారు మరెవరూ లేరు. కేవలం మూడ్ తెప్పించడం మాత్రమే కాదు.. పూర్తిగా సంతృప్తి చెందేలా చేయగలరు కూడా.

వీరు కేవలం ఫిజికల్ రిలేషన్ షిప్ గురించి  మాత్రమే కాకుండా తమ బంధాన్ని కూడా ఎంతో స్పెషల్‌గా మార్చుకోవడంలో ముందుంటారు. సెక్స్‌లో పాల్గొనే సమయంలో కొత్త కొత్త పొజిషన్లు ప్రయత్నించడం వీరికి పెద్దగా ఇష్టం ఉండదు. అయితే ప్రయత్నించిన ఒకటి, రెండు పొజిషన్లలోనే వీరు అందించే ఆనందంతో భాగస్వామి మిగిలిన పొజిషన్లను ప్రయత్నించాలని కూడా భావించరు.

ADVERTISEMENT

2

కర్కాటక రాశి (22 జూన్ నుంచి 22 జులై)

ఈ రాశి వాళ్లు రొమాన్స్ పట్ల ఆసక్తి ఎక్కువగానే చూపిస్తారు. కానీ వీరికి సంబంధించి సెక్స్ అన్నది కేవలం లైంగిక చర్యకు మాత్రమే పరిమితం కాదు. అది ఫీలింగ్స్‌కి సంబంధించినదని వీరి భావన. ఈ రాశి వారు చాలా సున్నితమనస్కులై ఉంటారు. అందుకే వీరు సెక్స్ లేదా రొమాన్స్‌లోని ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతారు. ఈ రాశివారు తమ ఫీలింగ్స్ తమ భాగస్వామికి కనబడకుండా దాచిపెట్టుకుంటారు. అందుకే వీరు బయట కనిపించేది వేరు. బెడ్రూంలో వేరు అని చెప్పవచ్చు.

అయితే ఈ రాశి వారు తమ భాగస్వామి ఆనందం కంటే తమ ఆనందం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వీరికి ఛాతి భాగంలో ముట్టుకోవడం వల్ల మూడ్ ఎక్కువగా వస్తుంది. ఈ రాశి వారికి వూహల్లో జీవించడం ఎక్కువగా అలవాటు. అందుకే వీరు సెక్స్ సంబంధించి కూడా చాలా కలలే కంటుంటారు. వీరి విషయంలో ప్రేమ, సెక్స్ రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటుంది. అందుకే తాము ప్రేమించిన వ్యక్తితో చాలా తక్కువ సమయంలోనే వీరు లైంగికంగా కూడా దగ్గరవుతారు. అయితే పెళ్లయిన తర్వాతే వీరికి సెక్స్‌లో ఆనందం అనేది కలుగుతుంది.

3

సింహ రాశి (23 జులై నుంచి 22 ఆగస్ట్ )

ఈ రాశి వారు చాలా రొమాంటిక్‌గా ఉంటారు. సెక్సీ‌గా కనిపిస్తారు కూడా. వీరిలో తమకు నచ్చిన వ్యక్తిని తమవైపుకి ఆకర్షించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చూడడానికి ఒకలా.. లోపల మరోలా కనిపిస్తారట. అందుకే బయట సున్నితంగా కనిపించినా.. తమ భాగస్వామికి మాత్రం తమలోని వైల్డ్ సైడ్ యాంగిల్‌ని చూపుతారట. సెక్స్ సమయంలోనూ వీళ్లు చాలా కాన్ఫిడెంట్‌గా, శక్తిమంతంగా కనిపిస్తారట. వీళ్లు తమని తాము చాలా హాట్‌గా భావిస్తారు.

అందుకే తమ భాగస్వామి నుంచి ప్రతిసారి ప్రశంసలు వినాలనుకుంటారు.  అలాగే రొమాన్స్ చేసే సమయంలో వీళ్లు చాలా చలాకీగా, ఫన్నీగా వ్యవహరిస్తుంటారు. అందుకే ఇలాంటివారి గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది.

ADVERTISEMENT

tenor %282%29

వృశ్చిక రాశి (23 అక్టోబర్ నుంచి 21 నవంబర్)

ఈ రాశి వారి ప్రతి అంగుళం రొమాంటిక్ అనే చెప్పుకోవాలి. రొమాంటిక్ ఫీలింగ్స్, లైంగికపరమైన కోరికలు ఎవరికి ఎక్కువ అంటే.. అందులో మొదటి ర్యాంక్ వీరికే అందుతుంది. ప్రేమ, సెక్స్ ఈ రెండు విషయాల్లోనూ వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. వీళ్లు సెక్స్ గురించి ప్రతి విషయం తెలుసుకొని.. ఆ సమయంలో తమ భాగస్వామి దగ్గర బోల్డ్‌గా, సెక్సీగా కనిపించే ప్రయత్నం చేస్తుంటారు. రకరకాల వస్తువులు, రకరకాల భంగిమలు ప్రయత్నించాలని వీరికి కోరికగా ఉంటుంది.

సెక్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్లకు అఫైర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే శారీరక సంబంధాలు పెట్టుకునే ముందు మాత్రం వీళ్లు  చాలా ఆలోచిస్తుంటారు. వన్ నైట్ స్టాండ్, ఫ్రెండ్స్ విత్ బెనెఫిట్స్ వంటివి వీరికి అస్సలు నచ్చవు. ఇతరులను ప్రేమిస్తేనే వారితో శారీరక సంబంధానికి ఇష్టపడతారు. వీరి పర్సనాలిటీ చాలా డీసెంట్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరినీ తమ వైపు చూసేలా చేస్తుంది. వారిని ప్రేమించేలా చేస్తుంది. వీరు చూపే ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి భాగస్వాములు కూడా వీరి నుంచి చాలా ఎక్కువే ఆశిస్తూ ఉంటారు.

ఇవి కూడా చదవండి.

సెక్స్ విషయంలో.. అబ్బాయిలకు ఉండే కలలు, కోరికలు ఇవే..

ADVERTISEMENT

సెక్స్‌లో పాల్గొనడం వల్ల మన ఆరోగ్యానికి.. ఎన్ని ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా?

సెక్స్ త‌ర్వాత.. అమ్మాయిలు ఏం ఆలోచిస్తారో మీకు తెలుసా..?

Images : Shutterstock/ Tenor

18 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT