ADVERTISEMENT
home / Life
తన పెళ్లిలో.. తనే డీజేగా మారిన ఓ పెళ్లి కూతురు కథ ఇది..!

తన పెళ్లిలో.. తనే డీజేగా మారిన ఓ పెళ్లి కూతురు కథ ఇది..!

పెళ్లంటే ఇంతకుముందు వధువు (Bride) సిగ్గుపడుతూ వచ్చి.. పెళ్లిపీటలపై కూర్చోవడం మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమ్మాయిలు కూడా తమ పెళ్లిని (Wedding) తమకు ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అందుకే వివాహ వేదిక దగ్గరే.. ఏదో ఒక ప్రత్యేకమైన పని చేసి దాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు.

గతంలో పెళ్లి లెహెంగాతో డ్యాన్సులు చేస్తూ పాపులరైన అమ్మాయిలను మనం చూశాం. మరో పెళ్లికూతురు అయితే.. పెళ్లి తర్వాత తన భర్తను అత్తింటివారిని కార్లో తనే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లింది. ఇలాంటి ఆధునిక వధువులు అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో సబ్యసాచి వధువు కొత్త పద్ధతికి నాంది పలికి వార్తల్లో నిలిచింది. తను మరో కూల్ బ్రైడ్ అని చాటింది.

అషిత బండారీ కపూర్.. తను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్న వ్యక్తి సార్థక్ కపూర్‌ని వివాహమాడింది. వీరిద్దరి వివాహం శ్రీలంకలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో సంగీత్, మెహెందీ, హల్దీ వంటి ఫంక్షన్లన్నీ జరిగాయి. అయితే వీటన్నింటి కంటే అందరినీ ఆకర్షించిన విషయం మరొకటి ఉంది. అదేంటనుకుంటున్నారా? వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా కేవలం పెళ్లి కొడుకు పక్కన నిల్చోవడం.. వచ్చినవారితో కలిసి మాట్లాడి ఎంజాయ్ చేయడం మాత్రమే కాకుండా.. ఈ వధువు డెక్ దగ్గరికి వెళ్లి.. తనే డీజేగా మారింది. ఛలో ఇష్క్ లడాయే.. అనే పాటను మిక్స్ చేస్తూనే వరుడు సార్థక్‌తో కలిసి డ్యాన్స్ చేసింది.

ఈ కూల్ బ్రైడ్ అంతటితోనే ఆగలేదు. చక్కటి మూవ్స్‌తో డ్యాన్స్ చేస్తూ.. రిసెప్షన్‌‌క వచ్చినవారినే కాదు.. వీడియో చూసిన మనలాంటివాళ్లందరినీ కూడా ఆకర్షించేస్తోంది.

ADVERTISEMENT

డీజే మిక్సప్‌లో భాగంగా మెలోడీ పాటలను కూడా మిక్స్ చేయడం విశేషం. ఎడ్ షీరన్ పర్ఫెక్ట్ పాటకు వీరిద్దరూ ఎంతో పర్ఫెక్ట్ గా డ్యాన్స్ చేశారు. ప్రతి పెళ్లి కావాల్సిన అమ్మాయి.. కలలో తాను ఇలా డ్యాన్స్ చేస్తున్నట్లుగా వూహించుకునేలా చేశారు.

తమ పెళ్లిలో ప్రతిఒక్కటీ పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకున్నారీ వధూవరులు సార్థక్, అషితలు. తమ పెళ్లిలో అందరూ ఎంజాయ్ చేస్తే సరిపోదు.. తామూ ఎంజాయ్ చేయాలనుకొని కాస్త డిఫరెంట్‌గా ప్రయత్నించిన వీరి కొత్త ఆలోచనకు ప్రతిఒక్కరూ ముగ్ధులైపోతున్నారు.

ఈ పెళ్లి శ్రీలంకలోని వెల్లిగామా బే మారియట్ రిసార్ట్ అండ్ స్పాలో జరిగింది. ఈ పెళ్లికి చేసిన డెకరేషన్ నుంచి ప్రతి ఏర్పాట్లు అద్భుతం అనిపించేలా ఉన్నాయని బంధుమిత్రులు చెప్పడం విశేషం. వాళ్లు చెప్పడం ఎందుకు.. ఈ ఫోటోలు చూసేయండి మీకే అర్థమైపోతుంది. అద్భుతమైన వివాహం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తోంది కదా. ఇవి చూసి మీకూ పెళ్లిపై మనసు మళ్లితే మేం బాధ్యులం కాదండోయ్.

1

ADVERTISEMENT

2

3

39790053 1908146162814900 6916505863351959552 n

ఈ వ‌ధువు త‌నకు కాబోయే భ‌ర్త‌కు మేక‌ప్ చేసింది.. ఎందుకంటే?

ADVERTISEMENT

ఈ వ‌ధువులు త‌మ భ‌ర్త‌ల‌కు తాళి క‌ట్టారు.. కానీ ఇది “జంబ‌ల‌కిడిపంబ” కాదు..!

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నిఖాతో ఒక్క‌టైన ప్రేమ‌జంట.. ఆర్య‌ – సాయేషా..!

11 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT