ADVERTISEMENT
home / Life
ప్రేమ వివాహం.. ప్రేమతో  మీకు నేర్పించే  విషయాలు ఇవే..

ప్రేమ వివాహం.. ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే..

ప్రేమ, ఇష్క్, కాదల్.. భాష ఏదైనా భావం ఒక్కటే. ఎవరి మనసులో ఎప్పుడు ఎందుకు పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అది పుట్టిన క్షణం నుంచి జీవితం ఆనందమయంగా మారిపోతుంది. దానికి కుల, మత, వర్ణ, జాతి, ఆస్తి, అంతస్థు అనే భేదాలేవీ లేవు. వాటన్నింటినీ ఛేదించుకొని ఏకమవుతున్న వారెందరో  ఉన్నారు. సంతోషంగా జీవిస్తున్నారు. ఇటీవలి కాలంలో కులమతాలకతీతంగా తమ పిల్లల ప్రేమను తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు. ఆనందంగా వివాహం చేస్తున్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి మనసుకు నచ్చిన వ్యక్తిని  వివాహం చేసుకొంటే ఆ సంతోషానికి వెలకట్టగలిగేది ఈ లోకంలో ఏదైనా ఉందా? కచ్చితంగా లేదనే సమాధానమే వస్తుంది. ఇలా కులాంతర లేదా మతాంతర వివాహం చేసుకోవడం వల్ల ప్రేమించిన వ్యక్తితో ఆనందంగా జీవించడం మాత్రమే కాదండోయ్.. ఇంకా ఎన్నో లాభాలున్నాయి. అమ్మాయిలూ..  అవేంటో తెలుసుకోవాలనుంది కదా..! రండి తెలుసుకొందాం.

1. ఇద్దరి సంప్రదాాయాలకనుగుణంగా పెళ్లి..

అబ్బాయి, అమ్మాయి మతాలు లేదా కులాలు వేరయినప్పుడు వారి కుటుంబ ఆచారాలు, సంప్రదాయాలు కూడా వేర్వేరు గానే ఉంటాయి. అంటే ఇద్దరి సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు పెళ్లి జరుగుతుంది. అబ్బ.. ఈ అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది.

2. పూర్తిగా కొత్త ప్రపంచం..

ADVERTISEMENT

మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు దాదాపుగా ఒకే రకమైన ఆచారవ్యవహారాలు, ఆహారపు అలవాట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు మీ కుటుంబానికి పూర్తి విరుద్ధమైన అలవాట్లు, వ్యవహారాలుంటాయి. సాధారణంగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొనే అమ్మాయిలు కొత్త కుటుంబంలోకి మాత్రమే అడుగుపెడతారు. కానీ మతాంతర లేదా కులాంతర వివాహం చేసుకొనేవారైతే పూర్తిగా కొత్త లోకంలోకి అడుగుపెడతారు.

2-marry-outside-your-caste

3. కొత్త భాష నేర్చుకొంటారు.

మీరు ప్రేమించిన వ్యక్తి కులం, మతంతో పాటు రాష్ట్రం కూడా వేరయితే.. చక్కగా వారి భాష కూడా నేర్చేసుకోవచ్చు. అంతేకాదు.. మీ అత్తింట్లో వారికి అర్థం అవకుండా.. చక్కగా అమ్మతో నచ్చిన విషయాలు మాట్లాడుకోచ్చు. ఏమంటారు?

ADVERTISEMENT

4. మీ మనసు విశాలమవుతుంది.

ఇద్దరి సంప్రదాయాలు వేర్వేరు కావడం వల్ల మీరు వారి ఆచారాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు. అర్థం చేసుకొంటారు. ఆచరణలో పెడతారు. ఈ క్రమంలో ఇతరుల ఆచారవ్యవహారాలను గౌరవించడం నేర్చుకొంటారు. మరి మీ మనసు విశాలమైనట్లే కదా..!

4-marry-outside-your-caste

5. కొత్త పండగల గురించి తెలుస్తుంది.

ADVERTISEMENT

నిజంగా మంచి విషయమే.. అటు పుట్టింటి పండగలు.. ఇటు మెట్టినింటి పండగలతో ఏడాదంతా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు.

6. కొత్త ఆహారం

మన సమాజంలో ప్రతి కమ్యూనిటీకి ప్రత్యేకమైన వంటలుంటాయి. అలా మీకు కొత్త రకాల వంటకాలు పరిచయమవుతాయి. అలాగే మీకు తెలిసిన వంటలను వారికి రుచి చూపించవచ్చు.

 

ADVERTISEMENT

6-marry-outside-your-caste-1

7. ఫ్యామిలీ వెకేషన్ కోసం రెండు ఆప్షన్లు

సెలవులకు వెళ్లడానికి మీ దగ్గర రెండు ఆప్షన్లుంటాయి. ఒకటి మీ పుట్టిల్లు.. రెండోది మీ మెట్టినిల్లు. అందులోనూ మీరు వేర్వేరు ప్రాంతాలకు చెందినవారైతే ఒక్కోసారి ఒక్కో చోటకు వెళ్లచ్చు.

8. పొరపాటు చేసినా తప్పించుకోవచ్చు..

ADVERTISEMENT

మెట్టినింట్లో పని చేసే విషయంలో మీకు అక్కడి పరిస్థితులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏదైనా పొరపాటు చేశారనుకోండి.. అరె ఇలా చేయాలని నాకు తెలీదండి అనేయచ్చు. ఇది వర్కవుట్ అవుతుంది కూడా.

8-marry-outside-your-caste

9. అందరూ మిమ్మల్ని మెచ్చుకొంటారు.

మతాంతర, కులాంతర వివాహం చేసుకొన్నవారిని చుట్టూ ఉన్నవారు గౌరవిస్తారు. వారి ధైర్యాన్ని, పెద్దలను ఒప్పించే విషయంలో వారికున్న ఓర్పును, వారి అన్యోన్యదాంపత్యాన్ని చూసి అందరూ మెచ్చుకొంటారు.

ADVERTISEMENT

9-marry-outside-your-caste

10. పిల్లలకు ‘ది బెస్ట్’ దొరుకుతుంది.

కులాంతర లేదా మతాంతర వివాహం చేసుకొన్నవారికి కలిగిన సంతానం రెండు కుటుంబాల సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను తెలుసుకొంటారు. ఆ రెండింటి నుంచి మంచి విషయాలను గ్రహించి వారు ఆచరిస్తారు.

GIFs: Giphy, Tumbler

ADVERTISEMENT
27 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT