ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఉంగరం తొడగాలా? ప్రేమ లేఖ ఇవ్వాలా? అతడికి ఎలా ప్రపోజ్ చెయ్యాలి? (How To Propose A Boy In Telugu)

ఉంగరం తొడగాలా? ప్రేమ లేఖ ఇవ్వాలా? అతడికి ఎలా ప్రపోజ్ చెయ్యాలి? (How To Propose A Boy In Telugu)

రిలేషన్ షిప్ విషయానికి వచ్చేసరికి అబ్బాయిలే తమకు ప్రపోజ్ చేయాలని కోరుకొంటారు అమ్మాయిలు. ఓ విషయం చెప్పండి అమ్మాయిలు..? మీరు ఇష్టపడుతున్న వారే వచ్చి మీకు ప్రపోజ్ చేసేంత వరకు ఎదురు చూసి టైం వేస్ట్ చేసుకొంటారా? లేక వారికి మీ ప్రేమను వ్యక్తం చేసి వారితో హాయిగా ఎంజాయ్ చేస్తారా? రెండోదే సరైనదిగా అనిపిస్తోంది కదా..! ఈ ఆలోచన వచ్చిన వెంటనే మనం చేసే పనేంటి? వెంటనే గూగుల్ తల్లిని అడుగుతాం.

అక్కడ వందల కొద్దీ కనిపించే సెర్చ్ రిజల్ట్స్ లో దేన్ని ఎంచుకోవాలో తెలియక తికమకైపోతాం. కానీ అమ్మాయిలు ఇలాంటి ఇబ్బంది పడకూడదనే మా ఉద్దేశం. ‘ఇతడే నా మానసచోరుడు’ అనుకొని మనసులోనే మురిసిపోయే అమ్మాయిలను కాస్త వెన్నుతట్టి.. తమకు నచ్చిన వ్యక్తికి తమ ప్రేమను ఎలా తెలియజేయాలో చెప్పాలనుకొంటున్నాం.

అబ్బాయికి ఎలా ప్రపోజ్ చేయాలి?

మీరు ప్రతిపాదించడానికి చేయగల విషయాలు 

ADVERTISEMENT

తరచూ అడిగే ప్రశ్నలు

అబ్బాయికి ఎలా ప్రపోజ్ చేయాలి? (How To Propose A Boy In Telugu)

ఓ అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరికి వెళ్లి ‘విల్ యూ మ్యారీ మీ?’ అనడగాలంటే.. ఎంతో ధైర్యం కావాలి. అంతకంటే ముందు మీ మనసులోని ఎన్నో ప్రశ్నలకు సమాధానం కావాలి. ఒక వ్యక్తికి ప్రేమను తెలిపేముందు అమ్మాయిగా కొన్ని విషయాల్లో స్పష్టత తెచ్చుకోవాలి. అలాగే అతడి ఇష్టాయిష్టాలు, అభిరుచులు వంటివి కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎలా ప్రపోజ్ చేయాలనే విషయం గురించి ఆలోచించాలి.

ఆసక్తులను గుర్తించాలి..(Identify The Interests)

మీరు ఇష్టపడుతున్న అబ్బాయిని డేట్ కి పిలవడానికి లేదా ప్రేమను వ్యక్తం చేయడానికి లేదా పెళ్లి చేసుకోమని అడగడానికి ముందే మీరు వారి ఇష్టాయిష్టాలేంటో తెలుసుకోవాలి. ఇలాంటివి తెలుసుకోవడం వల్ల మీరు చాలా సులువుగా ప్రపోజ్ చేయచ్చు. దానికి తగిన విధంగా ముందే ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు మనసిచ్చిన వ్యక్తికి ట్రెక్కింగ్ లేదా క్యాంపింగ్ వంటి వాటిపై  ఆసక్తి ఉంటే..  అలాంటి సందర్భాల్లోనే మీరు ప్రపోజ్ చేయడం ద్వారా వారి మనసుని గెలుచుకోవచ్చు. సినిమాలంటే ఆసక్తి ఉంటే.. రోజంతా సినిమా చూస్తూ గడిపి చివరిలో ప్రపోజ్ చేయండి. మీరు కేవలం మీ ప్రేమను వ్యక్తం చేసి ఊరుకోకుండా.. పువ్వులు, చాక్లెట్లు, వారి మనసుకి నచ్చే వస్తువులను బహుమతులుగా అందించండి. ఎందుకంటే మీరు ప్రపోజ్ చేసే రోజు అతనికి మరపురానిదిగా ఎప్పటికీ నిలిచిపోవాలి కదా..!

4 How To Propose A Boy In Telugu

ADVERTISEMENT

నెమ్మదిగా ప్రారంభించండి..(Start Slowly)

ఒక్కసారిగా మీ మనసులోని మాటను అతడి ముందుంచితే.. వెంటనే సమాధానం చెప్పలేకపోవచ్చు. కాబట్టి నెమ్మదిగా అతనికి విషయం అర్థమయ్యేలా చేయాలి. ఎందుకంటే మీరు అతనికి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. కాని షాక్ ఇవ్వాలనుకోవడం లేదు కదా..! అందుకే ముందుగా మీరు అతనితో కలసి జీవితాన్ని ప్రారంభించాలనుకొంటున్న విషయాన్ని అతనికి తెలియజేయండి. మీరు ఇష్టపడుతున్న వ్యక్తికి పెళ్లి చేసుకోవాలనే ప్రతిపాదన తీసుకెళుతున్నట్లయితే దాన్ని నేరుగా చెప్పడం కాకుండా.. ఇన్ డైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేయండి.

అసలు అబ్బాయికి ఇన్ డైరెక్ట్ గా ఎలా ప్రపోజ్  చేస్తాం? (How To Propose Directly)

1. మీరు ఓ అబ్బాయిని ఇష్టపడుతున్న విషయం లేదా అతన్ని పెళ్లి చేసుకోవాలనుకొంటున్న విషయాన్ని అతని దగ్గర కాకుండా.. అతని స్నేహితుని దగ్గర ప్రస్తావించండి. తర్వాత వాళ్లిద్దరూ మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పిన అంశం చర్చకు వస్తుంది. అలా అతనికి మీ మనసు గురించి తెలుస్తుంది.

2. మీరు మనసు పడుతున్న వ్యక్తి కుటుంబం గురించి తెలుసుకోండి. అతని కుటుంబ సభ్యులు, తోబుట్టువుల గురించి అడగండి. మీరు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకొంటున్నారనే విషయం అంతర్లీనంగా తెలియజేసే అద్భుతమైన మార్గమిది.

3. మీతో భవిష్యత్తు గురించి అతన్ని వూహించుకోమనండి. అదే భవిష్యత్తుని మీరెలా చూశారో చెప్పండి. కచ్చితంగా వారికి అర్థమవుతుంది.

ADVERTISEMENT

సమయం, సందర్భం రెండూ ముఖ్యమే (Time And Situation Is Important)

6 How To Propose A Boy In Telugu

మంచి సందర్భం చూసుకొని సరైన సమయంలో మీ మనసులోని కోరికను మీరు ప్రేమిస్తున్న వ్యక్తికి తెలియజేసినట్లయితే.. వారు కాదనగలరా? అందుకే ప్రపోజ్ చేయడానికి సమయం, సందర్భం కావాలంటున్నాం. మీ పుట్టిన రోజు, మీరు ప్రేమిస్తున్న వ్యక్తి పుట్టిన రోజు లేదా మీ ఇద్దరి స్నేహం మొదలైన రోజు.. ఇలాంటి రోజుల్లో మీరు మీ మనసులోని విషయాన్ని తెలియజేస్తే.. ఆ రోజు మరింత స్పెషల్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.

మీరిద్దరూ ఆర్థికంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నారని భావించినప్పుడే మీరు మీ బంధాన్ని మరో మెట్టు ఎక్కించేందుకు ప్రయత్నించండి. ‘విల్ యూ మ్యారీ మీ?’ లేదా ‘విల్ యూ బీ విత్ మీ?’ అనే ప్రశ్న అడిగే ముందు అతన్ని వచ్చే ఐదేళ్లకు గాను అతని ప్రణాళిక అడిగి తెలుసుకోండి. అందులో ప్రేమ, పెళ్లి వంటి గురించి ప్రస్తావనకు వస్తే నిర్భయంగా మీరు మీ ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ఈ సమాధానం విన్న వెంటనే కాకుండా.. మంచి టైం చూసుకొని ప్రేమ లేదా పెళ్లి ప్రస్తావన తీసుకురండి. దాన్ని మరింత అందంగా తెలియజేసే బహుమతి అందించండి. ఆ ప్రపోజ్ చేసే విధానం సమ్ థింగ్ స్పెషల్ అనిపించేలా చూసుకోండి. అబ్బాయి మీకు, మీ ప్రేమకు కచ్చితంగా ఫిదా అయిపోతాడు.

జీవితాంతం కలిసుందామని ఎలా ప్రపోజ్ చేయాలి? 

ఒక వ్యక్తిని కొంత కాలం పాటు నిశితంగా గమనించిన తర్వాత అతనితో కలసి జీవితాన్ని పంచుకొంటే బాగుంటుందని మీ మనసుకి అనిపించవచ్చు. మరి వారికి ఈ విషయాన్ని చెప్పేదెలా? అది కొంచెం కష్టమే. అతని ఇష్టాయిష్టాలు మీకు బాగా తెలిసినట్లయితే అది కొంత సులభతరమవుతుంది. మీరు ఏది ప్లాన్ చేసినా ఇద్దరూ సంతోషంగా దాన్ని ఎంజాయ్ చేయాలి. ఆ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకోవాలి. మీరు ఇష్టపడుతున్న వారి అభిరుచిని, వారి వ్యక్తిత్వాన్ని బట్టి వారితో సమయం గడపడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేయండి.

ADVERTISEMENT

మీరు ప్రతిపాదించడానికి చేయగల విషయాలు (Tips To Propose A Guy)

5 How To Propose A Boy In Telugu

1. రొమాంటిక్ డిన్నర్ డేట్ (Romantic Dinner Date)

మీ బాయ్ ఫ్రెండ్ రొమాంటిక్ గా ఉండే వ్యక్తి అయితే వారికోసం సర్ప్రైజ్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాుటు చేయండి. ఇది అతనికి నచ్చిన రెస్టారెంట్ లో అయితే మంచిది. వారికోసం షాంపెయిన్ బాటిల్ ఆర్డర్ చేసి మీ మనసులోని మాటను వారితో చెప్పండి.

2. అడ్వెంచర్ ప్లాన్ చేసి..(Plan An Adventure Trip)

మీరు మనసిచ్చిన అబ్బాయి.. ప్ర‌కృతితో మమేకమై సమయం గడపడానికి ఇష్టపడే వ్యక్తి అయితే.. చక్కటి కొండ ప్రదేశాన్ని ఎంచుకొని ట్రెక్కింగ్, క్యాంపింగ్ వంటివి ఏర్పాటు చేయండి. ఇక్కడికి మీ స్నేహితులందరితోనూ కలసి వెళ్లినా.. మీ ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు మీ మనసులోని మాటను వారి చెవిన వేయండి.

3. మూవీ సర్ ప్రైజ్(Plan A Movie Date)

మీరు ఇష్టపడుతున్న వ్యక్తికి సినిమాలంటే ఆసక్తి ఎక్కువ ఉంటే.. వారికి నచ్చిన హీరో సినిమాకు తీసుకెళ్లండి. టిక్కెట్లు మీరే తీయండి. ఇంటర్వెల్ వరకు ఎదురు చూసి వారికి మీ ప్రేమను గురించి చెప్పండి. పబ్లిక్ లో ఇలా చేయడం ఇష్టం లేని వ్యక్తి అయితే.. అదే ప్లాన్ ను నాలుగ్గోడల మధ్య అమలు చేయండి. అతనికి బాగా నచ్చే రొమాంటిక్ సినిమాను ఎంచుకొని మరీ చూడండి.

ADVERTISEMENT

4. ఫన్ డే అవుట్( A Fun Day Out)

1 How To Propose A Boy In Telugu

రోజంతా ఫన్ యాక్టివిటీస్ తో కాలం గడిపేసే వ్యక్తి అయితే సరదాగా ట్రాంపోలిన్ పార్క్ లేదా అడ్వంచర్ పార్క్ కి తీసుకెళ్లండి. చిన్నపిల్లాడిలా అక్కడ అతడు చేసే అల్లరికి మీరు మురిసిపోవడం మాత్రమే కాదు.. ఆ రోజు మొత్తం గడిచిన తర్వాత.. ‘జీవితాంతం నా తోడుగా నువ్వుంటే.. ఇలాగే ప్రతి రోజు సరదాగా గడిపేద్దాం. నీకిష్టమేనా?’ అని అడగండి.

5. అక్షర రూపంలో..(Write Some Lines For Them)

మీ మనసులోని భావాలను మరింత బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే.. లేఖలను మించిన మార్గం మరొకటి లేదు. కానీ ప్రపోజ్ చేయాలనుకొన్న సందర్భంలో కాస్త సృజ‌నాత్మ‌కంగా ఉంటే బాగుంటుంది కదా. దానికోసం చిన్న చిన్న కాగితాలపై అతనంటే మీకెందుకిష్టమో  ఒక్కొక్క లైన్ రాయండి.

వాటిని అతడు రోజూ కచ్చితంగా వాడే వస్తువులున్న చోట ఉంచండి. అంటే పర్సులో, ఫోన్ హోల్డర్ దగ్గర, అద్ధం దగ్గర ఇలా అన్నమాట. అలాగే అతనితో మీరెందుకు జీవితం గడపాలనుకొంటున్నారో కూడా కాగితంపై రాసి ఒక్కొక్కటిగా అందించండి. చివరి వరకు మీరే వాటిని ఇస్తున్నారనే విషయం అతనికి తెలియకుండా జాగ్రత్తపడండి. చివరిగా మీ మనసులోని మాటను బయట పెట్టండి. ఇక అతనికి నో అని చెప్పడానికి అవకాశమే ఉండదు.

ADVERTISEMENT

6. అందమైన పూలతో..(Using Flowers For Showing Your Love)

మీకు ఖర్చు పెట్టే తాహతున్నట్లయితే అలా ఖర్చు చేయడం మీ ప్రియుడికి ఇష్టమైతే.. మీరు గ్రాండ్ గా ప్రపోజ్ చేయొచ్చు. వందల కొద్దీ పేర్చిన పూల మధ్య.. వినసొంపైన లైవ్ బ్యాండ్ సంగీతం తోడుగా.. అందమైన సరోవరం చెంత.. ఫ్యాన్సీ డిన్నర్ ఏర్పాటు చేయండి. అక్కడ మీరు మీ మనసులోని మాటను మీ మనోహరుడికి చెప్పండి. కచ్చితంగా ఎస్ అనే సమాధానమే మీకు వస్తుంది. మరొక్కమాట.. ఈ అందమైన క్షణాలను ఫొటోల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్ ని పెట్టుకోవడం మాత్రం మరచిపోవద్దు.

7. ఉంగరాన్ని తొడిగి..(Give Them A Ring)

మీ ప్రేమను తెలియజేసే విధంగా ఒక అందమైన ఉంగరాన్ని కొనండి. దాన్ని అతని వేలికి తొడిగి.. మీరు తనని ఎంతగా ఇష్టపడుతున్నారో చెప్పండి. కుదిరితే దీన్ని ఓ అందమైన కవిత రూపంలో వర్ణించి ఆ తర్వాత అడగండి.. ‘నన్ను నీ దాన్ని చేసుకొంటావా?’ అని.

2 How To Propose A Boy In Telugu

తరచూ అడిగే ప్రశ్నలు (FAQ’s)

ప్రపోజ్ చేసినప్పుడు నో చెప్తే?(What If They Say No)

ఈ ప్రపంచంలో మనం కోరుకొన్నది ఏదీ అంత సులభంగా రాదు. వారు ఒకవేళ మీ ప్రతిపాదనను తిరస్కరించినట్లయితే.. మీరంటే ఇష్టం లేకపోవడం వల్ల అతడు అలా చేసి ఉండకపోవచ్చు. బహుశా ప్రస్తుతం అతడున్న పరిస్థితులు మీ ప్రతిపాదనకు ఆమోదం తెలియజేసే విధంగా ఉండకపోవచ్చు.

ADVERTISEMENT

కాబట్టి వారి పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు సాగిపోవడం మంచిది. అలాగే మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మిమ్మల్ని తిరిగి ఇష్టపడాలని కూడా లేదు.  అలాంటి సందర్భంలో అతను మీ సోల్ మేట్ కాదని గుర్తించండి. మీకోసం మరో వ్యక్తి ఎదురుచూస్తూ ఉండి ఉండొచ్చు. ఏది జరిగినా మన మంచికే అనే ఆలోచనతోనే ముందుకు సాగిపోవాలి తప్ప.. అనసవరంగా బాధపడకూడదు.

ఫొటోగ్రాఫర్ ని నియమించుకోవాలా?(Should You Appoint A Photographer)

అది మీరున్న పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరిద్దరే ఉన్నట్లయితే.. ఫొటోగ్రాఫర్ అవసరం ఉంటుంది. అలా కాకుండా మీ స్నేహితుల మధ్య మీరు ప్రపోజ్ చేస్తున్నట్లయితే.. వారిలోనే  చక్కటి ఫొటోగ్రఫీ నైపుణ్యాలున్నవారిని ఫొటోలు తీయమని అడగండి.

అతడి కుటుంబానికి చెప్పాలా?(Tell Your Family About That)

అది పూర్తిగా మీకు వారితో ఉన్న అనుబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.  మీ ప్రేమికుడి తల్లిదండ్రులను, తోబుట్టువులతో మీకింతకు ముందే పరిచయం ఉండటంతో పాటు వారికి మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధంపై ఎంతవరకు అవగాహన ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా వారికి విషయం చెప్పాలా? వద్దా? అని మీరే నిర్ణయం తీసుకోండి. 

స్నేహితులను ఇందులో భాగస్వాములను చేయాలా?(Being Friends With Thier Friends)

అతడి స్నేహితులతో మీకు పరిచయం ఉండటంతో పాటు.. వారితో మీరిద్దరూ ఎంతో కొంత సమయాన్ని గడిపి ఉన్నట్లయితే కచ్చితంగా వారిని కూడా భాగస్వాములను చేయండి. ఎందుకంటే వారు మీకు మద్ధతుగా నిలుస్తారు. అంతేకాదు.. మీ మధురక్షణాలను వారు తమ అల్లరితో మరింత మధురంగా మార్చేస్తారు.

ADVERTISEMENT

అమ్మాయిలూ మరింకెందుకాలస్యం.. మీ మనసు దోచుకొన్న మనోహరుడికి వెంటనే propose చేసేయండి మరి.

09 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT