ADVERTISEMENT
home / Astrology
మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!? – All You Need To Know About Capricorn Women

మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!? – All You Need To Know About Capricorn Women

బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్లుగా గుర్తింపు పొందిన దీపికా పదుకొణె, విద్యా బాలన్, ట్వింకిల్ ఖన్నా మకర రాశికి(Capricorn)  చెందినవారే. తాము అడుగుపెట్టిన రంగంలో వారు సాధించిన విజయాల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. వీరిలో మీరు గమనించిన విషయం ఏదైనా ఉందా? వారు తమ మనసు ఏది చెబితే అదే మాట్లాడతారు. ఎవరైనా తమను కించపరుస్తుంటే తమ వాక్పటిమతో వారి నోరు మూయించి మరీ వెళతారు. మకర రాశికి చెందిన అమ్మాయిలంతా అంతే. వారిలో ఇంకా ఎన్నో మంచి విషయాలున్నాయి.

ముఖ్యంగా ఈ రాశి వారు.. చాలా స్నేహపూర్వకంగా మెలుగుతారు. వారు ఎప్పుడూ ఎనర్జిటిక్‌‌గా ఉంటారు. అంతేకాదు వారికి ఆత్మ విశ్వాసం కూడా ఎక్కువే. ఎన్ని ఇబ్బందులెదురైనా సరే.. తాము అనుకొన్నది సాధించి తీరతారు. తమ స్నేహితులెవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి చేయూతగా నిలుస్తారు. ఇవేకాదు.. మకర రాశి అమ్మాయిల్లో ఇంకా ఎన్నో మెచ్చుకోదగిన లక్షణాలున్నాయి.

మకర రాశి అమ్మాయిల వ్యక్తిత్వం

ఈ రాశి మహిళలకు కెరీర్ అవకాశాలు

ADVERTISEMENT

పని విషయంలో మకర రాశి మహిళల ముద్ర

మకర రాశి మహిళలకు నప్పే రాశులు

స్నేహితులుగా మకర రాశి అమ్మాయిలు

ప్రేమ సంబంధ విషయాల్లో మకర రాశి మహిళలు

ADVERTISEMENT

పడక గదిలో ఈ రాశి మహిళలెలా ఉంటారు?

వైఫల్యాన్ని మకర రాశి మహిళలు ఎలా స్వీకరిస్తారు?

మకర రాశి మహిళలు అనుసరించే ఫ్యాషన్

ఈ రాశి అమ్మాయిలకు నచ్చే ఆహారం

ADVERTISEMENT

మకర రాశి వారిలో ఉండే ప్రతికూలాంశాలు

మకర రాశి అమ్మాయిల వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు తెలుసుకొందాం. ఏమంటారు? (Personality Traits Of Capricorn Women)

మకర రాశికి చెందిన అమ్మాయి ఏ పని చేసినా తన మనసుతో చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇతరులను సంతోషంగా ఉంచడానికి తన ఇష్టాలను, కోరికలను ఇష్టపూర్వకంగా త్యాగం చేస్తుంది. ఈ రాశి వారు ఎల్లప్పుడూ తమ లక్ష్య ఛేదన దిశగానే ముందడుగు వేస్తుంటారు. తమ గమ్యాన్ని చేరుకొనేందుకు సర్వశక్తులను ఒడ్డుతారు. తమ సామర్థ్యంతో తాము అనుకొన్నది సాధించి తీరతారు.

ఈ రాశికి చెందిన వారు నమ్మకంగా ఉంటారు. వీరు అబద్దాలు చెప్పడాన్ని అంతగా ఇష్టపడరు. మకరం నీటిలో చరించే జంతువు కాబట్టి వీరికి  దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. అలాగే భావోద్వేగాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

వీరిలో మనకు రెండు రకాల వ్యక్తిత్వాలు కనిపిస్తాయి. మకర రాశి వారికి తమపై నమ్మకం ఎక్కువ. అచంచలమైన ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోతుంటారు.  కానీ కొన్ని సందర్భాల్లో వీరిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఈ రెండు రకాల వ్యక్తిత్వాల మధ్య వారి మనసు వూగిసలాడుతూ ఉంటుంది.

ADVERTISEMENT

ఈ రాశి మహిళలకు కెరీర్ అవకాశాలు (Career Opportunities Of Capricorn Women)

మకర రాశి అమ్మాయిలు లక్ష్యసాధకులు. సమర్థులు. కష్టపడతారు. విజయాన్ని కోరుకొంటారు. వారు ఏదైనా పని మొదలు పెడితే.. దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. ఇచ్చిన సమయం లోపల అప్పచెప్పిన కార్యాన్ని వారు పూర్తిచేసేస్తారు. పని ప్రదేశాల్లో చాలా ఓపికగా వ్యవహరిస్తారు. అదే సమయంలో నియమనిబంధన విషయాల్లో ఎలాంటి రాజీ పడరు. సహోద్యోగులతో చక్కటి స్నేహబంధాలను పెంపొందించుకొంటారు.

ఇన్ని మంచి లక్షణాలున్న వారిలోనే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. వీరు చాలా సందర్భాల్లో నిరాశలో కూరుకుపోతారు. ఫలితంగా వారి పనితీరు మందగిస్తుంది. ఉత్పాదకత తగ్గిపోతుంది. మెచ్చుకోదగిన విషయం ఏంటంటే.. వారిలో ఎంత ఆత్మవిశ్వాసం తగ్గినా పడి లేచిన కెరటమల్లే సాగిపోతుంటారు. కచ్చితంగా సాధించి తీరాలనే వీరి సంకల్పమే దానికి కారణం. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వీరికి వ్యాపార, ఆర్థిక, వైద్య రంగాల్లో చక్కటి కెరీర్ ఉంటుంది. వీరికున్న సహనం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే తీరు కారణంగా పని ప్రదేశాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు.

పని విషయంలో మకర రాశి మహిళల ముద్ర (Capricorn Women In Case Of Work)

మకర రాశి అమ్మాయిలను ‘The Achievers’ అని పిలుస్తుంటారు. ఇలా పిలవడానికీ కారణం లేకపోలేదు. వారికి ఏదైనా టాస్క్ అప్పగిస్తే కచ్చితంగా పూర్తి చేసే తీరతారు. పనిని పూర్తి చేసే క్రమంలో వారు వ్యవహరించే విధానం, దానికోసం వారు వేసుకొన్న ప్రణాళిక, దాన్ని అమలు పరిచే తీరు వల్లే వారిని లక్ష్యసాధకులుగా వ్యవహరిస్తారు. అంతే కాదు.. ఏం చేస్తున్నాం? ఎంత వరకు చేశాం? ఇంకా ఎంత చేయాలి? అనే వాటిని చెక్ చేసుకొంటూ ఉంటారు. అందుకేనేమో.. వారు మిగిలిన వారికంటే త్వరగా పనులను పూర్తి చేయగలుగుతారు.

ADVERTISEMENT

ఈ రాశికి చెందిన వారికున్న మరో ప్రత్యేకత. కచ్చితత్వం. ఎంత చిన్న విషయమైనా సరే.. వారు దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ కనబరుస్తారు. అందుకే వారు పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లో తప్పులు పెద్దగా ఉండవు. ఈ రాశి వారు కార్యసాధకులే అయినప్పటికీ మానవ సంబంధాల విషయంలో సున్నితంగా వ్యవహరిస్తారు. అందుకే పని ప్రదేశంలో సహోద్యోగులతో పటిష్టమైన స్నేహబంధాన్ని కలిగి ఉంటారు. మకర రాశి వారికి నాయకత్వ లక్షణాలు కూడా మెండుగానే ఉంటాయి.

మకర రాశి మహిళలకు నప్పే రాశులు

మకర రాశి మహిళలు జీవితంలో సాధ్యాసాధ్యాలపై అవగాహన కలిగి ఉంటారు. మరో విధంగా చెప్పాలంటే ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్‌గా వ్యవహరిస్తారు. అలాగే కెరీర్ విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తారు. వీరికి వృషభం, కన్య రాశి కలిగిన పురుషులతో మంచి స్నేహం కుదురుతుంది.  మకర రాశి మహిళలతో కలసి ప్రయాణించే విషయంలో కన్యా రాశి పురుషులు వృషభ రాశిని కాస్త వెనక్కి నెడతారు. ఎందుకంటే.. కన్యరాశి వారు మకర రాశి అమ్మాయిల మాదిరిగానే పని విషయంలో ఎలాంటి రాజీ పడరు. వీరిద్దరూ కలిస్తే కెరీర్ పరంగా ఒకరికొకరు తోడ్పాటునిచ్చుకొంటూ ముందుకు సాగిపోతారు.

మకర రాశికి చెందిన మహిళలకు అదే రాశి పురుషులతో కూడా చక్కటి బంధం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇద్దరికీ దాదాపు ఒకే రకమైన ఆలోచనా విధానం, మనస్తత్వం ఉంటాయి.తమ జీవిత భాగస్వామిని ఎంచుకొనే విషయంలో మకర రాశి అమ్మాయిలు కొన్ని విషయాలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి వారిని అపరిమితంగా ప్రేమించడంతో పాటు తమకు విలువనివ్వాలని కోరుకొంటారు. అలాగే క్లిష్ట పరిస్థితుల్లో వారికి రక్షణగా నిలవాలని కోరుకొంటారు. ప్రేమలో ఉన్నప్పడు మకర రాశి మహిళలు ఆ బంధానికి చాలా విలువనిస్తారు. దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ కొన్ని సందర్భాల్లో చాలా మొండిగా వ్యవహరిస్తారు.

ADVERTISEMENT

స్నేహితులుగా మకర రాశి అమ్మాయిలు (Friendships)

మకర రాశి మహిళలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ప్రతి అంశాన్ని విశ్లేషించి చూసే స్వభావమే వారికి స్నేహితులను పెంచుతుంది. ఈ రాశి వారు హాస్యాన్ని పండిస్తారు. అలాగే.. జీవితానికి పనికి వచ్చే మంచి సలహాలను సైతం ఇస్తారు. మకర రాశి వారు అనుబంధాలను చాలా సీరియస్‌గా తీసుకొంటారు. స్నేహబంధాలను ఎల్లకాలం పదిలపరచుకోవాలని చూస్తారు. ఈ విషయంలో వారెలా వ్యవహరిస్తారో.. తమ స్నేహితులు కూడా అలాగే ఉండాలని కోరుకొంటారు.

ప్రేమ సంబంధ విషయాల్లో మకర రాశి మహిళలు (Love Affair)

మనం ముందే చెప్పకొన్నట్టుగానే బంధాలను ఏర్పరచుకోవడంలో, వాటిని నిలబెట్టుకొనే విషయంలో మకర రాశి మహిళలు చాలా నిబద్ధతతో వ్యవహరిస్తారు.  ఈ రాశి వారు ప్రేమలో పడితే.. తమ భాగస్వామి కోసం జీవితాన్ని ధారపోయడానికి సైతం వెనకాడరు. తాము ప్రేమిస్తున్న వ్యక్తి చెప్పే మాటలన్నింటినీ వింటారు. వింటున్నారు కదా అని వారిని మోసం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి పదాన్ని.. దాని వెనుకున్న అర్థాన్ని వారు ఇట్టే గ్రహించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఈ రాశి అమ్మాయిలు.. తాము వినాలనుకొన్న విషయాలను మాత్రమే వింటారు. మిగిలిన వాటిని పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకోలేకపోతారు.

కాబట్టి మకర రాశి అమ్మాయిని ప్రేమించాలనుకొనే వారు… కొన్ని విషయాలను మనసులో ఉంచుకోవాలి. ఈ రాశి అమ్మాయిలు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. మీరు నిజాయతీగా వ్యవహరిస్తే మంచు ముక్కలా కరిగిపోతారు. కాబట్టి మీరు వారి దగ్గర నటించకుండా మీరు మీలాగే వ్యవహరిస్తే బాగుంటుంది. ఒక వేళ మీకు ఆమెతో బంధాన్ని కొనసాగించడం ఇష్టం లేకపోతే.. నేరుగా ఆమెతో ఈ విషయం చెప్పేయండి. అంతేకానీ మోసం చేసేవిధంగా మాత్రం ప్రవర్తించవద్దు.

ADVERTISEMENT

పడక గదిలో ఈ రాశి మహిళలెలా ఉంటారు? (Capricorn Women In Bedroom)

మకర రాశి మహిళలకు శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ. వీరు లైంగిక జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగుతుంది. లైంగిక పరంగా తమ భాగస్వామిని ఈ రాశి మహిళలు పూర్తిగా సంతృప్తి పరుస్తారు. ఈ విషయంలో తమ భాగస్వామి కూడా అలాగే వ్యవహరించాలని ఈ రాశి వారు కోరుకొంటారు. వీరు సెక్స్‌తో పాటు ఫోర్ ప్లే ని కూడా కోరుకొంటారు. శృంగారం విషయంలో తమ భాగస్వామి నుంచి కొత్తదనాన్ని కోరుకొంటారు. పడకగదిలో తన భర్త దృష్టి పూర్తిగా తనపైనే ఉండాలని కోరుకొంటారు. వీరికి భావప్రాప్తిని(ఆర్గాజమ్) చాలా త్వరగా చేరుకొంటారు. ఓ రకంగా చెప్పాలంటే మకర రాశి మహిళలు చాలా క్రేజీగా ఉంటారు.

శృంగారం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ దాన్ని ఆస్వాదించే విషయంలో వీరు తొలుత అసౌకర్యంగా ఉన్న భావనకు గురవుతారు. ఒక్కసారి మకర రాశి మగువల మనసులో ఉన్న బెరుకు, భయం పోయినట్లయితే.. ఇక వారు తమ భాగస్వామి కోరుకొన్న సౌఖ్యాన్ని అందించగలుగుతారు. అలాగే తమ కోరికలను భర్త అర్థం చేసుకోవాలని కోరుకొంటారు. మొత్తానికి ఈ రాశికి చెందిన అమ్మాయిని భాగస్వామిగా చేసుకొన్న వారి లైంగిక జీవితం చాలా బాగుంటుందని చెప్పవచ్చు.

వైఫల్యాన్ని మకర రాశి మహిళలు ఎలా స్వీకరిస్తారు? (Relationships)

ప్రేమలో బ్రేకప్ లేదా వైవాహిక జీవితంలో తెగతెంపులు చేసుకోవాల్సిన సందర్భం వస్తే ఈ రాశి మహిళలు తట్టుకోలేరు. ఎందుకంటే వీరు బంధాలకు చాలా విలువనిస్తారు. తమ బంధానికి ముగింపు చెప్పాలనే విషయాన్ని వారు అంగీకరించలేరు. అలాగని పూర్తిగా బాధలో మునిగిపోరు. ప్రేమలో వైఫల్యాన్ని స్వీకరించిన తర్వాత.. వారు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉంటుంది. చెప్పాలంటే గతంతో పోలిస్తే మెరుగైన జీవితం వైపు అడుగులేస్తారు. తాము బంధాన్ని నిలబెట్టుకోలేకపోయామనే విషయాన్ని ఇతరులకు తెలిసినా పెద్దగా బాధపడరు. తమని తాము బిజీగా ఉంచుకోవడం ద్వారా తమ బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ తమ మనసుని తేలిక పరచుకొనే ప్రయత్నం చేస్తారు. కాస్త సమయం పట్టినా ఈ బాధ నుంచి బయటపడి.. తిరిగి ప్రశాంతమైన జీవితాన్నికొనసాగించగలిగే మనోధైర్యం వీరి సొంతం.

ADVERTISEMENT

మకర రాశి మహిళలు అనుసరించే ఫ్యాషన్ (Fashion)

ఈ రాశి మహిళలు చాలా సరదాగా సమయం గడుపుతారు. ఏ పని చేసినా తమదైన ముద్ర కనబడేలా చూసుకొంటారు. ఇది వారు అనుసరించే ఫ్యాషన్ శైలిలోనూ ప్రతిబింబిస్తుంది. వెస్ట్రన్ వేర్ అయినా.. సంప్రదాయ దుస్తులైనా ఏదైనా సరే ఈ రాశి అమ్మాయిలు చాలా సౌకర్యవంతంగా ఫీలవుతారు. అయితే ఈ రాశి మహిళలు కష్టపడి పనిచేసే తత్వం కలిగినవారు కాబట్టి ఎక్కువగా ఫార్మల్ డ్రస్‌లను ధరించడానికే ఆసక్తి చూపిస్తారు.

పార్టీలు, ఫంక్షన్లకు తగిన దుస్తులు ధరించడం, సందర్భానికి తగినట్లుగా మేకప్ వేసుకోవడంలో ఈ రాశి మహిళలు సిద్ధహస్తులు. సాధారణమైన రోజుల్లో మీరు మకరరాశి అమ్మాయిలను గమనించినట్లయితేfవారు చాలా సింపుల్ గా తయారవుతారు. కానీ స్టైలిష్‌గా కనిపిస్తారు. మరో విధంగా చెప్పాలంటే ఏ తరహా ఫ్యాషన్ అయినా సరే.. తమకు అనుగుణంగా వీరు మార్చుకోగలుగుతారు.              

ఈ రాశి అమ్మాయిలకు నచ్చే ఆహారం (Food Habits)

మకర రాశి అమ్మాయిలు భోజనప్రియులు. జంక్ ఫుడ్‌ని బాగా ఇష్టపడతారు. కానీ తమ ఆరోగ్యాన్ని ఎప్పడూ దృష్టిలో ఉంచుకొంటారు. కాబట్టి జిహ్వచాపల్యాన్ని అదుపులో ఉంచుకొంటారు. ఆహారం తినే విషయంలో సమయపాలన పాటిస్తారు. ఈ రాశివారిని మీరు గమనిస్తే ప్రతి రోజు దాదాపు ఒకే సమయానికి తింటూ ఉంటారు. వీరి ఆహారంలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సలాడ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

ADVERTISEMENT

మకర రాశి వారిలో ఉండే ప్రతికూలాంశాలు

ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం కచ్చితంగా ఉండే ఉంటుంది. ఈ విషయంలో మకర రాశి అమ్మాయిలు కూడా అతీతం కాదు. వారిలోనూ కొన్ని లోపాలున్నాయి. వీరిలో కాస్త నిరాశావాదం కనిపిస్తూ ఉంటుంది. దీని కారణంగా వారి బంధంలో కలతలు రేగే అవకాశం ఉంది. వీరు తమకు అనుకూలంగా ఉండే వాతావరణం నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు. ఏ విషయంలోనైనా.. ఎవరిపైన అయినా వీరు అయిష్టాన్ని పెంచుకొంటే పూర్తిగా వారి నుంచి దూరంగా వచ్చేస్తారు. ఈ విషయం వారు దూరంగా పెట్టిన వ్యక్తులు సైతం గుర్తించలేరు. చాలా సందర్భాల్లో వీరు మూడీగా ఉంటారు.

రాబోయే వారంలో మకరరాశి అమ్మాయిలకు ఎలా ఉండబోతోందంటే.. (Coming Next Week)

వచ్చేవారం మీరు చాలా పనులు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. వాటిలో కొన్ని మీకు వ్యతిరేక ఫలితాలు తీసుకురావచ్చు. కాబట్టి వాటిని ఎంచుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఎందుకంటే అన్ని మనం అనుకొన్న ఫలితాలే తీసుకురాకపోవచ్చు.

గత కొన్ని నెలలుగా మీలోని కొంత శక్తిని దాచిపెట్టుకొన్నారు. దాన్ని ఉఫయోగించడానికి సరైన సమయం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. అయితే దానికంటే ముందే మీరు పని నుంచి కాస్త విరామం తీసుకోండి. అప్పుడే మీరు ఫ్రెష్‌గా పనిని మొదలుపెట్టగలుగుతారు. మీ పనితీరు పట్ల మీ సహోద్యోగులు సానుకూల అభిప్రాయాన్నే కలిగి ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి మీలో వచ్చిన అనూహ్యమైన మార్పుని, మీరు సాధిస్తున్న ఫలితాలను మెచ్చుకోకుండా ఉండలేరు.

ADVERTISEMENT

మీ ప్రేమ జీవితం కూడా ఈ వారం బాగుంటుంది. మీరు ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నట్లయితే ఈ వారంలోనే మీ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకొంటారు. కాబట్టి కొత్త వ్యక్తులు పరిచయమైతే వారితో మాటామాటా కలపండి. ఏమో వారే మీ జీవితభాగస్వామి కావచ్చు. కానీ కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. మీ కుటుంబం కూడా మీరు తీసుకొన్న నిర్ణయాన్ని అంగీకరించి మీకు మద్ధతుగా నిలుస్తారు. మొత్తమ్మీద ఈ వారం మీకు చాలా అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది.

మీకో శుభవార్త. POPxoShopలో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్, కుషన్స్ ఇంకా మరెన్నో ఉత్పత్తులపై 25% డిస్కౌంట్ అందిస్తున్నారు. డిస్కౌంట్  పొందడానికి POPXOFIRST కూపన్ కోడ్ ఉఫయోగించండి.

ఈ ఆర్టికల్స్ కూడా చదవండి

వృశ్చిక రాశి అమ్మాయిల ప్రత్యేకతలు ఏమిటో ఆంగ్లంలో చదివేయండి

వృషభ రాశి అమ్మాయిల ప్రత్యేకతలు ఏమిటో ఆంగ్లంలో చదివేయండి

ADVERTISEMENT

ధనురాశి అమ్మాయిల ప్రత్యేకతలు ఏమిటో ఆంగ్లంలో చదివేయండి

19 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT