ADVERTISEMENT
home / Bollywood
క్రికెట్ లోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ రికార్డు సృష్టిస్తోన్న కోహ్లీ..!

క్రికెట్ లోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ రికార్డు సృష్టిస్తోన్న కోహ్లీ..!

ఇండియ‌న్ క్రికెట్ (Indian Cricket)లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న బ్యాటింగ్ నైపుణ్యంతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోన్న ఆట‌గాడు విరాట్ కోహ్లీ (Virat Kohli). టెస్ట్, వ‌న్డే, టీ 20 అనే తేడా లేకుండా దాదాపు ప్ర‌తి ఫార్మాట్ లోనూ త‌న‌దైన దూకుడుతో స్కోర్ ను ప‌రుగులు పెట్టిస్తూ, భార‌త జ‌ట్టుకు విజ‌యాలు అందిస్తూ క్రీడాభిమానులంద‌రినీ ఫిదా చేసేస్తున్నాడు. అయితే ప్ర‌స్తుతం మాత్రం ఆయ‌న తీసుకున్న ఒక ఫొటోకు నెటిజ‌న్లంతా ఫిదా అయిపోతూ విప‌రీత‌మైన లైక్స్‌తో దానిని వైర‌ల్‌గా మారేలా చేశారు. ఇంత‌కీ దాని క‌థాక‌మామీషు ఏంటంటే..

విరాట్ తాజాగా త‌న‌కు ఇష్ట‌మైన వారితో ఒక సెల్ఫీ దిగి దానిని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా అది విప‌రీతంగా లైక్స్ సొంతం చేసుకుని వైర‌ల్ అయింది. ఇంత‌కీ ఆ సెల్ఫీలో ఉన్న‌ది ఎవ‌ర‌నుకుంటున్నారు?? ఆయ‌న స‌తీమ‌ణి అనుష్కా శ‌ర్మ అని అనుకుంటే మాత్రం మీరు పొర‌ప‌డిన‌ట్లే! ఎందుకంటే ఆ సెల్ఫీలో ఉన్న‌ది విరాట్‌కు ఎంతో ఇష్ట‌మైన ఒక శున‌కం. దీనిని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన త‌ర్వాత దాదాపు 2 మిలియ‌న్ల‌కు పైగా లైక్స్ సొంతం చేసుకుని వైర‌ల్‌గా మారిపోయింది.

ఆస్ట్రేలియాతో కొన‌సాగుతున్న వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఆఖ‌రి వ‌న్డే కోసం దిల్లీకి చేరుకుంది టీం ఇండియా బృందం. అలా విరాట్ కోహ్లీ త‌న స్వ‌స్థ‌లంలోని ఇంటికి చేరుకుని కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతున్నాడు. ఆ స‌మ‌యంలోనే త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన ఈ శున‌క‌రాజంతో సెల్ఫీ తీసుకుని దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

విరాట్‌కు కేవ‌లం క్రీడ‌ల్లోనే కాదు.. సోష‌ల్ మీడియాలో కూడా విప‌రీత‌మైన సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. సామాజిక మాధ్య‌మాల‌లో ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ చూస్తేనే ఈ విష‌యం ఎవ‌రికైనా ఇట్టే అర్థ‌మైపోతుంది. ఫేస్ బుక్‌లో 37 మిలియ‌న్స్, ట్విట్ట‌ర్‌లో 28.7 మిలియ‌న్స్, ఇన్స్‌స్టాగ్రామ్‌లో 30.5 మిలియ‌న్స్.. ఇలా మొత్తంగా చూస్తే సామాజిక మాధ్య‌మాల‌లో 90 మిలియన్ల‌కు పైగా ఫాలోవ‌ర్స్‌ను క‌లిగి ఉన్నాడు విరాట్.

ADVERTISEMENT

మామూలుగానే సెల‌బ్రిటీలు పెట్టే ఫొటోల‌పై లైక్స్ వ‌ర్షం కురిపించే అభిమానులు త‌మ అభిమాన ఆట‌గాడు పెట్టిన ఫొటోను ఊరికే వ‌దిలిపెడ‌తారా?? అందుకే దానిని కూడా వ‌రుస లైక్స్‌తో వైర‌ల్ అయ్యేలా చేశారు.

ప్ర‌స్తుతం అత్య‌ధిక సంఖ్య‌లో ఫాలోయ‌ర్స్‌ను క‌లిగి ఉన్న క్రీడాకారుల్లో ఒక‌రిగా విరాట్‌కు గుర్తింపు ఉంది. ఇప్ప‌టికే మైదానంలో ఎన్నో రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టి త‌న పేరిట కొత్త రికార్డుల‌ను సృష్టించిన విరాట్ సోష‌ల్ మీడియాలో కూడా అదే ప‌నిలో ఉన్న‌ట్లున్నాడ‌ని అంటున్నారు కొంద‌రు నెటిజ‌న్లు. అత్య‌ధిక సంఖ్య‌లో ఫాలోవర్స్ క‌లిగి ఉన్న ధోనీని సైతం సోష‌ల్ మీడియాలో వెన‌క్కి నెట్టేశాడు విరాట్.

క్రీడామైదానంలో త‌న దూకుడును కొన‌సాగిస్తూ కేవ‌లం గ్రౌండ్‌లోనే కాకుండా; ఇటు సోష‌ల్ మీడియాలో సైతం త‌న అభిమానుల సంఖ్య‌ను మ‌రింత పెంచుకునే అవ‌కాశాలున్నాయంటున్నారు విశ్లేష‌కులు. ఈ మ‌ధ్య అత్య‌ధికంగా ఫాలోయ‌ర్స్ ఉంటున్న సెల‌బ్రిటీలు ఏ ఫొటో పెట్టినా స‌రే అది మిలియ‌న్ మార్క్‌ను అందుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు విరాట్ పెట్టిన సెల్ఫీ కూడా వైర‌ల్‌గా మారిపోయింది. ఏదైతేనేం.. విరాట్‌ కూల్ లుక్‌లో భ‌లేగా ఉంటాడుగా..! మీరూ ఓసారి ఆ ఫొటోని చూసేయండి..

ఇవి కూడా చ‌ద‌వండి

ADVERTISEMENT

‘మా’ ఎలక్షన్స్‌లో మహిళల సత్తా.. కీలక పదవుల్లో జీవిత రాజశేఖర్, హేమ..!

తెలంగాణలో తొలి విమెన్ క‌మాండో టీంని ప్రారంభించిన క‌రీంన‌గ‌ర్ అధికారులు..!“యుద్ధం వద్దు” అనడం తప్పా : ఓ జవాన్ భార్య ఆవేదన

12 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT