ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఆడ‌పిల్ల‌లంటే ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే..! ఎందుకో మీకు తెలుసా??

ఆడ‌పిల్ల‌లంటే ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే..! ఎందుకో మీకు తెలుసా??

ఆడ‌పిల్ల(Girl Child) పుట్టిందంటే ఇంట్లో ఓ మ‌హాల‌క్ష్మి పుట్టిన‌ట్లే.. అమ్మ‌కు మంచి స్నేహితురాలు, నాన్న‌కు అందాల రాకుమారి, ఇంట్లో అంద‌రికీ గారాల ప‌ట్టి… క‌రుణ‌, శ్ర‌ద్ధ‌, అప‌రిమిత‌మైన ప్రేమ‌కు పుట్టినిల్లు ఆమె.. ఆడ‌పిల్ల పుట్టిందంటే చాలు.. భ‌విష్య‌త్తుపై ఆశ పుడుతుంది. త‌న బంగారు తల్లి భ‌విష్య‌త్తును వూహించుకుంటూ ఆమె కోసం క‌ల‌లు కంటూ బ‌తికేస్తారు త‌ల్లిదండ్రులు. అందుకే ఇంట్లో అబ్బాయిలు ఎంత‌మంది ఉన్నా.. ఆడ‌పిల్ల‌లు ఎంతో ప్ర‌త్యేకం. జాతీయ బాలికా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌నంద‌రి జీవితాల్లో ఆడ‌పిల్ల‌లు(Daughters) ఎంత‌టి ఆనందాన్ని పంచుతారో.. వారెందుకు ప్ర‌త్యేక‌మో చూద్దాం రండి..

1. త‌న‌దే సంద‌డి

ఇంట్లో అబ్బాయిలు ఎంత మంది ఉన్నా.. ఒక్క ఆడ‌పిల్ల ఉంటే చాలు.. ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. అమ్మానాన్న‌ల(parents) మురిపాలు, తాతా బామ్మ‌ల లాలింపులు అన్నీ అమ్మాయిల విష‌యంలోనే ఎక్కువ‌గా ఉంటాయి.

2. త‌న‌తోనే అల్ల‌రంతా..

ఇంట్లో అమ్మాయి ఉంటే తండ్రితో క‌లిసి తాను చేసే అల్ల‌రి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. నాన్న-కూతురు ఎప్పుడూ ఒకే పార్టీ.. ఏ ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భ‌మైనా ఆమె లేక‌పోతే ఇల్లంతా బోసి పోవాల్సిందే..

Girl child

ADVERTISEMENT

3. మీకేమిష్ట‌మో త‌న‌కే తెలుసు..

మీకు ఏమిష్ట‌మో మీ త‌ల్లి త‌ర్వాత బాగా తెలిసింది మీ కూతురికే.. మీ జీవితంలోని ప్ర‌త్యేక‌మైన రోజుల‌న్నింటినీ త‌ను గుర్తుంచుకుంటుంది. వాటిని మ‌రింత స్పెష‌ల్‌గా జ‌రుపుకునేందుకు ప్లాన్ల‌ను కూడా సిద్ధం చేస్తుంది.

4. త‌న‌లా ఎవ‌రూ ప్రేమించ‌లేరు..

త‌ల్లిదండ్రుల‌ను ప్రేమించ‌డంలో అమ్మాయిల‌ను మించినవారు ఇంకొక‌రు ఉండ‌ర‌ని చెప్పుకోవ‌చ్చు. త‌న‌కు పెళ్లై వేరే ఇంటికి వెళ్లిపోయినా స‌రే.. త‌ల్లిదండ్రుల విష‌యంలో జాగ్రత్త‌లు తీసుకోవ‌డం ఆమె ఎప్ప‌టికీ మ‌ర్చిపోదు. అందుకే పెద్ద‌లు “కొడుకు ప్రేమ కోడ‌లు వ‌చ్చేవ‌ర‌కూ.. కూతురి ప్రేమ జీవితాంతం” అని అంటుంటారు.

5. అమ్మ బెస్ట్‌ఫ్రెండ్‌

కూతురు కంటే మంచి స్నేహితురాలు త‌ల్లి జీవితంలో ఇంకెవ‌రూ ఉండ‌రు. ఉండ‌లేరు కూడా. త‌న వ‌య‌సు ఎంతైనా కొత్త జ‌న‌రేష‌న్‌కి త‌గిన ఆలోచ‌న‌ల‌ను ఓ తల్లి త‌న కూతురు నుంచే నేర్చుకుంటుంది. అంతేకాదు.. ఓ మంచి స్నేహితురాలిగా అమ్మ‌కు అన్ని విష‌యాల్లోనూ తోడు నిలిచి సాయం చేస్తుంది కూతురు.

6. త‌నుంటే ఒత్తిడి హుష్‌కాకి..

త‌ల్లికైనా.. తండ్రికైనా.. త‌న ముద్దుల కూతురితో కాసేపు ఆడుకుంటే చాలు.. ఎంత ఒత్తిడైనా ఇట్టే త‌గ్గిపోతుంది. అబ్బాయిల విష‌యంలోనూ ఇది కొన్ని సంవ‌త్స‌రాల వ‌ర‌కూ స‌రైన‌దే అయినా.. అమ్మాయిలు మాత్రం ఎప్ప‌టికీ త‌ల్లిదండ్రుల మ‌న‌సును తెలుసుకొని వారి టెన్ష‌న్ల‌ను దూరం చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం మ‌న‌కు తెలిసిందే.

ADVERTISEMENT

7. గ‌ర్వ‌ప‌డేలా చేస్తుంది.

త‌ల్లిదండ్రులు త‌న‌ని చూసి గ‌ర్వ‌ప‌డేలా చేయాల‌ని అమ్మాయి జీవితంలోని ప్ర‌తి ద‌శ‌లోనూ కోరుకోవ‌డం స‌హ‌జం. అందుకే వారికి ఎప్పుడూ త‌ల‌వంపులు రాకుండా అన్నింట్లోనూ ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిలిచే ప్ర‌య‌త్నం చేసేది అమ్మాయిలే..

Girl with her mom

8. మంచి విమ‌ర్శ‌కురాలు

కూతురు అమ్మానాన్న‌ల‌కు మంచి స్నేహితురాలే కాదు.. చక్క‌టి విమ‌ర్శ‌కురాలు కూడా.. అమ్మకు ఎలాంటి చీర న‌ప్పుతుందో.. నాన్న‌కు ఏ రంగు ష‌ర్ట్ అయితే బాగుంటుందో త‌నే చక్క‌గా ఎంపిక చేయ‌గ‌లుగుతుంది. అంతేనా.. లేటెస్ట్ ఫ్యాష‌న్‌ల‌కు త‌గిన‌ట్లుగా వాటిని ఎంపిక చేసి మిమ్మ‌ల్ని అంద‌రిలోనూ బెస్ట్‌గా నిల‌బెడుతుంది కూడా. ఇదే కాదు.. మీరు ఏదైనా త‌ప్పు చేస్తే దాన్ని మీకు వివ‌రించి చెప్పి స‌రైన దారిలోనూ న‌డిపిస్తుంది.

9. మాన‌సికంగా అండ త‌నే..

జీవితం ఎప్పుడూ ఒక‌లా ఉండ‌దు. వృద్దాప్యంలోకి అడుగుపెట్టిన త‌ర్వాత శారీర‌క స‌మ‌స్య‌ల‌తో పాటు మానసికంగానూ ఎన్నో స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టుముడ‌తాయి. అప్పుడు కూడా కూతురు మ‌న‌కు తోడుగా నిలుస్తుంది. మీకు ఎల్ల‌ప్పుడూ ఓ అండ‌గా నిలిచి మీ స‌మ‌స్య‌ల‌ను దూరం చేసేందుకు త‌న‌ వంతు ప్ర‌య‌త్నం చేస్తుంది.

ADVERTISEMENT

10. తోబుట్టువుల‌కు అమ్మ..

ఇంట్లో ఒక అమ్మాయి ఉందంటే చాలు.. త‌న తోబుట్టువుల‌కు మ‌రో అమ్మ ఉన్న‌ట్లే.. అది కేవ‌లం అక్కే కాన‌వ‌స‌రం లేదు.. చెల్లైనా స‌రే.. త‌న అన్న లేదా త‌మ్ముడిని జాగ్ర‌త్త‌గా అమ్మ‌లా చూసుకుంటుంది. జీవితాంతం వారికి అవ‌స‌రమైన అండ‌ను అందిస్తూ అమ్మ కాని అమ్మ‌గా మారుతుంది.

ఇవన్నీ కొడుకులు చేయలేరా.. అంటే కొంత‌మంది చేయ‌గ‌ల‌రేమో కానీ.. ఆడ‌పిల్లలా మాత్రం చేయ‌లేరు. ఎందుకంటే త‌నెప్పుడూ అమ్మానాన్న‌ల గురించే ఆలోచిస్తూ వారి బాగోగులే కోరుకుంటుంది కాబ‌ట్టి..!

ఇవి కూడా చదవండి

ఇండిపెండెంట్ అయిన కూతురు కొడుకు కంటే ఎక్కువ ఎందుకో ఆంగ్లంలో చ‌ద‌వండి

ADVERTISEMENT

టీనేజీలో ఉన్న కూతురు త‌న త‌ల్లికి చెప్పాల‌నుకునే మాట‌లేంటో ఆంగ్లంలో చ‌ద‌వండి.

నాన్నంటే నాకెంత ఇష్టమో..! (తండ్రీ, కూతుళ్ల అనుబంధాన్ని తెలిపే 13 క్యారికేచర్లు)

22 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT