ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఈ అందాల తార‌ల ట్రావెల్ సీక్రెట్ల‌తో.. మీరూ అందంగా మెరిసిపోవ‌చ్చు!

ఈ అందాల తార‌ల ట్రావెల్ సీక్రెట్ల‌తో.. మీరూ అందంగా మెరిసిపోవ‌చ్చు!

సందర్భం ఏదైనా.. చ‌మ‌క్కుమంటూ అందంగా మెరిసిపోవాల‌ని ప్ర‌తి అమ్మాయి ఆశిస్తుంది. ముఖ్యంగా ఎక్క‌డికైనా వెళ్లేట‌ప్పుడు.. అంద‌రిలోనూ తానే ప్ర‌త్యేకంగా క‌నిపించాల‌ని భావిస్తుంది. కానీ అన్ని వేళ‌లా అందంగా క‌నిపించేందుకు మ‌న‌మేం సినిమా తార‌లం కాదు క‌దా. కానీ అందంగా క‌నిపించేందుకు కేవ‌లం తార‌లే కావాల్సిన అవ‌స‌రం లేదు. కొంచెం ప్రయత్నిస్తే.. ఎవరైనా తమను తాము అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.  సాధార‌ణంగా విమాన ప్ర‌యాణాల్లో (travel) పొడి వాతావ‌ర‌ణం, జెట్‌లాగ్ వంటి కార‌ణాల వ‌ల్ల చ‌ర్మం కాంతిని కోల్పోయి నిర్జీవంగా క‌నిపిస్తుంది. మ‌న‌కే కాదు.. మ‌నం ఫాలో అయ్యే నాయిక‌ల‌కు కూడా ఈ స‌మ‌స్య ఎదుర‌వుతుంది. కానీ కొందరు కొన్ని సీక్రెట్లు ఫాలో అవుతూ..  త‌మ చ‌ర్మాన్ని అందంగా క‌నిపించేలా చూసుకుంటారు. మ‌రి,  మనం కూడా ఏయే తార‌లు (celebrities) త‌మ అంద‌మైన లుక్ కోసం ఏమేం చేస్తారో చూద్దాం రండి..

1. అలియా భ‌ట్‌

అలియా భ‌ట్ సాధార‌ణంగా ఎక్క‌డికైనా వెళ్లేట‌ప్ప‌డు సింపుల్‌గా త‌యార‌య్యేందుకు ఆస‌క్తి చూపుతుంది. దుస్తులపై ఒక మంచి జాకెట్ వేసుకొని.. జుట్టును బ‌న్‌లాగా వేసుకుంటుంది. మేక‌ప్ కూడా చాలా సింపుల్‌గా ఉండేలా చూసుకుంటుంది. విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు పొడిగాలి వ‌ల్ల జుట్టు పాడ‌వుతుంది కదా. అలాగే దీనివ‌ల్ల ఫ్లైట్ దిగేస‌రికి మీ జుట్టు చెదిరిపోయి అంద‌విహీనంగా కూడా క‌నిపిస్తుంది. అందుకే మీరు అంద‌మైన జుట్టుతో ఫ్లైట్ దిగాలంటే అలియాలా బ‌న్ వేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి. మీకు బ‌న్ వేసుకోవ‌డం అంత‌గా ఇష్టం లేక‌పోతే.. మీతో పాటు ఒక డ్రై షాంపూ తెచ్చుకుంటే చాలు.. జుట్టు తిరిగి అందంగా మెరిసేలా చేసుకోవ‌చ్చు.

మీ ఫ్రెండ్స్‌తో గర్ల్స్ టూర్‌‌కి ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ ప్రదేశాలే సరైన ఎంపిక..!

ADVERTISEMENT

2. సోనాక్షి సిన్హా

సోనాక్షి ఎయిర్‌పోర్ట్ స్టైల్‌ని ఓసారి ప‌రిశీలిస్తే.. త‌నూ మ‌న‌లా చాలా సింపుల్ కనిపిస్తుంది. సింపుల్‌గా కుర్తా పైజామా, ఫ్లాట్స్‌తో పాటు.. స‌న్‌గ్లాసెస్‌ని జోడించిన సోనా కూడా తన జుట్టుకు బ‌న్ వేసుకోవ‌డం చూడ‌చ్చు. సాధార‌ణంగా ఫ్లైట్‌‌లో వెళ్లేట‌ప్పుడు మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవ‌డం మీకు ఇష్టం లేక‌పోతే.. సోనాక్షిలాగా క‌ళ్ల‌కు స‌న్‌గ్లాసెస్ పెట్టుకొని అల‌సిపోయిన క‌ళ్ల‌ను ఇత‌రులకు క‌న‌బ‌డ‌కుండా దాచిపెట్టుకోవ‌చ్చు. ఇక పెదాల‌కు లిప్‌బామ్ పెట్టుకోవ‌డం వ‌ల్ల ముఖం అల‌సిన‌ట్లుగా క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌వ‌చ్చు.

3. కంగ‌నా ర‌నౌత్

ఎక్కువ స‌మ‌యం పాటు విమానాల్లోనే గ‌డ‌పాల్సిన సంద‌ర్భాల్లో కంగ‌నలాంటి డ్రస్సింగ్ మ‌న‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది. వ‌దులుగా ఉండే డ్ర‌స్సు, దానితో పాటు ఓ స్కార్ఫ్‌, జాకెట్ ఫ్లైట్‌‌లో మ‌నం ఇబ్బందిప‌డ‌కుండా కాపాడ‌తాయి. ఇక ఒక మంచి మాయిశ్చ‌రైజ‌ర్ లేదా చ‌క్క‌టి నైట్ ప్యాక్ వెంట ఉంచుకోవ‌డం వ‌ల్ల.. ట్రావెల్ సమయంలో చర్మంలోని తేమ త‌గ్గ‌కుండా.. దిగే స‌మ‌యానికి చ‌ర్మం కాంతిహీనంగా క‌నిపించ‌కుండా చూసుకోవ‌చ్చు.

ADVERTISEMENT

4. క‌రిష్మా క‌పూర్‌

లేడీ బాస్ స్టైల్లో ప్ర‌యాణాలు చేయాలంటే.. క‌రిష్మాని ఫాలో అవ్వాల్సిందే. అలాగే అఫీషియ‌ల్‌గా క‌నిపించాలంటే.. చ‌క్క‌టి దుస్తులతో పాటు అంద‌మైన లుక్ కూడా కావాల్సిందే. దీనికోసం ఎక్కువ స‌మ‌యం పాటు నిలిచి ఉండే మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకొని.. పెదాల‌కు న్యూడ్ లిప్‌స్టిక్ రాసుకుంటే సింపుల్ లుక్‌తోనే అందంగా క‌నిపించ‌వ‌చ్చు.

5. క‌త్రినా కైఫ్‌

కంగ‌న మాదిరిగా క‌త్రినా కూడా ఎప్పుడు మేక‌ప్ సింపుల్‌గా ఉన్నా.. అద్భుత‌మైన చ‌ర్మంతో మెరిసిపోతూ ఉంటుంది. ఇందుకు చ‌ర్మంలోని తేమ‌ను కాపాడుకోవ‌డం కూడా ఒక మార్గం. దీనికోసం ఎక్కువ‌గా నీళ్లు తాగ‌డం, మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవ‌డంతో పాటు వీలుంటే చ‌క్క‌టి షీట్ మాస్క్ వేసుకోవ‌డం మంచిది. ముఖ్యంగా ఎక్కువ స‌మ‌యం పాటు ఫ్లైట్‌లో ఉండాల్సి వ‌స్తే మాత్రం మాస్క్ మ‌ర్చిపోవ‌ద్దు.

ADVERTISEMENT

మీకూ విహార‌యాత్ర‌ అంటే ఇష్ట‌మా? అయితే ఈ ల‌క్ష‌ణాలు మీకూ ఉంటాయి..

6. దీపికా ప‌దుకొణె

దీపిక ప్ర‌తి ఎయిర్‌పోర్ట్ లుక్‌లోనూ అందంగానే కనిపిస్తుంది. కానీ తాజాగా హ‌నీమూన్ నుంచి తిరిగొచ్చేట‌ప్పుడు మ‌రింత అద్భుతంగా క‌నిపించింది. త‌న లుక్ నుంచి మ‌నం నేర్చుకోవాల్సిన విష‌యాలు రెండు.. ఒక‌టి ఎక్క‌డికి వెళ్లినా వీలైనంత సింపుల్‌గా స్వెట్‌ష‌ర్ట్‌, ప్యాంట్‌, స్నీక‌ర్స్‌తో కనిపిస్తుంది దీప్స్‌. దానికి స‌న్‌గ్లాసెస్ కూడా జోడించ‌డంతో ముఖంలోని అల‌స‌ట బ‌య‌ట‌కు క‌నిపించ‌దు. అందుకే అవి లేకుండా దీపిక ఎప్పుడూ బ‌య‌ట‌కు రాదు.. ఇక దీపికలాంటి అంద‌మైన ముఖం కావాల‌నుకుంటే చ‌క్క‌టి బ్రాంజ‌ర్‌ని మీ ప‌ర్స్‌లో పెట్టుకోవ‌డం మ‌ర్చిపోవ‌ద్దు. బ‌య‌ట‌కు వ‌చ్చే ముందు మీ ముఖంపైన కాల‌ర్ బోన్స్ వ‌ద్ద కాస్త బ్రాంజ‌ర్ ట‌చ‌ప్ ఇస్తే మీరూ దీపిక‌లా మెరిసిపోవ‌చ్చు.

7. కియారా అద్వానీ

ADVERTISEMENT

ఎల్ల‌ప్ప‌డూ అద్భుత‌మైన స‌హ‌జ మెరుపుతో ఆక‌ట్టుకునే నాయిక‌ల్లో కియారా అద్వానీ ముందుంటుంది. త‌ను ఎక్క‌డికైనా వెళ్లేట‌ప్పుడు మేక‌ప్ వేసుకోవ‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌దు. మీరూ ఇలాంటి వారే అయితే.. ఫ్లైట్ స‌మ‌యంలో ఎక్కువ‌గా నిద్ర‌పోవ‌డానికి ఆస‌క్తి చూపించండి. ఒక‌వేళ మేక‌ప్ వేసుకోవ‌డానికి స‌మ‌యం లేకో.. ఇష్టంలేకో మేక‌ప్‌కి దూరంగా ఉంటే ఫేషియ‌ల్ మిస్ట్‌ని ప్ర‌య‌త్నించండి. అది మీ చ‌ర్మాన్ని తాజాగా మార్చుతుంది.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

10 Feb 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT