ఇలియానా (Ileana D’Cruz).. అందమంతా తనలోనే దాచుకుందా..? అన్నట్లుగా మెరిసే ఈ గోవా బ్యూటీ.. రామ్ సరసన దేవదాసు చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో కథానాయికగా కనిపించిన ఆమె.. బాలీవుడ్‌లోనూ చాలా సినిమాల్లో నటించింది. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో పడిన ఇలియానా.. ఈ మధ్యే అతడి నుంచి విడిపోయింది.
తన సోషల్ మీడియా అకౌంట్లలో అతడితో కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేసేసింది. అప్పటి నుంచి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ.. సన్నిహితులతో కలిసి గడుపుతూ.. తనని తాను బిజీగా ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది ఇలియానా. అయితే తాజాగా తనకున్న ఓ సమస్య గురించి.. ట్విట్టర్‌లో ఆమె పెట్టిన పోస్ట్ అందరినీ ఆమె గురించి కంగారు పడేలా చేస్తోంది.
ఈ ట్వీట్‌లో భాగంగా ఇలియానా తన సమస్యను గురించి పేర్కొంది. తాను ఉదయం లేవగానే తన కాళ్లపై తనకు తెలియకుండానే గాయాలు, గీరుకుపోయిన గుర్తులు కనిపిస్తున్నాయని తెలిపింది. తనకు రాత్రి నిద్రలో నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుందని కూడా ట్వీట్ చేసింది ఇలియానా. ‘నేను నిద్రలో నడుస్తున్నానని (Sleep walking) నమ్మడం కష్టంగా ఉంది. కానీ అదే నిజమేమో అనిపిస్తోంది. అది మాత్రమే కాకుండా.. నేను ఉదయం లేవగానే.. నా కాళ్లపై గాయాలు ఎలా అవుతున్నాయో ఊహించేందుకు నాకు మరో కారణం కనిపించడం లేదు’ అంటూ ట్వీట్ చేసింది.
ఆ వెంటనే మరో ట్వీట్ చేసిన ఆమె ‘అర్థరాత్రి తాను తనకు తెలియకుండానే.. స్నాక్స్ తింటున్నానేమో’ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ‘షిట్.. అర్థరాత్రి నాకు తెలియకుండా ఫ్రిజ్ దగ్గరికి వెళ్లి మిడ్ నైట్ స్నాక్స్ తింటున్నట్లున్నా. నేనో స్లీప్ వాకింగ్ స్నాకర్‌ని.. ఇది నాకే కొత్తగా ఉంది’ అంటూ ట్వీట్ చేసింది ఇలియానా. ఇలియానా చేసిన ట్వీట్ కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారిపోయింది. ఫ్యాన్స్ ఆమె పై తమకున్న కేర్‌ని చూపుతూ ట్వీట్ చేయడం ప్రారంభించారు.
I’m almost entirely convinced that I sleep walk…..
Almost.
Maybe.
Probably.
–
There’s no other way to explain how I wake up with mysterious bumps and bruises on my legs 🤷🏻♀️— Ileana D'Cruz (@Ileana_Official) September 14, 2019
ఓ అభిమాని తనకో మంచి సలహా కూడా ఇచ్చారు. ‘మీ బెడ్ రూంలో సీసీ కెమెరాలను పెట్టించుకోండి. అసలు కారణమేంటో అర్థమవుతుందని’ అతను ట్వీట్ చేయగా.. మరో వ్యక్తి ఇలియానా ఇంట్లో దెయ్యాలున్నాయేమో అంటూ ట్వీట్ చేయడం విశేషం.
మరో ట్విట్టర్ యూజర్.. ‘మీరు పడుకున్న దగ్గరే నిద్ర లేస్తున్నారా? లేక ఇంకెక్కడైనా నిద్ర లేచారా? మీరు పడుకున్న చోట కాక.. మరే ప్రదేశంలో అయినా నిద్ర లేస్తే అది నిద్రలో నడవడమే.. అలా కాకుండా మీరు పడుకున్న చోటే ఉన్నా గాయాలవుతున్నాయంటే.. మీ గదిలో దెయ్యాలు ఉన్నాయేమో చూసుకోండి’ అంటూ ట్వీట్ చేశాడు. మరికొందరు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లమని ఆమెకు సలహా ఇచ్చారు. ఇవే కాదు.. తను నిజంగానే ఇలాంటి సమస్య ఎదుర్కుంటోందా.. లేక ఏదైనా హారర్ సినిమా ఒప్పుకొని దాని గురించి ఇలా పబ్లిసిటీ చేస్తోందా? అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు చాలామంది ఫ్యాన్స్.
అయితే ఆ తర్వాత దీని గురించి మరో ట్వీట్ ద్వారా సమాధానం చెప్పింది ఇలియానా. ‘నాకు స్నాక్స్ అంటే ఎంతో ఇష్టం. వాటిని ఎప్పుడూ తింటూ ఉంటాను. కొన్నిసార్లు అర్థరాత్రి కూడా.. అంతేకాదు.. రాత్రుళ్లు చీకట్లో నడవడం వల్ల నా కాళ్లకు అలా దెబ్బలు తగులుతున్నాయి. నేను చాలా వింత వ్యక్తిని.. అయితే ఇలాంటివాళ్లు చాలామందే ఉంటారు’ అంటూ ట్వీట్ చేసిందామె. ప్రస్తుతం ఈ గోవా బ్యూటీ అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పాగల్ పంతీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమెతో పాటు జాన్ అబ్రహాం, అనిల్ కపూర్, ఊర్వశీ రౌతేలా, క్రితీ కర్బందాలు కూడా కనిపించనున్నారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.