ADVERTISEMENT
home / Bollywood
బ్లాండ్ జుట్టుతో అనుష్క.. ఎలా ఉంటుందో మీకు తెలుసా?

బ్లాండ్ జుట్టుతో అనుష్క.. ఎలా ఉంటుందో మీకు తెలుసా?

అనుష్కా శ‌ర్మ‌(Anushka sharma).. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌.. బాలీవుడ్‌లో ప‌న్నెండేళ్ల కెరీర్‌లో ఆమె ఎన్నో లుక్స్‌ని ప్ర‌య‌త్నించింది. “పీకే” సినిమాలో పొట్టి జుట్టుతో క‌నిపించిన అనుష్క‌.. “సంజు” సినిమాలో ఉంగ‌రాల జుట్టుతో మెరిసిపోయింది. ఇవే కాదు.. కొన్నిసార్లు పొడ‌వు జుట్టుతో.. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో పొట్టి జుట్టుతో.. ఎన్నో విభిన్న‌మైన‌ లుక్స్‌లో క‌నిపించింది.

వివిధ సినిమాల్లో త‌న పాత్ర కోసం జుట్టుకు రంగు కూడా వేసుకుంది అనుష్క‌. మ‌రి, అలాంటి అందాల తార తెలుపు రంగు బ్లాండ్ జుట్టుతో క‌నిపిస్తే ఎలా ఉంటుంది? దీని కోసం మీరు ప్ర‌త్యేకంగా ఎలా ఉంటుందో అని వూహించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఈ అమ్మాయిని చూస్తే చాలు..

julia1 69714

అవును.. అచ్చం అనుష్క‌లా క‌నిపించే ఈ యువ‌తి నిజానికి అనుష్క కాదు. మ‌నల్ని పోలిన వారు ఏడుగురు ఉంటార‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అలా అచ్చం అనుష్క‌ను పోలిన ఈ అమ్మాయిని గుర్తించారు అనుష్క ఫ్యాన్స్‌. ఆమె ఎలా ఉంటుందంటే న‌లుపు రంగు జుట్టుంటే చాలు.. అచ్చం అనుష్క‌లాగే క‌నిపిస్తుంది. ఇద్ద‌రూ క‌వ‌ల‌ పిల్ల‌లేమో అనుకునేలా మొత్తం ఒకేలా ఉన్నారు ఈ ఇద్ద‌రూ. కొంత‌మంది ట్విట్ట‌ర్ యూజ‌ర్ల‌యితే.. అప్పుడ‌ప్పుడూ విభిన్నంగా మేక‌ప్ వేసుకుంటే అనుష్క‌ను త‌నే అని గుర్తించ‌లేమేమో గానీ.. ఈ అమ్మాయిని మాత్రం అనుష్క అని గుర్తించ‌డంలో ఎలాంటి ఇబ్బందీ ఉండ‌దు అని ట్వీట్లు చేస్తున్నారు.

ADVERTISEMENT

julia2 3091908

అయితే అనుష్కలా ఉన్న ఈ అందాల భామ కూడా సాధార‌ణ వ్య‌క్తేమీ కాదు.. 25 సంవ‌త్స‌రాల జూలియా మైఖేల్స్(Julia michaels) అమెరిక‌న్ గాయ‌ని, పాట‌ల ర‌చ‌యిత కూడా. ఆమె పాట‌లు గ్రామీ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఆమె మ‌రో ప్ర‌ముఖ అమెరిక‌న్ గాయ‌ని సెలెనా గోమెజ్‌తో క‌లిసి యాంగ్జైటీ అనే వీడియోని కూడా రూపొందించారు. తాజాగా ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లిన జూలియా అక్క‌డ త‌న జుట్టుకు రంగు వేసుకుంది.

ఆమె బ్లాండ్ హెయిర్‌ని చూపుతూ పోస్ట్ చేసిన ఫొటో పాపుల‌ర్‌గా మారింది. “ఆస్ట్రేలియ‌న్ వాతావ‌ర‌ణానికి నా జుట్టు రంగు చ‌క్క‌గా న‌ప్పుతుంది” అంటూ జూలియా పోస్ట్ చేసిన ఫొటో చూసిన చాలామంది ఆమెను అనుష్క‌నే అనుకున్నారు. ఇదే స‌మ‌యానికి అనుష్క కూడా త‌న భ‌ర్త విరాట్ కొహ్లీతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో విహార‌యాత్ర‌లో ఉండ‌డం కూడా ఆ ఫొటో నిజంగానే అనుష్క‌దేమో అనుకునేలా చేసింది. చాలామంది అభిమానులు అనుష్క పేరెందుకు మార్చుకుంద‌ని విరాట్ కొహ్లీని కూడా అడిగార‌ట‌. అప్పుడే వీరికి కూడా అనుష్క పోలిక‌ల‌తో మ‌రో వ్య‌క్తి ఉన్న విష‌యం తెలిసింది.

ఇదే స‌మ‌యంలో భార‌త్‌కి చెందిన జూలియా అభిమానులు కూడా ఆమెకు అనుష్క గురించి చెబుతూ భార‌త్‌లో అచ్చం త‌న‌లాగే ఉండే హీరోయిన్ ఉంద‌ని చెప్పార‌ట‌. దీంతో అనుష్క‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది జూలియా. మ‌నిద్ద‌రం క‌వ‌ల పిల్ల‌లమేమో.. అంటూ ట్వీట్ చేసింది. దీనికి స‌మాధాన‌మిస్తూ దేవుడా.. నిజ‌మే నాలా ఇంకొక‌రున్నారు. “నేను నీ కోసం, మ‌న‌లా ఉన్న మ‌రో ఐదుగురి కోసం జీవితమంతా వేచి చూస్తున్నా” అంటూ స‌మాధాన‌మిచ్చింది అనుష్క. ఒక్క‌సారిగా భార‌త్‌లో వేలాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న జూలియా.. దీపికా ప‌దుకొణె న‌ట‌నంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని అభిమానుల‌తో పంచుకుంది.

ADVERTISEMENT

julia3 2052660

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే జూలియాని చూసిన త‌ర్వాత అనుష్క కూడా బ్లాండ్ హెయిర్‌లో చాలా అందంగా ఉంటుంద‌ని.. ఆ త‌ర‌హా రంగును ఓసారి ప్ర‌య‌త్నించ‌మ‌ని ఆమెను కోరుతున్నారు అభిమానులు. ఈ త‌ర‌హా జుట్టు రంగు మ‌న భార‌తీయ చ‌ర్మ‌ఛాయ‌కు అంత‌గా న‌ప్ప‌దు. గ‌తంలో ఓసారి ఓ మ్యాగ‌జైన్ షూట్ కోసం ఈ రంగు జుట్టుతో ఉన్న‌ విగ్‌ని ధ‌రించిన ప్రియాంక‌కు అభిమానుల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. అయితే అనుష్క విష‌యంలో మాత్రం ఇలాంటిది జ‌ర‌గ‌ద‌నే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బ్లాండ్ హెయిర్ ఆమెకు అందంగా న‌ప్పుతుంద‌ని జూలియాని చూస్తే తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే అనుష్క‌, జూలియాల గురించి ట్విట్ట‌ర్లో చాలా ర‌కాల ఫ‌న్నీ కామెంట్లు, మీమ్స్ వ‌స్తున్నాయి. అందులో కొన్ని ఇక్క‌డ చూడండి..

ఇవి కూడా చ‌ద‌వండి..

ప్రియాంక‌ని పోలి ఉన్న అమ్మాయి గురించి ఆంగ్లంలో చ‌ద‌వండి.

ADVERTISEMENT

సెలెనా గోమెజ్‌లా క‌నిపించే సోఫియా సొలారెస్ గురించి ఆంగ్లంలో చ‌ద‌వండి.

అచ్చం టైగ‌ర్ ష్రాఫ్‌లా క‌నిపించే వ్య‌క్తి గురించి ఆంగ్లంలో చ‌ద‌వండి.

06 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT