తరచూ అడిగే ప్రశ్నలు
Contact care@popxo.com for assistance
తదుపరి విభాగానికి వెళ్లండి
మీ ప్రొఫైల్
నేను popxo లో రాసే కథనాలను ఎవరు చూస్తారు?
సైన్ ఇన్ అయ్యే యూజర్లు మాత్రమే మీ కథనాలను చూడగలరు.
అపరిచిత వ్యక్తిగా నేను రాసే కథనాలను, యూజర్లు చూసే అవకాశం ఉందా?
అపరిచిత పోస్టులన్నీ కూడా యూజర్లు చూడగలరు. కానీ ఆ పోస్టులు ఎవరు చేశారో, వారు తెలుసుకోలేరు. అపరిచిత పోస్టులో రచన చేసిన వారి పేరు లేదా ప్రొఫైల్ కనిపించదు.
నేను బుక్ మార్క్ లేదా సేవ్ చేసిన పోస్టులను ఎక్కడ చూడగలను?
మీరు సేవ్ చేసిన కథనాలను మీ ప్రొఫైల్ పేజీతో పాటు, బుక్ మార్క్స్ టాబ్‌లో కూడా చూడగలరు.
నేను నా యూజర్ నేమ్ మార్చుకోవచ్చా?
మీరు ఫేస్‌బుక్ లేదా గూగుల్ ఐడి ద్వారా లాగిన్ అయితే, సిస్టమ్ ఆటోమెటిక్‌గా మీ యూజర్ నేమ్‌ను జనరేట్ చేస్తుంది.
నేను నా ఫ్రొఫైల్ చిత్రాన్ని మార్చుకోవచ్చా?
అవును. మీరు మీ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చుకోవచ్చు. అందుకు తొలుత మీరు మీ ప్రొఫైల్ పేజీని సందర్శించాలి. తర్వాత ఆ పేజీలోని సెట్టింగ్స్ ఐకాన్ పై క్లిక్ చేసి.. తర్వాత ఎడిట్ బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు అక్కడ మీరు మీ ప్రొఫైల్ చిత్రాన్ని అప్డేట్ చేయవచ్చు.
నేను నా పుట్టిన తేదిని మార్చుకోవచ్చా?
పుట్టిన తేదిని మార్చుకోవాలంటే.. తొలుత సెట్టింగ్స్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. తర్వాత పుట్టిన తేది పై క్లిక్ చేసి.. సరైన తేదిని ఎంచుకోండి.
నేను మరో యూజర్‌ని ఎలా ఫాలో అవ్వగలను?
మరో యూజర్‌ని అనుసరించాలంటే, మీరు ఆయా యాజర్ ప్రొఫైల్ పై క్లిక్ చేయాలి. తర్వాత కుడి వైపు కనిపించే ఐకాన్ పై క్లిక్ చేయాలి
నేను మరో యూజర్‌తో ఎలా ఛాట్ చేయగలను?
మరో యూజర్‌తో ఛాట్ చేసే ముందు ఆ యూజర్ ప్రొఫైల్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కుడివైపు కనిపించే ఛాట్ బటన్ పై క్లిక్ చేయాలి
నేను యాప్‌లో పోస్ట్ చేసే ప్రశ్నలు లేదా పోల్స్ ఎలా చూడగలను?
యాప్‌లో మీరు పోస్ట్ చేసిన ప్రశ్నలు లేదా పోల్స్ చూడాలంటే.. ముందుగా మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి మీ పోస్టులున్న బటన్‌ని క్లిక్ చేయాలి
ఒక యూజర్ రిపోర్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది?
popxo ప్రపంచం ఒక ప్రైవేట్ కమ్యూనిటీ వంటిది. ఇందులో యూజర్స్ ఉపయోగకరమైన సమాచారాన్ని చదవడం లేదా తెలుసుకోవడం మాత్రమే కాదు.. ఒకరితో మరొకరు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏ విషయం గురించైనా మహిళలు ఒకరితో మరొకరు చర్చించుకుంటూ తదనుగుణంగా అడుగులు వేసేందుకు అవసరమైన ఒక భద్రత కలిగిన వాతావరణాన్ని మేము మీకు అందిస్తాం. మా యాప్‌లో ఆన్ లైన్ వేధింపులు, ట్రాలింగ్.. వంటి వాటిని మేము అస్సలు సమర్ధించము. ముఖ్యంగా ఒక్కసారి యూజర్ రిపోర్ట్ చేసిన తర్వాత.. వారి ప్రొఫైల్‌ను మా టీం బాగా పరిశీలిస్తుంది. ఒకటి కంటే ఎక్కువసార్లు రిపోర్ట్ చేసే యూజర్స్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఇది మీకు బాగా సహాయపడుతుందని భావిస్తున్నాం. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు
నా బ్యాడ్జెస్, స్కోరుకు ఏం జరిగింది?
చాలా ఆసక్తికరమైన ఈ అంశంపై మేం ఇంకా పని చేస్తున్నాం. దీని గురించి పూర్తిగా తెలియాలంటే దీనిని చూస్తూనే ఉండండి
popxo కమ్యూనిటీ గైడ్ లైన్స్
popxo లో ఎవరు సైన్ ఇన్ అవ్వగలరు?
popxo అనేది మహిళల కోసం మహిళల చేత నిర్వహిస్తున్న కమ్యూనిటీ. భారతదేశంలోని స్త్రీలంతా ఎలాంటి సంకోచం, అభద్రతాభావనలు లేకుండా.. తమ జీవితాల్లో జరిగే విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడుకునే వేదిక ఇది. ఈ కారణంగానే పురుషులకు ఇందులో హ్యాంగవుట్ అయ్యే సౌలభ్యం ఉండదు. కానీ వారు ఇక్కడ ఉన్న ఆర్టికల్స్ చదవచ్చు. వీడియోలు చూడవచ్చు. popxo shopలో షాపింగ్ చేయచ్చు. కాబట్టి ఇక్కడ మీరు ఏం అడగాలనుకున్నా లేక మాట్లాడాలనుకున్నా నిర్భయంగా, నిస్సందేహంగా ముందడుగు వేయచ్చు.
popxo సైటులో చేయదగ్గ, చేయకూడని పనులు ఏమిటి?
చేయదగ్గవి
- – మీరు మీలా ఉండండి. popxo కమ్యూనిటీలో అమ్మాయిలు ఏ విషయం గురించైనా ఫ్రీగా మాట్లాడవచ్చు. తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు.
- – పాజిటివ్ ఆలోచనలకు శ్రీకారం చుట్టండి. మీ సలహాల ద్వారా మిగతా అమ్మాయిలకు సహాయాన్ని అందించండి. popxo కమ్యూనిటీలో అమ్మాయిలు పరస్పరం అభిప్రాయాలను పంచుకుంటూ నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటారు.
- – సాధ్యమైనంత వరకు మీ తోటి అమ్మాయిలకు సహాయకారిగా ఉండండి. వారు అడిగే ప్రశ్నలకు, వెలిబుచ్చే సందేహాలకు.. సూచనలు, సలహాలను సమాధానాల రూపంలో అందివ్వండి.
- – మీరు రాసే అంశాలు చాలా సింపుల్‌గా, చదవడానికి ఆసక్తి కలిగించే విధంగా ఉండాలి (ప్రాథమిక అంశాలు – మంచి పదజాలం ఉపయోగించాలి. అందరికీ అర్థమయ్యే రీతిలో వాక్య నిర్మాణం ఉండాలి)
- – కమ్యూనిటీ సురక్షితంగా ఉండే విషయంలో మీరు సహాయకారిగా ఉండండి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ పాటించని యూజర్ల పోస్టులను రిపోర్టు చేయండి.
చేయకూడనివి
- – ఒకరిని జడ్జి చేయడం లేదా గేలి చేయడం అనేవి ఈ కమ్యూనిటీలో నిషిద్ధం. యూజర్లను భయభ్రాంతులకు గురి చేసే కంటెంట్ లేదా ద్వేషపూరితమైన పోస్టులు చేయడం ఇక్కడ నిషిద్ధం.
- – గ్రాఫిక్ సెక్సువల్ కంటెంట్‌ను పోస్టు చేయడం లేదా యూజర్లను లైంగికంగా వేధించే విధంగా మెసేజ్‌లు పెట్టడం ఇక్కడ నిషిద్ధం.
- – మీ యూట్యూబ్ ఛానల్స్‌ని ప్రమోట్ చేయడం లేదా మీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్, బిజినెస్ పేజీలను ఈ వేదిక ద్వారా పంచుకోవడం నిషిద్ధం. అలాగే మత, రాజకీయాలకు సంబంధించిన పోస్టులు పెట్టడం కూడా నిషిద్ధం.
- – బిజినెస్/సెమినార్స్‌కు సంబంధించిన సమాచారం లేదా వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే సమాచారాన్ని ఇక్కడ పోస్టు చేయడం నిషిద్ధం.
- – పోస్టు చేసిన ప్రశ్నలనే పదే పదే పోస్టు చేయడం ఈ కమ్యూనిటీలో నిషిద్ధం.
- – వ్యక్తిగత కక్షల కారణంగా యూజర్లను రిపోర్ట్ చేయడం నిషిద్ధం
- – అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించే పోస్టులు పెట్టడం (పైరసీ, డ్రగ్స్, పోర్నోగ్రఫీ మొదలైనవి) ఇక్కడ నిషిద్ధం
- – మీ వ్యక్తిగత సమాచారమైన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ లేదా సోషల్ మీడియా ప్రొఫైల్స్ షేర్ చేయడం (లేదా ఇతరులను ఇవే వివరాలు అడగడం) ఈ కమ్యూనిటీలో నిషిద్ధం.
<
popxo లో పోస్టు అయ్యే అంశాలు పరిశీలించబడతాయా?
మోడరేటర్స్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం పోస్టులు ప్రచురితం అవుతున్నాయో లేదో పరిశీలిస్తారు. ఒక వేళ అవి కమ్యూనిటీ నియమ నిబంధనలను అతిక్రమిస్తే.. ఆయా పోస్టులను హైడ్ చేయడం జరుగుతుంది. ఒకే యూజర్ పలుమార్లు ఇదే మాదిరిగా నిబంధనలను అతిక్రమించినట్లయితే.. తనను పూర్తిగా బ్యాన్ చేయడం జరుగుతుంది.
నేను నా ఇమేజ్ పోల్స్ లేదా ఇమేజ్ ప్రశ్నలను ఎందుకు చూడలేకపోతున్నాను?
పోస్టు చేసిన అన్ని చిత్రాలను తొలుత మోడరేటర్స్ చూస్తారు. అవి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్రకారం ఉన్నట్లయితే.. వాటిని ఆమోదిస్తారు. అప్పుడు అవి ఫీడ్‌లో కనిపిస్తాయి. చిత్రం అప్లోడ్ అయ్యాక.. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తవ్వడానికి కనీసం 6-8 గంటల సమయం పడుతుంది.
నేను పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను? కానీ అవి యాప్‌లో ఎందుకు కనిపించడం లేదు?
మేము పలు పదాలను స్క్రీనింగ్ చేసే విధంగా మోడరేటింగ్ సిస్టమ్‌ను తయారు చేశాం. ఒకవేళ ఆ పదాలు మీరు పోస్టు చేసిన సమాధానాల్లో ఉంటే.. తొలుత అవి మోడరేటర్ అనుమతిని పొందాల్సి ఉంటుంది. అందుకే మీరు మీ సమాధానాలు పోస్టు చేసినప్పటికీ.. కమ్యూనిటీ గైడ్ లైన్స్‌కు అనుగుణంగా అవి లేకపోతే మోడరేటర్ వాటిని తొలిగిస్తారు.
నేను పోస్టులను రిపోర్ట్ చేయవచ్చా?
యూజర్ తనకు ఏదైనా పోస్టు స్పామ్ మాదిరిగా లేదా అసభ్యతకు తావిచ్చే విధంగా కనిపిస్తే.. దానిని రిపోర్టు చేయవచ్చు. మోడరేటర్ ఆ పోస్టును రివ్యూ చేస్తారు.
ఇతర యూజర్లను రిపోర్ట్ చేయవచ్చా?
popxo కమ్యూనిటీకి సరిపడని యూజర్లు.. ఈ వేదికను ఉపయోగిస్తున్నారని మీరు భావిస్తే.. అటువంటి యూజర్లను మీరు రిపోర్ట్ చేయవచ్చు. అందుకోసం ‘report user’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మోడరేటర్ ఆయా యూజర్ ప్రొఫైల్‌ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు.
నేను అనేక సమస్యలతో సతమతమవుతున్నాను. నాకు popxo కమ్యూనిటీ ఏ విధంగా సహాయపడగలదు?
తప్పకుండా మేము సహాయపడతాము. popxo కమ్యూనిటీ మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు అందివ్వడమే కాకుండా.. మీకు ప్రొఫెషనల్ హెల్ప్ అవసరమైన యెడల.. పలు సంస్థలను కూడా రిఫర్ చేస్తుంది.
నాకు ఒక పోస్టు నచ్చలేదు? దానిని మీరు తొలిగించగలరా?
మీరు నిజాయతీగా మాకు అందించే ఎలాంటి ఫీడ్ బ్యాక్‌ను అయినా మేము స్వీకరిస్తాం. అది మంచిదైనా కావచ్చు. లేదా చెడుదైనా కావచ్చు. మీకు ఏదైనా పోస్టు, ప్రశ్న, జవాబు, కామెంట్ పట్ల అభ్యంతరం ఉన్నట్లయితే దానిని మాకు రిపోర్ట్ చేయండి. అలాగే సైటులో ప్రచురితమైన ఏదైనా కథనం పట్ల అభ్యంతరాలు ఉన్నట్లయితే community@popxo.com కి మెయిల్ చేయండి. అలాగే ఆయా కథనానికి సంబంధించిన లింక్ కూడా పంపండి. మేము ఆ కథనాన్ని సమీక్షించి.. మీరు చెప్పిన కారణాల్లో నిజంగా అభ్యంతరకర అంశాలు ఉంటే.. సదరు పోస్టును తొలిగించడం జరుగుతుంది.
నేను popxo నుండి రెగ్యులర్ అప్డేట్స్ ఎలా పొందగలను?
మీరు popxo నుండి ఫోన్ ద్వారా రెగ్యులర్ అప్డేట్స్ పొందాలంటే.. మీరు మాకు నోటిఫికేషన్లు పంపేందుకు అనుమతి ఇవ్వాలి. అలాగే మీరు మా ఫేస్‌బుక్ పేజీ [ http://www.facebook.com/popxodaily], మా ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ [ http://www.instagram.com/popxodaily] మరియు యూట్యూబ్ ఛానల్‌ని,[ http://www.youtube.com/popxotv] ని ఫాలో అవ్వచ్చు.
మేము dm నుండి ఎవరినైనా రిపోర్టు చేయాలంటే ఏం చేయాలి?
మీరు dm నుండి ఎవరినైనా రిపోర్టు చేయాలని భావిస్తే, community@popxo.com కి మెయిల్ చేయండి. అలాగే ఆయా dm లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా పంపుతూ.. ఆ వ్యక్తిపై మీరు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో సవివరంగా తెలియజేయండి.
popxo గురించి
popxo అంటే?
popxo అనే కమ్యూనిటీలో అమ్మాయిలు తమకు సంబంధించిన విషయాల గురించి సంకోచం లేకుండా మాట్లాడవచ్చు. ఈ ఆన్‌లైన్ కమ్యూనిటీలో మీరు మహిళలకు ఆసక్తి కలిగించే కథనాలను చదవడంతో పాటు వీడియోలను కూడా వీక్షించవచ్చు. అలాగే పలు చర్చల్లో కూడా పాల్గొనవచ్చు. మీ అనుభవాలను తోటి మహిళలతో పంచుకోవడమే కాకుండా.. ఫ్యాషన్, బ్యూటీ, వర్క్, రిలేషన్ షిప్, సెక్స్ మొదలైన అంశాల గురించి నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు.
నేను popxo టీమ్‌లో ఏ విధంగా చేరగలను?
popxo టీమ్‌లో భాగమయ్యేందుకు ఆసక్తి చూపే.. టాలెంటెడ్ వ్యక్తులకు మేం ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటాము. ఎప్పటికప్పుడు ఈ సంస్థలో భర్తీ చేయబోయే ఖాళీలను మీరు popxo హైరింగ్ పోర్టల్ [http://popxo.breezy.hr] ద్వారా వీక్షించవచ్చు. అలాగే మీ స్కిల్స్ ఈ సంస్థకు పనికొస్తాయని భావిస్తే.. మీరు మీ cv ని jobs@popxo.com కు కవరింగ్ ఈమెయిల్‌తో సహా పంపించవచ్చు.
popxo సైటులో ప్రచురణ నిమిత్తం కథనాలను ఎలా పంపించాలి?
మీరు తప్పకుండా మీ కథనాలను community@popxo.com కు మెయిల్ చేయవచ్చు. మా సంపాదకుల సూచనల మేరకు.. మేము వాటిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీ కథనం సైట్ ఆడియన్స్‌ను ఆకట్టుకొనే విధంగా ఉందని మేము భావిస్తే, అలాంటి కథనాలను తప్పకుండా ప్రచురిస్తాం. ఒకవేళ మీరు పంపిన కథనం, మీ వ్యక్తిగత అనుభవమైతే, #mystory అనే హ్యాష్ ట్యాగ్‌ని తప్పకుండా జత చేయండి.
popxo బ్రాండ్స్‌తో కలిసి ఎలా పనిచేస్తుంది?
మాతో కలసి పనిచేసే బ్రాండ్స్ కోసం, మేము సరికొత్త సృజనాత్మక ఆలోచనలతో ప్రమోషన్లు చేపడుతుంటాం. అందుకోసం కస్టమైజ్డ్ కంటెంట్ తయారు చేయడం, ఫన్ కాంటెస్టులు నిర్వహించడం, ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ ఏర్పాటు చేయడం, సోషల్ మీడియా క్యాంపైన్స్ నిర్వహించడం మొదలైనవి చేస్తుంటాం. మీరు కూడా మాతో కలసి పనిచేయాలని భావిస్తే, partner@popxo.com కి మెయిల్ చేయగలరు.
popxo తో కలిసి ఇన్ఫ్లూయన్సర్స్ ఎలా పనిచేస్తుంటారు?
మీరు ఒక ఇన్ఫ్లూయన్సర్‌గా popxo తో కలిసి పనిచేయాలని భావిస్తే.. మా ఇన్ఫ్లూయన్సర్ మార్కెటింగ్ వేదిక Plixxo లో చేరగలరు. ఒకసారి ఇందులో చేరాక, మీకు మరిన్ని సంబంధాలు ఏర్పడతాయి. పెయిడ్ పోస్టులతో మరిన్ని అవకాశాలు కూడా లభించే అవకాశం కూడా ఉంది.