ADVERTISEMENT
home / Celebrity Style
ఆఫీసులో  స్టైల్‌ గా మెరిసిపోవాలంటే  .. ఈ ఫ్యాషన్ ఫాలో అవ్వాల్సిందే..!

ఆఫీసులో స్టైల్‌ గా మెరిసిపోవాలంటే .. ఈ ఫ్యాషన్ ఫాలో అవ్వాల్సిందే..!

ఆఫీసులో హుందాగా క‌నిపించాలంటే అందుకు మ‌నం ధ‌రించే దుస్తులు కూడా హుందాగా ఉండాల్సిందే..  ఈ క్ర‌మంలోనే చాలామంది మ‌హిళ‌లు ప్యాంట్ సూట్స్ (Pantsuits) ధ‌రించేందుకు ఎక్కువ‌గా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇవి ఇటు సౌక‌ర్యవంతంగా ఉంటూనే; అటు మ‌న‌ల్ని స్టైలిష్‌గా, హుందాగా క‌నిపించేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. మ‌రి, వీటిలో కూడా ఫ్యాష‌న‌బుల్‌గా మెరిసిపోవాలంటే అందుకు ఏదైనా ఒక ట్రెండ్‌తో కాస్త ఫ్యాష‌న్ ట‌చ్ ఇవ్వాల్సిందే! అదెలా అంటారా?? మ‌న బాలీవుడ్ ముద్దుగుమ్మ యామీ గౌత‌మ్‌ని ఫాలో అయితే స‌రి..!

హుందాగా క‌నిపించే ప్యాంట్ సూట్స్‌కి మోనోక్రోమ్ ఫ్యాష‌న్స్ (Monochrome Fashions)ని జ‌త చేసి ఎంత స్టైలిష్‌గా మెరిసిపోవ‌చ్చో త‌న‌ని చూసే మ‌నం తెలుసుకోవ‌చ్చు.  ఈ అమ్మ‌డు తాజాగా న‌టించిన ఉరి (URI) చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా యామీ ఎక్కువ‌గా ఈ ఫ్యాష‌న్స్‌నే ఎంపిక చేసుకుంది. న‌ఖ‌శిఖ‌ప‌ర్యంతం ఒకే రంగులో మెరిసిన యామీ ఫ్యాష‌న్స్‌ను మీరు కూడా ఒక్క‌సారి చూస్తే మ‌రే ఆలోచ‌న లేకుండా వాటిని మీ వార్డ్ రోబ్‌లో భాగం చేసుకుంటారు.

 

వాస్త‌వానికి మోనోక్రోమ్ ఏమీ కొత్త‌గా వ‌చ్చిన ట్రెండ్ కాదు. గ‌త రెండేళ్లుగా అది ఫ్యాష‌న్ ప్రపంచంలో త‌న ఉనికిని చాటుకుంటోంది. ఇప్ప‌టికే ఎంతో మంది టాలీవుడ్‌, బాలీవుడ్ క‌థానాయిక‌లు సైతం ఈ ఫ్యాష‌న్‌లో త‌ళుక్కున మెరిశారు. తాజాగా యామీ ఫాలో అయిన ట్రెండ్ మాత్రం వారంద‌రి కంటే కాస్త భిన్న‌మ‌నే చెప్పాలి.

ADVERTISEMENT

 

యామీ మోనోక్రోమ్ ఫ్యాష‌న్స్‌లో మ‌నం ముందుగా మాట్లాడుకోవాల్సింది మ‌హిళ‌ల దుస్తుల‌కు చెందిన ప్ర‌ముఖ బ్రాండ్ అయిన లావిష్ అలిస్ (Lavish Alice) రూపొందించిన పింక్ క‌ల‌ర్ ప్యాంట్ సూట్ గురించి. కాల‌ర్ కింది భాగం అస‌మాన  ఫ్యాష‌న్ (Asymmetric Fashion) త‌ర‌హాలో రూపొందించ‌గా.. స్లిట్టెడ్ స్లీవ్స్ ఈ అవుట్‌ఫిట్‌కి మ‌రింత అందాన్నిచ్చాయి.  ఆక‌ర్ష‌ణీయ‌మైన ఈ అవుట్‌ఫిట్‌కి ఆన‌మ్ రూపొందించిన అన‌మ‌లి స్టేట్ మెంట్ రింగ్ ధ‌రించి సింపుల్‌గా స్టైలిష్‌గా మెరిసిపోయింది యామీగౌత‌మ్. అంతేనా.. వింగ్డ్ ఐ లైన‌ర్, న్యూడ్ షేడెడ్ హీల్స్తో సింపుల్‌గా త‌న లుక్‌ని ముగించింది.

 

సాధార‌ణంగా హుందాగా క‌నిపించే లుక్ అన‌గానే చాలామందికి ప్యాంట్ సూట్స్ ఎక్కువ‌గా గుర్తుకొస్తాయి. కానీ యామీ వాటికి భిన్నంగా ఆఫ్ షోల్డ‌ర్ డ్ర‌స్‌ (Off Shoulder dress)లోనూ మెరిసి అంద‌రి దృష్టినీ బాగా ఆక‌ర్షించింది. ఆమె లుక్‌లో స్టొరెట్స్, స్వ‌రోస్కీ, లులు, స్కై.. వంటి బ్రాండ్స్ భాగ‌మై ఉన్నాయి. బీజ్ క‌ల‌ర్‌లోని ఈ ఆఫ్ షోల్డ‌ర్ డ్ర‌స్‌కి ఒక చ‌క్క‌ని కోట్ జ‌త చేస్తే చాలు.. చ‌లికాలంలోనూ చ‌క్క‌ని చుక్క‌లా చ‌మ‌క్కుమంటూ మెరిసిపోవ‌చ్చు.

ADVERTISEMENT

 

ఇక యామీ ధరించిన మ‌రొక మోనోక్రోమ్ ఫ్యాష‌న్ చూస్తే దానిని క‌చ్చితంగా ఫాలో అవ్వాలని అనిపించ‌డం స‌హ‌జ‌మే. ప‌ర్షియ‌న్ ర‌డీ టు వేర్ హౌస్ పాల్  రూపొందించిన తెలుపు రంగు ప్యాంట్ సూట్‌ (White color Pant Suit)లో స్లీక్ లుక్ తో ఆమె మ‌చ్చ‌లేని చంద‌మామ‌లా అందంగా మెరిసిపోతోంది క‌దూ! బోర్డ‌రూమ్స్ (Board Rooms) లో జ‌రిగే స‌మావేశాల‌కు ఇవి మంచి ఎంపిక అంటున్నారు డిజైన‌ర్లు.

చూశారుగా.. అంద‌మైన మోనోక్రోమ్ (Monochrome) ప్యాంట్ సూట్స్‌లో ఆక‌ర్ష‌ణీయంగా ఎలా క‌నిపించ‌వ‌చ్చో! మ‌రింకెందుకాల‌స్యం.. మ‌నం కూడా యామీ ఫాలో అయిన ఈ ఫ్యాష‌న్స్‌లో  న‌చ్చిన వాటిని అనుస‌రించేందుకు ర‌డీ అయిపోదామా..

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

సోనమ్ కపూర్ ఫ్యాషన్స్ గురించి ఆంగ్లంలో చదవండి

టాప్ టెన్ అమేజింగ్ అవుట్ ఫిట్స్ గురించి ఆంగ్లంలో చదవండి

బాలీవుడ్ లేడీ కపూర్స్ ఫ్యాషన్ గురించి ఆంగ్లంలో చదవండి

 

ADVERTISEMENT

 

 

18 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT