logo
Logo
home / వినోదం
విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’… ట్రైలర్ టాక్ మీకోసం

విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’… ట్రైలర్ టాక్ మీకోసం

‘నాకు కచ్చితంగా తెలుసు.. ఈ సినిమానే నా కెరీర్‌లో ఆఖరి లవ్‌స్టోరీ అని!! అందుకే ఈ సినిమాని మొత్తం ప్రేమతోనే నింపేసాము’- విజయ్ దేవరకొండ (vijay deverakonda).

వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ (world famous lover trailer) విడుదల సందర్భంగా హీరో విజయ్ చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇవి. అసలు విజయ్ ఏది చేసినా కూడా అది ఒక సంచలనమే! మరీ ముఖ్యంగా ఆయన తన కెరీర్‌లో ఎంచుకునే కథలు, మాట్లాడే మాటలు & చేసే ట్వీట్స్ కూడా అంతే వైవిధ్యంగా ఉంటున్న కారణంగా ఆయనను ఒక విలక్షమైన వాడిగా అందరూ గుర్తిస్తున్నారు.

RRR సినిమా విడుదల మళ్లీ వాయిదా : అందరినీ నిరాశపరిచిన రాజమౌళి

ఇక అటువంటిది.. నిన్నటి ప్రెస్ మీట్‌లో వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ (trailer) విడుదల సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఈ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ ఎలా ఉంది. ఆ ట్రైలర్ టాక్ (trailer talk) ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ముందుగా వరల్డ్ ఫేమస్ లవర్ (world famous lover) ట్రైలర్ చూడండి …

‘ఈ ప్రపంచంలో నిస్వార్ధమైనది ఏదైనా ఉందంటే … అది ప్రేమ ఒక్కటే! ఆ ప్రేమలో కూడా ‘నేను’ అనే రెండు అక్షరాలు ఓ సునామినే రేపగలవు. ఐ వాంటెడ్ టు బి ది వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ ఈ ట్రైలర్ మొదలవుతుంది. మనకి ఇందులో మొత్తం నాలుగు రకాల షేడ్స్‌లో విజయ్ దేవరకొండ కనిపిస్తాడు.

పార్టనర్‌గా రాశి ఖన్నా, వైఫ్‌గా ఐశ్వర్య రాజేష్, ఫాంటసీగా క్యాథరీన్ & గర్ల్ ఫ్రెండ్‌గా ఇసాబెల్‌లు మనకి కనిపించబోతున్నారు. అయితే ఈ నలుగురిలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌ల పాత్రలే ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఇద్దరి పాత్రలని డిజైన్ చేసిన విధానం బాగుంది.

ఇంతకి ఈ ట్రైలర్ చూసాక… ఇందులో విజయ్ దేవరకొండ నాలుగు పాత్రలు చేశాడా? లేక ఈ నాలుగు షేడ్స్ ఉన్న ఒక పాత్ర చేశాడా అన్న అనుమానం కలగక మానదు. అయితే ఆ వివరాలను మాత్రం మనకి సినిమా చూసి తెలుసుకోమని దర్శక నిర్మాతలు చెప్పడం జరిగింది.

Thappad Trailer Talk : భర్త చెంపదెబ్బ కొట్టినందుకు.. విడాకులు కోరిన భార్య కథ

ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి చిత్రాలు తీసిన క్రాంతి మాధవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  ఆయన సినిమాల్లో సంభాషణలు హత్తుకునేలా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా అందుకు మినహాయింపేమి కాదు. ఉదాహరణకి – ‘ఎవరు ఏది ప్రేమిస్తారో అది వాళ్ళకి దొరకాలి’ .. ఇలాంటి ఆలోచింపజేసే సంభాషణలను మనం ఇందులో చూడవచ్చు.

ఇక క్రియేటివ్ కమర్షియల్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ పై కేఎస్ రామారావు నిర్మించిన ఈ చిత్రం.. ఆ బ్యానర్‌లో సక్సెస్ అయిన చిత్రాల జాబితాలో  చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. ఇదిలావుంటే… అర్జున్ రెడ్డిలో ఒక భగ్న ప్రేమికుడి పాత్రలో మెరిసిన విజయ్.. ఈ చిత్రంలో కూడా అటువంటి షేడ్స్ ఉన్న పాత్రనే చేస్తుండడంతో.. సహజంగానే ఈ చిత్రం పైన అంచనాలు బలంగా ఉన్నాయి.

ఈ ట్రైలర్‌లో ఆఖరుగా ‘నా గుండెకి తగిలిన దెబ్బకి … ఆ పెయిన్ తెల్వకుండా ఉండాలంటే.. ఫిజికల్‌గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలే. నౌ ఐ విల్ లిటరల్లీ ఫీల్ ది పెయిన్’ అంటూ ఈ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్‌ని ముగించాడు దర్శకుడు క్రాంతి మాధవ్. దీనితో మరోసారి అర్జున్ రెడ్డి రేంజ్‌లో ఈ చిత్రం ఉండబోతుందని అభిమానులు చెప్పడం గమనార్హం. అలాగే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం ఒక మంచి ప్రేమకథగా నిలిచిపోవాలని మనమూ ఆశిద్దాం.

భర్త వైద్యం కోసం.. మారథాన్ లో 72 ఏళ్ళ వృద్ధురాలి పరుగులు

07 Feb 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
good points logo

good points text