ADVERTISEMENT
home / వెెడ్డింగ్
ప్రపంచమంతా తిరిగినా టెర్రస్ పైనే పెళ్లి చేసుకుంది.. ఎందుకంటే..?

ప్రపంచమంతా తిరిగినా టెర్రస్ పైనే పెళ్లి చేసుకుంది.. ఎందుకంటే..?

పెళ్లి (wedding).. అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. అందుకే దాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకోవడం ఎంతో సహజం. సాధారణంగా ఏ అందమైన ప్రదేశానికో వెళ్లినప్పుడు.. అక్కడి లొకేషన్లను చూసే ప్రతి అమ్మాయి తాను కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది? అని అనుకోవడం సహజం. పెళ్లి కాని ప్రతి అమ్మాయి తన పెళ్లి.. ఎవరితో.. ఎక్కడ.. ఎలా.. జరగాలో అని కలలు కనడం కూడా సహజమే. అందరు అమ్మాయిల్లాగే దిల్లీకి చెందిన సనా కూడా తన పెళ్లి ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలని భావించింది.

 

ట్రావెల్ ఫ్రీక్ అయిన సనా.. ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలను చుట్టొచ్చింది. ఆమెను చూసిన చాలామంది మామూలుగానే ఇన్ని దేశాలు చుట్టే అమ్మాయి.. పెళ్లి ఎంత చక్కటి వేదికలో చేసుకుంటుందో అని భావించారు. కానీ వారందరి అంచనాలను తప్పుగా చేస్తూ తన ఇంటి పైన టెర్రస్‌నే (terrace)  తన పెళ్లి వేదికగా మార్చేసింది సనా. అంతేకాదు.. తన ఇంట్లోనే పెళ్లి చేసుకోవడానికి ఓ కారణం కూడా ఉందంటోంది ఆమె. దిల్లీలోని సౌల్ టు సోల్ స్టూడియో సీఈవో అయిన సనా.. తన బాయ్ ఫ్రెండ్ సిద్ధాంత్ మిట్టల్‌ని కేవలం తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, దగ్గరి బంధువుల మధ్య మాత్రమే పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన అన్ని వేడుకలు వారి ఇంట్లోనే జరగడం విశేషం.

ఇంతకీ సనా విద్యాలంకర్ తన ఇంటి టెర్రస్ పై పెళ్లి చేసుకోవడానికి కారణమేంటంటారా? “ప్రపంచంలో ఏ అమ్మాయి వివాహం చేసుకోని చోట నేను చేసుకోవాలనుకున్నా. ఫంక్షన్ హాల్స్, ఫార్మ్ హౌజ్‌లు లేదా డెస్టినేషన్ వెడ్డింగ్.. ఇవన్నీ అందరు అమ్మాయిలు ఎంచుకునేవే. కానీ నేను మాత్రం అసలు ఎవరూ పెళ్లాడని ప్రత్యేక ప్రదేశంలో పెళ్లి చేసుకోవాలనుకున్నా. అందుకే నా ఇంటి టెర్రస్ పైనే పెళ్లి ప్లాన్ చేశాం. మా ఇల్లు చిన్నతనం నుంచి నాకు ఎన్నో ఆనందకరమైన అనుభూతులను మిగిల్చింది. వాటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మధురానుభూతులను మరింత మధురంగా మార్చుకునేందుకు నా పెళ్లిని కూడా నాకెంతో ఇష్టమైన మా డాబా మీద చేసుకోవాలని భావించాను” అని తెలిపిందామె.

ADVERTISEMENT

 

ఇందుకోసం తాను చేసిందల్లా ఖాళీగా ఉన్న తన టెర్రస్‌ని అందంగా డెకరేట్ చేసి.. అందమైన మండపం సెటప్ వేయించడమే.. తాజా పూలతో తయారుచేసిన ఈ మండపం టెర్రస్‌కి కొత్త అందాన్ని తీసుకురాగా.. తన జీవితంలో ఎన్నో మధురానుభూతులు అందించిన టెర్రస్ పై మనసైన వాడితో ఒక్కటైంది సనా. తనదైన ఈ సెటప్‌లో ఇంక ప్రపంచంలో ఏ అమ్మాయి పెళ్లాడలేదని.. నాది అనే ఆ ఫీలింగ్ కోసమే అక్కడ పెళ్లాడానని చెప్పింది సనా.

కేవలం పెళ్లి మాత్రమే కాదు.. కాక్ టెయిల్ ఫంక్షన్ నుంచి సంగీత్ , మెహెందీ, కలిరా ఫంక్షన్ వంటివన్నీ తన ఇంట్లోనే జరుపుకోవడం విశేషం. ఈ పెళ్లి సందర్భంగా డ్రింక్ తాగుతూ.. రణ్ వీర్ సింగ్, సోహా అలీ ఖాన్ నటించిన సింబా చిత్రంలోని “ఆంఖ్ మారే.. ఓ లఢ్ కీ ఆఖ్ మారే” అనే పాటకు తన స్నేహితులతో కలిసి సింపుల్ స్టెప్స్‌తో అద్భుతంగా నాట్యం చేసి ఆకట్టుకుంది ఈ వధువు.

ఈ వధూవరుల మెహెందీ, సంగీత్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారుతున్నాయి. అవి మీరూ చూసేయండి.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి.

స్నేహితురాలి పెళ్లిలో.. సమంత సందడి చూశారా?

తను వచ్చేవరకూ తాళి కట్టనన్నాడు : సౌందర్యా రజనీకాంత్

తన పెళ్లిలో.. తనే డీజేగా మారిన ఓ పెళ్లి కూతురు కథ ఇది..! 

ADVERTISEMENT
06 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT